
వదిలేసే ప్రతి చుక్క ఓ హెచ్చరికే!

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగర పరిధిలో రోజుకు 14.5 లక్షల నల్లా కనెక్షన్లతో 1.30 కోట్ల మందికి 560 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. దీనిలో కనీసం 20% ఆదా చేస్తే 30.28 కోట్ల లీటర్లు మిగులుతాయని గ్రేటర్ అధికారులు అంచనా వేశారు. ఇదే నీటిని రోజుకు ఒక వ్యక్తికి 160 లీటర్ల చొప్పున 15 లక్షల జనాభా ఉన్న నల్గొండలాంటి పెద్ద జిల్లాకు ఒక రోజంతా ఇవ్వొచ్చు. కేవలం హైదరాబాద్‌లో పొదుపు చేస్తేనే ఇంత మార్పు వస్తుందంటే... రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరిస్తే వచ్చే మార్పు ఎంతలా ఉంటుందో ఊహించవచ్చని నిపుణులు కోరుతున్నారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటడం, జలాశయాలు వట్టిపోవడంతో నీటికి కటకట ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో అందరి ముందున్న ఏకైక కర్తవ్యం ఆదా ఒక్కటే. రాష్ట్రంలో వర్షపాత లోటు, అధిక ఉష్ణోగ్రతలు, అధిక వినియోగంతో భూగర్భ జలాలు రోజురోజుకూ మరింత లోతుల్లోకి వెళ్తున్నాయి. ఈ తరుణంలో నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
అధిక జనాభా జిల్లాలో ఆందోళనకరం
రాష్ట్రంలో 271 మండలాల్లో భూగర్భ జలమట్టం పరిస్థితి ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 117 మండలాల్లో తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్; మహబూబ్‌నగర్, నారాయణపేట, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, ఆదిలాబాద్, జోగులాంబ-గద్వాల, మహబూబాబాద్, మెదక్, మంచిర్యాల, హనుమకొండ, వరంగల్, నిర్మల్, కామారెడ్డి, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల్లోని 271 మండలాల్లో పరిస్థితులు భయపెడుతున్నాయి.
మనసు పెడితే మార్గాలు ఎన్నెన్నో...
గృహాల్లో రోజూ చేస్తున్న నీటి వినియోగం తీరును ప్రత్యేకంగా పరిశీలించాలి. ఏమేరకు ఆదా చేయగలుగుతామనే విషయాన్ని పరిశీలిస్తే పొదుపు దానంతటదే మొదలవుతుంది. నల్లాల లీకేజీలు, వంట సామగ్రిని శుభ్రపరిచే విధానం, వాషింగ్ మెషిన్, షవర్లు, వాష్‌బేసిన్ వద్ద వినియోగం లాంటి వాటిని గమనించాలి.
- మొక్కలకు పైపుల ద్వారా నీటి సరఫరాతో ఎక్కువ వృథా ఉంటుంది. మొక్కలు, చెట్ల కుదుర్ల వద్ద నీరు నేరుగా చేరే చర్యలతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
- వాహనాలను కడగడం, ఫ్లోర్ క్లీనింగ్ వంటి పనుల్లో అవసరానికంటే ఎక్కువ నీరు వృథా అవుతుంది.
- దుస్తులను ఉతికే సమయంలో నీటిని నేరుగా పైపుల ద్వారా కాకుండా... బక్కెట్ల ద్వారా వినియోగించడం మేలు.
- ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వినియోగించిన నీటిని తప్పనిసరిగా వాటి పరిధిలోనే ఇంకేలా చూసుకోవాలి.
- తాగునీటి ఫిల్టర్లు ఒక లీటరు స్వచ్ఛమైన నీటి కోసం రెండున్నర లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంటాయి. అంటే లీటరున్నర నీరు వృథా అవుతున్నట్లే లెక్క. ఆర్వో ఫిల్టర్ కేంద్రాలు, బల్క్‌గా శుద్ధి చేసే కేంద్రాల్లో పొదుపు పాటించాలి. శుద్ధి అనంతరం విడుదలయ్యే నీటిని ఇంకుడు గుంతల్లో ఇంకేలా చూడాలి.
నీటిని ఎవరూ వృథా చేయొద్దు
భూగర్భజలాలు అడుగంటడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. వచ్చే వానాకాలం వరకు ఈ లోటు తప్పదు. అందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచనలను పాటిద్దాం.చిన్నచిన్న ఆలోచనలతో నీటి వృథాకు అడ్డుకట్ట వేయొచ్చు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వమూ అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Oct 2026 03:30 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వివాదాన్ని ఆర్బిట్రేషన్‌లో పరిష్కరించుకోండి బొంగులూరు-తుక్కుగూడ, కొల్లూరు-పటాన్‌చెరుల మధ్య ఎనిమిది వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 2007లో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్)-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ల మధ్య నెలకొన్న వివాదాన్ని ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- దసరా సెలవుల్లో వివాదాస్పద భూములపై కఠిన చర్యలొద్దు కోర్టు విచారణలో ఉన్న ఆస్తుల విషయంలో.. దసరా సెలవులు ముగిసే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ కలెక్టర్లతో పాటు హైడ్రాకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగున్నాయంటూ.. దసరా సెలవులకు ఇంటికొచ్చిన కుమారుడు తల్లిదండ్రుల ముందే కుప్పకూలి మృతిచెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో చోటుచేసుకుంది.
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
- ఎర్త్‌సైన్సెస్ వర్సిటీకి రూ.100 కోట్లు ఇవ్వండి కొత్తగూడెం ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీకి కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
- 3 నెలల్లో రోహిత్ వేముల బిల్లు ముసాయిదా మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు.
- పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారం పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు.
- రాజకీయంగా ఎదగటం ఆషామాషీ కాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఎదగటం అంత ఆషామాషీ కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
- పురుగులు పట్టని సంచులు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్(ఇండియా)-హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్వంలో నగరంలో శుక్రవారం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
- నారీశక్తికి ప్రతీక బతుకమ్మ బతుకమ్మ ఒకవైపు ప్రకృతి పండుగ అయితే మరోవైపు నారీశక్తికి ప్రతీక అని దిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు.
- సమర్థ విధానాలతో ‘ఆహారశుద్ధి’లో నీటి ఆదా ఆహార శుద్ధి పరిశ్రమల్లో సమర్థ నీటి నిర్వహణ.. పర్యావరణ పరిరక్షణకే కాకుండా పారిశ్రామిక లాభదాయకత, సుస్థిరతను నిర్దేశించే శాస్త్రీయ అంశమని మైసూరులోని సీఎస్ఐఆర్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ గిరిధర్ పర్వతం అన్నారు.
- భక్తులతో కిటకిటలాడిన బాసర అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
- కష్టకాలంలో రైతు కూలీలకు రూ.12 వేల హామీ నెరవేర్చాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా రైతు కూలీలకు ఏటా రూ.12 వేలను ఈ కష్టకాలంలోనైనా అందించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
- ఎస్ఆర్ వర్సిటీకి డీమ్డ్-టు-బి హోదా ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా తమ ఎస్ఆర్ వర్సిటీని తీర్చిదిద్దుతామని ఎస్ఆర్ అకాడమీ ఛైర్మన్, ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్ఆర్ఏహెచ్ఈ) ఛాన్సలర్ వరదారెడ్డి చెప్పారు.
- సింగూరు ఎండి.. పదేళ్ల తర్వాత భూములు బయటపడి నీటితో నిండుకుండలా కనిపించాల్సిన సింగూరు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ వేగంగా పడిపోతోంది.
- ఆకు అరమీటరు.. కాండంలో జిగురు అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పుతో అబ్బుర పరిచేలా ఉన్న ఈ పత్రం తపసి చెట్టుది.
- 25లోగా మండల కమిటీలను ఏర్పాటు చేయండి జిల్లాల్లో పార్టీ కమిటీల ఏర్పాటును పూర్తిచేసి.. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి సచిన్ సావంత్ సూచించారు.
- వాసవిమాతకు.. రూ.6.11 కోట్లతో అలంకరణ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గద్వాల పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవిమాతను శుక్రవారం రూ.6.11 కోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు.
- ‘ఎన్హెచ్ఎం’ ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి: రామచందర్‌రావు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
- రాజన్న సన్నిధిలో బతుకమ్మ సంబురాలు వేములవాడ పుణ్యక్షేత్రంలో శుక్రవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
English Translation

Every drop is a warning!

- A
- A+
- A++
Today, Hyderabad: The capital city of Hyderabad. 560 MGD of water is being supplied to 1.30 crore people with 14.5 lakh Nalla connections per day in the area. Greater authorities have estimated that if at least 20% is saved, 30.28 crore liters will be left. The same water can be given to a large district like Nalgonda with a population of 15 lakhs for a whole day at the rate of 160 liters per person per day. Experts want to imagine how much change will come if everyone practices this across the state. Due to El Nino, there is a risk of water scarcity due to depletion of ground water and drying up of reservoirs in the state. Boreholes have already started drying up in some areas. In this background, the only duty before everyone is save. Due to lack of rainfall, high temperatures and high consumption in the state, groundwater is getting deeper day by day. At this time, the government wants to use water very carefully.
High population is a concern in the district
Groundwater resources department reports reveal that the ground water level has fallen to dangerous levels in 271 mandals of the state. In these 117 mandals the intensity is high. Especially Hyderabad, Medchal-Malkajigiri, Rangareddy, Vikarabad; The situation is alarming in 271 mandals of Mahabubnagar, Narayanapet, Bhadradri-Kottagudem, Khammam, Sangareddy, Jayashankar Bhupalappalli, Suryapet, Adilabad, Jogulamba-Gadwala, Mahabubabad, Medak, Mancheryala, Hanumakonda, Warangal, Nirmal, Kamareddy, Yadadri-Bhuvanagiri etc districts.
If you put your mind to it, there are many ways...
The way of water consumption in the house should be specially examined. If you look at how much you can save, saving starts by itself. Things like drain leakages, cleaning method of cooking equipment, usage at washing machine, showers and washbasin should be observed.
- Water supply to plants through pipes is more wasteful. Actions that directly reach the roots of plants and trees are more beneficial.
- Works like washing vehicles and floor cleaning will waste more water than necessary. Apartments and gated communities must take care of the water used within their limits.
- Drinking water filters purify two and a half liters of water for one liter of clean water. That means one and a half liters of water is wasted. Savings should be observed in ARV filter centers and bulk treatment centers. The water released after treatment should be looked after in the inkwells.
No one should waste water
Difficulties for cultivation and drinking water started due to depletion of groundwater. This deficit is inevitable till the next monsoon season. Let's follow CM Revanth Reddy's instructions that everyone should use water sparingly. We can prevent water wastage with small ideas. The government is also undertaking awareness programs to create awareness among the people.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Oct 2026 03:30 ISTNote:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. No correspondence in this matter.
More
- Resolve Dispute in Arbitration The Supreme Court has made it clear that the dispute between HMDA, Hyderabad Growth Corridor Limited (HGCL)-Indian Council of Arbitration and Hyderabad Expressway Limited, which entered into a concession agreement in 2007 for the construction of an eight-lane expressway between Bonguluru-Thukkuguda and Kollur-Patancheru, should be settled through arbitration.
- Do not take strict action on disputed lands during Dussehra holidays In case of properties under court investigation.. The High Court has issued orders to the Chief Secretary of the Revenue Department to issue orders to the Collectors and Hydra not to take any strict action till the end of the Dussehra holidays. A heartbreaking incident where a son who had returned home for Dussehra holidays collapsed and died in front of his parents took place on Friday at Gandagalapadu under Vaira Municipality of Khammam district. Bharata Executive President KTR said that the graduates, educated people and unemployed people of the state are very angry with the Congress government and the defeat of the Congress party in the upcoming graduate MLC elections is certain. Union Coal and Mines Minister Kishan Reddy has been asked by Agriculture Minister Tummala Nageswara Rao to allocate Rs.100 crore from Coal India CSR funds to Kothagudem Earth Sciences University.
- Rohit Vemula Bill draft in 3 months Deputy Chief Minister Bhatti Vikramarka has issued instructions to the officials to prepare the draft of Rohit Vemula's Telangana Bill within three months.
- Mutual cooperation in industrial development. State IT and Industries Minister Duddilla Sridharbabu wished Telangana and Karnataka states to move ahead with mutual cooperation in industrial development. Minister Ponnam Prabhakar said that it is not so risky to grow politically in the current situation. On the occasion of World Food Day, Association of Food Scientists and Technologists (India)-Hyderabad Chapter organized a special exhibition in the city on Friday. Delhi Chief Minister Rekha Gupta said that Bathukamma is a festival of nature on the one hand but on the other hand it is a symbol of women's power. Efficient water management in food processing industries. Dr. Giridhar Parvatham, director of CSIR - Central Food Technological Research Institute (CFTRI) in Mysore said that apart from environmental protection, industrial profitability and sustainability is a scientific aspect. A large number of devotees flocked to Basara Kshetra in Nirmal district on Friday to pay homage to Mula Nakshatra, the mother's birth star. Telangana Raksha Sena president Kalvakuntla Kavitha has demanded that Rs.12,000 should be provided annually to the farmer laborers as promised by Congress party before the elections.
- Deemed-to-be status for SR University. Chairman of SR Academy and Chancellor of SR Academy of Higher Education (SRAHE) Varada Reddy said that they will make their SR University one of the best educational institutions in the country with world-class educational standards. The water level in the Singuru reservoir, which is supposed to be full of water, is falling rapidly day by day.
- The leaf is half a meter long. Half a meter long and half a meter wide, this astonishing document is a Tapasi tree.
- Set up Mandal Committees within 25 After completing the formation of party committees in the districts.. AICC State In-charge Secretary Sachin Sawant advised the District Congress Presidents to focus on strengthening the Congress party organizationally. As part of Devi Navratri celebrations, Vasavi Mata was decorated as Dhanalakshmi with Rs 6.11 crores at Srikanyakaparameshwari temple in Gadwala town on Friday.
- Demands of 'NHM' employees should be resolved immediately: Ramachandra Rao Several leaders demanded that the Congress government should immediately address the fair demands of the National Health Mission (NHM) employees. Saddula Bathukamma celebrations were held in Vemulawada shrine on Friday with grandeur.