మార్కెట్‌లోకి మహీంద్రా XUV 3XO CNG.. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం

Eenadu icon
By Business News Team Published : 15 Oct 2026 15:30 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Mahindra XUV 3XO CNG | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ పాపులర్ ఎస్‌యూవీ XUV 3XOలో సీఎన్‌జీ వేరియంట్‌ను (Mahindra XUV 3XO CNG) మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ZNGగా వ్యవహరించనున్నారు. దీని ధర రూ.9.99 (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్స్‌ కలిగిన వేరియంట్ ధర రూ.12.27 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ వెర్షన్లను కంపెనీ లాంచ్‌ చేసింది. అక్టోబర్‌ 20 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

  • గుర్తుతెలియని కాల్స్‌కు చెక్‌.. ఇక, కాలర్‌ ఐడీ డిస్‌ప్లే తప్పనిసరి!

ఇందులో 1.2-లీటర్ టర్బోఛార్జ్‌ MPFI పెట్రోల్ ఇంజిన్‌ అమర్చారు. సీఎన్‌జీ మోడ్‌లో 114 bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో కేజీకి 24.7 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం 4.9 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని, 11.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. ఇందులో ట్విన్‌ సిలిండర్లను బూట్‌ ఫ్లోర్‌ కంటే కింది భాగంలో అమర్చారు. దీంతో మెయిన్‌ బూట్ స్టోరేజీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీనివల్ల లగేజీ పెట్టుకోవడానికి మంచి స్థలం లభిస్తుంది. స్పేర్ వీల్‌ను కారు బాడీ కింద అమర్చారు. డ్యాష్‌బోర్డ్‌పై పెట్రోల్/సీఎన్‌జీ స్విచ్ బటన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకూ డిస్క్ బ్రేకులు తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్‌ సీఎన్‌జీ వేరియంట్లకు ఇది పోటీ ఇవ్వనుంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మార్కెట్‌లోకి టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. ధర ₹6.99 లక్షల నుంచి ప్రారంభం Toyota Glanza: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌.. పాపులర్‌ హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను (Toyota Glanza) దేశీయంగా విడుదల చేసింది.
  • అధిక మైలేజీతో మీ ఫ్యూచర్‌ కారు.. CAFE 3 నిబంధనలు నోటిఫై CAFE 3 norms: ప్రయాణికుల వాహనాల్లో ఇంధన సామర్థ్యం మెరుగుపరచడం, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ (CAFE-3) నిబంధనలు తీసుకొచ్చింది.
  • A6 ఇ-ట్రోన్ సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 1,338km ప్రయాణం.. ఆడి గిన్నిస్‌ రికార్డు Audi A6 e-Tron: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi)కి చెందిన A6 ఇ-ట్రోన్ (Audi A6 e-tron) అరుదైన మైలురాయిని అందుకుంది.
  • టిగోర్‌ స్థానంలో టాటా కొత్త ఏరిస్‌ సెడాన్‌.. ధర ₹5.29 లక్షలు Tata Aeris: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా కార్స్‌ కొత్త కారును లాంచ్‌ చేసింది. టిగోర్‌కు కొత్త హంగులు జోడిస్తూ సెడాన్ సెగ్మెంట్‌లో ఏరిస్‌ను (Tata Aeris) విడుదల చేసింది.
  • హోండా నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర, రేంజ్‌ వివరాలు ఇవే! Honda QC3: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా QC3(Honda QC3)ని విడుదల చేసింది.
  • ఈవీ అమ్మకాల జోరు.. 2.98 లక్షల యూనిట్లు విక్రయం EV retail sales: దేశంలో ఎలక్ట్రిక్‌  వాహనాల విక్రయాల జోరు పెరిగింది.
  • మారుతీ సుజుకీ షాక్‌.. మళ్లీ ధరల పెంపు Maruti Suzuki price hikes: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు మళ్లీ ధరల షాక్ ఇచ్చింది.
  • సింపుల్‌ ఎనర్జీ నుంచి సింపుల్‌ వేవ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km Simple Energy: విద్యుత్‌ ద్విచక్రవాహన తయారీ సంస్థ సింపుల్‌ ఎనర్జీ కొత్త విద్యుత్‌ స్కూటర్‌ను దేశీయ విపణిలో లాంచ్‌ చేసింది.
  • ఏథర్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. రూ.లక్షకే ‘కోణార్క్‌’ ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ మరో స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. ‘కోణార్క్‌’ (Ather Konarc) పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ S, Z అనే రెండు వేరియంట్స్‌లో లభించనుంది.
  • టూవీలర్లకు కొత్త రూల్‌.. ఏప్రిల్‌ నుంచి లోబీమ్‌లోనే New Two-Wheeler Headlamp Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ కలిగిన టూవీలర్లలో ఇకపై లోబీమ్‌ మాత్రమే ఉండనుంది.
  • కుర్రకారు కోసం యమహా నుంచి YZF R2.. ధరెంతంటే? Yamaha YZF R2: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా ఆర్‌-సిరీస్‌లో YZF-R2 పేరిట కొత్త మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది.
  • ఎంజీ హెక్టర్‌ టొమాహాక్‌ PHEV.. ఫుల్‌ ట్యాంక్‌+ ఛార్జ్‌తో 1100km MG Hector Tomahawk PHEV: ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా హెక్టర్‌ టొమాహాక్‌ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
  • హోండా రెబల్‌ 300 బైక్‌, ఏడీవీ 160 ప్రీమియం స్కూటర్‌ విడుదల Honda Rebel 300- ADV 160: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) ప్రీమియం ద్విచక్రవాహనాలపై దృష్టిసారించింది.
  • మోనోషాక్‌ సస్పెన్షన్‌తో పల్సర్‌ 125, పల్సర్‌ 150.. ధర, ఫీచర్లు ఇవే Bajaj Pulsar: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో కొత్త పల్సర్‌ మోటార్‌ సైకిళ్లను దేశీయంగా లాంచ్‌ చేసింది. 125, 150 సీసీ సెగ్మెంట్లలో వీటిని ఆవిష్కరించింది.
  • ఈ టాటా ఈవీల డెలివరీకి అధిక వెయిటింగ్‌ టైమ్‌ Tata cars waiting time: టాటా గ్రూప్‌నకు చెందిన కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఈవీలను విక్రయిస్తోంది. సంప్రదాయ ఇంధనంతో నడిచే కార్లకు తక్కువ వెయిటింగ్‌ టైమ్‌ కొనసాగుతుండగా.. ఈవీల డెలివరీకి మాత్రం అధిక సమయం పడుతోంది.
  • కారు.. సొంత నిధులా? బ్యాంకు రుణమా? కారు కొనడం అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక మధురమైన కల. ఇది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. కుటుంబ హోదాకు, సౌకర్యానికి చిహ్నం. ఇది మన జీవితంలో తీసుకునే అతి పెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటిగానూ నిలుస్తుంది.
  • మరోసారి ధరల పెంపు.. హ్యుందాయ్‌ కార్లు మరింత ప్రియం Hyundai car price hikes: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మరోసారి కార్ల ధరలను పెంచింది.
  • స్థానికులకు ‘ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌’.. మీ టోల్‌ప్లాజా ఈ లిస్ట్‌లో ఉందా? FASTag local pass: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
  • మీ కారు పార్కింగ్‌ ఎక్కడ? నగరాల్లో నివాస సముదాయాలు, కిక్కిరిసిన వీధుల మధ్య సురక్షితమైన పార్కింగ్‌ ప్రదేశం దొరకడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. ఈ పార్కింగ్‌ స్థలాల కొరత కారణంగా చాలామంది తమ కార్లను ప్రధాన రహదారి పక్కనో, నో పార్కింగ్‌ ఉన్న చోటో.. చెట్ల కింద లేదా లోతట్టు ప్రాంతాల్లోనూ నిలిపి ఉంచుతుంటారు.
  • ఈవీ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. సబ్సిడీ గడువు పొడిగింపు EV Subsidy: ఎలక్ట్రిక్‌ వాహన (EV Subsidy) కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం ఇ-డ్రైవ్‌ పథకం (PM E Drive) కింద ఇచ్చే సబ్సిడీ గడువును 2028 మార్చి 31 వరకు పొడిగించింది.