మ్యాచ్‌ ఓటమికి అదే కీలక మలుపు : సంజు శాంసన్‌

Eenadu icon
By Sports News Team Updated : 15 Oct 2026 12:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో తిలక్‌ వర్మ ఔటవడంతో ఫెయిల్డ్‌ ఛేజ్‌ మొదలైంది.. ఓటమికి అదే కీలక మలుపు’’ అని సంజు శాంసన్‌ ( Sanju Samson) అన్నాడు. యువ ఫాస్ట్‌ బౌలర్లు అనుభవం వచ్చే కొద్దీ మెరుగవుతారని ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమమైంది. తొలుత వెస్టిండీస్‌ (West Indies) 3 వికెట్లకు 247 పరుగులు చేయగా.. టీమిండియా(Tesm India)  19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. 

‘‘విశ్రాంతిలో ఉన్న జస్‌ప్రీత్‌ బుమ్రా( Jasprit Bumrah)కు ప్రత్యామ్నాయం లేదు. అలాంటి బౌలర్లు తరానికి ఒకరే ఉంటారనడంలో సందేహం లేదు. అతడు ఉండటం మన అదృష్టం. అలాగే భారత్‌ వద్ద ప్రతిభావంతులైన బౌలర్లు ఎందరో ఉన్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌( Arshdeep Singh), ప్రిన్స్‌ యాదవ్‌(Prince Yadav) వంటి బౌలర్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగా రాణిస్తారు. తిలక్‌ వర్మ( Tilak Varma) ఆట చూసి భారత్‌ గెలుపుపై ఆశలు పుట్టాయి. ఒకానొక సమయంలో విండిస్‌ బౌలర్లపై తిలక్‌, నితీశ్‌ విరుచుకుపడ్డారు. అనంతరం తిలక్‌ ఔట్‌తో మ్యాచ్‌ అనుకోని మలుపు తిరిగింది’’ అని సంజు అన్నాడు. ఈ మ్యాచ్‌లో మయాంక్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ తమ నాలుగు ఓవర్ల కోటాలో చెరో 52 పరుగులు సమర్పించుకున్నారు. 

  • బౌలింగ్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పాటించలేకపోయాం : శ్రేయస్‌ అయ్యర్‌

షాయ్‌ హోప్‌ (Shai Hope) నియంత్రణతో ఆడి, అనవసరమైన రిస్క్‌లు తీసుకోకుండా మంచి షాట్లు ఆడాడని శాంసన్‌ ప్రశంసించాడు. హైదరాబాద్‌ (Hyderabad) పిచ్‌పై మంచి బౌన్స్‌ ఉండటంతో భారీ స్కోర్లకు అనుకూలించిందన్నాడు. ప్రతి మైదానంలో ఒకే తరహా ఆట సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఇషాన్‌ కిషన్‌(Ishan), అభిషేక్‌ శర్మ ( Abhishek Sharma) ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లని, ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన వారి సామర్థ్యాన్ని తక్కువగా చూడకూడదని పేర్కొన్నాడు. శనివారం బెంగళూరులో జరిగే మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నామని సంజు చెప్పాడు. 

స్లో బంతులతో కట్టడి చేశాం : కిమో పాల్‌ 

ప్రణాళిక ప్రకారం స్లో బంతులు వేసి భారత్‌ను కట్టడి చేశామని వెస్టిండీస్‌ పేసర్‌ కీమో పాల్‌ చెప్పాడు. జట్టు విజయానికి ఆ ట్రిక్ బాగా పనిచేసిందని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో పాల్‌ ఐదు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ‘‘మంచు ప్రభావం లేకపోవడం తమకు అనుకూలించింది. మంచు ఉంటే సెకండ్‌ ఇన్నింగ్స్‌కు బౌలింగ్‌ చేసే జట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయి. పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు బౌలర్ల ప్రణాళికలను పక్కాగా ఉండాలి. మాకు ఏ మ్యాచ్‌ అయినా ఒకటే. ముందు బ్యాటింగ్‌కు దిగినా.. ఛేజింగ్‌ అయినా పాజిటీవ్‌ మైండ్‌ సెట్‌తో ఉండటమే ముఖ్యం. ముఖ్యంగా ఉప్పల్‌లాంటి పిచ్‌లలో అత్యధిక పరుగులు చేయాల్సిందే’’ అని పాల్‌ పేర్కొన్నాడు.  కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ 50 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేయడం, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం జట్టుకు భారీ స్కోరు అందించాయని చెప్పాడు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 11:57 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బౌలింగ్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పాటించలేకపోయాం : శ్రేయస్‌ అయ్యర్‌ వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, నిర్ణయాత్మక పోరుకు సిద్ధమవుతామని టీమిండియా (Team india) కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) తెలిపాడు. బౌలింగ్‌లో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. 
  • ఉప్పల్‌లో పడ్డారు పొట్టి క్రికెట్లో వెస్టిండీస్‌తో అంత తేలిక కాదని మరోసారి రుజువైంది. భారత్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయాక.. టీ20 సిరీస్‌లో గట్టి పోటీనిస్తున్న కరీబియన్‌ జట్టు, సిరీస్‌ను 2-2తో సమం చేసి ఫలితాన్ని చివరి పోరుకు మళ్లించింది.
  • తిరిగి హైదరాబాద్‌కు నటరాజన్‌ ఎడమచేతి వాటం పేసర్‌ నటరాజన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. ఐపీఎల్‌ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ అతణ్ని దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి తీసుకుంది.
  • టీ20ల్లో మేం చాలా శ్రమించాలి వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరముందని కొత్త కెప్టెన్‌ స్మృతి మంధాన చెప్పింది. మహిళల తొలి ఛాంపియన్స్‌ ట్రోఫీ వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది.
  • ఆ స్థానం ఓజాదే..! అజిత్‌ అగార్కర్‌ స్థానంలో వెస్ట్‌జోన్‌ నుంచి పార్థివ్‌ పటేల్‌ సెలక్టర్‌ అవుతాడని అంతా భావించారు. కానీ అతడు పదవి కోసం దరఖాస్తే చేసుకోలేదు. దీంతో సెలక్షన్‌ కమిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్‌గా కొనసాగేందుకు ప్రజ్ఞాన్‌ ఓజాకు మార్గం సుగమమైంది.
  • కరుణ్‌ శతకం ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్‌ డ్రా ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో కర్ణాటక డ్రాతో బయటపడింది. కరుణ్‌ నాయర్‌ (155; 242 బంతుల్లో 16×4, 2×6) వీరోచిత శతకంతో జట్టును గట్టెక్కించాడు.
  • 17 ఏళ్ల తర్వాత పంజాబ్‌కు.. ఈ నెలాఖర్లో జరగనున్న హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌కు ప్రత్యేకంగా నిలవనుంది. అతడి సొంతగడ్డ పంజాబ్‌లో 17 ఏళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ జరగబోతోంది.
  • నాలుగో స్థానంలో శ్రేయస్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో అతను 18 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని రేటింగ్‌ మెరుగుపడింది.
  • యోధాస్‌ గెలుపు ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో పృథ్వీరాజ్‌ యోధాస్‌ పుంజుకుంది. బుధవారం ఆ జట్టు 5-1తో చేరో ఆర్చర్స్‌పై ఘనవిజయాన్నందుకుంది. గణేశ్‌ మణిరత్నం 60కి 59 పాయింట్లతో జట్టు గెలుపులో కీలకమయ్యాడు.
  • సాత్విక్‌ జోడీ ఔట్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి జోడీ కథ ముగిసింది. బుధవారం తొలి రౌండ్లో ఈ జంట 21-12, 15-21, 19-21తో చైనా ద్వయం హె జి టింగ్, రెన్‌ జియాంగ్‌ యుల చేతిలో ఓడిపోయింది.
  • సంక్షిప్త వార్తలు (4) ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారు. గురువారం దిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో ఆయన ప్లేయర్లతో సమావేశం కానున్నారు.
  • భారత్‌పై కీమో పాల్‌ ‘ఫైఫర్’.. విండీస్‌దే నాలుగో టీ20 ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది.
  • విరాట్‌కు ధోనీలా.. మంధానకు హర్మన్‌ బాసటగా నిలవాలి: మిథున్ సీనియర్‌గా జట్టులో ఉన్నప్పుడు కొత్త సారథికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వెల్లడించాడు.
  • నాలుగులోకి శ్రేయస్ అయ్యర్.. రెన్‌షా 147 స్థానాలు జంప్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఆసీస్‌ ప్లేయర్ దూసుకొచ్చాడు.
  • ఆ టోర్నమెంట్‌లో అనుమతి లేకుండా నా పేరు వాడారు: శిఖర్‌ ధావన్‌ Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనధికారికంగా వాడుకోవడాన్ని భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖండించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
  • అభిషేక్‌ ఎఫెక్ట్‌.. సంజుపై ఒత్తిడి: పుజారా కీలక వ్యాఖ్యలు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సంజు శాంసన్‌ తక్కువ పరుగులకే ఔట్‌ అవడంపై మాజీ క్రికెటర్‌ పుజారా (Cheteshwar Pujara) స్పందించాడు. పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శాంసన్‌ మరికొంత సమయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
  • కోహ్లీ ఛేజ్‌ మాస్టర్‌ అయితే.. రోహిత్‌ మంచి లీడర్‌: ఇంగ్లాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ సమిత్‌ పటేల్‌ (Samit Patel) ప్రశంసించాడు. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో దూకుడు చూపిస్తాడని, నాయకుడిగానూ అతడు ఎంతో ప్రతిభావంతుడని పేర్కొన్నాడు.
  • ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్‌ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్‌ఇండియా తహతహలాడుతుంటే..
  • ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్‌ గిల్‌.. భారత మహిళల జట్టు ఓపెనర్‌ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్‌’ అవార్డు (సెప్టెంబర్‌ నెల) సాధించారు.
  • ఆరేసిన తనయ్‌ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనంగా బోణీ కొట్టింది. తనయ్‌ త్యాగరాజన్‌ (6/52) విజృంభించడంతో గ్రూప్‌-బి ఎలీట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో త్రిపురను చిత్తు చేసింది.