గుర్తుతెలియని కాల్స్‌కు చెక్‌.. ఇక, కాలర్‌ ఐడీ డిస్‌ప్లే తప్పనిసరి!

Eenadu icon
By Business News Team Updated : 15 Oct 2026 14:11 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: స్పామ్‌, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ బెడదకు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైంది (govt mandate caller IDs). ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే మీ ఫోన్‌లో అవతలి వ్యక్తి పేరు చూపించే కాలర్‌ ఐడీ సదుపాయం రానుంది. ఇందుకోసం కాలర్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ను (CNAP) కేంద్రం తప్పనిసరి చేసింది. నవంబర్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లను ట్రాయ్‌ ఆదేశించింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగానే వారి నంబర్‌తో పాటు పేరు కూడా ఫోన్‌ డిస్‌ప్లేపై కనిపిస్తుంది.

  • 21-23 తేదీల్లో జియో ఐపీఓ

4జీ, 5జీ తదితర హైస్పీడ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌లకు మాత్రమే CNAP సదుపాయం అందుబాటులోకి రానుంది. 2జీ, 3జీకి ఈ సేవలను తీసుకురావడంపై ట్రాయ్‌ వివరాలు వెల్లడించలేదు. మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు మాత్రమే పేరు డిస్‌ప్లే అవుతుంది. టెలికాం ఆపరేటర్ల సబ్‌స్క్రైబర్‌ డేటా బేస్‌లో నమోదైన కాలర్‌ పేరు, నంబర్‌ మన స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంతర్జాతీయ కాల్స్‌ విషయానికొస్తే.. పేరుకు బదులుగా ఇంటర్నేషనల్‌ కాల్‌ అని చూపిస్తుంది. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ముగిశాక అవతలి వ్యక్తి నంబర్‌ను పేరుతో పాటు రిట్రీవ్‌ చేసి సేవ్‌ చేసుకునే వీలుండదు. మాన్యువల్‌గా సేవ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, కాలింగ్‌ లైన్‌ ఐడెంటిఫికేషన్‌ రిస్ట్రిక్షన్‌ ఆప్షన్‌ను చందాదారులు ఎంపిక చేసుకుంటే వారి పేరు డిస్‌ప్లేపై చూపించదు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 13:55 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • భారీ లాభాల్లో మార్కెట్లు.. 1000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌ Stock Market: దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమంటున్నా.. ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నప్పటికీ నిన్నటి నష్టాల నుంచి సూచీలు పుంజుకున్నాయి.
  • ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంక్‌ ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72% వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌  కొనుగోలు చేయనుంది. ఇందు కోసం 5.5 బిలియన్‌ డాలర్లు (రూ.53,000 కోట్లు) వెచ్చించనుంది.
  • 21-23 తేదీల్లో జియో ఐపీఓ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈనెల 21న ప్రారంభమై, 23న ముగియనుంది.
  • స్కైరూట్‌ విక్రమ్‌ రాకెట్లతో రెండు ప్రయోగాలు అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో ‘రెండు ప్రత్యేక రాకెట్‌ ప్రయోగాల కోసం’ ఒప్పందం కుదుర్చుకుంది.
  • 2029 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-7 కార్లు, ఎస్‌యూవీలు మన దేశంలో కొత్త కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ) కోసం అత్యంత కఠినమైన బీఎస్‌-7 (భారత్‌ స్టేజ్‌-7) ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • కలవరపెట్టిన ద్రవ్యోల్బణం సెప్టెంబరులో రిటెయిల్, టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో, బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు అధిక ధరలూ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలపడి 95.17  వద్ద ముగిసింది.
  • మరింత ముదిరిన టాటా ట్రస్ట్స్‌ వివాదం టాటా గ్రూప్‌లో రగులుతున్న అంతర్గత విభేదాలు, న్యాయస్థానాలకు చేరుతున్నాయి. తాజాగా టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్‌ సింగ్‌ లేవనెత్తిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో బాంబే హైకోర్టుతో పాటు ముంబయి సిటీ సివిల్‌ కోర్టులో టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటా, ఆయన కుమారుడు నెవిల్లే టాటా కేవియట్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు.
  • మస్క్‌ స్టార్‌లింక్‌ కంటే వన్‌వెబ్‌ రేసులో ముందుంది దేశీయంగా ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవల కోసం, అమెరికా కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కంటే తమ యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ సంస్థే రేసులో ముందుందని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ బుధవారం బ్లూమ్‌బెర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ 2026లో వెల్లడించారు.
  • టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతానికి దేశీయంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 11.39 శాతానికి చేరింది. ఆహారం, తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్‌ ధరలు పెరగడం ఇందుకు కారణం.
  • మేలిమి వెండి సులభ దిగుమతికి వీలు కొన్ని రకాల వెండి వస్తువుల దిగుమతికి అనుమతులను వేగంగా జారీ చేసేందుకు, స్వీయ ప్రకటన ఆధారిత సరళీకృత విధానాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..(14-10-2026) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
  • పొగాకు రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినతరం! పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత కఠినం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో ఫ్రాంఛైజీలు, ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండు పేర్లు, నిర్వహణ ఒప్పందాల కోసం లైసెన్సింగ్‌లో ఎఫ్‌డీఐని నిషేధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
  • ఫారెక్స్‌ విపణిలో స్థిరత్వం తీసుకొస్తాం! ఫారెక్స్‌ (విదేశీ మారకపు ద్రవ్య) విపణిలో స్థిరత్వం తీసుకురావడానికి, రూపాయి విలువపై ఊహాజనిత కార్యకలాపాలు నిరోధించడానికి చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు.
  • ఎస్‌ఎంఈ ఐపీఓలకు కొత్త నిబంధనలు! చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎస్‌ఎంఈల) ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే మదుపర్ల నిధులకు మరింత రక్షణ కల్పించేందుకు, నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ బుధవారం సమగ్ర మార్పులను ప్రతిపాదించింది.
  • కెనరా బ్యాంకు లాభం రూ.5,175 కోట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,175 కోట్ల  నికర లాభం నమోదు చేసింది. 2025-26 ఇదే కాల లాభం  రూ.4,774 కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.38,598 కోట్ల నుంచి రూ.40,931 కోట్లకు పెరిగింది.
  • సంక్షిప్త వార్తలు(4) రెడీ టూ డ్రింక్‌ డెయిరీ విభాగంలోకి రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ అడుగుపెట్టింది. జాయ్‌ల్యాండ్‌ బ్రాండ్‌ పేరిట ప్యాకేజ్డ్‌ ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను విడుదల చేసింది. స్ట్రాబెర్రీ, వెనిలా ఫ్లేవర్‌లతో తమిళనాడు మార్కెట్‌లో తొలుత విడుదల చేయగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
  • చైనాతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు యత్నం చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడానికి మనదేశం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. సహేతుక ఒప్పందం లభించే పక్షంలో, ఏ దేశంతో నైనా ఉమ్మడి వ్యాపార భాగస్వామ్యాలకు భారత్‌ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
  • ఏఐని నెమ్మదింపజేయలేం కృత్రిమ మేధ (ఏఐ) వేగాన్ని నెమ్మదింపజేయడానికి చేపట్టే ఏ చర్య అయినా ఫలించక పోవచ్చని సిస్కో ఛైర్మన్, సీఈఓ చుక్‌ రాబిన్స్‌ అభిప్రాయపడ్డారు. అందుకు బదులుగా భద్రత, రక్షణ కవచాలను బలోపేతం చేసే సాంకేతికతపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు.
  • జామ్‌నగర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్‌ హబ్‌గా ముకేశ్‌ ఎలా మార్చారు? Mukesh Ambani- Jamnagar: ధీరూభాయ్ అంబానీ సగటు భారతీయులను షేర్‌హోల్డర్లుగా మారిస్తే.. ఆయన తనయుడు జామ్‌నగర్‌ రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్‌ హబ్‌ను తీర్చిదిద్దారు.
  • జియో ప్లాట్‌పామ్స్‌ IPO తేదీలొచ్చేశాయ్‌.. ధరల శ్రేణి ఎంతంటే? Jio Platforms IPO: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్‌ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్‌ 21న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 23న ముగియనుంది.

English Translation

Check for unknown calls.. Caller ID display is mandatory!

Eenadu icon
By Business News Team Updated : 15 Oct 2026 14:11 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: Spam, unknown numbers The time has come to check the nuisance calls from (govt mandate caller IDs). Caller ID facility will come to show the name of the other person on your phone without the need of third party apps like Truecaller. For this the Center has made Caller Name Presentation (CNAP) mandatory. TRAI has directed telecom service providers to implement this from November 1. As a result, when a call is received from an unknown person, their name along with their number will appear on the phone display.

  • On 21-23 Jio IPO

CNAP facility will be available only for high speed mobile networks such as 4G, 5G. TRAI has not revealed the details of bringing these services to 2G and 3G. The name will be displayed only when the phone comes from numbers that are not in our contact list. The name and number of the caller registered in the subscriber data base of the telecom operators will appear on our screen. As for international calls.. it shows International call instead of name. It is not possible to retrieve and save the other person's number along with the name after the end of incoming calls. Have to save manually. However, if the subscriber selects the Calling Line Identification Restriction option, their name will not show on the display.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 13:55 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Markets in huge gains.. Sensex up 1000 points Stock Market: Domestic markets continued to make huge gains on Thursday. Crude oil prices fall..Indices recover from yesterday's losses despite lingering inflation fears.
  • Fairfax acquires IDBI Bank Canada's Fairfax Financial Holdings will buy 60.72% stake in IDBI Bank. 5.5 billion dollars (Rs. 53,000 crores) will be spent for this.
  • Jio IPO on 21-23 The initial public offering (IPO) of Reliance Industries' digital and telecom arm Jio Platforms Limited (JPL) will begin on the 21st of this month and end on the 23rd.
  • Two experiments with Skyroot Vikram rockets America's Reflect Orbital has signed an agreement with Hyderabad-based space agency Skyroot Aerospace for 'two special rocket launches'.
  • BS-7 cars and SUVs from April 2029 The Union Ministry of Road Transport and Highways has released a draft notification proposing to implement the strictest BS-7 (Bharat Stage-7) emission norms for new cars and sports utility vehicles (SUVs) in our country from April 1, 2029.
  • Disturbing Inflation Domestic indices closed lower on Wednesday as retail and wholesale inflation picked up in September. Higher crude oil prices also hurt investor sentiment. The rupee strengthened by 19 paise to close at 95.17 against the dollar. Internal conflicts raging in the Tata Group are reaching the courts. Tata Trusts Chairman Noel Tata and his son Neville Tata have filed caveat petitions in Bombay High Court and Mumbai City Civil Court in the wake of allegations and controversies raised by Tata Trusts trustees Venu Srinivasan and Vijay Singh.
  • OneWeb is ahead of Musk Starlink in the race. Bharti Airtel Chairman Sunil Bharti Mittal revealed on Wednesday at the Bloomberg New Economy Forum 2026 that his Eutelsat OneWeb company is ahead of US tycoon Elon Musk's Starlink for domestic satellite internet services.
  • Wholesale inflation to 11.39 percent. Domestic inflation based on the Wholesale Price Index (WPI) reached 11.39 percent in September. The reason for this is the increase in the prices of food, manufactured goods, fuel and electricity. Ministry of Commerce has introduced a simplified system based on self-declaration to speed up issuance of permits for import of certain types of silver items.
  • Prices of gold and silver in major cities of Telugu states as follows..(14-10-2026) Look at the gold and silver rates (Gold Silver Rate Today) in Hyderabad, Vijayawada and Visakha, the major cities of Telugu states. It seems that the government is planning to tighten foreign direct investment (FDI) norms in the tobacco sector. Sources said that the government is considering a proposal to ban FDI in licensing for franchises, trademarks, brand names and management contracts in this sector.
  • Let's bring stability to the forex market! Reserve Bank of India (RBI) Governor Sanjay Malhotra on Wednesday revealed that steps have been taken to bring stability to the forex (foreign exchange) market and prevent speculative activities on the value of the rupee.
  • New rules for SME IPOs! Markets regulator Sebi on Wednesday proposed comprehensive changes to strengthen regulatory frameworks to provide more protection for investors' funds applying for IPOs of small and medium enterprises (SMEs).
  • Canara Bank's profit was Rs 5,175 crore. Public sector Canara Bank posted a net profit of Rs 5,175 crore for the September quarter. This is 8.4% higher than the profit of Rs.4,774 crore for the same period of 2025-26. During the same period the total income increased from Rs.38,598 crores to Rs.40,931 crores.
  • News Brief(4) Reliance Consumer Products has entered the ready-to-drink dairy segment. Joyland launched packaged flavored milk under the brand name. Initially released in the Tamil Nadu market with strawberry and vanilla flavors, it will soon be expanded across the country.
  • Effort to restore trade relations with China Union Commerce and Industry Minister Piyush Goyal said that our country is working hard to restore trade relations with China. He revealed that India is open to joint business partnerships with any country if a reasonable agreement is reached.
  • AI cannot be slowed down. Any move to slow down the pace of artificial intelligence (AI) may be futile, Cisco Chairman and CEO Chuck Robbins believes. Instead, it is suggested that it is better to focus on technology that strengthens security and defenses.
  • How did Mukesh turn Jamnagar into the world's largest refining hub? Mukesh Ambani- Jamnagar: If Dhirubhai Ambani turns average Indians into shareholders.. His son has built the world's largest refining hub in the form of Jamnagar.
  • Jio Platforms IPO date announced.. What is the price range? Jio Platforms IPO: Reliance Industries' digital services arm Jio Platforms has finalized its public issue dates. Subscription will start on October 21 and end on October 23.