జర్నలిస్టులా.. రీల్స్ చేసేవాళ్లా? తెలియట్లేదు: దిల్లీ ఆందోళనలపై కేంద్రం

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇటీవల దిల్లీలో జరిగిన ఆందోళనల సమయంలో కొందరు మహిళా జర్నలిస్టులపై వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నిరసనల వేళ మహిళా విలేకరులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ( Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య జర్నలిస్టులెవరో.. రీల్స్ చేసే వాళ్లు ఎవరో తెలియట్లేదని అన్నారు.
‘‘ఆందోళనల (Delhi Protests) సమయంలో చాలా మంది మైక్ పట్టుకుని కన్పిస్తున్నారు. వీడియోలు రికార్డ్ చేసి రీల్స్ అప్లోడ్ చేస్తామని కొందరు చెబుతున్నారు. జర్నలిస్టులమని మరికొందరు అంటున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో రీల్స్ చేసేవాళ్లు ఎవరో.. స్వతంత్ర జర్నలిస్టులు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. అయితే, వృత్తి ఏదైనా సరే.. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదు. మహిళా పోలీసు సిబ్బంది నుంచి సామాన్య మహిళల వరకు ఎవరూ అసభ్య ప్రవర్తనకు గురికాకూడదు’’ అని కేంద్రం తరఫున తుషార్ మెహతా పేర్కొన్నారు.
- సుప్రీం వరకు పాదయాత్రలా.. వెంటనే సమాధానం చెప్పండి: రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మహిళా జర్నలిస్టులపై పోలీసుల వేధింపుల ఆరోపణలు చాలా తీవ్రమైన అంశమని అభిప్రాయపడింది. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది. కమిటీలో రిటైర్డ్ మహిళా న్యామయూర్తులు, విశ్రాంత ఐపీఎస్ అధికారులు ఉంటారని పేర్కొంది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నిరసనల వేదికగా జంతర్‌మంతర్ తొలగింపుపై కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు జంతర్‌మంతర్(Jantar Mantar)ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో గురువారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసుల(Delhi Police) వివరణ కోరుతూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
- సుప్రీం వరకు పాదయాత్రలా.. వెంటనే సమాధానం చెప్పండి: రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం Supreme Court March: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్టోబర్ 12న ఇండియా కూటమి నేతలతో కలిసి రాహుల్ సుప్రీంకోర్టు వరకు పాదయాత్రగా వెళ్లి, అక్కడ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
- దిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకు హోంశాఖ కార్యదర్శి క్షమాపణలు Delhi protests: దిల్లీ ఆందోళనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ సెక్రటరీ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు.
- వెనకబాటుతనాన్ని బదిలీ చేయలేం: మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు Supreme Court: మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారినవారు.. కేవలం మతమార్పిడి ఆధారంగా వెనకబడిన తరగతుల (BC) కోటాను క్లెయిమ్ చేసుకోలేరని స్పష్టం చేసింది.
- జమ్మూకశ్మీర్‌లో మంచు సోయగాలు జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో మంచు దుప్పటి (Snow fall) చూపరులను ఆకర్షిస్తోంది.
- మళ్లీ వార్తల్లోకి అంకిత కేసు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల నిర్బంధం Ankita Bhandari murder: ఒక రిసార్టులో రిసెప్షనిస్టుగా చేరిన నెలరోజులకే అదృశ్యమై కెనాల్లో విగతజీవిగా కనిపించిన అంకితా భండారీ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
- కేఫ్ యజమాని మృతి.. మహిళా ఇన్ఫ్లూయెన్సర్ కోసం గాలింపు.. కేఫ్ యజమాని అనుమానాస్పద మృతి కేసులో మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శ్రద్ధా దూబే (Shraddha Dubey) కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- ఆ హైకోర్టు దుస్థితి ఎలా ఉందో చూడండి: సుప్రీంకోర్టు ‘న్యాయవిద్య కళాశాలల్లో తొలి ఏడాదే విద్యార్థులకు నేర్పే న్యాయసూత్రాలివి. ఇలాంటి తీర్పులు మా వద్దకు రావడం ఇదే తొలిసారి కాదు.
- ‘నీలి డ్రమ్ము’ హత్యకేసులో ఆమెకు, ప్రియుడికి మరణశిక్ష దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీలి డ్రమ్ము’ హత్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
- పండగ వ్యాపారాన్ని కాపాడండి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోరుతూ సాగుతున్న నిరసనోద్యమం సందర్భంగా ప్రజా నియంత్రణలపై దేశంలోని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తంజేశాయి.
- తిహాడ్ జైలుకు సీజేపీ నేతలు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలకు ఐదురోజుల జైలుశిక్ష విధించారు.
- రైల్వే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 బోనస్ రాబోయే దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రైల్వేలోని 11,40,770 మంది ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- విద్యార్థులకు అడ్డు రావొద్దు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విద్యార్థులకు అడ్డు రావొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ హితవు పలికారు.
- ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు? మీరు దేనినైతే పదే పదే పునరావృతం చేస్తారో, మీ మెదడు ఆ విషయంలో మరింత నైపుణ్యం సాధిస్తుంది.
- సంక్షిప్త వార్తలు (7) ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, దీనిని ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంటు వంటి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దాడి చేయడం సరికాదని హార్వర్డ్ విద్యావేత్తల బృందం పేరుతో విడుదలైన ఒక ప్రకటన పేర్కొంది.
- డేటా సెంటర్ల అనుమతులకు పంచ సూత్రాలు రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చే సమయంలో ఐదు సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది.
- పరిహారం కోరే హక్కు ఆ కుటుంబాలన్నిటికీ ఉంది రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని మృతి చెందిన భారతీయుల కుటుంబాలు పరిహారం, సహాయం కోరేందుకు ముందుకు వచ్చేలా బహిరంగ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.
- ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు(2023) వీడియో రికార్డుల ఫుటేజీ లభించడంలేదన్న ఎన్నికల సంఘం (ఈసీ) సమాధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- నిందితుడికి రాజ్యాంగ పదవా? హత్య కేసులో నిందితుడిగా ఉన్న వీఐపీకి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ పదవి ఇచ్చి రక్షణ కల్పించిందని, ఆ కేసులో బాధితులకు నాలుగేళ్లయినా ఇంతవరకూ న్యాయం చేయలేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
- తండ్రికి కాలేయదానం కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రం బాందాలో తీవ్రమైన కాలేయవ్యాధితో బాధపడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు పడిన తపన ఫలించింది.