ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం!

Eenadu icon
By Telangana News Desk Published : 15 Oct 2026 17:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది. చలికాలంలోనూ విద్యుత్తు డిమాండ్‌ కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో కొందామన్నా కరెంట్‌ దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి.

విద్యుత్తు పొదుపు అంటే.. అవసరం లేని వినియోగాన్ని తగ్గించడం అని నిపుణులు చెబుతున్నారు. ఇది అలవాటుకు సంబంధించినదని, మనసు పెడితే చాలా తేలిగ్గా చేయొచ్చని వారు సూచిస్తున్నారు. ఎల్‌నినో కారణంగా మున్ముందు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు చిన్నపాటి చిట్కాలు పాటించాలంటున్నారు.

ఇదివరకు ఒక ఏసీ ఉంటే గొప్ప. ఇప్పుడు చాలా ఇళ్లలో మూడు నాలుగు ఏసీలు, సెంట్రలైజ్డ్‌ ఏసీలు ఉంటున్నాయి. ఇటీవల కాలంలో విద్యుత్తు డిమాండ్‌ గణనీయంగా పెరగడానికి ఏసీల వాడకం పెరగడం ఓ కారణమని విద్యుత్తు ఇంజినీర్లు చెబుతున్నారు.

  • బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ప్రకారం ఏసీ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వద్ద ఉంటే విద్యుత్తు చాలా వరకు ఆదా అవుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే రాత్రి సమయాల్లో 24 డిగ్రీల బదులు 26 డిగ్రీలు దగ్గర వాడినా విద్యుత్తు వాడకం తగ్గుతుంది. 8 గంటలు వాడినా 5 యూనిట్లకు మించదు. నెలకు 36 నుంచి 60 యూనిట్ల వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. 
  • తెల్లవారుజామున వాతావరణం చల్లబడే సమయానికి ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయ్యేలా టైమర్‌ సెట్‌ చేసుకోవాలి. ఏసీ వాడేటప్పుడు ఆ గది తలుపులు మూసి ఉంచండి. ఎప్పటికప్పుడు ఫిల్టర్లను శుభ్రం చేయించడం ద్వారా కంప్రెసర్‌పై లోడ్‌ పడకుండా ఉంటుంది. 
  • పగటిపూట కూడా సాధ్యమైనంత వరకు సహజ వెలుతురు ఉపయోగించుకోవాలి. ఇంటి అలంకరణ పేరుతో అవసరం లేకపోయినా దీపాలు వాడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గించుకోవాలి. 
  • గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేస్తుంటారు. కానీ ఇంట్లో ఒక గదిలో ఉంటే మరో గదిలో ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అవసరం ఉన్న చోటే దీపాలు వెలిగేలా చూడండి. 
  • ఫ్రిజ్‌ తలుపులు పదే పదే తెరవద్దు. కొన్నిసార్లు తలుపు రబ్బరు సీల్‌ మూసుకోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టవద్దు. 
  • టీవీ, కంప్యూటర్, మొబైల్‌ ఛార్జర్‌ వంటి పరికరాలు వాడనప్పుడు విధిగా ఆపేయాలి. టీవీ రిమోట్‌తో ఆఫ్‌ చేస్తారు కానీ సాకెట్‌ ప్లగ్‌ ఆన్‌లో ఉంటుంది.
  • విద్యుత్తు ఎక్కువ వినియోగించే వాటిలో గీజర్‌ ఒకటి. ఒకసారి వేశాక కుటుంబం అంతా ఒకేసారి స్నానాలు చేయడం మేలు. ఒక్కొక్కరు ఒక్కోసారి ఆన్‌ చేస్తే విద్యుత్తు వినియోగం పెరుగుతుంది.
  • వాషింగ్‌ మెషీన్‌ నాలుగైదు బట్టలు ఉతకడానికి కాకుండా పూర్తి లోడ్‌తో ఉపయోగించుకోవాలి.
  • ఇళ్లలో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని విద్యుత్తు పొదుపు చాలా వరకు పాటిస్తున్నా.. ఉమ్మడి వినియోగం ఉన్నచోట దుబారా ఎక్కువగా జరుగుతోంది. 
  • చాలాసార్లు గంటల తరబడి వృథాగా లైట్లు వెలగడం, ఫ్యాన్లు తిరగడం గమనించే ఉంటారు. కార్యాలయాల్లో చివర్లో వెళ్లేవారు ఫ్యాన్లు అన్నీ ఆపేసి వెళ్లడం అలవాటు చేసుకోవాలి.
  • దసరా పండగ ఆఫర్లలో కొత్త ఉపకరణాలు కొనుగోలు చేస్తుంటే బీఈఈ స్టార్‌ రేటింగ్‌ ఉన్న వాటినే కొనుగోలు చేయడం మేలు.

విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారుడికి చేరేవరకు 20 శాతం పంపిణీ నష్టాలు ఉంటాయి. అంటే ఒక యూనిట్‌ ఆదా చేస్తే 1.2 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసినట్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్తు ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. ఇళ్లలో సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌డీఈ దీపాలు వాడాలి. ఫ్యాన్లు సైతం ఇప్పుడు బ్రష్‌లెస్‌ డైరెక్ట్‌ కరెంట్‌ (బీఎల్‌డీసీ) వచ్చాయి. వీటితో విద్యుత్తు ఆదా అవుతుంది. ఎక్కువ విద్యుత్తు వినియోగించే ఏసీలు, ఫ్రిజ్‌లు స్టార్‌ రేటెడ్‌వి మాత్రమే వినియోగించాలి. ధర పరంగా తక్కువ వస్తుందని రాజీ పడొద్దు. నాణ్యత లేని ఉపకరణాలు ఎక్కువ విద్యుత్తుని వినియోగిస్తాయి.          

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మ్యూల్‌ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్‌ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
  • మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్‌ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ పేర్కొన్నారు.
  • మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
  • హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణం మద్రాస్‌ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
  • రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
  • స్పర్శ్‌ హాస్పీస్‌ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్‌ హాస్పీస్‌’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
  • మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
  • ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండుతో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
  • మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్‌ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  • జాతీయ ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ ప్రాజెక్టుల ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.
  • కిమ్స్, యూకే ఆరోగ్య సంస్థల మధ్య ఒప్పందం వైద్య పరిశోధనలు, వైద్య విద్య, చికిత్సా రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కిమ్స్‌ హాస్పిటల్స్, బ్రిటిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (బీఐఎంఎస్‌), యూకేలోని లివర్‌పూల్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
  • అక్రమ భూములున్నట్లు నిరూపిస్తే అక్కడే రాసిస్తా: ఎంపీ చామల ‘నా పేరు మీద ఎసైన్డ్, అక్రమ భూములున్నట్లు భారాస నేతలు నిరూపిస్తే.. అధికారులను పిలిచి ఆ భూముల వద్దే రాసిస్తా’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
  • భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం: ఒవైసీ భాజపా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు.
  • సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ యత్నం సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం యత్నిస్తోందని, ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు.
  • నేటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పలు జిల్లాల్లో 15-18వ తేదీ మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
  • తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా తెలంగాణలో పెట్టిన పెట్టుబడులు పూర్తి భద్రతతో, సురక్షితంగా ఉంటాయని.. ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతోందని యార్క్‌షైర్, యూకే వ్యాపార ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో.. బాహుబలి మోటార్లు ప్రారంభం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్‌-అంజనగిరి జలాశయం మొదటి లిఫ్టు వద్ద రెండు బాహుబలి మోటార్లు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
  • మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల రుణాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడేళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంకు రుణాలను అందజేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
  • శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చిన భద్రకాళి తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ఓరుగల్లు శ్రీభద్రకాళి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.