పండగ విక్రయాలకు ‘జోష్’

- A
- A+
- A++

దసరా పండగ అంటేనే కొత్త దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, నూతన వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ సీజన్లో విక్రయాలు భారీగా పెంచుకునేందుకు కంపెనీలు, విక్రయశాలలు, ఇ-కామర్స్ సంస్థలు కూడా బ్యాంకులతో కలిసి, విడిగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈనెల 9 నుంచి ఇ-కామర్స్ సంస్థలు రాయితీ విక్రయాలు ప్రారంభించగా, తొలి రెండు రోజుల్లోనే దాదాపు రూ.24,000 కోట్ల విలువైన వస్తువులను విక్రయించాయని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేసింది. విలువపరంగా మొబైల్ ఫోన్లు అగ్రస్థానంలో నిలిచాయని తెలిపింది.
8-9 కోట్ల ఆర్డర్లు:అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, అజియో సహా అన్ని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో కలిపి వినియోగదారులు దాదాపు 8-9 కోట్ల ఆర్డర్లు పెట్టారని అంచనా. ఈ కొనుగోళ్లు చేసిన 6- 6.5 కోట్ల మంది వినియోగదారుల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది ద్వితీయ శ్రేణి, గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. తొలిరోజు షాపింగ్ చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది జెన్-జీ యువతే. గతేడాదితో పోలిస్తే తొలిసారి ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారి సంఖ్య రెట్టింపైంది. ఈ సీజన్ మొదటి విడత 11 రోజుల విక్రయాల్లో, మొత్తం 10 కోట్ల మంది కొనుగోళ్లు చేస్తారని అంచనా.
విభాగాల వారీగా విక్రయాలు ఇలా..
- మొత్తం అమ్మకాల విలువలో 38-40% వాటా మొబైళ్లదే. వీటి విక్రయాల విలువ రూ.9100- 9600 కోట్లుగా నమోదైంది.
- కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వాటా 25-27% (దాదాపు రూ.6000- 6500 కోట్లు)గా ఉంది. పెద్ద గృహోపకరణాల్లో టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీ) వాటా మూడింట రెండొంతులుగా నమోదైంది. టీసీఎల్, ఎల్జీ, శామ్సంగ్, షియామీ బ్రాండ్లకు చెందిన 55 అంగుళాల తెర కలిగిన టీవీలు, అగ్రశ్రేణి మోడళ్లలో 75 శాతానికి పైగా అమ్ముడయ్యాయి. సాధారణ రోజుల కంటే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 14 రెట్ల అధిక ఆర్డర్లు వచ్చాయి. ల్యాప్‌టాప్‌లు, ఐఓటీ పరికరాలూ ముందంజలో ఉన్నాయి.
- మొత్తం స్థూల వస్తువిలువ (జీఎంవీ)లో ఫ్యాషన్-లైఫ్‌స్టైల్ వాటా 15-18% (రూ.3630- 4350 కోట్లు). వార్షిక ప్రాతిపదికన ఈ విభాగం 22-25% వృద్ధి నమోదుచేసింది.
- సాధారణ రోజువారీ సగటుతో పోలిస్తే క్విక్ కామర్స్ విభాగంలో 4-5 రెట్లు అధిక జీఎంవీ నమోదైంది.
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కెనరా బ్యాంకు లాభం రూ.5,175 కోట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,175 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.4,774 కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.38,598 కోట్ల నుంచి రూ.40,931 కోట్లకు పెరిగింది.
- సంక్షిప్త వార్తలు(4) రెడీ టూ డ్రింక్ డెయిరీ విభాగంలోకి రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ అడుగుపెట్టింది. జాయ్‌ల్యాండ్ బ్రాండ్ పేరిట ప్యాకేజ్డ్ ఫ్లేవర్డ్ మిల్క్‌ను విడుదల చేసింది. స్ట్రాబెర్రీ, వెనిలా ఫ్లేవర్లతో తమిళనాడు మార్కెట్లో తొలుత విడుదల చేయగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
- చైనాతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు యత్నం చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడానికి మనదేశం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. సహేతుక ఒప్పందం లభించే పక్షంలో, ఏ దేశంతో నైనా ఉమ్మడి వ్యాపార భాగస్వామ్యాలకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
- ఏఐని నెమ్మదింపజేయలేం కృత్రిమ మేధ (ఏఐ) వేగాన్ని నెమ్మదింపజేయడానికి చేపట్టే ఏ చర్య అయినా ఫలించక పోవచ్చని సిస్కో ఛైర్మన్, సీఈఓ చుక్ రాబిన్స్ అభిప్రాయపడ్డారు. అందుకు బదులుగా భద్రత, రక్షణ కవచాలను బలోపేతం చేసే సాంకేతికతపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు.
- రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది.
- మూలధన లాభాల పన్నుపై చర్చకు సిద్ధం స్వల్ప-దీర్ఘకాల మూలధన లాభాలపై విధిస్తున్న పన్ను తొలగింపునకు సంబంధించి, రాబోయే బడ్జెట్ సంప్రదింపుల్లో సలహాలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- బలంగా పుంజుకున్న సూచీలు ఐటీ షేర్లు పరుగులు తీయడంతో, సోమవారం చవిచూసిన భారీ నష్టాల నుంచి సూచీలు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఐటీ, ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. రూపాయి కోలుకోవడం, మూలధన లాభాల పన్నుపై సూచనలు పరిశీలిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి.
- చిప్ సరఫరాలో కీలకం అవుతాం మనదేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకం కానున్నాయని.. దేశంలో ప్రతిభావంతుల లభ్యత, భారీ దేశీయ మార్కెట్, అంతర్జాతీయ భాగస్వామ్యాల రీత్యా ప్రపంచ సరఫరా వ్యవస్థలో ముఖ్య కేంద్రంగా మన దేశం అవతరిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
- విపణిలోకి సైకిల్ బ్రాండ్ నూతన ఉత్పత్తులు పూజా సామగ్రి, అగరుబత్తీల తయారీ సంస్థ సైకిల్ ప్యూర్ అగర్బత్తీ, మార్కెట్లోకి నూతన ఉత్పత్తులను తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో సంస్థ ఎండీ, సీఈఓ అర్జున్ రంగా వీటిని విపణిలోకి విడుదల చేశారు.
- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎంజీ విండ్సర్ ఇండల్జ్ కారును మంగళవారం జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ విడుదల చేసింది. దీని ధర రూ.17.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు, పూర్తి ఛార్జింగ్‌తో 332 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
- రూ.20.23 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల ఆమోదం కోసం సిఫారసు రహదార్లు, రైల్వేలు సహా వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు రూ.20.23 లక్షల కోట్ల విలువైన 400కు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీఎం గతిశక్తి కార్యక్రమం కింద ఆమోదం కోసం నెట్వర్క్ ప్లానింగ్ గ్రూపు (ఎన్పీజీ) సిఫారసు చేసింది.
- 17 వరకు సౌదీకి భారత విమానాలు రద్దు సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఈనెల 17 వరకు రద్దు చేస్తున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రకటించాయి.
- ఎల్ఐసీ నుంచి కొత్తగా 3 పాలసీలు బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మూడు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం, కుటుంబ ఆరోగ్య రక్షణ, క్యాన్సర్ చికిత్స సమయంలో ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకాల ప్రధాన లక్ష్యం.
- ఏఐ హార్డ్‌వేర్ తయారీకి జాబిల్ - అదానీ సంయుక్త సంస్థ మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్ పరికరాల తయారీ ప్లాంటును 50:50 భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని అమెరికా సంస్థ జాబిల్, గౌతమ్ అదానీ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ నిర్ణయించాయి.
- 2026-27లో భారత్ వృద్ధి 7%: ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. జులైలో అంచనా వేసిన 6.4% కంటే ఇది 0.6% అధికం కావడం గమనార్హం.
- సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండదు అమెరికాలో తమ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ కోసం స్పాన్సర్ చేయకుండా అమెరికా తాత్కాలికంగా విధించిన ఆంక్షల వల్ల, సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని విప్రో స్పష్టం చేసింది.
- ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు సిటీతో రూ.3,200 కోట్లకు ఇండిగో ఒప్పందం దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, 8 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు నిమిత్తం అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీతో 328 మి. డాలర్ల (సుమారు రూ.3200 కోట్లు) రుణ ఒప్పందంపై సంతకాలు చేసింది.
- ఇన్ఫీ ఆదాయాల్లో సగం ఏఐ సేవలే అందిస్తాయ్ ఇన్ఫోసిస్ ఆదాయాల్లో ఏఐ (కృత్రిమమేధ) సేవల వాటా గత త్రైమాసికంలో 8 శాతానికి పైగా నమోదైందని.. జూన్ త్రైమాసికం కంటే రెండంకెల వృద్ధిని ఇది సాధించిందని కంపెనీ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు.
- సంక్షిప్త వార్తలు (8) కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల ఖర్చులు భారీగా పెరగడం, సాఫ్ట్వేర్ రంగ భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొనడం లాంటి కారణాలను చూపుతూ వార్షిక వేతన పెంపులను నిలిపేసి, మార్కెటింగ్ వ్యయాలను జోహో కార్పొరేషన్ తగ్గించుకుందని..
English Translation
Josh' for festival sales

- A
- A+
- A++

TheSara Festival means buying new clothes, electronic devices, and new vehicles. do In order to increase the sales in this season, companies, sales outlets and e-commerce companies are also announcing offers separately along with banks. Redseer Strategy Consultants, a consultancy firm, estimated that the e-commerce companies started discount sales from the 9th of this month, and in the first two days, they sold goods worth Rs.24,000 crore. In terms of value, mobile phones are at the top.
8-9 crore orders:It is estimated that consumers placed around 8-9 crore orders on all e-commerce platforms including Amazon, Flipkart, Meesho, Ajio. Almost two-thirds of the 6-6.5 crore consumers who made these purchases are from the second tier and rural areas. About a third of those who shopped on the first day were Gen-Z youths. Compared to last year, the number of first-time online buyers has doubled. In the first phase of this season, in 11 days of sales, a total of 10 crore people are expected to make purchases.
segment wise sales like..
- Mobiles account for 38-40% of total sales value. The sales value of these is recorded at Rs.9100-9600 crores.
- The share of consumer electronics is 25-27% (about Rs.6000-6500 crores). TVs, refrigerators and air conditioners (AC) accounted for two-thirds of the major home appliances. TVs with 55-inch screens from TCL, LG, Samsung and Xiaomi brands accounted for more than 75 percent of the top-end models sold. Electronics department received 14 times more orders than normal days. Laptops and IoT devices are also at the forefront.
- Fashion-lifestyle accounts for 15-18% (Rs. 3630- 4350 crores) in total gross merchandise value (GMV). This segment has registered a growth of 22-25% on annual basis.
- Quick Commerce segment recorded 4-5 times higher GMV compared to normal daily average.
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Canara Bank profit Rs.5,175 crore Public sector Canara Bank posted a net profit of Rs 5,175 crore for the September quarter. This is 8.4% higher than the profit of Rs.4,774 crore for the same period of 2025-26. During the same period the total income increased from Rs.38,598 crores to Rs.40,931 crores.
- News Brief(4) Reliance Consumer Products has entered the ready-to-drink dairy segment. Joyland launched packaged flavored milk under the brand name. Initially released in the Tamil Nadu market with strawberry and vanilla flavors, it will soon be expanded across the country.
- Effort to restore trade relations with China Union Commerce and Industry Minister Piyush Goyal said that our country is working hard to restore trade relations with China. He revealed that India is open to joint business partnerships with any country if a reasonable agreement is reached.
- AI cannot be slowed down. Any move to slow down the pace of artificial intelligence (AI) may be futile, Cisco Chairman and CEO Chuck Robbins believes. Instead, it is suggested that it is better to focus on technology that strengthens security and defenses.
- Postponement of MDR on UPI commercial transactions exceeding Rs. National Payments Corporation of India (NPCI) has postponed the decision to levy Merchant Discount Rate (MDR) on Unified Payments Interface (UPI) commercial transactions above Rs.2,000.
- Ready for discussion on Capital Gains Tax Finance Minister Nirmala Sitharaman has said that the government is ready to listen to suggestions in the upcoming budget consultations regarding the removal of tax on short-term capital gains.
- Indices rebound strongly. Indices rebounded strongly on Tuesday from Monday's heavy losses as IT stocks took a run. IT, financials and FMCG stocks were buoyed by buying. Finance Minister Nirmala Sitharaman's comments that we will consider suggestions on rupee recovery and capital gains tax have had a positive effect.
- We will be key in chip supply. Tata Sons Chairman N Chandrasekaran said that Semiconductors will be the key to our country's future.. Due to the availability of talents in the country, huge domestic market and international partnerships, our country will become an important center in the global supply system. Cycle Pure Agarbatti, a puja equipment and incense stick manufacturer, has brought new products to the market. Company MD and CEO Arjun Ranga released these in the market in a meeting held in Hyderabad on Tuesday.
- JSW MG Windsor Indulge. MG Windsor Indulge was launched by JSW MG Motor on Tuesday. It is priced at Rs 17.89 lakh (ex-showroom). The company said that this car with a 38 kilowatt battery pack will travel 332 kilometers on a full charge.
- Recommendation for approval of infrastructure projects worth Rs.20.23 lakh crore The Network Planning Group (NPG) has recommended over 400 infrastructure projects worth around Rs 20.23 lakh crore under various ministries including roads and railways for approval under PM's Gati Shakti programme.
- Cancelation of Indian flights to Saudi Arabia till 17 Domestic airlines Indigo, Air India, Air India Express and Akasha Air have announced that they are canceling flights to major cities in Saudi Arabia till the 17th of this month.
- 3 new policies from LIC Insurance giant Life Insurance Corporation of India (LIC) has introduced three new insurance plans. The main objective of these schemes is to provide stable income after retirement, family health care and financial security during cancer treatment.
- Jabil - Adani joint venture to manufacture AI hardware. American firm Jabil and Gautam Adani's Adani Enterprises have decided to set up a 50:50 joint venture manufacturing plant for artificial intelligence (AI) and data center equipment in our country.
- India's growth to grow by 7% in 2026-27: IMF The International Monetary Fund (IMF) has estimated that India's growth rate in the current financial year (2026-27) could be 7 percent. Notably, this is 0.6% higher than July's forecast of 6.4%.
- There will be no impact on the firm. Wipro has clarified that there will be no negative impact on the company due to the temporary restrictions imposed by the US on not sponsoring its employees for green cards in the US. IndiGo, the country's largest airline, signed an agreement with international banking giant Citi for the purchase of 8 Airbus aircraft for Rs 328 crore. Dollars (about Rs.3200 crores) loan agreement.
- Half of Infi's revenue comes from AI services. Company CEO, MD Salil Parekh stated that the share of AI (artificial intelligence) services in Infosys' revenues was over 8 percent in the last quarter, a double-digit growth compared to the June quarter.
- News in brief (8) Zoho Corporation has halted annual salary hikes and cut marketing costs, citing soaring costs of artificial intelligence (AI) infrastructure and uncertainty over the future of the software industry..