ఏపీలో పలు చోట్ల ఉద్రిక్తతలు.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 16 Oct 2026 15:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

విజయవాడ: ఏపీలో స్థానిక సంస్థల (AP Local Body Elections) ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులు, సమస్యలపై స్పందించనుంది. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 0866 2490023, 2490024, 2490025, 2490026 ఫోన్‌ చేయాలని ఎస్‌ఈసీ వెల్లడించింది.

అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో వైకాపా, తెదేపా వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలో వాహనాలకు నిప్పంటించారు. తిరుపతిలోనూ వైకాపా నేతలు హల్‌చల్‌ చేశారు. ఆ పార్టీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి వాహనాలతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి హల్‌చల్‌ చేశాడు. దీనిపై భాజపా కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో వైకాపా, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

ఐజీ సమీక్ష

రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న దాడులపై ఐజీ  రాజకుమారి సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితిని ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పరస్పర దాడులపై ఎన్నికల సంఘం కూడా సమాచారం తెప్పించుకుంటోంది.

ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పర్యటన

పల్నాడు జిల్లా మాచవరం ఎస్సీ కాలనీలో ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పర్యటించారు. కమిషన్‌ సభ్యుడితో కలిసి వైకాపా దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. వైకాపా నేతల దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 15:53 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రూ.4.5 కోట్లతో వాసవీ కన్యకాపరమేశ్వరికి అలంకరణ దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Dr. B.R. Ambedkar Konaseema) అమలాపురం మెయిన్‌రోడ్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
  • అప్పటి వరకు పెద్దిరెడ్డి, మిథున్‌ను జైల్లో పెట్టాలి: రామచంద్రయాదవ్‌ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దాడులకు వైకాపా (YSRCP) నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబమే కారణమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ (Ramachandra Yadav) ఆరోపించారు.
  • తిరుపతిలో భూమన సహా వైకాపా నేతల హల్‌చల్‌ మేయర్‌ ఎన్నిక నామినేషన్‌ సందర్భంగా నగరంలోని పలు నామినేషన్‌ కేంద్రాల వద్ద వైకాపా (YSRCP) నేతలు హల్‌చల్‌ చేశారు.
  • సీబీఐకి సాయికృష్ణ కేసు.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
  • ‘వెంకటాద్రి’తో సులభంగా తిరుమల యాత్ర.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే? భక్తులకు తిరుమల (Tirumala) యాత్రను మరింత సులభతరం చేసేందుకు తితిదే (TTD) ‘వేంకటాద్రి’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది
  • ముగ్ధ మనోహరం.. వంజంగి సోయగం అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాడేరు వంజంగి కొండలను (Vanjangi Hills) మంచు దుప్పటి కప్పేసింది.
  • నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత.. రాయచోటిలో వాహనాలకు నిప్పు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
  • విశేష అలంకరణలో అమ్మవారు.. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దర్శించుకుంటున్నారు.
  • మూలా నక్షత్రం.. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ మూలా నక్షత్రం రోజు కావడంతో శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
  • సీట్ల లేక్క తేలింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
  • పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
  • ఏడుగురు మేయర్, 20మంది ఛైర్మన్‌ అభ్యర్థులతో వైకాపా తొలి జాబితా మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్, ఛైర్మన్‌ అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా గురువారం ప్రకటించింది.
  • ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్‌ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.
  • ప్రగతి సారథులు మహిళలే ‘స్వయం సహాయక సంఘాలు ఊహించని రీతిలో విస్తరించాయి. గ్రామీణ జీవన విధానాన్ని సమూలంగా మారుస్తూ, దేశ సమగ్రాభివృద్ధికి వెలకట్టలేని సేవలందిస్తున్నాయి.
  • నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు ‘మహిళ ఆర్థికంగా ఎదిగితే.. ఆ కుటుంబం పైకొస్తుంది.. స్త్రీలు అభివృద్ధి చెందితే.. దేశం పురోగమిస్తుంది.
  • రాష్ట్రపతికి మంగళగిరి చేనేత చీర,ఏటికొప్పాక కళాకృతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
  • చకచకా పోలవరం నిర్వాసితులకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీ పనులనూ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది.
  • కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.
  • సర్వభూపాలంపై వేణుగోపాలుడిగా శ్రీవారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరింది.
  • అంత డబ్బు ఎలా సమకూరింది? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు.

English Translation

Tensions in many places in AP.. Control room set up

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 16 Oct 2026 15:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Vijayawada: During AP Local Body Elections nominations Tensions are happening in many places. In this background, the State Election Commission has set up a control room in Vijayawada. It will respond to the election complaints and problems of the local bodies. In case of problems anywhere, the SEC has revealed that the control room numbers should be called: 0866 2490023, 2490024, 2490025, 2490026.

It is known that there is tense situation in Annamaiya district. In Punganur and Rayachoti in the district, Vaikapa and TDP factions clashed with each other. Many vehicles were destroyed in the stone pelting. Vehicles were set on fire in SN Colony in Rayachoti. Vaikapa leaders also created a stir in Tirupati. The leaders of that party Bhumana Karunakar Reddy, Bhumana Abhinay Reddy and many other leaders committed atrocities on TDP workers. There was also tension at the Dharmavaram Municipal Office of Sri Satyasai District. Ketireddy Venkatrami Reddy's younger brother Krishna Reddy has been making a fuss with vehicles since this morning. BJP workers objected to this. In this order, an argument took place between Vaikapa and BJP workers. The alert police dispersed the people from both sides.

IG review

IG Rajakumari conducted a review on the attacks that took place during the nominations in the state. The SPs were asked about the situation in the respective districts. On the other hand, the Election Commission is also providing information on mutual attacks.

SC Commission Chairman's visit

SC Commission Chairman visited Machavaram SC colony of Palnadu district. Along with a member of the commission, he visited the injured victims of the Vaikapa attack. Learned the details of the attack on Vaikapa leaders. He assured that justice will be given to the victims.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 15:53 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Rs 4.5 crore decoration of Vasavi Kanyakaparameshwari As part of the Devi Navratri celebrations, Dr. BR Ambedkar Konaseema District (Dr. B.R. Ambedkar Konaseema) in the Sri Vasavi Kanyakaparameshwari Temple on Amalapuram Main Road, the festivities are going on with grandeur.
  • Till then Peddireddy, Mithun should be put in jail: Ramachandrayadav BCY Party president Ramachandra Yadav has blamed the family of YSRCP leader and former minister Peddireddy Ramachandra Reddy for the attacks in Punganur of Annamaya district. Vaikapa (YSRCP) leaders made a ruckus at many nomination centers in the city during the mayoral election nomination.
  • Saikrishna case to CBI.. AP High Court order A key development has taken place in the Gade Saikrishna custodial torture case.
  • Tirumala Yatra made easy with 'Venkatadri'.. How does the app work? Thithide (TTD) has launched 'Venkatadri' app to make Tirumala Yatra easier for devotees. Vanjangi Hills, a popular tourist center in Alluri district, has been covered in snow.
  • Tension on the first day of nominations. On the first day of municipal election nominations, tension prevailed in Annamaiya district.
  • Women in special decorations. Devi Sharannavaratri celebrations are going on in Telugu states with grandeur. As part of this, goddesses are decorated in various forms in temples. After that special pooja was performed. Devotees are flocking to the temples on a large scale. Durgamma is appearing in Saraswati Devi adornment on Friday as it is Moola Nakshatra day. The process of adjustment of seats between the alliance parties in the urban local body elections ended in a cordial atmosphere. Nominations will be received from 11 am on Friday morning in 100 towns, municipal bodies and city panchayats in the state.
  • The first list of Vaikapa with seven mayor and 20 chairman candidates. Vaikapa announced the first list of mayor and chairman candidates on Thursday against the background that the nominations for municipal and city government elections will begin from Friday. Dr. CH Ravikumar of Alapadu, Guntur District, Chundur Mandal filed a PIL in the High Court that the BC reservations made in the 'local' elections were not in accordance with the Supreme Court's directives. Self help societies have expanded in an unexpected way. Radically changing the way of rural life, they are rendering invaluable service to the overall development of the country.
  • Yesterday's Savings Societies. If a woman grows economically... the family will grow... if women develop... Nation will progress.
  • Mangalgiri handloom sari for President, Etikoppaka artwork President Draupadi Murmu received a courtesy call from Education and IT Minister Lokesh at the Novotel Hotel in Vijayawada on Thursday morning. Along with the construction of the Polavaram project, the government is also running the work of the colony for the displaced. All should work together for the success of alliance candidates in local body elections. We won seats in the municipal elections according to the sentiments of the activists. As part of Tirumala Navratri Brahmotsavam, Sarvabhupala Vahanaseva was held grandly on Thursday night.
  • How did you collect so much money? Enforcement Directorate (ED) officials questioned Devi Reddy Sivashankar Reddy, a key accused in the murder case of former minister YS Vivekananda Reddy, on Thursday.