పోటీకి భయపడేది లేదు: మస్క్‌కు రిలయన్స్ కౌంటర్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో స్టార్‌లింక్ రాకను కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని, భారత ప్రధాని ముఖేశ్ అంబానీ అంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) స్పందిస్తూ మస్క్ ( Elon Musk)కు గట్టిగా బదులిచ్చింది. స్టార్‌లింక్ (Starlink) రాకను స్వాగతిస్తున్నామని, పోటీకి తాము ఏమాత్రం భయపడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘‘భారత మార్కెట్, రిలయన్స్ గురించి ఇటీవల వచ్చిన వ్యాఖ్యల (మస్క్ ఆరోపణల) నేపథ్యంలో కొన్ని వాస్తవాలను తెలియజేయాలనుకుంటున్నాం. ప్రజల జీవితాలను మెరుగుపరిచే స్వదేశీ/అంతర్జాతీయ పెట్టుబడులను, ఆవిష్కరణలను స్వాగతించే భారతదేశంలో రిలయన్స్ ఎదిగింది. ఇక, పారదర్శకత అనేది చట్టబద్ధమైన పాలనపై ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం పేర్కొన్నట్లుగా.. స్వదేశీయులైనా, విదేశీ సంస్థలైనా అందరికీ నిబంధనలు ఒకేలా వర్తిస్తాయి. జియో ( Jio) కూడా సొంత శాటిలైట్ సేవలు అనుమతుల కోసం ఎదురుచూస్తోంది’’ అని రిలయన్స్ వెల్లడించింది.
- 2030 కల్లా 6జీ తెస్తాం
‘‘మేం ఎన్నడూ పోటీకి భయపడలేదు. వినియోగదారులకు ఎవరు ఉత్తమ సేవలు అందిస్తారో తేల్చే అసలైన పరీక్షగానే దాన్ని భావించాం. 2016లో టెలికాం మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న సమయంలో జియో కొత్త కంపెనీగా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. కేవలం 10 ఏళ్లలోనే 53 కోట్ల మంది కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొంది. భారతీయులకు ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను, చౌకైన డేటాను అందించింది. స్టార్‌లింక్ మాత్రమే కాదు.. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో ఏ కంపెనీనైనా మేం స్వాగతిస్తాం. జియోతో సహా పత్రి సంస్థ దేశ ప్రజలకు సేవలందించాలనే కోరుకుంటున్నాం. అయితే, భారత్‌లో పనిచేసే ఏ కంపెనీ అయినా దేశ చట్టాలకు లోబడి ఉండాలి’’ అని రిలయన్స్ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవలందించకుండా కొందరు వ్యాపారవేత్తలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఇటీవల మస్క్ తన ఎక్స్ ఖాతా పోస్ట్‌లో ఆరోపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ ( Mukesh Ambani)ని ఉద్దేశించి ‘ప్రధాని అంబానీ’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. భారత ప్రభుత్వ విధానాలను ఆయనే శాసిస్తున్నారా అని ప్రశ్నించారు. మస్క్ ఆరోపణలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. నిబంధనలు అందరికీ సమానంగానే ఉంటాయని స్పష్టం చేసింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 10:21 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- టెస్లా ఎగురుతోంది.. మస్క్ కంపెనీ నుంచి ‘ఫ్లయింగ్ కారు’ Elon Musk: వినూత్న ఆవిష్కరణలతో కస్టమర్లను అబ్బుపరుస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. ఇందులో ఒకటే ‘ఎగిరే కారు’.
- 2030 కల్లా 6జీ తెస్తాం 6జీ సాంకేతికతపై జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) పనిచేస్తోందని, 2030 సంవత్సరంతో మొదలయ్యే దశాబ్దంలో వాణిజ్యపరంగా ఆ సేవలను ఆవిష్కరిస్తామని కంపెనీ ఎండీ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
- విప్రో లాభం రూ.3,200.60 కోట్లు ‘మేం పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాలనివ్వడం ప్రారంభించాయి. అవి కొత్త మార్కెట్లలో విజయం సాధించడానికి, కొత్త క్లయింట్లను చేర్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగ పడుతున్నాయి.’
- టెక్ మహీంద్రా 1:1 బోనస్ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జులై- సెప్టెంబరు త్రైమాసికానికి రూ.1,585.6 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
- సూచీలకు కొనుగోళ్ల పండగ మదుపర్ల కొనుగోళ్ల జోరుతో దేశీయ సూచీలు గురువారం దుమ్మురేపాయి. బ్యాంకులు, ఐటీ, రిలయన్స్ షేర్లు లాభాలతో కళకళలాడాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ మూడు వారాల గరిష్ఠానికి చేరాయి.
- కార్ల సరఫరాలు 30.7% పెరిగాయ్ ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు 13,60,687 ప్రయాణికుల వాహనాలు (పీవీ - కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) సరఫరా అయినట్లు వాహన తయారీదార్ల సంఖ్య సియామ్ గురువారం వెల్లడించింది.
- డ్రోగో ఏరోస్పేస్‌కు మరో గుర్తింపు స్వదేశీ డ్రోన్ తయారీ సంస్థ డ్రోగో ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన జేకే250ఈ డ్రోన్‌కు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) టైప్ సర్టిఫికేషన్ లభించింది.
- నెస్లే ఇండియా లాభంలో 36.3% వృద్ధి దిగ్గజ ఎఫ్ఎమ్సీజీ సంస్థ నెస్లే ఇండియా, జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.1,026.77 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.743.17 కోట్ల కంటే ఇది 36.32% అధికం.
- హెరిటేజ్ లాభం రూ.30.85 కోట్లు పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.30.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2025-26 ఇదే కాల లాభం రూ.50.99 కోట్లతో పోలిస్తే ఇది 39% తక్కువ.
- బీన్యూ మొబైల్స్ ప్రత్యేక ధరలు దసరా ఆఫర్లలో భాగంగా మొబైల్స్, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు ప్రత్యేక ధరల్లో విక్రయిస్తున్నట్లు బీన్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు.
- సోనోవిజన్ దసరా ఆఫర్లు దసరా సేల్‌లో తాము ఇస్తున్న ఆఫర్లకు అదనంగా, ప్రతి కొనుగోలుదారుకు కచ్చితంగా 5.75% ప్రయోజనం కలిగేలా స్క్రాచ్‌కార్డ్ స్కీము ఉపయోగ పడుతోందని సోనోవిజన్ మేనేజింగ్ పార్ట్నర్ పి.భాస్కరమూర్తి తెలిపారు.
- టోకు ద్రవ్యోల్బణం 12% దాటొచ్చు: ఇండ్-రా ఈ ఏడాది అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 12%, రిటెయిల్ ద్రవ్యోల్బణం 6% మించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది.
- సిట్రోయెన్, జీప్ బ్రాండ్లలో 12 మోడళ్లు తీసుకొస్తాం ఫాస్ట్‌లేన్- 2030 ప్రణాళిక కింద రాబోయే మూడేళ్లలో సిట్రోయెన్, జీప్ బ్రాండ్లలో 12 మోడళ్లు తీసుకు రానున్నట్లు స్టెల్లాంటిస్ ఇండియా తెలిపింది.
- సెప్టెంబరులో వాణిజ్య లోటు 30.21 బి.డా. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాల ఎగుమతుల్లో నమోదైన ఆరోగ్యకర వృద్ధి కారణంగా, సెప్టెంబరులో మన దేశ వస్తు ఎగుమతులు 23.04% పెరిగాయి.
- మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ వెర్షన్ మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ వెర్షన్‌ను ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ జెడ్ఎన్జీ పేరుతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
- బలమైన మేధో సంపత్తితోనే మీడియాలో తదుపరి దశ వృద్ధి బలమైన మేధో సంపత్తి, ఆదాయ నమూనాలు, క్రమం తప్పని పెట్టుబడులు, క్రాస్ మార్కెట్ వీక్షకులు/పాఠకులను చేరడం ద్వారా మీడియా-వినోద రంగంలో తదుపరి దశ వృద్ధి సాధ్యమవుతుందని సమాచార, ప్రసారాల మంత్రిత్వ కార్యదర్శి చంచల్ కుమార్ పేర్కొన్నారు.
- ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13% పెరిగాయ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27)లో అక్టోబరు 14 వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13.21% పెరిగి రూ.13.38 లక్షల కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ లక్ష్యంలో ఇది దాదాపు 50 శాతానికి సమానం.
- రూ.28,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్లో మార్పుల్లేవ్: టాటా రెన్యూవబుల్ టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య కొనసాగుతున్న వివాదాలు తమ వ్యాపార విస్తరణపై ఎటువంటి ప్రభావం చూపబోవని టాటా గ్రూప్ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ స్పష్టం చేసింది.
- మెహ్లి మిస్త్రీ అర్హతపై ప్రశ్నించిన టాటా ట్రస్ట్స్ టాటా ట్రస్ట్స్ పరిధిలోని రెండు స్వచ్ఛంద సంస్థలు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ), బాయి హీరాబాయి జంషెడ్జీ టాటా నవ్సారి ఛారిటబుల్ ఇన్స్టిట్యూషన్ల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి మెహ్లి మిస్త్రీకి ఉన్న లోకస్ స్టాండి (చట్టపరమైన అర్హత)ని టాటా ట్రస్ట్‌లు గురువారం ఛారిటీ కమిషనర్ కార్యాలయం ముందు ప్రశ్నించాయి.
- యెస్ బ్యాంక్‌కు సుప్రీంలో చుక్కెదురు యెస్ బ్యాంకుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2020 మార్చిలో రూ.8,415 కోట్ల విలువైన అదనపు టైర్ 1(ఏటీ-1) బాండ్లను రద్దు (రైటాఫ్) చేస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీం సమర్థించింది.
English Translation
Not afraid of competition: Reliance counter to Musk

- A
- A+
- A++

Internet Desk: Starlink arrival in India expected by some Global billionaire Elon Musk's allegation that Indian Prime Minister Mukesh Ambani is obstructing businessmen has become a hot topic of discussion. Recently, Reliance Industries (Reliance Industries) responded strongly to Musk (Elon Musk). They have made it clear that they welcome the arrival of Starlink and are not afraid of competition. In this regard, an official statement was issued on Friday.
''We would like to inform some facts in the background of the recent comments (Musk's allegations) about the Indian market and Reliance. Reliance has grown in an India that welcomes domestic/international investments and innovations that improve people's lives. Further, transparency depends on the rule of law. As stated by the Government of India, the rules apply equally to both domestic and foreign companies. Jio (Jio) is also waiting for approvals for its own satellite services,'' said Reliance.
- We will bring 6G by 2030
''We have never been afraid of competition. We consider it as a real test to determine who will provide the best services to the customers. Jio entered the field as a new company in 2016 at a time when the telecom market was highly competitive. It has earned the trust of 53 crore customers in just 10 years. It has provided Indians with the world's best digital infrastructure and cheap data. Not only Starlink.. We welcome any company in the field of satellite communication. We want the newspaper organization including Jio to serve the people of the country. However, any company operating in India must abide by the country's laws,'' Reliance clarified in its statement. Reliance Industries CMD Mukesh Ambani (Mukesh Ambani) was also addressed as 'Pradhani Ambani'. It was questioned whether he is ruling the policies of the Government of India. Union Information Ministry has denied Musk's allegations. It has clarified that the rules will be same for all.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 10:21 ISTNote:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
more
- Tesla is flying.. a 'flying car' from Musk's company Elon Musk: Automobile companies are surprising customers with innovative innovations. This is the only 'flying car'.
- We will bring 6G by 2030 Company MD Akash Ambani stated that Jio Platforms (JPL) is working on 6G technology and will launch those services commercially in the decade starting from 2030.
- Wipro's profit is Rs.3,200.60 crores. Our strategic investments have started yielding results. They are used to win new markets, attract new clients, improve existing relationships.'
- Tech Mahindra 1:1 Bonus IT services major Tech Mahindra has reported a consolidated net profit of Rs 1,585.6 crore for the July-September quarter of the current financial year (2026-27).
- Buying festival for indices Domestic indices rallied on Thursday on the back of buying by investors. Banks, IT and Reliance shares were buoyant with gains. As a result, Sensex and Nifty hit three-week highs.
- Car shipments up 30.7% SIAM revealed on Thursday that 13,60,687 passenger vehicles (PV - cars, SUVs, vans) were supplied to dealers by vehicle manufacturers during the July-September quarter of this year.
- Another recognition for Drogo Aerospace The JK250E drone, developed by indigenous drone manufacturer Drogo Aerospace, has received type certification from the Directorate General of Civil Aviation (DGCA).
- 36.3% growth in Nestlé India's profit FMCG major Nestlé India reported a net profit of Rs 1,026.77 crore on a consolidated basis for the July-September quarter. This is 36.32% higher than the profit of Rs.743.17 crore for the same period of 2025-26.
- Heritage's profit is Rs.30.85 crore Dairy products major Heritage Foods has reported a consolidated net profit of Rs 30.85 crore for the September quarter. This is 39% less than the profit of Rs.50.99 crores for the same period in 2025-26.
- Benew Mobiles Special Prices BNU Mobiles and Electronics CMD YD Balaji Chaudhary said that mobiles, home appliances and laptops are being sold at special prices as part of Dussehra offers.
- Sonovision Dussehra offers P. Bhaskaramurthy, Managing Partner of Sonovision said that in addition to their offers in the Dussehra sale, the scratchcard scheme is being used to ensure that each buyer gets a benefit of 5.75%. India Ratings and Research (Ind-RA) has estimated that wholesale inflation may exceed 12% and retail inflation may exceed 6% in October this year.
- We will bring 12 models of Citroen and Jeep brands. Stellantis India has said that it will bring 12 models of Citroen and Jeep brands in the next three years under the Fastlane-2030 plan. Our country's merchandise exports increased by 23.04% in September due to healthy growth recorded in exports of petroleum products, electronic goods and chemicals.
- Mahindra XUV 3XO CNG version Mahindra Company has launched its XUV 3XO CNG version with the name XUV 3XO ZNG. Its starting price is Rs.9.99 lakh (ex-showroom).
- Strong intellectual property is the next phase of growth in media. Secretary, Ministry of Information and Broadcasting, Chanchal Kumar said that the next phase of growth in the media-entertainment sector is possible with strong intellectual property, revenue models, regular investments, reaching cross-market viewers/readers.
- Direct tax collections increased by 13%. In the current financial year (2026-27) till October 14, net direct tax collections increased by 13.21% to Rs 13.38 lakh crore. This equates to around 50 per cent of the budget target for the full financial year.
- Rs 28,000 crore investment proposals leave unchanged: Tata Renewable Tata Power Renewable Energy, a Tata Group company, has clarified that the ongoing disputes between Tata Sons and Tata Trusts will not have any impact on their business expansion.
- Tata Trusts questioned Mehli Mistry's eligibility. Mehli Mistry's locus standi (legal capacity) to object to the running of Sir Dorabji Tata Trust (SDTT) and Bai Hirabai Jamshedji Tata Navsari Charitable Institutions, two charitable institutions under Tata Trusts, was filed by the Tata Trusts before the office of the Charity Commissioner on Thursday. Questioned.
- Yes Bank will be sued in the Supreme Court Yes Bank was hit in the Supreme Court. In March 2020, the Supreme Court upheld the order issued by the Bombay High Court setting aside the bank's decision to write off Additional Tier 1 (AT-1) bonds worth Rs 8,415 crore.