అమెరికాలో.. క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ఏపీ యువకుడు

Eenadu icon
By Nri News Team Updated : 15 Oct 2026 19:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడి (AP student in USA) కథ విషాదంగా ముగిసింది. ఏపీ నుంచి అగ్ర రాజ్యానికి వెళ్లిన కొంత కాలానికే క్యాన్సర్‌ బారిన పడినట్లు నిర్ధరణ కాగా.. నాలుగేళ్ల పాటు మహమ్మారితో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఉదయం భరత్‌ పులిపాటి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. యువకుడి మృతి పట్ల ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ ( Nara Lokesh) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భరత్‌ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భరత్‌ (Bharat Pulipati) ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లారు. ఏడాది తర్వాత హెపటో సెల్యులార్‌ కార్సినోమా బారినపడిన ఆయన.. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో టెక్సాస్‌లోని ఆసుపత్రిలో చేరారు. మాతృభూమికి వచ్చి కుటుంబసభ్యులలో గడపాలని ఉందని.. అనారోగ్యం దృష్ట్యా ఎయిర్‌ అంబులెన్స్‌ సాయం అవసరమని పేర్కొంటూ భరత్‌ గతంలో వీడియో విడుదల చేశారు. ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్‌.. భరత్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా ప్రయాణాలు చేయొద్దని వైద్యబృందం సూచించినట్లు తెలిసిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే భరత్‌ ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

► Read latest Nri Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 16:23 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రైఫిల్‌ జామ్‌ అవడంతో ఆగిన నరమేధం: అమెరికాలో ఆలయంపై దాడి కుట్రలో కీలక విషయాలు US Teen Shooting Case: అమెరికాలో ఇల్లినోయీలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
  • అమెరికాలో హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు కుట్ర.. యువకుడి అరెస్టు అమెరికా(USA)లో హిందూ ఆలయంపై సాముహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • యూఏఈ లాటరీ.. భారతీయుడికి రూ.13 కోట్ల జాక్‌పాట్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది.
  • వలసదారులకు ట్రంప్‌ మరో షాక్‌.. ఆటోమేటిక్‌ వర్క్‌పర్మిట్‌ పొడిగింపు నిలిపివేత Automatic Work Permit Extensions: వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొందరు ప్రత్యేక వలసదారులకు ఆటోమేటిక్‌ వర్క్ పర్మిట్స్‌ పొడిగింపును నిలిపివేసింది.
  • కామారెడ్డి జిల్లా వాసి రష్యాలో మృతి కామారెడ్డి జిల్లా వాసి రష్యాలో మృతి చెందాడు. జిల్లాలోని తడ్కోల్‌ వాసి అఫ్జల్‌ఖాన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం రష్యా వెళ్లాడు.
  • టైమ్స్‌స్క్వేర్‌లో ఘనంగా ‘దుర్గా ఉత్సవ్‌’ న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌(Times Square)లో దుర్గామాత ఉత్సవం (Durga Utsav) కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
  • తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) నూతన ధర్మకర్తల మండలి ఎన్నిక యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL), వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) 2026 అక్టోబరు10న బర్న్‌హామ్ గ్రామర్ స్కూల్‌లో నిర్వహించింది.
  • గఫూర్‌ కుమారుడి మృతికి గ్లోబల్ ఎన్నారై తెదేపా చీఫ్ డాక్టర్ రాజా సంతాపం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.అబ్దుల్ గఫూర్ కుమారుడు కిరణ్ వెంకట పల్లా (42) అకాల మరణం పట్ల గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
  • టోక్యోలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో టోక్యోలోని కోమత్సుగావా పార్కులో బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
  • కెనడా మేయర్ బరిలో తెలుగు మహిళ.. బాలీవుడ్ పాటతో ఓట్ల వేట! కెనడాలోని మిస్సిస్సాగా మేయర్‌ బరిలో ఉన్న తెలుగు మహిళ దీపికా దామెర్ల చేస్తోన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
  • అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గఫూర్ కుమారుడు అమెరికాలో మృతి చెందాడు.
  • H1B నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా.. నిషేధానికి ప్రతిపాదన H1B నిబంధనలు ఉల్లంఘిస్తే 2.5 లక్షల డాలర్ల జరిమానా, పదేళ్ల నిషేధానికి ప్రతిపాదన చేస్తూ యూఎస్‌ఏ ప్రతినిధుల సభలో ఓ బిల్లు పెట్టారు. 
  • పాదచారుడితో వివాదం.. కెనడాలో భారత సంతతి మహిళ అరెస్టు ట్రాఫిక్‌ వివాదం ఓ భారత సంతతి (Indian Origin) మహిళ అరెస్టుకు దారితీసింది. కెనడా(Canada)లోని కాల్‌గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
  • డాలస్‌లో మహాత్ముడి మెమోరియల్‌ వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు భారత జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు అమెరికాలోని డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా గాంధీ జయంతి సందర్భంగా శాంతి నడక యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
  • ఛార్లెట్‌లో తానా ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం అమెరికాలోని ఛార్లెట్‌లో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతమైంది.
  • అంతర్జాతీయ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌.. నాలుగు స్వర్ణాలు, రజతం సాధించిన భారత్‌ అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌ ఒలింపియాడ్‌ (IOAA)లో భారత విద్యార్థులు సత్తా చాటారు. 
  • ఒమన్‌ నుంచి యూఏఈలోకి చొరబాటు.. శిక్ష ముగిసినా జైలులోనే జగిత్యాల వాసి ఉపాధి కోసం ఒమన్‌ వెళ్లిన జగిత్యాల వాసి ఏగుర్ల మల్లేశం పాస్‌పోర్ట్, వీసా లేకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోకి ప్రవేశించి జైలుపాలయ్యాడు.
  • అమెరికాలో సుప్రియ మృతిపై మంత్రి పొంగులేటి తీవ్ర విచారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దారం సుప్రియ (30) మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
  • అమెరికా యూనివర్సిటీకి రూ.10 కోట్లు అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన డాక్టర్‌ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్‌)కు 1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు)ను విరాళంగా అందించారు.