రేపటి నుంచే ఐఫోన్ డ్యుయో ప్రీ ఆర్డర్లు.. డిస్ప్లే పగిలితే జేబుకు చిల్లే!

- A
- A+
- A++

iPhone Duo | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ప్రీ ఆర్డర్లకు సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23 నుంచి విక్రయాలు మొదలవ్వనున్నాయి. ఇప్పటికే డ్యుయో ఖరీదైన ఐఫోన్‌గా నిలిచింది. 256జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,99,900 ఉండగా.. టాప్ వేరియంట్ 2TB ధర రూ.4,49,900గా కంపెనీ నిర్ణయించింది. దీని ధర వెల్లడించిన రోజే దీనికి బదులు ‘కొత్త కారే వస్తుంది కదా’ అంటూ మీమ్స్ సందడి చేశాయి. తాజాగా డ్యుయో రిపేర్ ఖర్చులు బయటకు రావడంతో ఈ ఫోన్ మరోసారి వార్తలకెక్కింది.
- రుణ గ్రహీతలకు SBI షాక్.. రుణ రేట్లు పెంపు
డిస్ప్లే పగిలితే..
యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ డ్యుయోకు సంబంధించిన రిపేర్కయ్యే ఖర్చులను తన వెబ్సైట్లో పొందుపరిచింది. డిస్ప్లే కవర్ లేయర్ రిపేర్ ధర రూ.5,900గా నిర్ణయించింది. బ్యాక్ గ్లాస్ డ్యామేజ్ ధర రూ.20,900, బ్యాటరీ సర్వీస్ ధర రూ.24,900, కెమెరా రిపేర్ రూ.26,900కు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ అవుటర్ డిస్ప్లే డ్యామేజ్ అయితే, రూ.42,900, అవుట్ డిస్ప్లే+ గ్లాస్ డ్యామేజ్‌కు రూ.55,900 చెల్లించాలి. ఇన్నర్ డిస్ప్లే గనక పాడైతే అక్షరాలా రూ.1,49,900 చెల్లించాలి. ఇతర డ్యామేజ్ ధరలను రూ.2,24,900గా నిర్ణయించింది. ఈ రిపేర్ ఖర్చులను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇన్నర్ డిస్ప్లే పొరపాటున పాడైతే.. దానికి పెట్టే ఖర్చుతో ఏ ఐఫోన్ 18ప్రోనో, శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రానో కొనుగోలు చేయొచ్చంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- యాపిల్ స్మార్ట్ హోమ్ డివైజ్‌లు.. హోమ్‌వ్యూ, యాపిల్ టీవీ వివరాలివీ.. Apple HomeView: పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాపిల్.. ఇప్పుడు స్మార్ట్ హోమ్ సెగ్మెంట్‌లోకీ అడుగుపెట్టింది.
- యాపిల్ హోం వ్యూ వచ్చేసింది.. మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చేయొచ్చు! Apple HomeView: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా హోమ్‌వ్యూను (Apple HomeView) లాంచ్ చేసింది.
- ఫోన్ లేకుండానే.. కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్! Jio AI Glasses: సాధారణంగా ఏదైనా కిరాణా దుకాణం వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే కచ్చితంగా మొబైల్ ఉండాల్సిందే.
- పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఎయిర్టెల్ షాక్.. ప్లాన్ ధరలు పెంపు Airtel traiff hike: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ (Airtel) పోస్ట్‌పెయిడ్ యూజర్లకు షాకిచ్చింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధరలను రూ.50 చొప్పున పెంచింది.
- వివో నుంచి 3 ఫోన్లు.. X ఫోల్డ్, వి80, ఎస్2 FE ధర, వివరాలు ఇవే! Vivo phones launched: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో (Vivo) దేశీయ మార్కెట్లో ఒకేరోజు మూడు ఫోన్లను లాంచ్ చేసింది. వివో X సిరీస్‌లో ఎక్స్ ఫోల్డ్ 6 (Vivo X Fold 6), V సిరీస్‌లో వి80 ( Vivo V80), ఎస్ సిరీస్‌లో ఎస్2 ఎఫ్ఈ (Vivo S2 FE) ఫోన్లను విడుదల చేసింది.
- ‘భయం వేస్తోంది.. మీరు క్షేమమేనా?’.. యజమాని ఆరోగ్యంపై ఏఐ ఏజెంట్ల ఆందోళన AI Agents: గ్రోక్ థెరపిస్ట్ అనే ఏఐ పరిశోధకురాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో తన ల్యాప్‌టాప్‌లో రన్ అవుతున్న రెండు అటానమస్ ఏఐ ఏజెంట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిద్రపోయారు. దీంతో కొన్ని గంటల పాటు యజమాని నుంచి స్పందన లేకపోవడంతో రెండు ఏజెంట్లూ కంగారు పడ్డాయట.
- 50MP సెల్ఫీ కెమెరాతో ఒప్పో నుంచి F35, F35 Pro స్మార్ట్‌ఫోన్స్ విడుదల Oppo F35 Pro-F35: ఒప్పో తన ఎఫ్ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది.
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డీల్స్ Amazon great indian deals: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్‌కు సిద్ధమవుతోన్న అమెజాన్ (Amazon) ఒక్కో ఆఫర్‌ను రివీల్ చేస్తోంది.
- సింగిల్ వేరియంట్లో శాంసంగ్ ఏ08.. ధర, ఫీచర్లు ఇవే! Samsung Galaxy A08: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ దేశీయంగా గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
- భారత మార్కెట్లోకి గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ Google Fitbit Air:ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) దేశీయ మార్కెట్లోకి తన తొలి స్క్రీన్‌లెస్ ఫిట్నెస్ ట్రాకర్ ఫిట్బిట్ఎయిర్ను (Google Fitbit Air) విడుదల చేసింది.
- మొబైల్ ఫోన్ల ధరలు 16% పెరిగాయ్.. ₹10వేల్లోపు వాటిపైనే అధిక భారం Mobile Phone prices: మొమొరీ ధరల కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్ ధరలు (Mobile Phone prices) సగటున 16 శాతం మేర పెరిగాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
- ₹12 వేలకే Mivi నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే! Mivi One 5G: ప్రముఖ వేరెబుల్ బ్రాండ్ మివి తన తొలి స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది.
- ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అడోబ్ ప్రీమియర్ ఫ్రీ Adobe Premiere Free: భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అడోబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. మల్టీమీడియా ఎడిటింగ్ టూల్ అడోబ్ ప్రీమియర్ (Adobe Premiere) మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది.
- ట్రాయ్ ఆదేశాలు.. ఇక మరిన్ని వాయిస్+ SMS రీఛార్జి ప్లాన్స్ Voice-SMS plans: వాయిస్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలతో మరిన్ని స్పెషల్ టారిఫ్ వోచర్లను (STV) అందించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) టెల్కోలను ఆదేశించింది.
- నాసిరకం స్క్రీన్ ప్రొటెక్టర్లపై నిషేధం.. BIS ప్రమాణాలు ఉండాల్సిందే Phone screen protectors: మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణీత ప్రమాణాలు అందుకోని నాసిరకం ప్రొటెక్టర్ల అమ్మకాలపై నిషేధం విధించింది.
- బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ₹80వేల లోపు ఐఫోన్ 17? iPhone 17: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న వేళ.. ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య ఎక్కువనే చెప్పొచ్చు.
- ₹20 వేలకే 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో లావా కొత్త స్మార్ట్‌ఫోన్ Lava Virat Curve 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా బడ్జెట్ ధరలో విరాట్ కర్వ్ 5జీ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చింది.
- చైనా ‘యూట్యూబ్’పై మన కంటెంట్ క్రియేటర్ల ఆసక్తి Bilibili: కంటెంట్ క్రియేటర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారాలు నిబంధనలు కఠినతరం చేస్తుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం గాలిస్తున్నారు.
- బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గెలాక్సీ ఎస్25పై ₹15 వేల వరకు ఆదా! Samsung Galaxy S25- FE: టెక్ ప్రియులను అలరించేందుకు ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లతో సిద్ధమవుతోంది.
- శాంసంగ్ గెలాక్సీ S26పై రూ.12 వేలు పెంపు! Samsung Galaxy S26: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్26 సిరీస్ (Samsung Galaxy S26) ధరలను పెంచుతుందా? అంటే అవుననే వినిపిస్తోంది.