రుణ గ్రహీతలకు SBI షాక్.. రుణ రేట్లు పెంపు

- A
- A+
- A++

State bank of India | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను సవరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఇటీవల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో రుణ రేట్లు పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది.
ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలు ప్రియం కానున్నాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. పెరిగిన రేట్లు అక్టోబర్ 15 నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. EBLR 7.90% నుంచి 8.15% శాతానికి (CRP + BSP అదనం) పెంచింది. RLLRను 7.50% నుంచి 7.75%కి (CRP + BSP అదనం) సవరించింది. సాధారణంగా ఈ రేట్లతో అనుసంధానం అయి ఉన్న గృహ, వాహన రుణాల ఈఎంఐ పెరుగుతుంది. * CRP- క్రెడిట్ రిస్క్ ప్రీమియం; BSP- బ్యాంక్ స్ప్రెడ్
- ఫెయిర్ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంక్
ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్, ఒక నెల ఎంసీఎల్ఆర్లో ఎస్బీఐ ఎలాంటి మార్పూ చేయలేదు. 7.85 శాతం వద్దే కొనసాగించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.75 శాతానికి; ఏడాది ఎంసీఎల్ఆర్ను 8.70 శాతం నుంచి 8.85 శాతానికి, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ వరుసగా 8.90 శాతం, 8.95 శాతానికి చేర్చింది. MCLR అనేది బ్యాంకు రుణాలపై వసూలు చేయగల కనీస వడ్డీ రేటును సూచిస్తుంది. ఒక బ్యాంకు తన నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, మార్జిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేటును నిర్ణయిస్తుంది. సాధారణంగా పాత హోమ్, పర్సనల్ లోన్లు; కార్పొరేట్ రుణాలు ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉంటాయి.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు జమ చేయొచ్చా? పొదుపు ఖాతాలో ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.10లక్షలు అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే.. ఆ లావాదేవీల వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
- పండుగ ఖర్చులకు కూడా వ్యక్తిగత రుణమా! ఈ జాగ్రత్తలు మీకే.. పండుగ ఖర్చుల నిమిత్తం వ్యక్తిగత రుణం తీసుకునే ముందు ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- 60 ఏళ్లు దాటిన వారికి గృహ రుణాలు సాధ్యమేనా.. ఇంటి రుణ ఆమోదం కోసం సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు పరిగణించాల్సిన ముఖ్యమైన అంశాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
- కార్డు ఈఎంఐ అసలు ఖర్చు ఎంత? సున్నా శాతం వడ్డీ రేటు.. ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. నెలకు ఈఎంఐ రూ.1,999 మాత్రమే.. ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నెలవారీ చెల్లింపు తక్కువగా కనిపించగానే ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సులభంగా కొనేయొచ్చనే ఆలోచన వస్తుంది
- ఎఫ్డీ రద్దు.. రుణం.. ఏది మేలు? అత్యవసరంలో డబ్బు అవసరమైనప్పుడు చాలామందికి గుర్తుకొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ). అప్పటికే బ్యాంకులో ఉన్న ఎఫ్డీని గడువు తీరకముందే రద్దు చేసుకొని, డబ్బును ఉపసంహరించుకోవాలా? లేక ఆ డిపాజిట్ను హామీగా ఉంచి రుణం తీసుకోవాలా?
- రుణ హామిదారుడి క్రెడిట్ స్కోరు ఎప్పుడు దెబ్బతింటుంది? రుణానికి హామీదారుగా ఉండడం వల్ల మీ క్రెడిట్ స్కోరుపై ఏర్పడే ప్రభావంతో పాటు, ఇంకా అనేక ఇతర ఆర్థిక అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం.
- ప్రాపర్టీ రుణంపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత? ఆస్తిని తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయి. వీటిపై వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల కన్నా తక్కువే ఉంటాయి.
- ఇంటి రుణం ‘ఈఎంఐ చూసుకోండి’ సొంతిల్లు ప్రతి కుటుంబానికీ ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. ఇల్లు కొనాలనే ఆలోచనలో తమ ఆదాయ సామర్థ్యాన్ని మించి రుణం తీసుకుంటే ఆ తర్వాత ఈఎంఐల భారం ఇబ్బంది పెట్టొచ్చు. నెలవారీ ఖర్చులకు డబ్బు సరిపోకపోవడమే కాకుండా, పిల్లల చదువులు, పదవీ విరమణ కోసం చేసే మదుపులపైనా ప్రభావం పడొచ్చు.
- క్రెడిట్ నివేదికలో మాయా రుణం మీరు అసలు తీసుకోని రుణం.. మీ క్రెడిట్ నివేదికలో కనిపిస్తే? అది చిన్న పొరపాటు కాదు. దాన్ని ఆర్థిక పరిభాషలో ‘ఘోస్ట్ లోన్’ అంటారు. ఈ అపరిచిత రుణాలు మీ ప్రమేయం లేకుండానే మీ క్రెడిట్ స్కోరును తగ్గిస్తాయి.
- ఎఫ్డీలపై వివిధ బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు ఇవే.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రజలకు ఫిక్స్డ్ డిపాజిట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.
- అప్పు తీర్చినా.. ఇంటి పత్రాలు ఇవ్వకపోతే ఇల్లు కొనుగోలు చేసేందుకు, స్థిరాస్తిపై రుణం తీసుకునేందుకుగానీ బ్యాంకులు అసలు ఆస్తి పత్రాలను హామీగా తీసుకుంటాయి. విక్రయ పత్రంతోపాటు అనుమతులు ఇతర పత్రాలూ బ్యాంకు రుణం తీర్చే వరకూ పెట్టుకుంటుంది.
- వ్యక్తిగత రుణం పొందడానికి కనీస ఆదాయ ప్రమాణాలివే.. వ్యక్తిగత రుణం పొందడానికి కొన్ని ఆదాయ ప్రమాణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
- ద్విచక్ర వాహనాల రుణాలపై బ్యాంకులు వసూలుజేసే వడ్డీ రేట్లు ఇవే.. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలిస్తున్నాయి. ఈ రుణాలపై రుణసంస్థలు వసూలుచేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
- నెట్ బ్యాంకింగ్.. యూపీఐ వాడాలి జాగ్రత్తగా మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని వేల రూపాయల లావాదేవీలు చేసేటప్పుడు మనసులో ఒక చిన్న సందేహం సహజం.
- 14 శాతం వడ్డీ సాధ్యమేనా? ఆన్లైన్ వేదికల్లో కార్పొరేట్ బాండ్లపై 14 శాతం వరకూ వడ్డీ ఇస్తామంటూ వచ్చే ప్రకటనలు సామాన్య మదుపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ లాభం వస్తుందన్న ఆశతో చాలామంది వీటిని ఆసక్తిగా చూస్తున్నారు.
- రుణాల నిర్వహణ ఎలా ఉండాలి? రుణాలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన ప్యూహాలను అమలుజేయాలి, అది ఎలాగో ఇక్కడ చూద్దాం.
- EMI చెల్లించకపోతే ఏమవుతుంది? కొన్ని కారణాల వల్ల సమయానికి EMI చెల్లించడం కష్టతరం కావచ్చు.
- పే స్లిప్లు లేకుండా వ్యక్తిగత రుణం పొందే మార్గాలివే.. రుణ సంస్థలు..రుణలిచ్చేటప్పడు కేవలం భౌతిక పత్రాల మీదనే ఆధారపడకుండా రుణ దరఖాస్తుదారుడి చెల్లింపులు సామర్థ్యంపై కూడా దృష్టి పెడతాయి.
- ఇంటి అప్పు.. వడ్డీ భారం తగ్గాలంటే సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మైలురాయి. అత్యంత సుదీర్ఘమైన ఆర్థిక ప్రయాణం. ఇంటి రుణం తీసుకున్న ప్రతి మధ్యతరగతి కుటుంబం మనసులో మెదిలే అతి పెద్ద ప్రశ్న ఒకటి ఉంటుంది.
- ఎఫ్డీ చేసినా నగదు అందుబాటులో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) సురక్షితమైన పెట్టుబడిగా కనిపిస్తుంటాయి. కేవలం అధిక వడ్డీ లభిస్తుందనే ఆశతో డబ్బు మొత్తాన్ని దీర్ఘకాలిక వ్యవధికి ఎఫ్డీ చేయడం ఆర్థికంగా కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు