వీళ్ల మనసూ అందమైనదే!

విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ సినిమా స్ఫూర్తితో పోలీసు ఉద్యోగాల్లో చేరి సమాజంలో మహిళలపై జరుగుతోన్న అన్యాయాలపై పోరాడిన యువతులెంతోమంది..  ‘మహానటి’ సావిత్రి పాత్ర ఎంతోమందిలో దానగుణాన్ని, దయాగుణాన్ని పెంచింది. ఈ ప్రేరణతో సమాజ సేవకు నడుం బిగించిన మహిళామణులూ కొందరున్నారు.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 13:05 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

(Photos: Instagram)

విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ సినిమా స్ఫూర్తితో పోలీసు ఉద్యోగాల్లో చేరి సమాజంలో మహిళలపై జరుగుతోన్న అన్యాయాలపై పోరాడిన యువతులెంతోమంది..

‘మహానటి’ సావిత్రి పాత్ర ఎంతోమందిలో దానగుణాన్ని, దయాగుణాన్ని పెంచింది. ఈ ప్రేరణతో సమాజ సేవకు నడుం బిగించిన మహిళామణులూ కొందరున్నారు.

‘అరుంధతి’, ‘పింక్‌’, ‘గంగూబాయ్‌ కథియావాడి’.. వంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ స్త్రీ పాత్రలు సామాజిక చైతన్యానికి ఊతమిచ్చాయి.

అయితే తాము పోషించిన పాత్రలు సమాజానికే కాదు.. తమకూ స్ఫూర్తినిచ్చాయంటున్నారు కొందరు తారలు. వీటిని ప్రేరణగా తీసుకొనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో తాజాగా చేరిపోయింది రష్మిక. ‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ పాత్ర స్ఫూర్తితోనే 400 కుటుంబాల్ని దత్తత తీసుకున్నానంటూ ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. వెండితెరపై తమ పాత్రల స్ఫూర్తితో ఆయా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన కొందరు అందాల నాయికల గురించి తెలుసుకుందాం..

జయమ్మ స్ఫూర్తితో.. ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’!

అందమే కాదు.. అందమైన మనసూ నటి రష్మిక సొంతం. ఇప్పటికే తన భర్త విజయ్‌తో కలిసి చిన్నారుల చదువు కోసం స్కాలర్‌షిప్‌లందిస్తూ, ఆయా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాను నటించిన ‘రణబాలి’ చిత్రంలోని తన పాత్ర జయమ్మ స్ఫూర్తితోనే దీన్ని ప్రారంభించినట్లు ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టింది.

‘సినిమాల్లో కొన్ని పాత్రలు సమాజాన్నే కాదు.. నటీనటుల్నీ ప్రేరేపిస్తాయి. రణబాలిలో జయమ్మ పాత్ర అలాంటిదే. ఆమె ఎంతో దయాగుణం, సేవాగుణం కలిగిన వ్యక్తి. చాలామంది ‘మీకు, జయమ్మకు పోలికలున్నాయా?’ అని అడుగుతుంటారు. కచ్చితంగా ఉన్నాయనే చెబుతా. సేవాగుణం అందులో ఒకటి. నేనెప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటా. కానీ వాటి గురించి అందరికీ తెలియాలనుకోను. నా సన్నిహితులకు తెలిస్తే చాలనుకుంటా. అయితే ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. నన్ను చూసి స్ఫూర్తి పొంది మరికొందరు సమాజానికి సహాయపడాలని నేను కోరుకుంటున్నా. ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ కార్యక్రమంలో భాగంగా 400 పేద కుటుంబాల్ని దత్తత తీసుకున్నా. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి 3 నెలల పాటు సరిపోయేలా నిత్యావసర సరుకుల్ని అందించబోతున్నా. ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తద్వారా ఆయా కుటుంబాలు నిత్యావసర సరుకులకయ్యే డబ్బును పొదుపు చేసుకొని భవిష్యత్‌ అవసరాలకు వాడుకొనే వీలు కలుగుతుంది. మరొకరి జీవితాన్ని మెరుగుపరచాలంటే పెద్ద సహాయమే చేయక్కర్లేదు.. ఇలాంటి చిన్న చిన్న పనులూ ఫలితాన్నిస్తాయి..’ అంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తన ప్రాజెక్ట్‌ కోసం వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలను ఎంచుకుందట. ఇలా రష్మిక అందించబోయే కిట్లలో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమపిండి, 10 లీటర్ల వంటనూనె, పప్పులు, ఉప్పులు.. చాలానే ఉన్నాయట. దీనికి సంబంధించిన వీడియోను రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో.. ఆమె మంచి మనసును నెటిజన్లు కొనియాడుతున్నారు.

మహిళల్లో చైతన్యం రగిలించేలా!

సమాజంలో మహిళలపై ఉన్న వివక్ష నేపథ్యంతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.. ఎంతోమందిని ఆలోచింపజేశాయి. అయితే తాప్సీ నటించిన ‘పింక్‌’, ‘థప్పడ్‌’ చిత్రాలు ఈ జోనర్‌లో ప్రత్యేక ముద్ర వేశాయని చెప్పచ్చు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, పురుషాధిపత్య సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని నొక్కి చెప్పే ఈ చిత్రాలు తనలోనూ ఎంతో స్ఫూర్తి నింపాయంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది తాప్సీ. ఈ ప్రేరణతోనే మహిళల్లో చైతన్యం రగిలించేలా పలు సేవా కార్యక్రమాల్లోనూ భాగమైంది.

⚛ తాను నటించిన మహిళా ప్రాధాన్య పాత్రల స్ఫూర్తితో మహిళల వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టింది తాప్సీ. ఈ క్రమంలోనే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘హేమ్‌కుంట్‌ ఫౌండేషన్‌’తో చేతులు కలిపిన ఆమె.. ఈ సంస్థ అడ్వైజరీ బోర్డ్‌ మెంబర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా సమాజంలో నెలసరిపై ఉన్న అపోహల్ని తొలగించడానికి వివిధ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.

⚛ అంతేకాదు.. వివిధ గ్రామాల్లో పర్యటించి నెలసరి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అక్కడి బాలికలకు 2 లక్షలకు పైగా ఉచిత శానిటరీ న్యాప్‌కిన్లను సైతం పంపిణీ చేసింది.

⚛ మహిళలపై జరిగే గృహ హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి తన మద్దతు ప్రకటించింది తాప్సీ. ఈ క్రమంలో సినిమాలలో గృహ హింసకు సంబంధించిన దృశ్యాలు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా డిస్‌క్లెయిమర్ వేయాలన్న పిటిషన్‌కు మద్దతు ఇచ్చింది.

⚛ వెనుకబడిన వర్గాల ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసం కృషి చేసే ప్రాజెక్ట్ ‘నాన్హీ కలీ’లో చురుగ్గా పాల్గొంటూ బాలికా విద్యకు అండగా నిలుస్తోందీ సొట్టబుగ్గల సుందరి.

ఇవే కాదు.. మహిళల హక్కులు, ఆరోగ్యం, సమానత్వం కోసం సందర్భం వచ్చినప్పుడల్లా తన గళాన్ని వినిపిస్తూ మహిళా సాధికారతకు తన వంతుగా కృషి చేస్తోందీ బ్యూటీ.

‘ఛపాక్‌’తో వాటికి చెక్‌ పెట్టేలా..!

యాసిడ్‌ దాడి బాధితుల సమస్యలు, వాళ్ల జీవితాన్ని కళ్లకు కట్టిన చిత్రమే ‘ఛపాక్‌’. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథతో రూపొందించిన ఈ సినిమాలో నటి దీపికా పదుకొణె ‘మాల్తీ’ అనే పాత్రలో నటించింది. ఈ పాత్ర స్ఫూర్తితో ఆపై పలు అవగాహన కార్యక్రమాల్నీ నిర్వహించిందీ బ్యూటీ.

⚛ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిస్తూ.. సహనటుడు విక్రాంత్‌ మాసేతో కలిసి ‘#AbLadnaHai’ అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది దీప్స్.

⚛ దేశంలో యాసిడ్‌ ఎంత సులభంగా దొరుకుతుందో నిరూపించడానికి ముంబయి వీధుల్లో ఓ స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన దీపిక.. దీని ద్వారా ‘యాసిడ్‌ అమ్మకాలు ఆపితేనే దాడులు ఆగుతాయ’నే బలమైన సందేశాన్ని ప్రభుత్వాలు, ప్రజల దృష్టికి తీసుకెళ్లింది.

⚛ ‘యాసిడ్‌ బాధితుల రూపం కాదు.. వారి ధైర్యమే వారి అసలైన గుర్తింపు’ అంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది దీపిక. వాళ్లను బాధితుల్లా కాకుండా పోరాట యోధుల్లా చూడాలని, తగిన గౌరవం కల్పించాలని సమాజానికి చక్కటి సందేశం ఇచ్చింది.

ఇలా ఈ సినిమా స్ఫూర్తితోనే కాదు.. తన వ్యక్తిగత జీవితంలో డిప్రెషన్‌ని ఎదుర్కొన్న దీప్స్‌.. అందరిలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా తన మాటలతో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతోంది.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Their mind is beautiful!

Inspired by Vijayashanthi's movie 'Kartavyam', many young people joined police jobs and fought against the injustices against women in the society. There are some women who are motivated to serve the community.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 13:05 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

(Photos: Instagram)

Vijayashanti's movie 'Kartavyam' Many young women joined the police jobs with inspiration and fought against the injustices against women in the society. With this motivation, there are some women who have joined the service of the society.

The powerful female characters in the women-oriented films like 'Arundhati', 'Pink', 'Gangubai Kathiawadi'... have given a boost to social consciousness. It is said that many social service programs have been undertaken taking these as inspiration. Rashmika is the latest in this list. This cutie, who played the role of Jayamma in 'Ranabali', has announced on the Insta platform that she has adopted 400 families with the inspiration of this character. In this background.. let's know about some of the beautiful actresses who took up social service projects inspired by their characters on the silver screen..

In the spirit of Jayamma.. 'Project Annapurna'!

Not only beautiful.. Actress Rashmika has a beautiful mind. This lovely lady who is already giving scholarships for children's education along with her husband Vijay and donating to the respective charities has recently started another service program. She posted on Instagram that she started it with the inspiration of Jayamma, her role in the film 'Ranabali'. Jayamma's role in Ranbali is like that. She is a very kind and helpful person. Many people ask, 'Are you and Jayamma similar?' Let me tell you that they are for sure. Service is one of them. I always do such services. But I don't want everyone to know about them. I want my close friends to know. But why am I saying now.. I want others to be inspired by me and help the society. 400 poor families were adopted as part of 'Project Annapurna' programme. In this order, every family is going to be provided with essential goods to last for 3 months. This program will continue for a year. So that the respective families can save money for essential commodities and use it for future needs. You don't need to do a lot of help to improve the life of someone else.. Small things like this will pay off..' Antonna this cute girl.. has chosen poor families living in different parts of different states for her project. The kits that Rashmika will provide include 75 kg of rice, 10 kg of wheat flour, 10 liters of cooking oil, pulses, salt, etc. When Rashmika posted a video related to this on Insta.. Netizens are praising her good heart.

To ignite the consciousness among women!

With the background of discrimination against women in society. Many movies have been released.. they have made many people think. But it can be said that Taapsee's films 'Pink' and 'Thappad' left a special mark in this genre. On one occasion, Taapsee said that these films, which highlight the problems faced by women in a male-dominated society, have inspired her. With this inspiration, she became a part of many service programs to ignite the consciousness among women.

⚛ Inspired by the female lead roles she played, Taapsee focused on women's personal health. In this order, she has joined hands with the famous charity organization 'Hemkunt Foundation'. She is acting as an advisory board member of this organization. As a part of this, she is actively participating in various awareness programs to remove the misconceptions about menstruation in the society.

⚛ Moreover.. Taapsee has also visited various villages and conducted awareness programs on menstrual hygiene and distributed more than 2 lakh free sanitary napkins to the girls there.

⚛ Taapsee has expressed her support for the movement against domestic violence against women. In this order, she supported the petition to put a disclaimer against the scenes of domestic violence in the movies.

⚛ Sottabuggala Sundari is actively participating in the project 'Nanhi Kali' which works for the educational development of the girls of the backward communities and is standing by the girl's education.

Not only this.. Beauty is doing her best for women's empowerment by raising her voice for women's rights, health and equality whenever the occasion arises.

Let's check them with 'Chhapak'..!

Chapak is a film that focuses on the life and problems of acid attack victims. Actress Deepika Padukone played the role of 'Malti' in the film based on the life story of acid attack victim Lakshmi Agarwal. Inspired by this role, the beauty then organized many awareness programs.

⚛ Calling everyone to fight against the attacks on women in the society.. Deepika along with her co-star Vikrant Massey organized a campaign called '#AbLadnaHai'.

⚛ Deepika conducted a sting operation on the streets of Mumbai to prove how easily acid is available in the country. Deepika has taken the strong message of 'Aguthaya' to the attention of governments and people.

⚛ Deepika has organized many awareness programs saying 'Acid victims are not their appearance.. Their courage is their real identity'. It has given a good message to the society that they should be treated as fighters and not as victims.

This is not only the inspiration of this movie..Deeps who faced depression in his personal life..is running a charity organization called 'The Live Love Laugh' to promote mental health in everyone. Whenever the occasion arises, she raises awareness about mental health.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :