రష్యా-ఉక్రెయిన్‌ ఒప్పందం.. తనకు తెలియదన్న జెలెన్‌స్కీ

Eenadu icon
By International News Team Published : 12 Oct 2026 09:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా, ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య తక్షణమే ఇంధన వనరుల కాల్పుల విరమణ (Energy Ceasefire) ఒప్పందం అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ప్రకటించారు. విద్యుత్, చమురు, గ్యాస్‌ వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడుల నిలిపివేతకు ఇరుపక్షాలూ అంగీకరించాయన్నారు. ఈ ప్రకటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) స్పందించారు. ఈ విషయం తనకు ముందుగా తెలియదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసే తాను తెలుసుకున్నట్లు చెప్పారు. అయితే ఇది మంచి పరిణామమేనని పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమ ఇంధన సదుపాయాలపై మాస్కో దాడులు ఆపిన వెంటనే.. తాము కూడా ఆ దేశ చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు నిలిపివేస్తామని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉద్రిక్తతలను తగ్గించే ఏ చర్యలైనా ఇరుపక్షాల నుంచి ఉన్నప్పుడే శాంతి స్థాపన సాధ్యమవుతుందన్నారు.

కాగా.. ట్రంప్‌ ( Donald Trump) ప్రకటనపై అటు రష్యా ఇప్పటి వరకూ స్పందించలేదు సరికదా.. ప్రకటన అనంతరం ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేపట్టడం గమనార్హం. దేశ రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాల్లోని విద్యుత్‌ కేంద్రాలపై డ్రోన్ దాడులు జరగడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఖర్కీవ్‌లో ఒక దుకాణంపై జరిగిన దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. ఇకనైనా దాడులు ఆపకపోతే రష్యా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఇంధన వనరుల కాల్పుల విరమణ

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పడేనా ట్రంప్‌ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
  • కోలుకుంటున్న పోప్‌ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్‌ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్‌ మేరీ మిల్బెన్‌ ఆరోపించారు.
  • ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే... ఎలాన్‌ మస్క్‌ కూడా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్‌ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్‌ బుధవారం పేర్కొంది.
  • పాకిస్థాన్‌ మళ్లీ ‘హ్యాండ్‌ ఇచ్చింది’..! ఒక చిన్న గెరిల్లాదళమైన హూతీలు సౌదీ అరేబియాపై వరుసదాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.
  • జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలోని బాకూమ్‌ నగరంలో ఓ నివాస సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
  • ఇరాన్‌ వ్యూహాల్లో మరో టర్నింగ్‌ పాయింట్‌.. రంగంలోకి స్పాటర్లు Iran: అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమై హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)లో నౌకల లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇరాన్ (Iran) కొత్త వ్యూహాలు పన్నుతోంది.
  • హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని మునిగిన నౌక హర్మూజ్‌లో సీమైన్లను ఢీకొని ఓ చమురు ట్యాంకర్‌ మునిగిపోయింది.
  • ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌- బీబీ రహస్య చర్చలు! ఇరాన్‌పై త్వరలోనే దాడులు ప్రారంభించేందుకు ట్రంప్-నెతన్యాహు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికన్ల నుంచి నిధులు: సింగర్ ఆరోపణలు Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ (American singer) ఆరోపించారు.
  • ఓపెన్‌ఏఐ మీటింగ్‌ హాల్‌లో గూఢచర్య పరికరాలు..! ఓపెన్‌ఏఐ సంస్థలో పని చేస్తూ.. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 
  • బాలికను అసభ్యంగా తాకిన రోబో.. షాకింగ్‌ ఘటన జర్మనీ (Germany)లో ఓ రోబో.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రవర్తించేలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
  • ప్రపంచం కోసమే రష్యా డీజిల్‌ కొనుగోలు: ట్రంప్ విచిత్ర వివరణ Donald Trump: డీజిల్‌ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
  • సౌదీకి షాక్‌: అరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీ అరేబియాలో దాడులు తీవ్రమయ్యాయి. ధహ్రాన్‌ నగరంలోని చమురు సంస్థ అరాంకో(Aramco) కార్యాలయపై హూతీలు(Houthis) బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు.
  • గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.
  • ‘ఫ్లైదుబాయ్‌’ కూల్చివేత కుట్రలో.. ఇద్దరు మాల్దీవియన్‌ పైలట్ల అరెస్ట్‌ ‘ఫ్లైదుబాయ్‌’ విమానాన్ని హైజాక్‌ చేసి, కూల్చివేసేందుకు ఒమన్‌ కోపైలట్‌ ఇటీవల పన్నిన కుట్రలో భాగంగా భావిస్తున్న ఇద్దరు మాల్దీవియన్‌ పైలట్లను యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు.
  • ప్రభుత్వంపై పోరాటానికి రూ.967 కోట్ల వ్యయం సంపన్నులపై పన్ను విధించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కోర్టులో పోరాడటానికి గూగుల్‌ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ ఏకంగా రూ.967 కోట్లు ఖర్చు పెట్టారు.
  • 11 ఏళ్ల పగ! యెమెన్‌లోని అంతర్యుద్ధంపై సౌదీ అరేబియా వేసుకున్న లెక్కలు తప్పాయా..  ఆ దేశం ఎరక్కపోయి ఇరుక్కుందా.. గల్ఫ్‌లో తమ దేశాన్ని అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మార్చాలనుకునే క్రమంలో యెమెన్‌పై తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయా.. అంటే ప్రస్తుతం హూతీలు చేస్తున్న దాడులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.