అమెరికాలో ఆలయంపై దాడికి కుట్ర.. స్పందించిన భారత్‌

Eenadu icon
By National News Team Published : 15 Oct 2026 16:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా ( USA)లో హిందూ ఆలయంలో కాల్పులకు కుట్రపన్నిన ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది (Hindu Temple Shooting Plot). అది పూర్తిగా హిందూ వ్యతిరేక ఘటన అని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కుట్ర కేసుపై విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ మీడియాతో మాట్లాడారు.

‘‘ ఇల్లినోయీలోని అరోరా శివారు ప్రాంతంలోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పుల కుట్రకు సంబంధించిన నివేదికలు మా దృష్టికి వచ్చాయి. ఆ కుట్ర ఘటన తీవ్ర కలవరానికి గురిచేసింది. దాని వెనక జాతి వివక్ష, హిందూ వ్యతిరేక స్వభావం ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని జయస్‌వాల్ పేర్కొన్నారు.

  • రైఫిల్‌ జామ్‌ అవడంతో ఆగిన నరమేధం: అమెరికాలో ఆలయంపై దాడి కుట్రలో కీలక విషయాలు

భారతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపే ఉద్దేశంతో (US Teen Shooting Case) నిందితుడు అలెగ్జాండ్రోస్‌ పపోరాకిస్‌ ఆలయానికి వెళ్లినట్లు పోలీసులు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అయితే, రైఫిల్‌ జామ్‌ అవడంతో కుట్ర విఫలమైనట్లు పేర్కొన్నారు. రెస్టారంట్‌లో తనతో పాటు పనిచేసే ఓ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి కాల్పులు జరపాలనుకున్న విషయాన్ని, తుపాకీ జామ్‌ అయిన సంగతిని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని