విజృంభించిన అనికేత్‌

Eenadu icon
By Sports News Desk Published : 12 Oct 2026 03:54 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ఈనాడు - హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీలో తొలి రోజు హైదరాబాద్‌ సత్తా చాటింది. బౌలర్లు విజృంభించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో త్రిపురను 134 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనికేత్‌ రెడ్డి (5/21), తనయ్‌ త్యాగరాజన్‌ (3/37) ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించారు. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఆదివారం ఆరంభమైన ఈ గ్రూప్‌-బి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న త్రిపుర.. ఆరంభంలో మెరుగ్గానే బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు బిక్రమ్‌కుమార్‌ దాస్‌ (50; 107 బంతుల్లో 4×4, 2×6), హ్రితురాజ్‌ రాయ్‌ (33; 70 బంతుల్లో 5×4) తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించి త్రిపురకు శుభారంభం అందించారు. హ్రితురాజ్‌ను తనయ్‌ ఔట్‌ చేసి ఈ జోడీని విడగొట్టడంతో ఆ జట్టు పతనం మొదలైంది. హనుమ విహారి (0), బిక్రమ్‌కుమార్‌ స్వల్ప తేడాతో పెవిలియన్‌ చేరడంతో త్రిపుర 82/3తో ఇబ్బందుల్లో పడింది. అయితే మన్‌దీప్‌ సింగ్‌ (24) నిలవడంతో త్రిపుర 130/3తో కాస్త కోలుకుంది. ఈ స్థితిలో అనికేత్, తనయ్‌ విజృంభించడంతో త్రిపుర కుప్పకూలిపోయింది. 4 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి 140లోపే ఆలౌటైంది. ఆ జట్టులో అయిదుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. టీమ్‌ఇండియా పేసర్, హైదరాబాద్‌ కెప్టెన్‌ మహ్మద్‌ సిరాజ్‌ 9 ఓవర్లు వేసినా వికెట్‌ తీయలేకపోయాడు. ఆట ఆఖరికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ (48), రుత్విక్‌ (11) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు తన్మయ్, అభిరథ్‌ రెడ్డి (32; 56 బంతుల్లో 3×4, 1×6) తొలి వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. అయితే 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు చేజార్చుకున్న హైదరాబాద్‌.. 66/3తో నిలిచింది. రాహుల్‌ సింగ్‌ (5), ప్రజ్ఞయ్‌ రెడ్డి (0), హిమతేజ (18) విఫలమయ్యారు. త్రిపుర బౌలర్లలో సందీప్‌ సర్కార్‌ (4/44) రాణించాడు. 

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కెప్టెన్‌ రవిచంద్రన్‌ స్మరణ్‌ (126; 218 బంతుల్లో 11×4, 1×6) సెంచరీ బాదడంతో ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 274 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి రోజు ఆరంభంలో 22/4తో తడబడింది. స్టార్‌ ప్లేయర్లు కేఎల్‌ రాహుల్‌ (4), మయాంక్‌ అగర్వాల్‌ (5), కరుణ్‌ నాయర్‌ (8)తో పాటు అనీష్‌ (0) విఫలమయ్యారు. ఈ స్థితిలో స్మరణ్, కృష్ణన్‌ శ్రీజిత్‌ (58) జట్టును ఆదుకున్నారు. ఈ జంట అయిదో వికెట్‌కు 111 పరుగులు జత చేయడంతో ఒక దశలో కర్ణాటక 133/4తో కోలుకుంది. శ్రీజిత్‌ ఔటయ్యాక ఆ జట్టు 174/7తో మళ్లీ తడబడింది. అయితే మాధవ్‌ బజాజ్‌ (33) జతగా స్మరణ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్కోరును 200 దాటించాడు. ఈ క్రమంలోనే అతడు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్మరణ్‌ తొమ్మిదో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. సౌరభ్‌ కుమార్‌ (3/69), కావూరి సాయితేజ (2/20), శశికాంత్‌ (2/10) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఆట ఆఖరికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 16/2తో నిలిచింది. హేమంత్‌ (1), త్రిపురణ విజయ్‌ (4) ఔటయ్యారు. 

టీమ్‌ఇండియా పునరాగమనంపై ఆశలు పెట్టుకున్న పేసర్‌ మహ్మద్‌ షమి (4/30).. రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. బెంగాల్‌ తరఫున ఆడుతూ దిల్లీపై అతడు విజృంభించాడు. షమి, అమీర్‌ గని (3/45), ఆకాశ్‌ దీప్‌ (2/74) రాణించడంతో కల్యాణి (బెంగాల్‌)లో మొదలైన పోరులో దిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌటైంది. హృతిక్‌ షోకీన్‌ (56), ఆయుష్‌ దోసెజా (45), సార్థక్‌ (33) రాణించకపోతే దిల్లీ ఆమాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఒక దశలో దిల్లీ 148/7తో నిలిచినా.. హృతిక్‌ షోకీన్‌ పోరాడి ఆ జట్టు స్కోరు 200 దాటించాడు. 

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ఫామ్‌ నిరూపించుకోవడానికి రంజీ బరిలో నిలిచిన స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. చండీగఢ్‌తో మ్యాచ్‌లో తొలి రోజు మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. ఆట ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 249/5తో నిలిచింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డకౌట్‌ అయ్యాడు. ముషీర్‌ ఖాన్‌ (65), ఆయుష్‌ మాత్రే (48) నిలవడంతో ఆ జట్టు 77/1తో కోలుకుంది. ఆయుష్‌ వెనుదిరిగినా.. కెప్టెన్‌ సిద్ధేశ్‌ లాడ్‌ (80 బ్యాటింగ్‌), ముషీర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 142/2తో మెరుగైన స్థితిలో కనిపించిన ముంబయి.. 144/4తో నిలిచింది. ముషీర్‌తో పాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ (1) ఔటయ్యాడు. ఆట ఆఖరికి సిద్ధేశ్‌కు తోడుగా శామ్స్‌ ములాని (27) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌ ముంబయిలో జరుగుతోంది.

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (72 బ్యాటింగ్‌) మెరిశాడు. అతడు సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. రాజ్‌కోట్‌లో మొదలైన పోరులో ఛత్తీస్‌గఢ్‌పై అతడు అజేయ అర్ధసెంచరీ చేశాడు. ప్రేరక్‌ మన్కడ్‌ (92 బ్యాటింగ్‌), చిరాగ్‌ జాని (83) రాణించడంతో ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 308/4తో నిలిచింది.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్‌ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్‌ఇండియా తహతహలాడుతుంటే..
  • ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్‌ గిల్‌.. భారత మహిళల జట్టు ఓపెనర్‌ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్‌’ అవార్డు (సెప్టెంబర్‌ నెల) సాధించారు.
  • ఆరేసిన తనయ్‌ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనంగా బోణీ కొట్టింది. తనయ్‌ త్యాగరాజన్‌ (6/52) విజృంభించడంతో గ్రూప్‌-బి ఎలీట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో త్రిపురను చిత్తు చేసింది.
  • దిల్లీ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌లో కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. మంగళవారం అతడు దిల్లీ క్యాపిటల్స్‌ సహాయ కోచ్, బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు.
  • సింధు, లక్ష్య ఔట్‌ భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. ఆమె తొలి రౌండే దాటలేకపోయింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 21-13, 23-25, 19-21తో యోనెలి (జర్మనీ) చేతిలో ఓడిపోయింది.
  • రాజ్‌పుతానా ఘనవిజయం ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌ అదిరే విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆ జట్టు 6-0తో చేరో ఆర్చర్స్‌ను చిత్తు చేసింది.
  • పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈనెల 18న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది అథ్లెట్లలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.
  • క్రిషన్‌ బహదూర్‌ పునరాగమనం గోల్‌కీపర్‌ క్రిషన్‌ బహదూర్‌  పాఠక్‌ భారత హాకీ జట్టులో పునరాగమనం చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించాడు.
  • సంక్షిప్త వార్తలు (3) సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు భంగపాటు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పేసర్‌ హేజిల్‌వుడ్‌ (6/49) ధాటికి కుదేలైన సఫారీ జట్టు 214 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.

English Translation

A booming Aniket

Eenadu icon
By Sports News Desk Published : 12 Oct 2026 03:54 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

Today - Hyderabad: On the first day of the Ranji Trophy, Hyderabad showed its strength. Tripura were bowled out for 134 runs in the first innings as the bowlers boomed. Aniket Reddy (5/21) and Tanay Thyagarajan (3/37) played a key role in the opponent's downfall. Tripura won the toss and elected to bat in the Group-B match that started on Sunday at the Gymkhana ground in Secunderabad. Openers Bikramkumar Das (50; 4×4, 2×6 off 107 balls) and Hrithuraj Roy (33; 5×4 off 70 balls) added 80 runs for the first wicket and gave Tripura a good start. The downfall of the team started when Tanay dismissed Hrithuraj and broke the pair. Hanuma Vihari (0) and Bikramkumar reached the pavilion by a narrow margin as Tripura were in trouble at 82/3. But Mandeep Singh (24) stood and Tripura recovered a bit with 130/3. In this situation Tripura collapsed as Aniket and Tanay flourished. They lost 7 wickets with a difference of 4 runs and were bowled out under 140. Five batters were ducked in that team. Team India pacer and Hyderabad captain Mohammad Siraj bowled 9 overs but could not take a wicket. At the end of the game, Hyderabad scored 121 runs for 4 wickets in the first innings. Tanmay Agarwal (48) and Ruthvik (11) are at the crease. Openers Tanmay and Abhirath Reddy (32; 3×4, 1×6 off 56 balls) added 60 runs for the first wicket. However, Hyderabad lost 3 wickets in 6 runs and finished with 66/3. Rahul Singh (5), Pragnaya Reddy (0), Himateja (18) failed. Sandeep Sarkar (4/44) excelled among the Tripura bowlers. 

After scoring a century, Karnataka scored 274 runs in the first innings of the Ranji match against Andhra. After winning the toss and batting, Karnataka were 22/4 at the start of the first day. Star players KL Rahul (4), Mayank Agarwal (5), Karun Nair (8) and Anish (0) failed. In this situation, Smaran and Krishnan Sreejith (58) supported the team. The pair put on 111 runs for the fifth wicket as Karnataka recovered to 133/4 at one stage. After Sreejith's dismissal, the team stumbled again at 174/7. But Madhav Bajaj (33) took Smaran's innings forward. Score crossed 200. He completed the century in this sequence. Smaran turned back in the form of the ninth wicket. Saurabh Kumar (3/69), Kavuri Saiteja (2/20) and Shashikant (2/10) tied the opposition. At the end of the game, Andhra was 16/2 in the first innings. Hemanth (1) and Tripurana Vijay (4) were dismissed. 

Paceer Mohammad Shami (4/30), who is hoping for India's comeback (4/30).. showed his power in the Ranji Trophy. Playing for Bengal, he exploded against Delhi. Shami, Amir Ghani (3/45) and Akash Deep (2/74) excelled as Delhi were bowled out for 240 runs in the first innings in Kalyani (Bengal). If Hrithik Shokeen (56), Ayush Doseja (45) and Sarthak (33) did not perform well, Delhi Amatram would not have scored. At one stage, Delhi stood at 148/7.. Hrithik Shokeen fought and the team's score crossed 200. 

Star opener Yashaswi Jaiswal, who was in the Ranji ring to prove his form before the series against New Zealand, failed in the first match. On the first day of the match against Chandigarh, Mumbai batted first. The game ended with 249/5 in the first innings. Opener Yashasvi Jaiswal ducked out. With Musheer Khan (65) and Ayush Mathre (48), the team recovered to 77/1. Even though Ayush turned back... Captain Siddesh Lad (80 batting) and Mushir led the innings. Mumbai, who looked in a better position with 142/2, stood at 144/4. Sarfaraz Khan (1) was dismissed along with Musheer. At the end of the game, Sams Mulani (27) joined Siddesh at the crease. This match is being played in Mumbai.

TIndian all-rounder Ravindra Jadeja (72 batting) shined. He plays for Saurashtra. He scored an unbeaten half-century against Chhattisgarh in the opening match at Rajkot. Prerak Mankad (92 batting) and Chirag Jani (83) excelled and the game ended with Saurashtra 308/4 in the first innings.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Oopevarido in Uppal. Batters are ready to flood the runs. Today is the fourth T20I between India and West Indies at Uppal Stadium, a haven for batting. If Team India is eager to win the series..
  • Shubman, Shefali as ICC's best players Indian ODI and Test captain Shubman Gill. Indian women's team opener Shefali Verma won the ICC 'Best Player' award (for the month of September).
  • Aresina Tanay Hyderabad won the Ranji Trophy. Tanay Thyagarajan (6/52) blasted Tripura by an innings of 40 runs in the Group-B elite match.
  • Yuvraj as Delhi batting coach Team India's former star Yuvraj Singh is ready for key responsibilities in IPL. On Tuesday he was appointed as assistant coach and batting coach of Delhi Capitals.
  • Sindhu, Lakshya out. Indian star shuttler PV Sindhu has left the Denmark Open. She could not pass the first round. Sindhu lost to Yoneli (Germany) 21-13, 23-25, 19-21 in a tight women's singles match on Tuesday.
  • Rajputana's big win Defending champions Rajputana Royals secured a similar victory in the Archery Premier League. The team thrashed Chero Archers 6-0 in Tuesday's clash.
  • 166 Indian athletes for Para Asiad The Union Sports Department has given approval to send 166 athletes to the Para Asian Games. 111 men and 55 women are among the 166 athletes who will participate in the Games, which will begin in Japan on the 18th of this month.
  • Krishan Bahadur's comeback Goalkeeper Krishan Bahadur Pathak made a comeback in the Indian hockey team. Made it to the squad selected for the Asian Champions Trophy.
  • News in Brief (3) Disruption to South Africa on home soil. In the first Test against Australia, the Safari team suffered a heavy defeat by pacer Hazlewood (6/49) by 214 runs.