అప్పుడు రజనీ దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథి పాత్రలో: ‘జైలర్‌ 2’లో హృతిక్‌

Eenadu icon
By Entertainment Team Updated : 15 Oct 2026 16:45 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ( Rajinikanth) నటించిన ‘జైలర్‌ 2’ (Jailer 2) అభిమానుల కోలాహలం మధ్య గురువారం విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ‘జైలర్‌’లో లాగే ఇందులోనూ పలువురు ప్రముఖ నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే వారిలో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. దర్శకుడు నెల్సన్‌ ‘రోడీ’ పాత్రలో హృతిక్‌ను స్టైలిష్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్‌ అభిమానులు 40 ఏళ్ల క్రితం నాటి ఓ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. అదే 1986లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘భగవాన్‌ దాదా’ (Bhagwan Dada). 

 

ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పుడు 12 ఏళ్ల వయసున్న హృతిక్‌ ఆ సినిమాలో రజనీకాంత్‌ దత్తపుత్రుడిగా కనిపించారు. పలు సన్నివేశాల్లో రజనీతో కలసి సందడి చేశారు. ఆ తరువాత కొన్నేళ్లకు తన తండ్రి తెరకెక్కించిన ‘కహోనా ప్యార్‌ హై’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు హృతిక్‌. అనంతరం క్రిష్‌, ధూమ్‌ 2, అగ్నిపథ్‌ లాంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ‘జైలర్‌ 2’లో అతిథి పాత్రలో నటించి సూపర్‌స్టార్‌తో మరోసారి తెరను పంచుకోవడంపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ రెండు సినిమాల్లో రజనీ-హృతిక్‌ల సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

  • రివ్యూ: జైలర్‌2.. రజనీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ సీక్వెల్‌ ఎలా ఉంది?
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 16:36 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ దంపతులు ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా వేడుకల్లో విజయ్‌ దేవరకొండ దంపతులు పాల్గొన్నారు.
  • రివ్యూ: జైలర్‌2.. రజనీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ సీక్వెల్‌ ఎలా ఉంది? రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన కామెడీ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘జైలర్‌2’. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • వివాదాస్పద చిత్రం.. ట్రైలర్‌ రిలీజ్‌ మనోజ్‌ బాజ్‌పేయీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘గజబ్ రాత్ ’.
  • అమ్మ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి.. ఇప్పుడు రూ.50 కోట్ల వసూళ్లతో సంచలనం! స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. ప్రచారానికి డబ్బుల్లేవు! అయినా ప్రేక్షకుల మనసులు గెలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోందో చిన్న కన్నడ సినిమా. 
  • సీజేపీ నిరసనలు.. ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్‌.. భారత్‌ను వీడాలంటూ నోటీసులు ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 
  • సంయుక్త కథ ఓకే చేస్తే.. సినిమా బ్లాక్‌బస్టరే: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ విగ్రహాలకూ, ఓ పోలీసు అధికారికీ మధ్య ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘హైందవ’.
  • రజనీ ‘జైలర్‌ 2’ రిలీజ్‌.. థియేటర్‌కి ధనుష్‌, ఐశ్వర్య అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధానపాత్రలో నటించిన ‘జైలర్‌ 2’ (Jailer 2) నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
  • రామోజీ ఫిల్మ్‌ సిటీలో డ్రాగన్‌ యాక్షన్‌ ‘డ్రాగన్‌’ అవతారంలో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నారు.
  • జయమ్మ పాత్ర ప్రేరణతో… 400 కుటుంబాలకు సాయం! ‘రణబాలి’ సినిమాలో పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో కథానాయిక రష్మిక 400 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
  • హిందీలో... ఓ ప్రేమకథతో! తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న కృతిశెట్టి త్వరలోనే హిందీలో కథానాయికగా పూర్తిస్థాయి చిత్రం చేయబోతున్నారు.
  • బాధ్యతలు చేపట్టిన సావిత్రి ‘‘అబ్జెక్షన్‌ ఓవర్‌రూల్డ్‌..! సావిత్రి బాధ్యతలు చేపట్టారు.. అది కూడా అద్భుతమైన శైలిలో’’ అంటూ ‘సత్యవాన్‌ సావిత్రి’ ప్రపంచాన్ని పరిచయం చేసింది చిత్రబృందం.
  • రెండున్నరేళ్ల తర్వాత తాము నమ్మిన కథల కోసం కథానాయకులు ఎంతైనా శ్రమిస్తుంటారు. ఎన్ని రోజులు కేటాయించడానికైనా వెనకాడరు.
  • అమ్మ కదిలి వచ్చేనమ్మా నవరాత్రి ఉత్సవాలతో ముడిపడిన అమ్మవారి గీతంతో ‘భరతవర్ష’ సినిమా సంగీత ప్రచారం ఊపందుకుంది.
  • దశావతారాల గుడి నేపథ్యంలో... హైందవ ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్‌గా ప్రత్యేకమైన అనుభవాన్ని పంచే సినిమాలు ఎంతో ముఖ్యం.
  • హృదయం నిండుగా కథానాయకుడు ప్రభాస్‌ పంపిన విందు భోజనాన్ని చూపుతూ ‘హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా...’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు కథానాయిక ఇమాన్వి.
  • సంక్షిప్త వార్తలు (4) విభిన్నమైన జానర్‌లలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఎప్పటికప్పుడూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు కథానాయిక కృతిసనన్‌.
  • కుటుంబాలకు భరోసా.. నిత్యావసరాలకు అండగా రష్మిక ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ ప్రముఖ నటి రష్మిక దేవరకొండ తన దాతృత్వాన్ని చాటనున్నారు. 400 కుటుంబాలను ఏడాది పాటు దత్తత తీసుకునేందుకు ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ కార్యక్రమాన్ని చేపట్టారు.
  • హీరోయిన్‌ బర్త్‌డేకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. చూస్తే కడుపునిండిపోద్ది ప్రభాస్‌తో (Prabhas) కలసి పనిచేసిన నటులంతా ఆయన ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఇంటి నుంచి సెట్‌కు రకరకాల వంటకాలు తెప్పించి, అందరికీ ప్రేమగా వడ్డించడమంటే ఆయనకెంతో ఇష్టం.
  • రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోపై బిగ్‌ అప్డేట్‌ రంగస్థలం’ లాంటి ఘనవిజయం తరువాత రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
  • పాఠ్యపుస్తకాలు చెప్పని వాస్తవాలను ‘రణబాలి’ చెబుతోంది: అన్నామలై బ్రిటిషర్లు దాచేసిన దేశ చరిత్రలోని పలు అంశాలపై మాజీ ఐపీఎస్‌ అధికారి, రాజకీయ నాయకుడు అన్నామలై, న్యాయవాది జె.సాయిదీపక్‌లతో విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ సాంకృత్యాన్‌ సంభాషించారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేసింది.