టర్మ్ ఇన్సూరెన్స్ కొంటున్నారా?ఈ తప్పులు చేయొద్దు..

Eenadu icon
By Business News Team Published : 15 Oct 2026 15:58 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

జీవిత బీమా అవసరాలకై టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మీరు తీసుకునే తెలివైన ఆర్థిక నిర్ణయాలలో చాలా కీలకమైంది. ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచం అనిశ్చితులతో నిండి ఉంది. అందువల్ల, ప్రస్తుతం జీవిత బీమా మునుపెన్నడూ లేనంత ముఖ్యమైందిగా మారింది. దురదృష్టవశాత్తు పాలసీదారుడు లేనప్పుడు జీవిత బీమా పాలసీ అతని కుటుంబ శ్రేయస్సుకు ఆర్థిక భరోసా ఇస్తుంది. టర్మ్ ప్లాన్..అత్యంత సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకం అని చెప్పాలి. అయితే, ఈ బీమా కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు దరఖాస్తుదారులు సాధారణంగా ఎలాంటి తప్పులు చేస్తుంటారు, వాటిని ఎలా నివారించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

కవరేజ్‌

బీమాను కొనుగోలు చేయడం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం, మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలు పూర్తిగా తీర్చగలగడం. ఇది టర్మ్ ప్లాన్‌కు బాగా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు, చాలా మంది తమ అవసరాలను తక్కువగా అంచనా వేసి, తక్కువ కవరేజ్‌తోనే సరిపెట్టుకుంటారు. మీరు పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు ఉండే కవరేజ్‌ను ఎంచుకోవడం మేలు. మీ కుటుంబానికి మరిన్ని నిధులు అవసరం కావచ్చని మీరు భావిస్తే, ఈ మొత్తానికి మించిన కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు. బీమా హామీ మొత్తాన్ని ఎంచుకునేటప్పుడు దీర్ఘకాల ద్రవ్యోల్బణం, భవిష్యత్తులో మీ కుటుంబానికి ఉండే ఖర్చులను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.

పాలసీ కాలపరిమితి

టర్మ్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు ప్రజలు చేసే అత్యంత సాధారణ తప్పులలో తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ఒకటి. ఎందుకంటే, తక్కువ కాలపరిమితి గల బీమా చౌకగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు 25 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాల టర్మ్ ప్లాన్ తీసుకుంటే, అది మీకు 40 సంవత్సరాల వయసు వరకు మాత్రమే కవరేజీని అందిస్తుంది. ఆ తరువాత మరొక బీమా పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే, వయసు రీత్యా సాధారణంగానే బీమా ప్రీమియం పెరుగుతుంది. అప్పుడు పెరిగిన ప్రీమియం ఖర్చుతో పాలసీని మళ్లీ కొనసాగించాల్సి ఉంటుంది. అందుచేత, మీరు ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవాలి. కనీసం మీరు పదవీ విరమణ చేసే వరకు, వీలైతే అంతకంటే ఎక్కువ కాలం పాటు మీకు రక్షణ కల్పించే పాలసీనే ఎంచుకోవాలి.

బీమా కొనుగోలు వయసు

ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాతే బీమా అవసరమని చాలా మంది అనుకుంటారు. వివాహం జరిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత లేదా కుటుంబ బాధ్యతలు పెరిగిన తర్వాతే జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది వాయిదాలు వేసేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. జీవితం ప్రారంభ దశలోనే బీమా తీసుకోవడం సులభం, ఎంతో ఆచరణాత్మకం. మీరు ఎంత త్వరగా 'టర్మ్ ప్లాన్'(term plan) తీసుకుంటే, మీ ప్రీమియం అంత తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

యువ వయసులో ఉన్నప్పుడు జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అదే 35 లేదా 45 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం పెరుగుతుంది, అనారోగ్య సమస్యలుంటే బీమా పొందే అవకాశం కష్టమవ్వొచ్చు. అందుచేత, 20-25 ఏళ్ల వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, జీవితంలోని కీలక దశల్లో; ఉదాహరణకు, వివాహం జరిగినప్పుడు లేదా పిల్లలు పుట్టినప్పుడు మీ బీమా కవరేజీని పెంచుకోవడానికి, నామినీని మార్చుకోవడానికి వీలు కల్పించే బీమా ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

ఆరోగ్య సమాచారం

బీమా తీసుకునేటప్పుడు ఆరోగ్య సమస్యలు దాచిపెడితే, మొదట్లో ప్రీమియం తక్కువగా అనిపించవచ్చు. కానీ, ఒకవేళ పాలసీ తీసుకునే సమయంలో ఉన్న అనారోగ్య సమస్య వల్ల మరణం సంభవిస్తే, బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశముంది. ఇలాంటి సమయంలో పాలసీదారుడి కుటుంబ సభ్యులకు తీరని వేదన కలగడమే కాకుండా, క్లిష్ట సమయంలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. ప్రీమియంలో డబ్బు ఆదా చేయడమనేది స్వల్పకాలిక ప్రయోజనం మాత్రమే. టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు, అవసరమైన మొత్తం సమాచారాన్ని బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయండి. ఎల్లప్పుడూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మీ కుటుంబ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోండి.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • క్రెడిట్ కార్డు లేకుండా క్రెడిట్ స్కోరును పెంచుకోవడం సాధ్యమేనా.. క్రెడిట్ కార్డ్ లేకుండా మంచి క్రెడిట్‌ స్కోరు ఎలా సాధించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
  • బహుళ ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకోవాలి? ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని ఉద్యోగం ద్వారా మాత్రమే కాకుండా, అనేక ఇతర మార్గాల ద్వారా ఎలా సృష్టించుకోవాలో కూడా తెలుసుకోవాలి.
  • ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత? ప్లెక్సీ-క్యాప్‌ ఫండ్స్‌ అంటే, వివిధ రకాల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గల కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఫండ్లు. ఇవి లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి.
  • పూర్తి క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించట్లేదా? క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లిస్తే పొందే ప్రయోజనాలు, కనీస మొత్తం చెల్లిస్తే కలిగే ప్రతికూలతలతో పాటు పాక్షిక చెల్లింపుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
  • వడ్డీ రేటు పెంపు మన వ్యూహం మారాలి సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మార్కెట్లో ఉన్న పాత బాండ్ల ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా మధ్య, దీర్ఘకాలిక బాండ్‌ పథకాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
  • పాలసీ మధ్యలోనే ఆపేస్తే జీవిత బీమా పాలసీని గడువు తీరకముందే మధ్యలోనే రద్దు చేసుకుంటే, ఇప్పటివరకూ చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి రాదు. పాలసీ నిబంధనల ప్రకారం లెక్కించే ‘స్వాధీన విలువ (సరెండర్‌ వాల్యూ)’ మాత్రమే అందుతుంది.
  • వాహన బీమా తరుగుదల భారం తగ్గేలా! కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు వాహన బీమా తీసుకోవడం తప్పనిసరి. సాధారణ సమగ్ర బీమాలో ప్రమాదం వల్ల దెబ్బతిన్న విడిభాగాల మొత్తం విలువ పరిహారంగా అందకపోవచ్చు. వాహనం వయసును బట్టి, వాటి విలువలో తరుగుదల లెక్కిస్తారు.
  • ఆర్థిక ప్రణాళిక వాయిదా వేస్తున్నారా? సొంతిల్లు కొనాలన్నా, పిల్లల ఉన్నత చదువులకు డబ్బు సమకూర్చాలన్నా.. ఉద్యోగం మారేటప్పుడు మనం ఎంతో ముందుగానే ఆలోచిస్తాం. కానీ, మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే సమగ్ర ఆర్థిక ప్రణాళిక విషయానికి వచ్చేసరికి మాత్రం చాలామంది ‘తర్వాత చూద్దాంలే’ అని వాయిదా వేస్తుంటారు.
  • గరిష్ఠ రాబడుల కోసం మీ పెట్టుబడులను ఎలా విభజించాలి? పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు కేవలం ఒకే రకమైన పెట్టుబడిపై పూర్తిగా ఆధారపడకూడదు. అది ఎందుకో ఇక్కడ చూద్దాం.
  • మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలా? ఇవి తెలుసుకోండి మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు కేవలం రాబడులనే కాకుండా, ఫండ్లకు సంబంధించి కొన్ని కీలక అంశాల గురించి తెలుసుకోవాలి.
  • బంగారు ఆభరణాలపై బీమా ఎందుకు? బంగారు ఆభరణాలపై బీమా, ఎందుకు తెలివైన నిర్ణయమో ఇక్కడ తెలుసుకుందాం.
  • క్రెడిట్ స్కోరు మెరుగ్గా లేకపోవడానికి కారణాలివే.. మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడకపోవడానికి అనేక కారణాలుంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
  • స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే.. దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్‌ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.
  • టర్మ్‌ బీమా ఎంతుంటే ధీమా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనుకునే ప్రతి ఒక్కరికీ టర్మ్‌ పాలసీ ఎంతో కీలకం. కానీ, పాలసీ తీసుకునే సమయంలో వేసుకోవాల్సిన ప్రశ్న ‘కచ్చితంగా బీమా తీసుకోవాలా?’ అని కాదు.. ‘ఎంత కవరేజీ తీసుకుంటే కుటుంబానికి నిజమైన రక్షణ లభిస్తుంది?’ అనేది.
  • మ్యూచువల్‌ ఫండ్లు సంఖ్య పెరిగితే లాభమేనా? మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ‘ఒకదానిలోనే మొత్తం డబ్బు ఎందుకు? నాలుగైదు పథకాల్లో పెడితే నష్టభయం తగ్గుతుంది’ అనుకోవడం సహజం.
  • కాస్త వాయిదా వేద్దాం.. జీతం చేతికి రాగానే ఎన్నో ఖర్చులు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, నిత్యావసరాలు.. ఇవన్నీ పోను  మిగిలిన డబ్బుతో కొత్త ఫోన్‌ కొనాలనిపిస్తుంది.
  • స్థిరాదాయం కోరుకుంటే పెట్టుబడి అనగానే షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. మన డబ్బులో కొంత భాగాన్ని స్థిరాదాయ మార్గాల్లో ఉంచుకోవడమూ ఆర్థిక ప్రణాళికలో భాగమే.
  • ఒక కుటుంబానికి ఆరోగ్య బీమా ఎంతుంటే సరిపోతుంది.. సరైన ఆరోగ్య బీమా కవరేజీ ఎంత ఉండాలి అని నిర్ణయించేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటంటే..
  • పదవీ విరమణ ప్రణాళికను దెబ్బతీసే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడమెలా.. పదవీ విరమణకు చేరువవుతున్నవారు మార్కెట్ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య తమ పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
  • వివిధ మిడ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే.. 1, 3, 5 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.