వివాహిత ఇంట్లో ప్రియుడు...

- A
- A+
- A++

పళ్లిపట్టు: తిరువళ్లూర్ జిల్లా ఆర్కేపేట యూనియన్ అయ్యనేరి గ్రామానికి చెందిన నరసింహన్(45), గౌతమి(34) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిని గౌతమి ప్రతిరోజూ రాణిపేట జిల్లా షోలింగర్‌లోని ప్రయివేటు పాఠశాలకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఆమెకు షోలింగర్ ప్రాంతానికి చెందిన కూలీ అరుళ్పాండి(35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం రాత్రి గౌతమి ఇంటికి అరుళ్పాండి వెళ్లాడు. ఆమెతో ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. తమ మధ్య బంధాన్ని తెంచుకుందామని చెప్పడంతో ఆవేదనకు గురైన అరుళ్పాండి గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో గౌతమి ఆర్కేపేట పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా అరుళ్పాండి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
► Read latest Tamilnadu Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రోగ నివారణకు ఏఐ ఉపకరణాలు [ 15-10-2026] వైద్యరంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేలా మహిళలు ఏర్పాటు చేసిన అంకుర సంస్థ(స్టార్టప్)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తాజాగా చెన్నైలో పర్యటించిన ఆయన స్టార్టప్ ప్రతినిధుల్ని పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- విజయ్ సీఎం కావడానికి డీఎంకే కూటమే కారణం: ఈపీఎస్ [ 15-10-2026] విజయ్ ముఖ్యమంత్రి కావడానికి డీఎంకే కూటమే కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. పార్టీ సేలం సబర్బన్ జిల్లా నిర్వాహకుల సమావేశం బుధవారం ఓమలూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది.
- రింగ్ పైపులైన్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన [ 15-10-2026] చెన్నై మహానగర పాలక సంస్థ పరిధిలో రూ.3,108.55 కోట్ల వ్యయంతో రింగ్ పైప్‌లైను ఏర్పాటు చేసే ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి విజయ్ శంకుస్థాపన చేశారు.
- అన్నాడీఎంకేలో మళ్లీ అసమ్మతి సెగలు [ 15-10-2026] దళపతి విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా అన్నాడీఎంకే భారీ కుదుపునకు లోనైంది. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది.
- మార్చి 17 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు టైమ్‌టేబుల్ విడుదల [ 15-10-2026] వచ్చే ఏడాది మార్చిలో పది, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయి. చెన్నైలోని ప్రొఫెసర్ అన్బళగన్ విద్యా ప్రాంగణంలోని ఆడిటోరియంలో బుధవారం పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ పది, ప్లస్‌టూ తరగతుల పబ్లిక్ పరీక్షలు, ప్లస్‌వన్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేశారు.
- రెండు పూర్తి.. ఇక ఐదింటిపై దృష్టి [ 15-10-2026] రెండు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మిగతా ఐదు నియోజకవర్గాలపై ఆశావహులు దృష్టి సారించారు. అధికార పార్టీ ఆశావహులు ఓ అడుగు ముందుకేసి గోడ ప్రచారాలు చేపట్టారు.
- మెట్రో స్టేషన్లపై ఎలివేటెడ్ కారిడార్ [ 15-10-2026] చెన్నైలోని తేనాంపేట నుంచి సైదాపేట వరకు 3.2 కిలోమీటర్ల దూరంలోని తేనాంపేట నుంచి నందనం మెట్రో స్టేషన్లపై నిర్మిస్తున్న నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు త్వరలో తిరిగి ప్రారంభం కానున్నాయి.
- ఉదయం పెళ్లి చేసుకున్నారు.. సాయంత్రానికి విడిపోయారు [ 15-10-2026] కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట రోజైనా గడవకముందే విడిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా కుళచ్చల్కి చెందిన 31ఏళ్ల వయసున్న ఓ సైనికుడు, కన్యాకుమారి-కేరళం సరిహద్దు ప్రాంతమైన పారసాలై ప్రాంతానికి చెందిన 26ఏళ్ల యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.
- రజనీ మాస్ ప్రదర్శన చూసేందుకు నిరీక్షిస్తున్నా [ 15-10-2026] భారీ తెరపై రజనీకాంత్ మాస్ ప్రదర్శన చూసేందుకు ఆసక్తిగా నిరీక్షిస్తున్నట్లు సినీ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్-2’ గురువారం థియేటర్లలోకి రానుంది.
- కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి... [ 15-10-2026] తంజావూర్ జిల్లా తిరువిడైమరుదూర్ సమీపంలోని ఓ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తికి 10ఏళ్ల కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా ప్రకాశ్ ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ నుంచి తరచూ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
- పిల్లల్ని చిత్రహింసలకు గురిచేసిన తల్లి... [ 15-10-2026] కన్నియాకుమరి జిల్లా నాగర్కోవిల్కి చెందిన సుకన్య, అళగువేల్ దంపతులకు ఏడేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం సుకన్య తన పిల్లలను తన సోదరుడు రాజలింగం ఇంట్లో వదిలి వెళ్లింది.
- ముప్పుందని చెప్పినా మార్పు లేదు [ 14-10-2026] చెన్నైలో 2021లో సంభవించిన భీకర వరదల తర్వాత విశ్రాంత ఐఏఎస్ అధికారి వి.తిరుప్పుగళ్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. నగరవ్యాప్తంగా పర్యటించి లోపాలపై అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి 600 పేజీల నివేదికను 2023 మార్చిలో సమర్పించింది.
- తుదిదశకు యువర్స్ లవింగ్లీ చిత్రీకరణ [ 14-10-2026] ముత్తురామ్ మురుగన్ దర్శకత్వంలో ఆకాశ్ ప్రేమ్‌కుమార్, శ్రీదేవి అపల్ల ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘యువర్స్ లవింగ్లీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. రాంజీ, బక్స్, మైథిలీ, చంద్రన్, తుషార్, ఆశా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
- తమిళనాడు ఆలయాలకు అసోం ఏనుగులు [ 14-10-2026] అసోం రాష్ట్రం నుంచి ఐదు ఏనుగులను తమిళనాడులోని ప్రముఖ ఆలయాలకు తీసుకొచ్చారన్న వార్తలు బయటకు పొక్కడంతో సామాజిక కార్యకర్తల మనసుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి.
- విద్యుత్ ఒప్పందాల్లో భారీ కుంభకోణం: ఈపీఎస్ [ 14-10-2026] టీవీకే ప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్ రూ.35 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇందులో భారీ అవినీతి జరిగిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో వి ద లీడర్స్ పోటీ: అన్నామలై [ 14-10-2026] ‘వి ద లీడర్స్’ ఉద్యమం తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దాని వ్యవస్థాపకుడు అన్నామలై ప్రకటించారు. తిరువారూర్ జిల్లా చోళపాండిలో 15వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ‘వి ద లీడర్స్’ ఉద్యమం తరఫున మంగళవారం నిర్వహించారు.
- మూడు చేపలు.. రూ.75 వేలు [ 14-10-2026] జాలర్ల వలలో చిక్కిన మూడు భారీ టూనా చేపలు రూ.75 వేల ధర పలికాయి. రామనాథపురం జిల్లా పాంబన్కి చెందిన జాలర్లు ఆదివారం సముద్రానికి చేపల వేటకు వెళ్లి సోమవారం తీరానికి చేరుకున్నారు.
- పురాతన రాతి విగ్రహాలు లభ్యం [ 14-10-2026] ధర్మపురి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర పరిశోధకుడు చంద్రశేఖర్, ఆయన పరిశోధక బృందం ఇటీవల ధర్మపురి జిల్లా బొమ్మిడి సమీపంలోని కొండరళ్లి వత్తల్మలై పర్వతం దిగువన చెరువులో 15వ శతాబ్దపు రెండు రాతి విగ్రహాలను గుర్తించారు.
- బ్యాంకులో మోసానికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగుల అరెస్టు [ 14-10-2026] వేలూర్ జిల్లా కె.వి.కుప్పం సమీపంలోని మేల్కావనూర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఉంది. ఇందులో చిన్న వడుగందాంగలైకి చెందిన పార్థిబన్(32), కీళ్ముట్టుకూరైకి చెందిన శ్రీనివాసన్(55) చాలాఏళ్లుగా ఆభరణాల మదింపుదారులుగా పనిచేస్తున్నారు.