గత 25 ఏళ్లుగా నీ అసిస్టెంట్‌నే కదా!: యువరాజ్ సింగ్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఆటగాళ్లుగా సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ (Sourav Ganguly - Yuvraj Singh) భారత క్రికెట్ జట్టుకు అద్భుత విజయాలు అందించారు. వీరిద్దరూ కలిసి మరోసారి పనిచేయనున్నారు. అయితే, ఇప్పుడు ప్లేయర్లుగా కాదు.. కోచ్‌లుగా మారారు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. ఆ జట్టు ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీని ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యువరాజ్‌ను దిల్లీ జట్టుకు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఎంట్రీ సందర్భంగా గంగూలీతో యువీ సరదా సంభాషణ ఇలా..
గంగూలీ:నువ్వు నా అసిస్టెంట్ అవుతావా?
యువీ:(నవ్వుతూ) నేను గత 25 ఏళ్లుగా నీకు అసిస్టెంట్‌నే కదా.. ఇప్పుడూ నా పని అదే.
- ఈ జట్టుతో వరల్డ్ కప్‌ను నెగ్గడం కష్టమే: భారత మాజీ క్రికెటర్
ఉత్సాహంగా ఉన్నా: యువీ
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యువ క్రికెటర్లకు యువరాజ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఫ్రాంచైజీ కోచింగ్ సెటప్‌లోకి అడుగు పెట్టడంపై యువీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ బాధ్యతల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కెరీర్లో నన్ను ప్రోత్సహించిన గంగూలీని ( Sourav Ganguly) గురువుగా, పెద్దన్నలా భావిస్తా. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లందరినీ కలుపుకొని వెళ్లడం, గెలుపు సంస్కృతిని అలవర్చడంలో గంగూలీ శైలే వేరు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని యువీ (Yuvaraj Singh) తెలిపాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 15:51 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఈ జట్టుతో వరల్డ్ కప్‌ను నెగ్గడం కష్టమే: భారత మాజీ క్రికెటర్ విండీస్ బ్యాటర్లను అడ్డుకోవడంలో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ఉప్పల్ మ్యాచ్‌లోనూ విండీస్ విజయం సాధించింది.
- లింక్డిన్లో విరాట్ ఫస్ట్ పోస్టు.. స్పందించిన సత్యనాదెళ్ల విరాట్ కోహ్లీ పెట్టిన తొలి లింక్డిన్ పోస్టుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల స్పందించారు.
- మాకొద్దు ఆ సెలక్టర్ పదవి.. తిరస్కరించిన ఇద్దరు మాజీలు! సెలక్టర్ పదవి ఆఫర్ వస్తే ఇద్దరు మాజీ క్రికెటర్లు తిరస్కరించినట్లు వస్తోన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
- మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు : సంజు శాంసన్ ‘‘వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో తిలక్ వర్మ ఔటవడంతో ఫెయిల్డ్ ఛేజ్ మొదలైంది.. మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు’’ అని భారత ఆటగాడు సంజు శాంసన్ (Sanju Samson) అన్నాడు. యువ ఫాస్ట్ బౌలర్లు అనుభవంతో మెరుగవుతారని ధీమా వ్యక్తం చేశాడు.
- బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ పాటించలేకపోయాం : శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, నిర్ణయాత్మక పోరుకు సిద్ధమవుతామని టీమిండియా (Team india) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తెలిపాడు. బౌలింగ్‌లో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
- ఉప్పల్‌లో పడ్డారు పొట్టి క్రికెట్లో వెస్టిండీస్‌తో అంత తేలిక కాదని మరోసారి రుజువైంది. భారత్‌కు వన్డే సిరీస్ కోల్పోయాక.. టీ20 సిరీస్‌లో గట్టి పోటీనిస్తున్న కరీబియన్ జట్టు, సిరీస్‌ను 2-2తో సమం చేసి ఫలితాన్ని చివరి పోరుకు మళ్లించింది.
- తిరిగి హైదరాబాద్‌కు నటరాజన్ ఎడమచేతి వాటం పేసర్ నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. ఐపీఎల్ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్ అతణ్ని దిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుంది.
- టీ20ల్లో మేం చాలా శ్రమించాలి వన్డే ప్రపంచకప్ గెలిచినప్పటికీ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరముందని కొత్త కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది. మహిళల తొలి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది.
- ఆ స్థానం ఓజాదే..! అజిత్ అగార్కర్ స్థానంలో వెస్ట్‌జోన్ నుంచి పార్థివ్ పటేల్ సెలక్టర్ అవుతాడని అంతా భావించారు. కానీ అతడు పదవి కోసం దరఖాస్తే చేసుకోలేదు. దీంతో సెలక్షన్ కమిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్‌గా కొనసాగేందుకు ప్రజ్ఞాన్ ఓజాకు మార్గం సుగమమైంది.
- కరుణ్ శతకం ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్ డ్రా ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో కర్ణాటక డ్రాతో బయటపడింది. కరుణ్ నాయర్ (155; 242 బంతుల్లో 16×4, 2×6) వీరోచిత శతకంతో జట్టును గట్టెక్కించాడు.
- 17 ఏళ్ల తర్వాత పంజాబ్‌కు.. ఈ నెలాఖర్లో జరగనున్న హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ప్రత్యేకంగా నిలవనుంది. అతడి సొంతగడ్డ పంజాబ్‌లో 17 ఏళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది.
- నాలుగో స్థానంలో శ్రేయస్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో అతను 18 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని రేటింగ్ మెరుగుపడింది.
- యోధాస్ గెలుపు ఆర్చరీ ప్రిమియర్ లీగ్‌లో పృథ్వీరాజ్ యోధాస్ పుంజుకుంది. బుధవారం ఆ జట్టు 5-1తో చేరో ఆర్చర్స్‌పై ఘనవిజయాన్నందుకుంది. గణేశ్ మణిరత్నం 60కి 59 పాయింట్లతో జట్టు గెలుపులో కీలకమయ్యాడు.
- సాత్విక్ జోడీ ఔట్ డెన్మార్క్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ కథ ముగిసింది. బుధవారం తొలి రౌండ్లో ఈ జంట 21-12, 15-21, 19-21తో చైనా ద్వయం హె జి టింగ్, రెన్ జియాంగ్ యుల చేతిలో ఓడిపోయింది.
- సంక్షిప్త వార్తలు (4) ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారు. గురువారం దిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆయన ప్లేయర్లతో సమావేశం కానున్నారు.
- భారత్‌పై కీమో పాల్ ‘ఫైఫర్’.. విండీస్‌దే నాలుగో టీ20 ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది.
- విరాట్‌కు ధోనీలా.. మంధానకు హర్మన్ బాసటగా నిలవాలి: మిథున్ సీనియర్‌గా జట్టులో ఉన్నప్పుడు కొత్త సారథికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వెల్లడించాడు.
- నాలుగులోకి శ్రేయస్ అయ్యర్.. రెన్షా 147 స్థానాలు జంప్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఆసీస్ ప్లేయర్ దూసుకొచ్చాడు.
- ఆ టోర్నమెంట్లో అనుమతి లేకుండా నా పేరు వాడారు: శిఖర్ ధావన్ Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనధికారికంగా వాడుకోవడాన్ని భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖండించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
- అభిషేక్ ఎఫెక్ట్.. సంజుపై ఒత్తిడి: పుజారా కీలక వ్యాఖ్యలు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సంజు శాంసన్ తక్కువ పరుగులకే ఔట్ అవడంపై మాజీ క్రికెటర్ పుజారా (Cheteshwar Pujara) స్పందించాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శాంసన్ మరికొంత సమయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.