ఉదయ్‌వీర్‌కు స్వర్ణం

- A
- A+
- A++

కైరో: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్ధు సత్తాచాటాడు. ఆదివారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో అతడు పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో 24 ఏళ్ల ఉదయ్‌వీర్ 240.6తో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీ షూటర్ క్రిస్టియన్ రీజ్ (240.1) రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే 0.5 పాయింట్ల తేడాతో ఉదయ్‌వీర్ విజయం సాధించడం మాత్రం అద్భుతమే. చివరి రెండు షాట్లకు ముందు అతడు 0.3 పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. తీవ్ర ఒత్తిడి ఉన్న ఈ స్థితిలో గురి తప్పకుండా బుల్లెట్ దించాడు. ఆఖరి రెండు షాట్లకు 10.2, 9.8 స్కోరు చేసి స్వర్ణ రేసులో నిలిచాడు. ప్రత్యర్థి ఆఖరి రెండు ప్రయత్నాల్లోనూ 9.6 పాయింట్లే స్కోరు చేయడంతో ఉదయ్‌వీర్ సంబరాల్లో మునిగిపోయాడు. పావోలో మోనా (219.8) కాంస్యం దక్కించుకున్నాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్ఇండియా తహతహలాడుతుంటే..
- ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్ గిల్.. భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డు (సెప్టెంబర్ నెల) సాధించారు.
- ఆరేసిన తనయ్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఘనంగా బోణీ కొట్టింది. తనయ్ త్యాగరాజన్ (6/52) విజృంభించడంతో గ్రూప్-బి ఎలీట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో త్రిపురను చిత్తు చేసింది.
- దిల్లీ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. మంగళవారం అతడు దిల్లీ క్యాపిటల్స్ సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
- సింధు, లక్ష్య ఔట్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. ఆమె తొలి రౌండే దాటలేకపోయింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 21-13, 23-25, 19-21తో యోనెలి (జర్మనీ) చేతిలో ఓడిపోయింది.
- రాజ్‌పుతానా ఘనవిజయం ఆర్చరీ ప్రిమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ అదిరే విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆ జట్టు 6-0తో చేరో ఆర్చర్స్‌ను చిత్తు చేసింది.
- పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈనెల 18న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది అథ్లెట్లలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.
- క్రిషన్ బహదూర్ పునరాగమనం గోల్‌కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్ భారత హాకీ జట్టులో పునరాగమనం చేశాడు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించాడు.
- సంక్షిప్త వార్తలు (3) సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు భంగపాటు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పేసర్ హేజిల్‌వుడ్ (6/49) ధాటికి కుదేలైన సఫారీ జట్టు 214 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.