యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ 0.08 శాతానికి తగ్గించాలి

Eenadu icon
By Business News Desk Published : 12 Oct 2026 03:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ముంబయి: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై, వ్యాపారులు సంబంధిత బ్యాంకులకు చెల్లించాల్సిన రుసుము (ఎండీఆర్‌-మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు)ను 0.40% నుంచి 0.08 శాతానికి తగ్గించాలని ఐఐటీ-బాంబే (ఐఐటీ-బి) ప్రొఫెసర్లు ఆశిష్‌ దాస్, ప్రగ్యా దాస్‌ సిఫారసు చేశారు. బ్యాంకులు ఇప్పటికే తగినన్ని లాభాలు ఆర్జిస్తున్నందున, ఎండీఆర్‌ రూపేణ వసూలు చేస్తున్న మొత్తంలో బ్యాంకులకు వాటా ఇవ్వకూడదని సూచించారు. వారు రూపొందించిన నివేదిక ప్రకారం.. 

  • రూ.2,000కు మించిన వాణిజ్య లావాదేవీలపై విధించాలనుకుంటున్న 0.40% ఎండీఆర్‌ను 0.08 శాతానికి తగ్గించాలి. 
  • ఈ 0.08 శాతంలో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి థర్డ్‌-పార్టీ యాప్‌ ప్రొవైడర్ల (టీపీఏపీ)కు 0.06%, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (పీఎస్‌పీ)కు 0.02% అందించాలి. బ్యాంకులకు ఏమీ ఇవ్వనవసరం లేదు.

బ్యాంకులకు వాటా ఎందుకొద్దంటే..

కాసా (కరెంట్‌ ఖాతా, పొదుపు ఖాతా) డిపాజిట్ల ద్వారా 2025-26లో బ్యాంకులు రూ.4.85 లక్షల కోట్ల నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) ఆర్జించాయి. ఇదంతా డిపాజిటర్ల నిధుల నుంచే లభించాయి.

  • యూపీఐ వ్యవస్థను నడపడానికి, మెరుగుపర్చడానికి ఈ నిధుల నుంచి 3% (రూ.15,000 కోట్లు) కేటాయించాలి. అంతేకానీ ఈ సేవల కోసం ఎండీఆర్‌ రాబడిపై ఆధారపడకూడదు. 
  • కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ (సీబీఎస్‌) లాగే యూపీఐని కూడా బ్యాంకులు తప్పనిసరిగా అందించాల్సిన ఒక ప్రాథమిక సేవగా మార్చే ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ప్రభుత్వం పరిశీలించాలి. 

ఇతర ముఖ్య సిఫార్సులు 

  • యూపీఐ లావాదేవీపై గరిష్ఠ ఎండీఆర్‌ రూ.40 మించకూడదు. అమల్లోకి రానున్న పద్ధతిలో ఈ గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంది. 
  • వార్షిక టర్నోవర్‌ రూ.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యాపారులకే యూపీఐ ఎండీఆర్‌ నియమాలు పరిమితం చేయాలి. 
  • డిజిటల్‌ చెల్లింపులు సులభంగా అందుబాటులో ఉన్నందున, ఏటీఎం ఉచిత విత్‌డ్రా పరిమితులను ఆర్‌బీఐ పునస్సమీక్షించాలి. 
  • క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదార్ల భారం సాధారణ యూపీఐ వినియోగదార్లపై పడకుండా ఉండటానికి, క్రెడిట్‌ కార్డ్‌ ఎండీఆర్‌ని తగ్గించాలి.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్‌ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధింపు నిర్ణయాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వాయిదా వేసింది.
  • మూలధన లాభాల పన్నుపై చర్చకు సిద్ధం స్వల్ప-దీర్ఘకాల మూలధన లాభాలపై విధిస్తున్న పన్ను తొలగింపునకు సంబంధించి, రాబోయే బడ్జెట్‌ సంప్రదింపుల్లో సలహాలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.
  • బలంగా పుంజుకున్న సూచీలు ఐటీ షేర్లు పరుగులు తీయడంతో, సోమవారం చవిచూసిన భారీ నష్టాల నుంచి సూచీలు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఐటీ, ఆర్థిక, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. రూపాయి కోలుకోవడం, మూలధన లాభాల పన్నుపై సూచనలు పరిశీలిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి.
  • చిప్‌ సరఫరాలో కీలకం అవుతాం మనదేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకం కానున్నాయని.. దేశంలో ప్రతిభావంతుల లభ్యత, భారీ దేశీయ మార్కెట్, అంతర్జాతీయ భాగస్వామ్యాల రీత్యా ప్రపంచ సరఫరా వ్యవస్థలో ముఖ్య కేంద్రంగా మన దేశం అవతరిస్తుందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు.
  • విపణిలోకి సైకిల్‌ బ్రాండ్‌ నూతన ఉత్పత్తులు పూజా సామగ్రి, అగరుబత్తీల తయారీ సంస్థ సైకిల్‌ ప్యూర్‌ అగర్‌బత్తీ, మార్కెట్లోకి నూతన ఉత్పత్తులను తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో సంస్థ ఎండీ, సీఈఓ అర్జున్‌ రంగా వీటిని విపణిలోకి విడుదల చేశారు.
  • జేఎస్‌డబ్ల్యూ ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ కారును మంగళవారం జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ విడుదల చేసింది. దీని ధర రూ.17.89 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 38 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ కలిగిన ఈ కారు, పూర్తి ఛార్జింగ్‌తో 332 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
  • రూ.20.23 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల ఆమోదం కోసం సిఫారసు రహదార్లు, రైల్వేలు సహా వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు రూ.20.23 లక్షల కోట్ల విలువైన 400కు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీఎం గతిశక్తి కార్యక్రమం కింద ఆమోదం కోసం నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూపు (ఎన్‌పీజీ) సిఫారసు చేసింది.
  • 17 వరకు సౌదీకి భారత విమానాలు రద్దు సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఈనెల 17 వరకు రద్దు చేస్తున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్‌ ప్రకటించాయి.
  • ఎల్‌ఐసీ నుంచి కొత్తగా 3 పాలసీలు బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మూడు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం, కుటుంబ ఆరోగ్య రక్షణ, క్యాన్సర్‌ చికిత్స సమయంలో ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకాల ప్రధాన లక్ష్యం.
  • ఏఐ హార్డ్‌వేర్‌ తయారీకి జాబిల్‌ - అదానీ సంయుక్త సంస్థ మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్‌ పరికరాల తయారీ ప్లాంటును 50:50 భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని అమెరికా సంస్థ జాబిల్, గౌతమ్‌ అదానీ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్ణయించాయి.
  • 2026-27లో భారత్‌ వృద్ధి 7%: ఐఎంఎఫ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. జులైలో అంచనా వేసిన 6.4% కంటే ఇది 0.6% అధికం కావడం గమనార్హం.
  • సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండదు అమెరికాలో తమ ఉద్యోగులకు గ్రీన్‌ కార్డ్‌ కోసం స్పాన్సర్‌ చేయకుండా అమెరికా తాత్కాలికంగా విధించిన ఆంక్షల వల్ల, సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని విప్రో స్పష్టం చేసింది.
  • ఎయిర్‌బస్‌ విమానాల కొనుగోలుకు సిటీతో రూ.3,200 కోట్లకు ఇండిగో ఒప్పందం దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, 8 ఎయిర్‌బస్‌ విమానాల కొనుగోలు నిమిత్తం అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీతో 328 మి. డాలర్ల (సుమారు రూ.3200 కోట్లు) రుణ ఒప్పందంపై సంతకాలు చేసింది.
  • ఇన్ఫీ ఆదాయాల్లో సగం ఏఐ సేవలే అందిస్తాయ్‌ ఇన్ఫోసిస్‌ ఆదాయాల్లో ఏఐ (కృత్రిమమేధ) సేవల వాటా గత త్రైమాసికంలో 8 శాతానికి పైగా నమోదైందని.. జూన్‌ త్రైమాసికం కంటే రెండంకెల వృద్ధిని ఇది సాధించిందని కంపెనీ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు.
  • సంక్షిప్త వార్తలు (8) కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల ఖర్చులు భారీగా పెరగడం, సాఫ్ట్‌వేర్‌ రంగ భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొనడం లాంటి కారణాలను చూపుతూ వార్షిక వేతన పెంపులను నిలిపేసి, మార్కెటింగ్‌ వ్యయాలను జోహో కార్పొరేషన్‌ తగ్గించుకుందని..

English Translation

MDR on UPI transactions should be reduced to 0.08 percent

Eenadu icon
By Business News Desk Published : 12 Oct 2026 03:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Mumbai: Unified Payments Interface (UPI) Commercial On transactions, IIT-Bombay (IIT-B) professors Ashish Das and Pragya Das recommended reducing the fee (MDR-Merchant Discount Rate) payable by the merchants to the respective banks from 0.40% to 0.08%. As the banks are already making enough profits, MDR Rupena suggested that the banks should not be given a share of the amount collected. According to their report..

  • The proposed 0.40% MDR on commercial transactions above Rs 2,000 should be reduced to 0.08 percent. 
  • Of this 0.08 percent, 0.06% should be given to Third-Party App Providers (TPAP) like PhonePay, GooglePay, and 0.02% to Payment Service Providers (PSP). Banks don't have to give anything.

Why should banks get a share..

Banks have earned a net interest margin (NIM) of Rs 4.85 lakh crore in 2025-26 through CASA (current account, savings account) deposits. All this was obtained from the funds of the depositors.

  • 3% (Rs. 15,000 crores) should be allocated from these funds to run and improve the UPI system. Also MDR revenue should not be relied upon for these services. 
  • The Reserve Bank of India (RBI) and the government should consider the proposal to make UPI a basic service that banks must provide, like Core Banking Solutions (CBS). 

Other Key Recommendations

  • Maximum MDR on UPI transaction should not exceed Rs.40. This maximum limit is Rs.300 as per the scheme to come into force. 
  • UPI MDR rules should be limited to merchants with an annual turnover of Rs.50 crore or more. 
  • With easy availability of digital payments, RBI should review ATM free withdrawal limits. 
  • Credit card MDR should be reduced so that the burden of credit card users does not fall on common UPI users.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no need for correspondence in this regard.

More

  • Deferral of MDR on UPI commercial transactions exceeding Rs.2,000 National Payments Corporation of India (NPCI) has postponed the decision to levy Merchant Discount Rate (MDR) on Unified Payments Interface (UPI) commercial transactions above Rs.2,000.
  • Ready for discussion on Capital Gains Tax Finance Minister Nirmala Sitharaman has said that the government is ready to listen to suggestions in the upcoming budget consultations regarding the removal of tax on short-term capital gains.
  • Indices rebound strongly. Indices rebounded strongly on Tuesday from Monday's heavy losses as IT stocks took a run. IT, financials and FMCG stocks were buoyed by buying. Finance Minister Nirmala Sitharaman's comments that we will consider suggestions on rupee recovery and capital gains tax have had a positive effect.
  • We will be key in chip supply. Tata Sons Chairman N Chandrasekaran said that Semiconductors will be the key to our country's future.. Due to the availability of talents in the country, huge domestic market and international partnerships, our country will become an important center in the global supply system. Cycle Pure Agarbatti, a puja equipment and incense stick manufacturer, has brought new products to the market. Company MD and CEO Arjun Ranga released these in the market in a meeting held in Hyderabad on Tuesday.
  • JSW MG Windsor Indulge. MG Windsor Indulge was launched by JSW MG Motor on Tuesday. It is priced at Rs 17.89 lakh (ex-showroom). The company said that this car with a 38 kilowatt battery pack will travel 332 kilometers on a full charge.
  • Recommendation for approval of infrastructure projects worth Rs.20.23 lakh crore The Network Planning Group (NPG) has recommended over 400 infrastructure projects worth around Rs 20.23 lakh crore under various ministries including roads and railways for approval under PM's Gati Shakti programme.
  • Cancelation of Indian flights to Saudi Arabia till 17 Domestic airlines Indigo, Air India, Air India Express and Akasha Air have announced that they are canceling flights to major cities in Saudi Arabia till the 17th of this month.
  • 3 new policies from LIC Insurance giant Life Insurance Corporation of India (LIC) has introduced three new insurance plans. The main objective of these schemes is to provide stable income after retirement, family health care and financial security during cancer treatment.
  • Jabil - Adani joint venture to manufacture AI hardware. American firm Jabil and Gautam Adani's Adani Enterprises have decided to set up a 50:50 joint venture manufacturing plant for artificial intelligence (AI) and data center equipment in our country.
  • India's growth to grow by 7% in 2026-27: IMF The International Monetary Fund (IMF) has estimated that India's growth rate in the current financial year (2026-27) could be 7 percent. Notably, this is 0.6% higher than July's forecast of 6.4%.
  • There will be no impact on the firm. Wipro has clarified that there will be no negative impact on the company due to the temporary restrictions imposed by the US on not sponsoring its employees for green cards in the US. IndiGo, the country's largest airline, signed an agreement with international banking giant Citi for the purchase of 8 Airbus aircraft for Rs 328 crore. Dollars (about Rs.3200 crores) loan agreement.
  • Half of Infi's revenue comes from AI services. The share of AI (artificial intelligence) services in Infosys' revenues was recorded at over 8 percent in the last quarter. Salil Parekh, MD, CEO of the company stated that it has achieved double digit growth over the June quarter.
  • News in Brief (8) Zoho Corporation has halted annual salary hikes and cut marketing costs, citing soaring costs of artificial intelligence (AI) infrastructure and uncertainty over the future of the software industry..