రవితేజ కథానాయకుడిగా... తులాభారం

- A
- A+
- A++

రాజకీయం, కుట్ర, కుతంత్రాలతో కూడిన ఓ కథ... పద్మవ్యూహాన్ని తలపించేలా ఎన్నో చిక్కుముళ్లున్న ఓ నేర పరిశోధన కథ... భార్య ప్రేమ కోసం తపిస్తున్న ఓ భర్త కథ... కుటుంబం కోసం బయటికొచ్చిన మరొక అమ్మాయి కథ... ఇన్ని కథల్ని ఇముడ్చుకున్న ఓ సినిమానే ‘తులాభారం’. నవ రవితేజము... అంటూ కథానాయకుడు రవితేజను కొత్తగా ఆవిష్కరించనున్న ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, తరుణ్‌భాస్కర్ కీలక పాత్రధారులు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైందీ చిత్రం. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు శ్రీవిష్ణు క్లాప్‌నివ్వగా, చందు కెమెరా స్విచ్చాన్ చేశారు.
దర్శకులు శివ నిర్వాణ, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శైలేశ్ కొలను, విష్వక్, హసిత్ గోలి తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరయ్యారు. ఈ సినిమా పేరుతో కూడిన ప్రత్యేకమైన డాక్యుమెంటరీని ఈ వేడుకలో మై హోమ్ రామ్ విడుదల చేశారు. సినిమా కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేసిందా డాక్యుమెంటరీ. ‘ఇరుముడి’తో ఘన విజయాన్ని అందుకున్న రవితేజ ఇందులో క్రైమ్ మహారాజాగా సందడి చేయనున్నారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘‘నేను తీసిన ‘అంటే... సుందరానికి!’ విడుదల తర్వాత ‘మేం కామెడీ ఆశించాం, కానీ, ఇందులో డ్రామా ఎక్కువగా ఉంది’ అన్నారు. ‘సరిపోదా శనివారం’నకు ముందేమో ‘ఇది సూపర్‌హీరో సినిమా’ అన్నారు. అందుకే ఈసారి నేను ఏం సినిమా చేయబోతున్నానో స్పష్టంగా చూపించాలనే టైటిల్ డాక్యుమెంటరీ చేశా’’ అన్నారు. అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్, కూర్పు: రవితేజ గిరిజాల, కళ: జి.ఎం.శేఖర్.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 03:47 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రామోజీ ఫిల్మ్ సిటీలో డ్రాగన్ యాక్షన్ ‘డ్రాగన్’ అవతారంలో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
- జయమ్మ పాత్ర ప్రేరణతో… 400 కుటుంబాలకు సాయం! ‘రణబాలి’ సినిమాలో పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో కథానాయిక రష్మిక 400 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
- హిందీలో... ఓ ప్రేమకథతో! తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న కృతిశెట్టి త్వరలోనే హిందీలో కథానాయికగా పూర్తిస్థాయి చిత్రం చేయబోతున్నారు.
- బాధ్యతలు చేపట్టిన సావిత్రి ‘‘అబ్జెక్షన్ ఓవర్‌రూల్డ్..! సావిత్రి బాధ్యతలు చేపట్టారు.. అది కూడా అద్భుతమైన శైలిలో’’ అంటూ ‘సత్యవాన్ సావిత్రి’ ప్రపంచాన్ని పరిచయం చేసింది చిత్రబృందం.
- రెండున్నరేళ్ల తర్వాత తాము నమ్మిన కథల కోసం కథానాయకులు ఎంతైనా శ్రమిస్తుంటారు. ఎన్ని రోజులు కేటాయించడానికైనా వెనకాడరు.
- అమ్మ కదిలి వచ్చేనమ్మా నవరాత్రి ఉత్సవాలతో ముడిపడిన అమ్మవారి గీతంతో ‘భరతవర్ష’ సినిమా సంగీత ప్రచారం ఊపందుకుంది.
- దశావతారాల గుడి నేపథ్యంలో... హైందవ ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్‌గా ప్రత్యేకమైన అనుభవాన్ని పంచే సినిమాలు ఎంతో ముఖ్యం.
- హృదయం నిండుగా కథానాయకుడు ప్రభాస్ పంపిన విందు భోజనాన్ని చూపుతూ ‘హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా...’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు కథానాయిక ఇమాన్వి.
- సంక్షిప్త వార్తలు (4) విభిన్నమైన జానర్లలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఎప్పటికప్పుడూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు కథానాయిక కృతిసనన్.
- రామ్‌చరణ్ కోసం... రంగంలోకి దిగేదెవరో? రామ్‌చరణ్ - సుకుమార్ కలయికలో సినిమా పట్టాలెక్కేందుకు ఇంకాస్త సమయం ఉంది కానీ, పూర్వ నిర్మాణ పనులకు సంబంధించిన పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ‘రంగస్థలం’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఎప్పట్నుంచో కొనసాగుతూ వచ్చాయి.
- నవ్విస్తూ.. సందేశమిచ్చే సినిమా శివాజీ ప్రధాన పాత్రధారిగా బాలాజీ వీఆర్ దర్శకత్వంలో ‘ఎం3’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎస్.టి.బి.ఎల్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. రవికృష్ణ, భరణ్, ఖుష్బూ, కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- ఆ పరీక్షలన్నీ దాటి సక్సెస్ అయ్యాడు మా బ్యాచిలర్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కేవలం నవ్వించే సిరీస్ మాత్రమే కాదు. ఆలోచింపజేస్తుంది.. విలువల గురించి చెప్తుంది. జీవితం, ఆత్మన్యూనతల గురించి చర్చిస్తుంది’’ అన్నారు నటుడు హర్ష చెముడు.
- ఈ పండక్కి స్వీట్ లాంటి చిత్రం మాది ఆద్యంతం నవ్విస్తూ.. అందర్నీ అలరించే సినిమా ‘క్రేజీ కళ్యాణం’’ అన్నారు హీరో అఖిల్ రాజ్. ఇప్పుడాయన.. అనుపమ పరమేశ్వరన్, నరేశ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని భద్రప్ప గాజుల తెరకెక్కించారు.
- బర్త్‌డేకి ‘కింగ్’ టీజర్ ట్రీట్! దాదాపు మూడేళ్ల తర్వాత ‘కింగ్’ సినిమాతో తెరపై సందడి చేయనున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఆయన కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
- ఆది.. డివైన్ మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు హీరో ఆది సాయికుమార్. ఇప్పుడాయన మరో ఆసక్తికర డివైన్ మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నవరసన దర్శకత్వంలో ముస్తాబు కానున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్ జి.రుద్రప్ప నిర్మిస్తున్నారు.
- మా సంస్థలో ఓ కొత్త ప్రయత్నం ‘‘గరివిడి లక్ష్మి’ చాలా మంచి సినిమా. ఇది థియేటర్లో ఎక్కువ రోజులు ఆడుతుందని నమ్ముతున్నా’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆయన నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది టైటిల్ పాత్ర పోషించారు.
- డెవిల్ అలియాస్ రుక్మిణి నితిన్ సరసన నటిస్తున్న కథానాయిక ఎవరో బయట పెట్టింది ‘అలియాస్ రుక్మిణీ’ చిత్రబృందం. బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్... రుక్మిణి పాత్రలో సందడి చేయనున్నారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో..
- ‘ది డర్టీ పిక్చర్ 2’లో ఇద్దరిలో ఎవరు? ఒకవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు యువతను విశేషంగా ఆకట్టుకునే ప్రత్యేక గీతాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తారు కథానాయిక తమన్నా. ఇటీవలే ‘ది వీవాన్’ చిత్రంలో నటించారు.
- తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా... ‘రణబాలి’ పండగ మొదలైంది. అందరూ ఆ ఆనందంలో ఉన్నాం. మరో మూడు రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా ‘రణబాలి’ సినిమా వస్తోంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా..
- బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ నటుడు మిట్టే ఆత్మహత్య! టెలివిజన్ హిట్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ సహనటుడు ఆర్.జె.మిట్టే(34) కన్నుమూశారు. సోమవారం టెక్సాస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు అమెరికా వినోద పరిశ్రమకు చెందిన ఓ సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.