‘ఆడిటరీ ఫ్రీసాన్‌’ గురించి విన్నారా!

కొన్ని పాత పాటలు వినగానే స్కూల్, కాలేజీ రోజులు, పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా! దీనికి కారణం మెదడులో ఉండే మీడియల్‌ ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌ అని చెబుతున్నారు నిపుణులు.

Eenadu icon
By Vasundhara Team Published : 15 Oct 2026 01:59 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

కొన్ని పాత పాటలు వినగానే స్కూల్, కాలేజీ రోజులు, పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా! దీనికి కారణం మెదడులో ఉండే మీడియల్‌ ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌ అని చెబుతున్నారు నిపుణులు. ఆ పాటలు మన పర్సనల్‌ మెమరీతో కనెక్ట్‌ అవుతాయట. దాంతో మన మెదడులో రివర్స్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ అయ్యి డోపమైన్‌ విడుదలై మనసుకి హాయినిస్తుందట. మెదడు చేసే ఈ మాయనే ‘ఆడిటరీ ఫ్రీసాన్‌’ అంటున్నారు నిపుణులు. అందుకే పనిలో ఒత్తిడి ఎక్కువైనా... నిద్ర రాకపోయినా ఇష్టమైన పాటలు పెట్టుకుని వింటే మంచిదంటున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల ప్రకారం... ప్రపంచంలో 50శాతం మంది దీన్ని అనుసరిస్తున్నారట. అంతేకాదు, పాత పాటలు విన్నప్పుడు గడిచిన రోజులు, గత జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందు కదలాడతాయి. దీంతో మనసుకు హాయిగా అనిపించి, ఒక థెరపీలా పనిచేస్తుందని చెప్పారట. అందుకే ఇష్టమైన పాటల్ని ఒక ఫోల్డర్‌లో సేవ్‌ చేసి పెట్టుకుంటున్నారట. అంతేకాదు, ఇల్లు, ఆఫీసు పనులతో అలసటగా అనిపించినప్పుడు ఓ పదిహేను నిమిషాలు మనసుకి నచ్చిన పాటలు వింటే స్ట్రెస్‌ హార్మోన్‌ విడుదల తగ్గి, ఒత్తిడి నియంత్రణలో ఉంటుందట. అంతేకాదు, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాద్య పరికరాల శబ్దాల వల్ల మెదడు చురుగ్గా పని చేసి, కొత్త ఆలోచనలు వస్తాయని చెబుతున్నారు. అందుకే జెన్‌జీ అమ్మాయిలు ‘మ్యూజికల్‌ నోస్టాల్జియా’ అంటూ ఈ బిజీ జీవితంలో కొన్ని నిమిషాలు ఇష్టమైన పాటలకి కేటాయిస్తున్నారు. వంట, వ్యాయామం, ప్రయాణం... ఇలా ఏ పని చేస్తున్నా నచ్చిన పాటలు వింటూ మ్యూజికల్‌ ఎస్కేప్‌ అని సోషల్‌ మీడియాలోనూ పంచుకుంటున్నారు. బాగుంది కదా ఈ అమ్మాయిల ఆలోచన. ఇంతకీ మీ ప్లే లిస్ట్‌లో ఉన్న పాటేంటి?

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Have you heard about 'Auditory Freesan'!

Doesn't listening to some old songs bring back old memories of school, college days! Experts say that the reason for this is the medial prefrontal cortex in the brain.

Eenadu icon
By Vasundhara Team Published : 15 Oct 2026 01:59 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

When listening to some old songs, school, college days, old memories. Do you remember? Experts say that the reason for this is the medial prefrontal cortex in the brain. Those songs connect with our personal memory. With that, the reverse system is activated in our brain and dopamine is released and the mind is relaxed. Experts say that this method of the brain is 'auditory freson'. That's why it is better to put on your favorite songs and listen to them even if you are stressed at work... According to research done by Harvard University... 50 percent of people in the world are following it. Moreover, when listening to old songs, bygone days and past memories again move before the eyes. It is said that this makes the mind feel comfortable and works like a therapy. That's why favorite songs are saved in a folder. Moreover, when you feel tired from home and office work, if you listen to your favorite songs for fifteen minutes, the release of stress hormones will be reduced and the stress will be under control. Moreover, it is said that the sound of musical instruments in the background makes the brain work actively and new ideas come. That's why Genji girls are devoting a few minutes to their favorite songs in this busy life called 'Musical Nostalgia'. Cooking, exercise, travel... While doing any work, listening to favorite songs and sharing it on social media as musical escape. Good idea of ​​these girls. So what's on your play list?

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :