వీలైనంత త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం: నిర్మలా సీతారామన్‌

Eenadu icon
By Business News Team Published : 16 Oct 2026 14:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (India-US trade deal) ఇంకా ఖరారు కాలేదు. ఇరు పక్షాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా.. కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ( Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం సహా ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అగ్రరాజ్యంతో చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. బ్యాంకాక్‌లో నిర్వహించిన ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఒప్పందానికి సంబంధించిన తొలి దశ ఖరారైందని (India-US Trade Deal), ప్రస్తుతం దీనికి చట్టపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ( Piyush Goyal) ఇటీవల తనకు చెప్పినట్లు సీతారామన్‌ వెల్లడించారు. దానిపై త్వరలో సంతకాలు కూడా చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో పలు అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ.. భారత్‌ బలమైన వృద్ధి కొనసాగిస్తోందన్నారు. ‘అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని భారతదేశం వృద్ధిని కొనసాగించగలుగుతోంది. నిజానికి.. కొవిడ్ తర్వాత గత నాలుగైదేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం మనదే. సమ్మిళిత వృద్ధి విధానాలు, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణే ఈ పనితీరుకు కారణం. ప్రజాధనం విషయంలో మాకు బాధ్యత ఉంది’ అని సీతారామన్‌ పేర్కొన్నారు.  ఇదీ చదవండి: పోటీకి భయపడేది లేదు: మస్క్‌కు రిలయన్స్‌ కౌంటర్‌

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు..! పలు భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు చొరబడినట్లు భారత సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ హెచ్చరించింది.
  • పోటీకి భయపడేది లేదు: మస్క్‌కు రిలయన్స్‌ కౌంటర్‌ Musk-Reliance: భారత్‌లో స్టార్‌లింక్‌ రాకను కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని, భారత ప్రధాని ముఖేశ్‌ అంబానీ అంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
  • టెస్లా ఎగురుతోంది.. మస్క్‌ కంపెనీ నుంచి ‘ఫ్లయింగ్‌ కారు’ Elon Musk: వినూత్న ఆవిష్కరణలతో కస్టమర్లను అబ్బుపరుస్తున్నాయి ఆటోమొబైల్‌ కంపెనీలు. ఇందులో ఒకటే ‘ఎగిరే కారు’.
  • 2030 కల్లా 6జీ తెస్తాం 6జీ సాంకేతికతపై జియో ప్లాట్‌ఫామ్స్‌ (జేపీఎల్‌) పనిచేస్తోందని, 2030 సంవత్సరంతో మొదలయ్యే దశాబ్దంలో వాణిజ్యపరంగా ఆ సేవలను ఆవిష్కరిస్తామని కంపెనీ ఎండీ ఆకాశ్‌ అంబానీ  పేర్కొన్నారు.
  • విప్రో లాభం రూ.3,200.60 కోట్లు ‘మేం పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాలనివ్వడం ప్రారంభించాయి. అవి కొత్త మార్కెట్లలో విజయం సాధించడానికి, కొత్త క్లయింట్లను చేర్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న సంబంధాలను  మెరుగుపరచుకోవడానికి ఉపయోగ పడుతున్నాయి.’ 
  • టెక్‌ మహీంద్రా 1:1 బోనస్‌ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జులై- సెప్టెంబరు త్రైమాసికానికి రూ.1,585.6 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
  • సూచీలకు కొనుగోళ్ల పండగ మదుపర్ల కొనుగోళ్ల జోరుతో దేశీయ సూచీలు గురువారం దుమ్మురేపాయి. బ్యాంకులు, ఐటీ, రిలయన్స్‌ షేర్లు లాభాలతో కళకళలాడాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ మూడు వారాల గరిష్ఠానికి చేరాయి.
  • కార్ల సరఫరాలు 30.7% పెరిగాయ్‌ ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు 13,60,687 ప్రయాణికుల వాహనాలు (పీవీ - కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) సరఫరా అయినట్లు వాహన తయారీదార్ల సంఖ్య సియామ్‌ గురువారం వెల్లడించింది.
  • డ్రోగో ఏరోస్పేస్‌కు మరో గుర్తింపు స్వదేశీ డ్రోన్‌ తయారీ సంస్థ డ్రోగో ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన జేకే250ఈ డ్రోన్‌కు, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) టైప్‌ సర్టిఫికేషన్‌ లభించింది.
  • నెస్లే ఇండియా లాభంలో 36.3% వృద్ధి దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ నెస్లే ఇండియా, జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.1,026.77 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.743.17 కోట్ల కంటే ఇది 36.32% అధికం.
  • హెరిటేజ్‌ లాభం రూ.30.85 కోట్లు పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.30.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2025-26 ఇదే కాల లాభం రూ.50.99 కోట్లతో పోలిస్తే ఇది 39% తక్కువ.
  • బీన్యూ మొబైల్స్‌ ప్రత్యేక ధరలు దసరా ఆఫర్లలో భాగంగా మొబైల్స్, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు ప్రత్యేక ధరల్లో విక్రయిస్తున్నట్లు బీన్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు.
  • సోనోవిజన్‌ దసరా ఆఫర్లు దసరా సేల్‌లో తాము ఇస్తున్న ఆఫర్లకు అదనంగా, ప్రతి కొనుగోలుదారుకు కచ్చితంగా   5.75% ప్రయోజనం కలిగేలా స్క్రాచ్‌కార్డ్‌ స్కీము ఉపయోగ పడుతోందని సోనోవిజన్‌  మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పి.భాస్కరమూర్తి తెలిపారు.
  • టోకు ద్రవ్యోల్బణం 12% దాటొచ్చు: ఇండ్‌-రా ఈ ఏడాది అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 12%, రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 6% మించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) అంచనా వేసింది.
  • సిట్రోయెన్, జీప్‌ బ్రాండ్లలో 12 మోడళ్లు తీసుకొస్తాం ఫాస్ట్‌లేన్‌- 2030 ప్రణాళిక కింద రాబోయే మూడేళ్లలో సిట్రోయెన్, జీప్‌ బ్రాండ్లలో 12 మోడళ్లు తీసుకు రానున్నట్లు స్టెల్లాంటిస్‌ ఇండియా తెలిపింది.
  • సెప్టెంబరులో వాణిజ్య లోటు 30.21 బి.డా. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రసాయనాల ఎగుమతుల్లో నమోదైన ఆరోగ్యకర వృద్ధి కారణంగా, సెప్టెంబరులో మన దేశ వస్తు ఎగుమతులు 23.04% పెరిగాయి.
  • మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ సీఎన్‌జీ వెర్షన్‌ మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ సీఎన్‌జీ వెర్షన్‌ను ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ జెడ్‌ఎన్‌జీ పేరుతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).
  • బలమైన మేధో సంపత్తితోనే మీడియాలో తదుపరి దశ వృద్ధి బలమైన మేధో సంపత్తి, ఆదాయ నమూనాలు, క్రమం తప్పని పెట్టుబడులు, క్రాస్‌ మార్కెట్‌ వీక్షకులు/పాఠకులను చేరడం ద్వారా మీడియా-వినోద రంగంలో తదుపరి దశ వృద్ధి సాధ్యమవుతుందని సమాచార, ప్రసారాల మంత్రిత్వ కార్యదర్శి చంచల్‌ కుమార్‌ పేర్కొన్నారు.
  • ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13% పెరిగాయ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27)లో అక్టోబరు 14 వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13.21% పెరిగి రూ.13.38 లక్షల కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ లక్ష్యంలో ఇది దాదాపు 50 శాతానికి సమానం.
  • రూ.28,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్లో మార్పుల్లేవ్‌: టాటా రెన్యూవబుల్‌ టాటా సన్స్, టాటా ట్రస్ట్స్‌ మధ్య కొనసాగుతున్న వివాదాలు తమ వ్యాపార విస్తరణపై ఎటువంటి ప్రభావం చూపబోవని టాటా గ్రూప్‌ సంస్థ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్పష్టం చేసింది.

English Translation

India-US trade deal as soon as possible: Nirmala Sitharaman

Eenadu icon
By Business News Team Published : 16 Oct 2026 14:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: India-US trade deal Not finalized yet. Even though there have been several rounds of talks between the two parties, nothing has come to an end. In this context, Union Finance Minister Nirmala Sitharaman (Nirmala Sitharaman) made key comments. He said that steps are being taken to conclude an India-US trade agreement as soon as possible. Keeping in view the bilateral economic and commercial interests including global trade, steps are being taken in that direction. He said that the negotiations with the superpower have come to an end. Speaking at the IMF-World Bank annual meetings held in Bangkok, Sitharaman disclosed that Indian Commerce Minister Piyush Goyal (Piyush Goyal) recently told him that the first phase of the agreement (India-US Trade Deal) has been finalized and the legal draft is currently being prepared. He said that it will be signed soon. Despite many uncertainties in the world, India continues to grow strongly. "In spite of all the adversities, India has been able to continue to grow. In fact.. we are the fastest developing country in the last four years after covid. This performance has been attributed to inclusive growth policies, investment in skill development and fiscal discipline. Sitharaman stated that we have a responsibility in the matter of public money.  Also Read: No fear of competition: Reliance counter to Musk

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Intrusion of AI agents into the computer systems of Indian companies..! Cybersecurity agency Cert-In of India has warned that AI agents have infiltrated the computer systems of several Indian companies.
  • Not afraid of competition: Reliance counter to Musk Musk-Reliance: The accusations made by Elon Musk, the world's Kubera, that some big businessmen are blocking the arrival of Starlink in India and the Prime Minister of India, Mukesh Ambani, have become the subject of intense discussion.
  • Tesla is flying. Elon Musk: Automobile companies are surprising customers with innovative innovations. This is the only 'flying car'.
  • We will bring 6G by 2030 Company MD Akash Ambani stated that Jio Platforms (JPL) is working on 6G technology and will launch those services commercially in the decade starting from 2030.
  • Wipro's profit is Rs.3,200.60 crores. Our strategic investments have started yielding results. They are used to win new markets, attract new clients, improve existing relationships.'
  • Tech Mahindra 1:1 Bonus IT services major Tech Mahindra has reported a consolidated net profit of Rs 1,585.6 crore for the July-September quarter of the current financial year (2026-27).
  • Buying festival for indices Domestic indices rallied on Thursday on the back of buying by investors. Banks, IT and Reliance shares were buoyant with gains. As a result, Sensex and Nifty hit three-week highs.
  • Car shipments up 30.7% SIAM revealed on Thursday that 13,60,687 passenger vehicles (PV - cars, SUVs, vans) were supplied to dealers by vehicle manufacturers during the July-September quarter of this year.
  • Another recognition for Drogo Aerospace The JK250E drone, developed by indigenous drone manufacturer Drogo Aerospace, has received type certification from the Directorate General of Civil Aviation (DGCA).
  • 36.3% growth in Nestlé India's profit FMCG major Nestlé India reported a net profit of Rs 1,026.77 crore on a consolidated basis for the July-September quarter. This is 36.32% higher than the profit of Rs.743.17 crore for the same period of 2025-26.
  • Heritage's profit is Rs.30.85 crore Dairy products major Heritage Foods has reported a consolidated net profit of Rs 30.85 crore for the September quarter. This is 39% less than the profit of Rs.50.99 crores for the same period in 2025-26.
  • Benew Mobiles Special Prices BNU Mobiles and Electronics CMD YD Balaji Chaudhary said that mobiles, home appliances and laptops are being sold at special prices as part of Dussehra offers.
  • Sonovision Dussehra offers P. Bhaskaramurthy, Managing Partner of Sonovision said that in addition to their offers in the Dussehra sale, the scratchcard scheme is being used to ensure that each buyer gets a benefit of 5.75%. India Ratings and Research (Ind-RA) has estimated that wholesale inflation may exceed 12% and retail inflation may exceed 6% in October this year.
  • We will bring 12 models of Citroen and Jeep brands. Stellantis India has said that it will bring 12 models of Citroen and Jeep brands in the next three years under the Fastlane-2030 plan. Our country's merchandise exports increased by 23.04% in September due to healthy growth recorded in exports of petroleum products, electronic goods and chemicals.
  • Mahindra XUV 3XO CNG version Mahindra Company has launched its XUV 3XO CNG version with the name XUV 3XO ZNG. Its starting price is Rs.9.99 lakh (ex-showroom).
  • Strong intellectual property is the next phase of growth in media. Secretary, Ministry of Information and Broadcasting, Chanchal Kumar said that the next phase of growth in the media-entertainment sector is possible with strong intellectual property, revenue models, regular investments, reaching cross-market viewers/readers.
  • Direct tax collections increased by 13%. In the current financial year (2026-27) till October 14, net direct tax collections increased by 13.21% to Rs 13.38 lakh crore. This equates to around 50 per cent of the budget target for the full financial year.
  • Rs 28,000 crore investment proposals leave unchanged: Tata Renewable Tata Power Renewable Energy, a Tata Group company, has clarified that the ongoing disputes between Tata Sons and Tata Trusts will not have any impact on their business expansion.