

సింగరేణి కుంభకోణాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: విదేశీ బొగ్గు కొనుగోలు సహా సింగరేణిలో జరుగుతున్న అన్ని కుంభకోణాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు కొనుగోలుపై ఏ విచారణ జరిపించాలో తేల్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌పై శుక్రవారం కేటీఆర్ స్పందించారు. ‘సింగరేణిలో మీ బావమరిది ప్రమేయంతో జరిగిన రూ.10 వేల కోట్ల కుంభకోణం సహా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమాలు జరిగాయని మేము ఆరోపిస్తున్న అన్ని అంశాలపైనా న్యాయ విచారణకు ఆదేశించాలి’ అని సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ భారాస సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘‘గతంలో 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని బలహీనపరిచి.. ఇప్పుడు ఆ సంస్థను పక్కనపెట్టి.. విదేశీ బొగ్గు కొనుగోళ్లకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సింగరేణిలో టన్ను బొగ్గు సుమారు రూ.3,800కు లభిస్తుంటే.. విదేశాల నుంచి కొనుగోలు చేస్తే టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతుంది.
దేశీయంగా సింగరేణిలో అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా.. కేవలం కమీషన్ల కోసం మాత్రమే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోళ్ల పేరుతో ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షోభాన్ని సృష్టించి.. పరిస్థితి చేయి దాటిన తర్వాత బొగ్గు తెస్తామని, విద్యుత్ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని తగ్గించడం వల్లే నేడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద బొగ్గు కొరత ఏర్పడింది. సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి.. బొగ్గు సరఫరా చేయడం లేదంటూ సంస్థను బద్నాం చేస్తున్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు.. అప్పట్లో యూనిట్ విద్యుత్‌ను రూ.3.90కు కొనుగోలు చేస్తే కుంభకోణమని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు యూనిట్‌కు రూ.15 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాలని చూస్తోంది.
సాగునీరు, కరవు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదు. సుమారు 1,000 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేసి.. ఇప్పుడు ఎల్‌నినోను సాకుగా చూపుతూ చేతులెత్తేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి.. రైతుల సమస్యలపై స్పందించాలి. సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలి. నర్సంపేట నియోజకవర్గంలో రాబోయే రెండేళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయం’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారాస నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య, ఏనుగు రాకేశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- లెక్క తేలని విద్యార్థులు.. 2.07 లక్షలు! రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం (2025-26)లో చదివిన విద్యార్థుల్లో 2.07 లక్షల మంది లెక్క తేలడం లేదు.
- ఆది నుంచీ లొసుగులు.. లోపాలు నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో 4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్తగా నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంటు నిర్మాణ, నిర్వహణ పనుల్లో లొసుగుల వల్లనే విద్యుదుత్పత్తి సరిగా లేదని ఇంజినీర్లు చెపుతున్నారు.
- ‘స్పెషల్’ బాదుడు! బతుకమ్మ, దసరా పండగల రద్దీని ఆర్టీసీ ప్రత్యేక ఆదాయ అవకాశంగా మలుచుకుంటోంది.
- పాత గుత్తేదారులకివ్వాలా.. కొత్తగా టెండరు పిలవాలా.. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల పనులు పాత గుత్తేదారులకే ఇవ్వాలా లేక టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించాలా అన్నదానిపై నీటిపారుదల శాఖ తర్జనభర్జనలు పడుతోంది.
- సంక్షిప్త వార్తలు (14) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం (నేడు) జరగనున్న ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీజీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆహ్వానించింది.
- మన బంగారు కొండలు.. ‘బాగు పడేలా మాటలు!’ ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో తల్లిదండ్రులు అనే మాటలే ఇవి. ఉద్యోగరీత్యా, ఇతర పనుల్లో భాగంగా ఉదయం వెళ్లి.. సాయంత్రానికి తిరిగివస్తుంటారు.
- డబుల్ డ్యూటీకి సెలవుల్లేవ్! డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలని.. డీఆఫ్, సీఆఫ్ (సంబంధిత సెలవులు) మంజూరు చేయవద్దంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదేశించింది.
- ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం విచారించాలి ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సవాల్ చేస్తూ విజయ్‌గోపాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ సిద్ధం.. దసరా నుంచి ఓపీ సేవలు ఎంజీఎం భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనంలోకి వైద్య విభాగాలను తరలించి సేవలు అందించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
- ఒకరి నష్టం నుంచి మరొకరు ధనవంతులు కాకూడదు బుక్ చేసుకున్న ఫ్లాట్‌ను అప్పగించడంలో విఫలమైన రియల్ఎస్టేట్ సంస్థ డబ్బు వాపస్ ఇచ్చినప్పుడు దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అతను సొంతంగా చెల్లించిన మొత్తం మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
- సింగరేణి భవిష్యత్తుపై కేటీఆర్ మొసలి కన్నీరు సింగరేణి భవిష్యత్తు, బకాయిలపై మాజీ మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.
- ‘రైతు బీమా’ కొనసాగించకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా ‘బొగ్గు ఉత్పత్తి లేక విద్యుత్తు నిలిచిపోతోంది. జల లభ్యత ఉన్నా ప్రాజెక్టుల్లో మోటార్లు నడవకపోవటంతో నీళ్లు వస్తలేవు. రాష్ట్రంలో మూడు నెలల నుంచి రైతు బీమా పథకం ఆగిపోయింది. మూడు వేల రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
- తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్తలను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
- ఐదు లక్షల ఎకరాల్లో పంటలకు తెగుళ్ల బెడద రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీరందక పంట రక్షణకు ఆపసోపాలు పడుతున్న అన్నదాతలను పంట తెగుళ్లు బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లో ప్రధాన పంటలు వివిధ తెగుళ్ల బారిన పడినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.
- నంబులాద్రి స్వామివారు.. ఏడాదికి 3 రోజులే కొలువవుతారు! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక నంబులాద్రిస్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో స్వామివారు సంవత్సరంలో మూడు రోజులే కొలువై భక్తులకు దర్శనమిస్తారు.
- ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ: మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
- భవన నిర్మాణ కార్మికుల బోర్డును ప్రక్షాళన చేస్తాం: మంత్రి వివేక్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తామని, ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న కార్మికులను బదిలీ చేస్తామని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
- లలితా మహా త్రిపురసుందరి అలంకరణలో భద్రకాళి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం..ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు లలితా మహా త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
- సత్వరమే మార్కెట్ యార్డులను డిజిటలీకరించాలి: మంత్రి తుమ్మల రాష్ట్రంలో మార్కెట్ యార్డులన్నింటిని వెంటనే డిజిటలీకరించి.. చెల్లింపుల ప్రక్రియ వంటివన్నీ ఆన్లైన్లో జరపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
- గురుకులాల్లో బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయండి: మంత్రి అడ్లూరి సంక్షేమ గురుకులాల్లో సరకుల కొరతకు తావులేకుండా ముందస్తుగా బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.
English Translation


- A
- A+
- A++
Today, Hyderabad: Bharasa Executive President KTR demanded that all the scandals going on in Singareni, including the purchase of foreign coal, should be investigated by the sitting judge. On Friday, KTR responded to the challenge thrown by Chief Minister Revanth Reddy to decide which inquiry should be conducted on the purchase of foreign coal. CM Revanth demanded that a judicial inquiry should be ordered on all the issues that we are alleging that irregularities took place after the Congress government came to power, including the Rs 10,000 crore scam involving your brother-in-law in Singareni. KTR spoke as the chief guest at the Warangal District Narsampet Constituency Bharasa meeting held at Telangana Bhavan on Friday. "Government is conspiring to buy foreign coal by weakening Singareni, which produced 70 million metric tons of coal in the past.. and now sidelining that company.. If a tonne of coal is available in Singareni for around Rs.3,800, if purchased from abroad, it costs Rs.10,000 to Rs.12,000 per tonne.
Instead of using what is available domestically in Singareni, this business is being carried forward in the name of buying coal from Australia only for commissions. The Chief Minister is saying that they will bring coal and buy electricity after creating a crisis. Due to reduction of coal production in Singareni today there is shortage of coal at power generating stations. The company is being maligned by saying that the dues of about Rs.60 thousand crores to be paid to Singareni are pending.. and that they are not supplying coal. Earlier in Chhattisgarh, when the then Congress government made a power purchase agreement, the Congress party accused it of being a scam if a unit of electricity was purchased at Rs.3.90. After releasing about 1,000 TMC of water into the sea. The government should keep aside politics and respond to farmers' problems. People who are suffering from shortage of irrigation water, drinking water and electricity should be supported. KTR expressed confidence that the pink flag will be raised in the Narsampeta constituency in the next two years. Bharata leaders Palla Rajeshwar Reddy, Pochampalli Srinivas Reddy, Takkellapalli Ravinder Rao, Boinapalli Vinodkumar, Gandra Venkata Ramana Reddy, Shankar Naik, Tatikonda Rajaiah, Enugu Rakesh Reddy, Vasudevar Reddy, late leader Peddi Sudarshan Reddy's wife Swapna and others participated in the program.
► Read Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Students who cannot count.. 2.07 lakhs! 2.07 lakh students who studied in government and private schools in the state in the last academic year (2025-26) are not accounted for. Engineers say that the electricity generation is not good because of the loopholes in the construction and maintenance of the newly built Yadadri Thermal Plant with an installed capacity of 4 thousand megawatts near Damaracharla in Nalgonda district.
- 'Special' Badudu! Bathukamma and Dussehra festival rush is being converted by RTC as a special revenue opportunity.
- The Irrigation Department is debating whether to give the old monopolists.. Call for a new tender.. Should the repair work of Kaleswaram barrages be given to the old monopolists or handed over through the tender process.
- Brief News (14) A delegation led by TGFDC Chairman Dil Raju has invited Chief Minister Revanth Reddy to be the chief guest at the 'Bathukamma Young Filmmakers Challenge-2026' awards ceremony to be held at the Shilpaka venue in Hyderabad on Saturday (today). These are the words that parents say in every household at some point. As an employee, as part of other work, they go in the morning and return in the evening. Drivers and conductors doing double duties should be paid only double duty advance. The State Road Transport Corporation (RTC) has ordered not to grant DOF and COF (relevant leaves). The Supreme Court has ordered a bench headed by the Chief Justice of the High Court to hear a writ petition filed by a lawyer named Vijaygopal challenging the Kalyanalakshmi and Shaadi Mubarak schemes being implemented by the Telangana government without any legal support. District in-charge minister Ponguleti Srinivasa Reddy said that in the wake of the dilapidation of the MGM building, medical departments will be shifted to the Warangal Super Specialty Hospital building as soon as possible. The Supreme Court has said that when a real estate company fails to hand over the booked flat, when it refunds the money, the buyer should only be given the amount he himself paid.
- KTR's crocodile tears on Singareni's future. Minister Ponguleti Srinivasa Reddy has flagged that the former minister is shedding crocodile tears over Singareni's future and arrears.
- Dharna in front of the CM's house if 'Ritu Bima' is not continued. "Coal production or electricity is stopping. Even if there is water availability, water is not coming because the motors are not running in the projects. Rythu Bima scheme has been stopped in the state since three months. Three thousand farmers' families are on the road.
- Participate in the development of Telangana IT Minister Duddilla Sridhar Babu has asked the industrialists from Tamil Nadu to become partners in the development of Telangana. Crop pests are troubling the rice farmers who are facing the danger of protecting the Nirandaka crop due to the rainy conditions in the state. The Department of Agriculture has identified that major crops in five lakh acres across Telangana have been affected by various pests.
- Nambuladri Swami. Kodurupaka Nambuladriswamy temple of Sultanabad mandal of Peddapally district has a special feature. In this temple, Swami visits the devotees only three days a year.
- Precautionary action to face El Nino: Minister Seethakka State Panchayati Raj and Rural Development Minister Sitakka has ordered the authorities to prepare with comprehensive action to deal effectively with the situations arising due to the influence of El Nino.
- We will purge the construction workers board: Minister Vivek Power Minister Vivek Venkataswamy said that the construction workers' welfare board will be purged and the workers who have been working in the same place for years will be transferred. On the fifth day of Devi Sarannavaratri celebrations, Goddess Orugallu Bhadrakali appeared to the devotees dressed as Lalita Maha Tripurasundari on Thursday.
- Market yards should be digitized soon: Minister Thummala Agriculture Minister Tummala Nageswara Rao has directed officials to digitize all market yards in the state immediately and make payments online.
- Prepare buffer stock in gurukuls: Minister Adluri SC Welfare Minister Adluri Laxman Kumar said that buffer stock should be prepared in advance to avoid shortage of goods in welfare gurukuls.