నవంబరు 5న ‘రామాయణ’

Eenadu icon
By Cinema Desk Published : 12 Oct 2026 03:48 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

సినీప్రియులందరి దృష్టి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్న ‘రామాయణ’ చిత్రం మీదే. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాముని పాత్రలో బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. రావణుడిగా హీరో యశ్‌ నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. దీన్ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించినా.. తేదీని ఇంకా ఖరారు చేయలేదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమాని నవంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది చిత్రబృందం. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా మరో కొత్త పోస్టర్‌ను పంచుకుంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని యశ్, నమిత్‌ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రామోజీ ఫిల్మ్‌ సిటీలో డ్రాగన్‌ యాక్షన్‌ ‘డ్రాగన్‌’ అవతారంలో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నారు.
  • జయమ్మ పాత్ర ప్రేరణతో… 400 కుటుంబాలకు సాయం! ‘రణబాలి’ సినిమాలో పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో కథానాయిక రష్మిక 400 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
  • హిందీలో... ఓ ప్రేమకథతో! తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న కృతిశెట్టి త్వరలోనే హిందీలో కథానాయికగా పూర్తిస్థాయి చిత్రం చేయబోతున్నారు.
  • బాధ్యతలు చేపట్టిన సావిత్రి ‘‘అబ్జెక్షన్‌ ఓవర్‌రూల్డ్‌..! సావిత్రి బాధ్యతలు చేపట్టారు.. అది కూడా అద్భుతమైన శైలిలో’’ అంటూ ‘సత్యవాన్‌ సావిత్రి’ ప్రపంచాన్ని పరిచయం చేసింది చిత్రబృందం.
  • రెండున్నరేళ్ల తర్వాత తాము నమ్మిన కథల కోసం కథానాయకులు ఎంతైనా శ్రమిస్తుంటారు. ఎన్ని రోజులు కేటాయించడానికైనా వెనకాడరు.
  • అమ్మ కదిలి వచ్చేనమ్మా నవరాత్రి ఉత్సవాలతో ముడిపడిన అమ్మవారి గీతంతో ‘భరతవర్ష’ సినిమా సంగీత ప్రచారం ఊపందుకుంది.
  • దశావతారాల గుడి నేపథ్యంలో... హైందవ ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్‌గా ప్రత్యేకమైన అనుభవాన్ని పంచే సినిమాలు ఎంతో ముఖ్యం.
  • హృదయం నిండుగా కథానాయకుడు ప్రభాస్‌ పంపిన విందు భోజనాన్ని చూపుతూ ‘హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా...’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు కథానాయిక ఇమాన్వి.
  • సంక్షిప్త వార్తలు (4) విభిన్నమైన జానర్‌లలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఎప్పటికప్పుడూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు కథానాయిక కృతిసనన్‌.
  • రామ్‌చరణ్‌ కోసం... రంగంలోకి దిగేదెవరో? రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కలయికలో సినిమా పట్టాలెక్కేందుకు ఇంకాస్త సమయం ఉంది కానీ, పూర్వ నిర్మాణ పనులకు సంబంధించిన పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ‘రంగస్థలం’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు ఎప్పట్నుంచో కొనసాగుతూ వచ్చాయి.
  • నవ్విస్తూ.. సందేశమిచ్చే సినిమా శివాజీ ప్రధాన పాత్రధారిగా బాలాజీ వీఆర్‌ దర్శకత్వంలో ‘ఎం3’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎస్‌.టి.బి.ఎల్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. రవికృష్ణ, భరణ్, ఖుష్బూ, కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
  • ఆ పరీక్షలన్నీ దాటి సక్సెస్‌ అయ్యాడు మా బ్యాచిలర్‌ లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ కేవలం నవ్వించే సిరీస్‌ మాత్రమే కాదు. ఆలోచింపజేస్తుంది.. విలువల గురించి చెప్తుంది. జీవితం, ఆత్మన్యూనతల గురించి చర్చిస్తుంది’’ అన్నారు నటుడు హర్ష చెముడు.
  • ఈ పండక్కి స్వీట్‌ లాంటి చిత్రం మాది ఆద్యంతం నవ్విస్తూ.. అందర్నీ అలరించే సినిమా ‘క్రేజీ కళ్యాణం’’ అన్నారు హీరో అఖిల్‌ రాజ్‌. ఇప్పుడాయన.. అనుపమ పరమేశ్వరన్, నరేశ్, తరుణ్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని భద్రప్ప గాజుల తెరకెక్కించారు.
  • బర్త్‌డేకి ‘కింగ్‌’ టీజర్‌ ట్రీట్‌! దాదాపు మూడేళ్ల తర్వాత ‘కింగ్‌’ సినిమాతో తెరపై సందడి చేయనున్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఆయన కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్‌ బచ్చన్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
  • ఆది.. డివైన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘శంబాల’ చిత్రంతో హిట్‌ ట్రాక్‌ ఎక్కారు హీరో ఆది సాయికుమార్‌. ఇప్పుడాయన మరో ఆసక్తికర డివైన్‌ మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నవరసన దర్శకత్వంలో ముస్తాబు కానున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్‌ జి.రుద్రప్ప నిర్మిస్తున్నారు.
  • మా సంస్థలో ఓ కొత్త ప్రయత్నం ‘‘గరివిడి లక్ష్మి’ చాలా మంచి సినిమా. ఇది థియేటర్లో ఎక్కువ రోజులు ఆడుతుందని నమ్ముతున్నా’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ఆయన నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది టైటిల్‌ పాత్ర పోషించారు.
  • డెవిల్‌ అలియాస్‌ రుక్మిణి నితిన్‌ సరసన నటిస్తున్న కథానాయిక ఎవరో బయట పెట్టింది ‘అలియాస్‌ రుక్మిణీ’ చిత్రబృందం. బాలీవుడ్‌ భామ ఆఫియా సయ్యద్‌... రుక్మిణి పాత్రలో సందడి చేయనున్నారు. మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో..
  • ‘ది డర్టీ పిక్చర్‌ 2’లో ఇద్దరిలో ఎవరు? ఒకవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు యువతను విశేషంగా ఆకట్టుకునే ప్రత్యేక గీతాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తారు కథానాయిక తమన్నా. ఇటీవలే ‘ది వీవాన్‌’ చిత్రంలో నటించారు.
  • తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా... ‘రణబాలి’ పండగ మొదలైంది. అందరూ ఆ ఆనందంలో ఉన్నాం. మరో మూడు రోజుల్లో  తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా ‘రణబాలి’ సినిమా వస్తోంది’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా..
  • బ్రేకింగ్‌ బ్యాడ్‌ సిరీస్‌ నటుడు మిట్టే ఆత్మహత్య! టెలివిజన్‌ హిట్‌ సిరీస్‌ ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ సహనటుడు ఆర్‌.జె.మిట్టే(34) కన్నుమూశారు. సోమవారం టెక్సాస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు అమెరికా వినోద పరిశ్రమకు చెందిన ఓ సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.