సీట్ల లేక్క తేలింది

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 16 Oct 2026 16:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, అమరావతి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది. సుదీర్ఘ చర్చల తర్వాత మూడు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చాయి. తెదేపా, జనసేన మధ్య చర్చల్లో మొదట్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినా.. చివరకు రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు కొలిక్కి తెచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీల నాయకులు, కార్యకర్తల ఆకాంక్షల్ని గౌరవిస్తూ తెదేపా, జనసేన, భాజపా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేశాయి. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేసేదీ గురువారం రాత్రి ప్రకటించాయి. 

17 నగరపాలక సంస్థల మేయర్‌ పీఠాలకుగానూ తెదేపా 11, జనసేన 4, భాజపా 2 చోట్ల పోటీపడతాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ పదవులకు తెదేపా 78 చోట్ల, జనసేన 21, భాజపా 7 స్థానాల్లో పోటీ చేస్తాయి. మొత్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో తెదేపా 89, జనసేన 25, భాజపా 9 చోట్ల పోటీ చేయనున్నాయి. మొత్తం స్థానాల్లో జనసేనకు 20.33%, భాజపాకి 7.32% కేటాయించారు. మేయర్‌/ ఛైర్మన్‌గా ఒక పార్టీ వారుంటే, డిప్యూటీ మేయర్‌/ వైస్‌ ఛైర్మన్‌ పోస్టును మరో పార్టీకి ఇచ్చేలా సర్దుబాటు చేసుకునే అవకాశముంది. 

కార్యకర్తల ఆకాంక్షల్ని గౌరవిస్తూ:పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల కీలక నేతల మధ్య సోమవారం నుంచి నాలుగు రోజులపాటు విస్తృత చర్చలు జరిగాయి. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంలో తెదేపా, జనసేన మధ్య చర్చల్లో కొంత పీటముడి పడింది. జనసేన ఎక్కువ స్థానాలు కోరడం, వివిధ సమీకరణాల దృష్ట్యా అన్ని కేటాయించలేమని తెదేపా చెప్పడంతో కొంత ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని సామరస్య వాతావరణంలో ఎలా కొలిక్కి తెస్తారన్న ఉత్కంఠ రెండు పార్టీల శ్రేణుల్లోనూ కొనసాగింది. సోమవారం నుంచి బుధవారం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన, భాజపా నేతలు.. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో తెదేపా నేతలు చర్చించారు. బుధవారం ముఖ్యమంత్రితో జనసేన నేతల భేటీలో సీట్ల సర్దుబాటుపై దాదాపుగా ఒక అవగాహన కుదిరింది. దానికి కొనసాగింపుగా గురువారం సీఎంతో జనసేన, భాజపా నేతలు జరిపిన చర్చల్లో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 

  • ఉదాహరణకు పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయిస్తారన్న సంకేతాలు రావడంతో అక్కడ తెదేపా కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. వారి ఆకాంక్షల్ని అర్థం చేసుకుని పెద్దాపురం స్థానంలో తెదేపా పోటీకి జనసేన అంగీకరించింది. 
  • ఏలూరు మేయర్‌ పదవిని జనసేన కోరింది. అక్కడ తెదేపా శ్రేణుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా.. పార్టీ నాయకత్వం వారికి సర్దిచెప్పి జనసేన పోటీకి మార్గం సుగమం చేసింది. 

నేటి నుంచి అభ్యర్థుల ప్రకటన 

కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఛైర్మన్‌ పోస్టులకు కూటమి పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. శుక్రవారం నుంచి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. కార్పొరేటర్, కౌన్సిలర్‌ పోస్టులకు అభ్యర్థుల్ని జిల్లాల్లోనే ఖరారు చేసి, అక్కడే ప్రకటిస్తారు. 

డివిజన్లు, వార్డులపై ముమ్మరంగా చర్చలు

మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల సర్దుబాటుపై జిల్లాల్లో మూడు పార్టీల మధ్య ముమ్మర కసరత్తు జరుగుతోంది. తెదేపా, జనసేన, భాజపాల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఆ పక్రియ కొలిక్కి రానుంది.

కార్పొరేషన్లలో కూటమి పార్టీలు పోటీ చేసే స్థానాలు..

తెదేపా:విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు.

జనసేన:శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ

భాజపా:రాజమహేంద్రవరం, అనంతపురం

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 05:05 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
  • ఏడుగురు మేయర్, 20మంది ఛైర్మన్‌ అభ్యర్థులతో వైకాపా తొలి జాబితా మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్, ఛైర్మన్‌ అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా గురువారం ప్రకటించింది.
  • ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్‌ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.
  • ప్రగతి సారథులు మహిళలే ‘స్వయం సహాయక సంఘాలు ఊహించని రీతిలో విస్తరించాయి. గ్రామీణ జీవన విధానాన్ని సమూలంగా మారుస్తూ, దేశ సమగ్రాభివృద్ధికి వెలకట్టలేని సేవలందిస్తున్నాయి.
  • నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు ‘మహిళ ఆర్థికంగా ఎదిగితే.. ఆ కుటుంబం పైకొస్తుంది.. స్త్రీలు అభివృద్ధి చెందితే.. దేశం పురోగమిస్తుంది.
  • రాష్ట్రపతికి మంగళగిరి చేనేత చీర,ఏటికొప్పాక కళాకృతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
  • చకచకా పోలవరం నిర్వాసితులకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీ పనులనూ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది.
  • కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.
  • సర్వభూపాలంపై వేణుగోపాలుడిగా శ్రీవారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరింది.
  • అంత డబ్బు ఎలా సమకూరింది? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు.
  • ఆకాంక్షలు, విజయాలకు చిరునామా ఏపీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల జోడీ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది.
  • బ్యాంకింగ్‌ వ్యవస్థకు వెన్నెముక గ్రామీణ మహిళలు గ్రామీణ మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారు.
  • స్త్రీ శక్తితోనే సర్వతోముఖాభివృద్ధి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, సహజసిద్ధ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ వస్తువులను సరస్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచారు.
  • శ్రీవారి వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం...
  • విదేశీ నిపుణులకు ‘డయాఫ్రం వాల్‌ డాక్యుమెంట్‌’ పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి ప్యానళ్ల ఏర్పాటు, ఇతర అంశాలపై 36 పుస్తకాలతో సిద్ధం చేసిన డాక్యుమెంట్‌ను విదేశీ నిపుణుల బృందానికి అధికారులు గురువారం సమర్పించారు.
  • మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ బైక్‌ ర్యాలీ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31 నాటికి గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకునేలా తలపెట్టిన ‘జాతీయ ద్విచక్ర వాహనాల ర్యాలీని (నేషనల్‌ మోటర్‌ సైకిల్‌ ర్యాలీ) డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
  • శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
  • స్కందమాతగా భ్రమరాంబాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 
  • ఉపాధి కల్పిస్తున్నా.. బీటెక్‌ వైపే మొగ్గు! పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నా చాలా మంది వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
  • ధనలక్ష్మీ.. నమోస్తుతే! దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ భవనంలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి మాత గురువారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

English Translation
my-3">

Lack of seats

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 16 Oct 2026 16:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Today, Amaravati: The seat adjustment process between the alliance parties in the urban local body elections ended in a cordial atmosphere. After long discussions, the three parties came to an agreement. Although there was some deadlock in the talks between TDP and Jana Sena, finally the talks came to an end in the trend of exchange between the two parties. Respecting the aspirations of party leaders and activists at the field level, TDP, Jana Sena and BJP have completed the seat adjustment process. They announced on Thursday night which party will contest from where. 

The TDP will contest in 11 places, Jana Sena in 4 places and BJP in 2 places out of 17 mayoral seats. TDP will contest in 78 places, Jana Sena in 21 places and BJP in 7 places for the posts of chairpersons in municipalities and city panchayats. Out of a total of 123 urban local bodies, TDP will contest in 89 seats, Jana Sena in 25 seats and BJP in 9 seats. 20.33% of the total seats were allotted to Jana Sena and 7.32% to BJP. If one party is Mayor/Chairman, there is a possibility to adjust the post of Deputy Mayor/Vice Chairman to another party. 

Regarding the aspirations of the activists:Four days of extensive discussions were held between the key leaders of the alliance parties on the adjustment of seats in the urban local bodies. There was some deadlock in the discussions between TDP and Jana Sena regarding who should contest in how many seats. There was some deadlock as the Janasena demanded more seats and the TDP said that they could not allot them in view of various equations. The excitement continued in the ranks of both the parties as to how this could be resolved in an atmosphere of harmony. From Monday to Wednesday, Janasena and BJP leaders discussed with Chief Minister Chandrababu and TDP leaders with Janasena chief and Deputy Chief Minister Pawan Kalyan. In the meeting of the Janasena leaders with the Chief Minister on Wednesday, an understanding was almost reached on the adjustment of seats. In continuation of that, in the discussions held by the Janasena and BJP leaders with the CM on Thursday, the adjustment of the seats came to an end. 

  • For example, when there were signs that the Peddapuram municipality would be allotted to the Janasena, the TDP workers there expressed extreme concern. Understanding their aspirations, the Jana Sena agreed to contest TDP instead of Peddapuram. 
  • Janasena demanded the post of mayor of Eluru. Although there was some opposition from the ranks of the TDP, the party leadership corrected them and paved the way for the Janasena contest. 

Announcement of candidates from today

The process of selection of candidates for the posts of mayors of corporations, municipalities and city panchayats is almost over. Candidates will be announced from Friday. Candidates for the posts of Corporator and Councilor will be finalized in the districts and announced there. 

Discussions on Divisions and Wards

On the other hand, there is a heated exercise between the three parties in the districts on the adjustment of divisions and wards in corporations and municipalities. District presidents, MLAs and chief leaders of TDP, Jana Sena and BJP are holding extensive discussions. The action will come to an end on Friday and Saturday.

The seats where alliance parties will contest in corporations..

Tedepa:Vijayanagaram, Visakhapatnam, Machilipatnam, Mangalagiri-Tadepalli, Guntur, Ongole, Nellore, Kurnool, Kadapa, Tirupati, Chittoor.

Janasena:Srikakulam, Kakinada, Eluru, Vijayawada

BJP:Rajamahendravaram, Anantapuram

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 05:05 IST

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Nominations in 5,485 centers for Pura Poru Nominations will be received from 11 am on Friday morning in 100 towns, municipal bodies and city panchayats in the state.
  • The first list of Vaikapa with seven mayor and 20 chairman candidates. Vaikapa announced the first list of mayor and chairman candidates on Thursday against the background that the nominations for municipal and city government elections will begin from Friday. Dr. CH Ravikumar of Alapadu, Guntur District, Chundur Mandal filed a PIL in the High Court that the BC reservations made in the 'local' elections were not in accordance with the Supreme Court's directives. Self help societies have expanded in an unexpected way. Radically changing the way of rural life, they are rendering invaluable service to the overall development of the country.
  • Yesterday's Savings Societies. If a woman grows economically... the family will grow... if women develop... Nation will progress.
  • Mangalgiri handloom sari for President, Etikoppaka artwork President Draupadi Murmu received a courtesy call from Education and IT Minister Lokesh at the Novotel Hotel in Vijayawada on Thursday morning. Along with the construction of the Polavaram project, the government is also running the work of the colony for the displaced. All should work together for the success of alliance candidates in local body elections. We won seats in the municipal elections according to the sentiments of the activists. As part of Tirumala Navratri Brahmotsavam, Sarvabhupala Vahanaseva was held grandly on Thursday night.
  • How did you collect so much money? Enforcement Directorate (ED) officials questioned Devi Reddy Sivashankar Reddy, a key accused in the murder case of former minister YS Vivekananda Reddy, on Thursday. The pair of Prime Minister Narendra Modi and Chief Minister Chandrababu Babu is driving development in the state.
  • Rural women are the backbone of the banking system. If rural women are given adequate opportunities, they will grow into entrepreneurs and provide employment to hundreds of families. 1,500 women entrepreneurs from all over the country exhibited handicrafts, handlooms, natural food products and organic products at the Saras Mela.
  • High Court Judge at Srivari Vahanaseva High Court judge Justice B. Krishnamohan along with family members on Thursday...
  • 'Diaphragm Wall Document' for foreign experts Officials on Thursday submitted a document prepared with 36 books to a group of foreign experts on construction of new diaphragm wall in Polavaram project, installation of panels and other issues.
  • Long bike rally against drugs DGP Harishkumar Gupta flagged off the 'National Motorcycle Rally' at the police headquarters in Mangalagiri on Thursday to mark National Unity Day and reach Ektanagar in Gujarat by 31st of this month. As part of Dussehra Sharannavaratri celebrations, Jaganmata Durgamma Srilalitha Tripura appeared to the devotees on Indrakiladri in Vijayawada on Thursday.
  • Bhramarambadevi as Skandamata. The Sharannavaratri mahotsavam is going on in Srisaila Mahakshetra. 
  • Providing employment.. Lean towards BTech! The students who are completing their polytechnic diploma are getting jobs but many of them are not interested in joining them.
  • Dhanalakshmi. Goddess Vasavi Kanyakaparameshwari Mata appeared to the devotees in the form of Dhanalakshmi on Thursday at Thyagaraja mansion in Bhimavaram, West Godavari district as part of the Devi Sarannavaratri celebrations.