కర్ణాటక సత్రంపై రగులుతున్న వివాదం

- A
- A+
- A++

ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఆధ్యాత్మిక సేవలకు కేంద్రంగా ఉన్న కర్ణాటక అతిథిగృహం (ప్రవాసీ సౌధ) నిర్వహణ బాధ్యతలను మౌలికంగా మార్చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దేవాదాయశాఖ పరిధిలో ఉండాల్సిన సత్రాన్ని 30 ఏళ్లపాటు కేఎస్టీడీసీ (కర్ణాటక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ)కి అప్పగించడంపై తితిదే ఆరా తీస్తోంది. సేవాభావాన్ని పక్కనపెట్టి వాణిజ్య కోణంలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామాలు శ్రీవారి క్షేత్రంలో ఆసక్తిగా మారాయి.
లీజు నిబంధనలు.. అద్దె వివాదం నేపథ్యం..
తిరుమలలోని కర్ణాటక అతిథిగృహం కోసం తితిదే గతంలో సుమారు 6.47 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించి ఏటా నామమాత్రంగా రూ.1,116 లీజు అద్దె చెల్లిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ భూమికి సంబంధించి చదరపు అడుగుకు రూ.2 చొప్పున అద్దె చెల్లించాలని, తద్వారా సంవత్సరానికి రూ.6 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుందని తితిదే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. భక్తుల సౌకర్యార్థం సేవాభావంతో వీటిని నిర్వహిస్తున్నామని, అంత అద్దె చెల్లించలేమని పేర్కొంటూ మైసూరుకు, తితిదేకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేస్తూ ప్రత్యుత్తరం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహణ మార్పు తెరపైకి రావడం గమనార్హం.
సీఎంకు తితిదే బోర్డు సభ్యుడి లేఖ..
కర్ణాటక అతిథిగృహం నిర్వహణ, పర్యవేక్షణ, ఆదాయ భాగస్వామ్యాన్ని 30 సంవత్సరాలపాటు కర్ణాటక పర్యాటకాభివృద్ధి సంస్థకు బదిలీ చేయడానికి ఉద్దేశించిన క్యాబినెట్ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదివారం లేఖ రాశారు. ఈ నిర్ణయం ఏపీ హిందూ ధార్మిక, దేవాదాయ ధర్మాదాయ చట్టం-1987కు, తితిదే లీజు షరతులకు పూర్తిగా విరుద్ధమని లేఖలో స్పష్టం చేశారు. కేవలం శ్రీవారి భక్తుల సేవకే అంకితం కావాల్సిన ధార్మిక సంస్థను వాణిజ్య కార్పొరేషన్‌కు అప్పగించి, 50:50 నిష్పత్తిలో లాభాలు పంచుకోవడం సరికాదని హితవు పలికారు. అవాంఛనీయ పరిణామాలు తలెత్తకముందే కర్ణాటక ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరారు.
తిరుమల పవిత్రతకు భంగం
తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం వ్యాపార ధోరణి అవలంబించడం అపచారమని భాజపా నేత నవీన్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఆధ్యాత్మిక స్థలంలో సత్రాలను పర్యాటక శాఖకు కేటాయిస్తే వ్యాపార కేంద్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సత్రాల నిర్వహణ భారంగా భావిస్తే, వాటిని వెంటనే తితిదే యథావిధిగా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సున్నితమైన అంశంపై తితిదే బోర్డు, ఉన్నతాధికారులు మౌనం వహించడం అత్యంత ప్రమాదకరమని, వెంటనే అధికారికంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 09:06 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మెనూ మెరుగ్గా [ 15-10-2026] గతంలో వైకాపా ప్రభుత్వం వసతి గృహాలను నిర్లక్ష్యం చేసింది. పేద విద్యార్థులుండే వీటి నిర్వహణను పట్టించుకోలేదు. కనీసం మెస్ ఛార్జీలు పెంచకపోవడంతో మెనూ సక్రమంగా అమలు కాలేదు.
- ‘సింహా’సనాన నరహరి [ 15-10-2026] తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సింహ, ముత్యపుపందిరి వాహనసేవలు అత్యంత వేడుకగా జరిగాయి. ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనాన్ని అధిరోహించి తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.
- ఒక్క ఛాన్స్ ప్లీజ్! [ 15-10-2026] మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్ల ప్రకటనతో కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికమైంది. మొన్నటివరకు స్తబ్దుగా ఉన్న నాయకులు ఇప్పుడు తామూ రేసులో ఉన్నామని చెబుతున్నారు.
- పదింట నాలుగు ఆమెకే [ 15-10-2026] రాజకీయ నేతలు, ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూసిన పురపాలక సంఘాల ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అందరిలో ఉత్సాహం నెలకొంది. ఈసారి మహిళల ప్రాధాన్యం పెరగనుంది.
- మోగింది ఎన్నికల శంఖారావం [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. మొదట నగరపాలక, పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
- బీసీలే తెదేపాకు వెన్నెముక [ 15-10-2026] తెదేపాకు బీసీలే వెన్నెముక అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు బీసీ భవన్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
- వీడని పీటముడి [ 15-10-2026] ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
- గిరులు.. సౌర సిరులు [ 15-10-2026] విద్యుత్తు ఆదానే లక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరాలయం అడుగులు వేస్తోంది. పెరుగుతున్న విద్యుత్తు వాడకాన్ని అవసరాన్ని బట్టి తగ్గించుకోవడం కాకుండా సౌర ఉత్పత్తి పెంచుకుంటూ ఖర్చును తగ్గించుకుంటోంది.
- అదుపుతప్పి బోల్తా పడిన కారు.. వ్యక్తి మృతి [ 14-10-2026] బెంగుళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేలో కారు అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తి మృతి చెందాడు.
- శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత [ 14-10-2026] శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ బయ్యాల భాస్కర్ తెలిపారు.
- సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్పస్వామి [ 14-10-2026] శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
- తితిదేలో ఆగిన అగరబత్తీల ఉత్పత్తి [ 14-10-2026] ఎస్వీ గో సంరక్షణశాలలోని తితిదే అగరబత్తీల కేంద్రం ఉత్పత్తి లేక మూతపడింది. ఎల్‌ఎస్‌నగర్ వద్ద ఉన్న తితిదే ఎస్వీ గోసంరక్షణ శాలలో 2019లో దర్శన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం ప్రారంభించారు.
- తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు.. త్వరలో ఏఎన్పీఆర్ వ్యవస్థ అమలు [ 14-10-2026] తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తితిదే ఐటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు తెలిపారు.
- రాయంచ విహారి.. శేషుడిపై మురారి [ 14-10-2026] అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉదయం చిన్న శేషవాహనంపై శ్రీమలయప్ప స్వామి ద్వారకా కృష్ణుడి అలంకారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు.
- నాడు ఇష్టారాజ్యం.. నేడు సామాజిక న్యాయం [ 14-10-2026] వైకాపా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నేతల అభిమతానికి అనుగుణంగా అధికారులు రిజర్వేషన్లలో మార్పులు చేశారు.
- కబ్జా కోరల్లో చెరువులు [ 14-10-2026] కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. నాలుగు మండలాల్లో సాగు.. తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారంలో భాగంగా..
- జనరల్ మహిళకే చిత్తూరు జడ్పీ పీఠం [ 14-10-2026] చిత్తూరు జడ్పీ పీఠం రిజర్వేషన్‌పై ఉత్కంఠ వీడింది. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో పోరు తీవ్రమయ్యేలా ఉంది.
- పరిషత్తు రిజర్వేషన్లు ఖరారు [ 14-10-2026] పరిషత్తు ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆమోదించినట్లు జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు మంగళవారం సాయంత్రం తెలిపారు.
- చౌక దుకాణాల్లో సీసీ కెమెరాలు [ 14-10-2026] ప్రభుత్వ చౌక దుకాణాల్లో సరకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ హెచ్చరించారు.
- ఇన్ఛార్జుల పాలనతో అభివృద్ధి సాగేనా? [ 14-10-2026] మండలంలో కీలక శాఖల్లో ఇన్‌ఛార్జి అధికారులు ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 శాఖల్లో అదనపు బాధ్యతలు, డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే ఆ శాఖలను నిర్వహిస్తుండటంతో పూర్తిస్థాయి పాలన చేపట్టడం కష్టతరంగా మారింది.
- మేయర్ పీఠం ఎవరిదో.. [ 14-10-2026] తిరుపతి మేయర్ పీఠం ఈసారి ఏ పార్టీకి దక్కుతుంది? కూటమిలో తెదేపా, జనసేన, భాజపాల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది? సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తారు..
- రుయాలో స్కాన్ స్కామ్ [ 14-10-2026] రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో విలువైన స్కాన్ పరీక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద క్షతగాత్రుల గాయాల గుర్తింపు.. వ్యాధుల నిర్దారణ..
English Translation
Controversy raging over Karnataka satra

- A
- A+
- A++

Enadu Digital, Tirupati; Tirumala, Newstoday: An uproar is raging over the fundamental change in management responsibilities of Karnataka Guest House (Pravasi Soudha), which is the center of spiritual services in Tirumala. Titi is inquiring about handing over the inn to KSTDC (Karnataka State Tourism Development Corporation) for 30 years, which should be under the purview of the Department of Tourism. These developments have become interesting in Srivari Kshetra at a time when there are criticisms that they are acting from a commercial point of view aside from the sense of service.
Lease terms.. Background of the rent dispute..
Tithide had earlier allotted about 6.47 acres of land for a Karnataka guest house in Tirumala. In connection with this, a nominal lease rent of Rs.1,116 is being paid annually. However, Titide has recently asked the state government to pay rent of Rs.2 per square feet for this land, which means that she will have to pay more than Rs.6 lakh per annum. Responding to this, the Karnataka government responded by reminding the historical association of Mysore and Tithida stating that they are running these services for the convenience of the devotees and cannot pay such a rent. It is noteworthy that the latest change in management has come to the fore.
Tithide board member's letter to CM..
Thithide board member Bhanuprakash Reddy has written to the Chief Minister of the state on Sunday asking for the immediate withdrawal of the cabinet's proposal to transfer the management, supervision and revenue sharing of the Karnataka guest house to the Karnataka Tourism Development Corporation for 30 years. Wrote a letter. The letter clarified that this decision is completely contrary to the AP Hindu Dharmika and Devadaya Charitable Act-1987 and the terms of the lease. Hitavu said that it is not appropriate to hand over a charitable institution dedicated solely to the service of Srivari devotees to a commercial corporation and share the profits in the ratio of 50:50. He asked the Karnataka government to reconsider before any untoward consequences arise.
Breach of the sanctity of Tirumala
BJP leader Naveen Kumar Reddy condemned that the Karnataka government's business orientation in Tirumala is wrong. He expressed concern that if the inns in the spiritual place are allotted to the tourism department, it will become a business center. If the maintenance of these satras is considered burdensome, they are demanded to be taken over immediately as usual. He said that the silence of the Tithide Board and higher authorities on this sensitive issue is very dangerous and he asked them to take immediate official response and appropriate action. us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 09:06 IST
Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. Correspondence has no place in this matter.
More
- Menu Better [ 15-10-2026] In the past, the Vaikapa government neglected the hostels. Even the poor students did not care about their maintenance. At least the menu was not implemented properly as mess charges were not increased.
- 'Sinha' Sanana Narahari [ 15-10-2026] As part of Tirumala Srivenkateswara Swamy Navratri Brahmotsavam, Simha and Mutyapupandiri Vahanasevas were held in a very festive manner on Wednesday. In the morning Srimalayappa swami took a procession on a lion chariot. Yoga Narasimhaswamy ascended the lion vehicle and roamed the streets of Tirumada and granted abhaya to the devotees.
- One chance please! [ 15-10-2026] With the announcement of reservation for the posts of Mayor and Municipal Chairman, the number of aspirants in the coalition parties has increased. Leaders who were stagnant till now are now saying that they are in the race. 15-10-2026] As political leaders and aspirants eagerly awaited the reservation for the posts of Chairman of Municipal Corporations, there was excitement among all. This time the importance of women will increase. 15-10-2026] The city of local body elections has rung. First, notification was given to the municipal and municipal bodies to conduct elections. Later MPTC and ZPTC elections will be held.
- BCL is the backbone of TDP [ 15-10-2026] MLA Gurjala Jaganmohan stated that BC is the backbone of TDP. On Wednesday at Chittoor BC Bhavan, under the auspices of Kotami parties, a spiritual gathering of BCs was held.
- Vedani Peetamudi [ 15-10-2026] The spiritual city of Tirupati, as the election bell of the Municipal Corporation rang, the political atmosphere suddenly heated up. All the major parties are sharpening their strategies with the implementation of the Code of Conduct for Elections. 15-10-2026] Srikalahasteeshwaralayam is taking steps to save electricity. Instead of reducing the increasing use of electricity according to the need, it is reducing the cost by increasing the solar production. 14-10-2026] A person died after a car overturned on the Bangalore-Chennai express highway. 14-10-2026] Sri Baiyala Bhaskar, Deputy EO of the temple said that common devotees are given high priority in darshans of Srivari. 14-10-2026] The Brahmotsavams of Srivari Navratri are going on with great pomp.
- Production of incense sticks stopped at Thithide [ 14-10-2026] Thithide Incense Burner Center at SV Go Conservatory has closed due to lack of production. In 2019, Darshan International Pvt Ltd., Bangalore started an incense stick center at Tithide SV Gosanrakshana Hall at LSnagar.
- For traffic control in Tirumala.. Implementation of ANPR system soon [ 14-10-2026] As part of the traffic control measures in Tirumala, the Automated Number Plate Recognition (ANPR) system will soon be made available at the Alipiri check post, Titi IT GM Venkateshwarlu Naidu said.
- Rayancha Vihari.. Seshudipai Murari [ 14-10-2026] The Navratri Brahmotsavam of Akhilandakoti Brahmanda leader Srivenkateswara Swami is going on with great splendor. As part of the festivities, on Tuesday morning on the second day, Srimalayappa Swami Dwaraka appeared at Bhaktakoti in the form of Krishna on a small relic. 14-10-2026] During the Vaikapa regime, the officials made changes in the reservations in accordance with the preferences of the party leaders in the elections of the local bodies. 14-10-2026] CM Chandrababu is working hard to make Kuppam constituency green. Cultivation in four mandals.. as part of permanent solution to drinking water crisis..
- General Chittoor ZDP seat for women [ 14-10-2026] Suspense over Chittoor ZP seat reservation. As this post was allotted to a general woman, the battle intensified. 14-10-2026] JDP CEO Ravikumar Naidu said on Tuesday evening that the District Election Officer and Collector Sumit Kumar approved the reservation of ZPTC and MPPs as part of the Parishad elections.
- CC cameras in cheap shops [ 14-10-2026] JC Adarsh Rajendran warned that strict action will be taken if irregularities are committed in the distribution of goods in government cheap shops. [ 14-10-2026] Due to the presence of in-charge officers in key departments in the mandal, the development is lagging. Not one, not two, but about 10 departments have additional responsibilities and the officers who have come on deputation are managing those departments, so it has become difficult to take up full governance. 14-10-2026] Which party will get the seat of Tirupati mayor this time? Who will get a chance among TDP, Jana Sena and BJP in the alliance? Considering the social equations which category is preferred..
- Ruya Scan Scam [ 14-10-2026] Scandal of valuable scan tests has come to light in Ruya Government Hospital. Identification of injuries of accident victims.. Diagnosis of diseases..