కాళ్లు, చేతులు కట్టేసి.. నీటి సంపులో పడేసి

- A
- A+
- A++

ఈనాడు-హైదరాబాద్, బొల్లారం, న్యూస్‌టుడే: డబ్బు కోసం ఐదేళ్ల చిన్నారిని దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మిల్టన్ ఫెర్నాండెజ్, డేజి ఇవాంజెలియా దంపతులు ఉద్యోగరీత్యా 2019 నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి కౌకూరులోని విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు జేడెన్ ఫెర్నాండెజ్, కుమార్తె మోజెస్ అరేలియా(5) ఉన్నారు. ఈ విల్లాల సముదాయానికి బిహార్‌కు చెందిన విక్రమ్(28) అనే యువకుడు గతంలో వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇటీవల విల్లా నిర్వాహకులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై విల్లా అసోసియేషన్ సభ్యులకు విక్రమ్‌కు గొడవ జరిగింది.
అదే సమయంలో అరేలియా కుటుంబంతోనూ విక్రమ్ గొడవపడి వెళ్లిపోయాడు. విల్లాల సముదాయంలో శనివారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా..అరేలియా కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లారు. చిన్నారి ఇంటి సమీపంలోని క్లబ్‌హౌస్ దగ్గర సైకిల్ తొక్కుకుంటోంది. సాయంత్రం 6.30 గంటల సమయంలో విక్రమ్ అకస్మాత్తుగా విల్లా సముదాయానికి వచ్చాడు. భద్రతా సిబ్బంది అతడిని లోపలికి అనుమతించారు. క్లబ్‌హౌస్ దగ్గర ఉన్న చిన్నారిని విక్రమ్ సెల్లార్లోకి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు కట్టేసి, శరీరానికి పెద్ద రాయి కట్టి నీటి సంపులో పడేశాడు. చిన్నారి చనిపోయిందని నిర్ధారించుకుని..రాత్రి 7.30 గంటల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కడే బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి వెళ్లిపోయాడు.
రూ.20 లక్షలివ్వాలని డిమాండ్

సాయంత్రం చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు విల్లాల సమీపంలో వెదుకులాట ప్రారంభించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో బొల్లారం పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో చిన్నారి తాత అరుల్దాస్కు నిందితుడు విక్రమ్ ఫోన్ చేశాడు. అరేలియా తన దగ్గరే ఉందని, రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. తొలుత పాప క్షేమంగా ఉన్నట్లు వీడియోకాల్ ద్వారా చూపిస్తే డబ్బిస్తామని అరుల్దాస్ చెప్పారు. 2 నిమిషాలు మాట్లాడిన నిందితుడు కాల్ కట్ చేశాడు. ఈలోపు అరుల్దాస్ చిన్నారి తండ్రి మిల్టన్‌కు విషయం చెప్పారు. మిల్టన్ నిందితుడికి ఫోన్ చేసి డబ్బు సిద్ధం చేస్తామని పాపను అప్పగించాలని కోరాడు.
నిందితుడు సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఫోన్ మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇదే సమయంలో విల్లా సముదాయం పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా..ఫుటేజీలో నిందితుడు ఒక్కడే సెల్లార్నుంచి బయటకు వెళ్లిన దృశ్యం కనిపించింది. పాప కచ్చితంగా విల్లాల సముదాయం లోపలే ఉందనే అనుమానంతో మరింత నిశితంగా సెల్లార్‌ను పరిశీలించగా..ఆదివారం తెల్లవారుజామున సెల్లార్‌లోని సంపులో చిన్నారి విగతజీవిగా కనిపించింది. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ ఫోన్
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నిందితుడు విక్రమ్ మరోసారి అరుల్దాస్కు కొత్త నంబరు నుంచి ఫోన్ చేశాడు. తనకు డబ్బులివ్వాలని డిమాండ్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. పటాన్చెరు నుంచి ఫోన్ చేసినట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు తెల్లవారుజామున విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు మాత్రం నిందితుడు తమ అదుపులో లేడని చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, డీసీపీ శ్రీధర్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించి బాధిత కుటుంబసభ్యుల్ని ఓదార్చారు.
చిన్నారి హత్య వారికి ముందే తెలుసా?
నిందితుడు విక్రమ్ హత్య చేసిన అనంతరం బయటికెళ్లేటప్పుడు విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది బిహార్‌కు చెందిన సునీల్, జయరాజ్, హరేకృష్ణలతో మాట్లాడిన దృశ్యం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఈ మేరకు వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా..బాలికను చంపేసి సంపులో పడేసినట్లు విక్రమ్ చెప్పాడని..ఒకడు పోలీసులకు చెప్పాడు. దీంతో ఈ ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ప్రియుడి బెయిల్‌కు డబ్బుల్లేక అడ్డదారులు.. డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన యువతి జైలులో ఉన్న ప్రియుణ్ని విడిపించుకునేందుకు డబ్బులు అవసరమై.. కమీషన్ కోసం డ్రగ్స్ తెస్తూ ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
- కొలువులో చేరినచోటే కాసుల వేట రాజధాని శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు పాపాల చిట్టా బయటపడుతోంది.
- పోలీసులపై దాడి ఘటనలో 20 మంది అరెస్టు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్‌లో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో ఇరవై మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- ఆలయంలోకి ఎందుకొచ్చారని నిలదీత ఆలయంలోకి ఎందుకొచ్చారంటూ ఎస్సీ దంపతులను నిలదీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- సహ జీపీఏ హోల్డర్‌కు తెలియకుండా 3 వేల గజాల స్థలం అమ్మకం ఓ వ్యక్తి హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని తన స్థలాన్ని అమ్మిపెట్టే బాధ్యతను ఇద్దరికి అప్పగించి వారి పేరిట సంయుక్త జీపీఏ చేశారు.
- నిజామాబాద్‌లో రసాయన డబ్బా పేలి మహిళ దుర్మరణం చెత్త సేకరించే మహిళ ఓ రసాయన డబ్బాను తెరిచేందుకు ప్రయత్నించగా..అది పేలి ఆమె దుర్మరణంపాలైన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
- ఔషధ దుకాణంలో డ్రగ్స్ విక్రయం..నిలదీసిన ఉద్యమకారుడి కాల్చివేత మందుల దుకాణంలో మత్తుపదార్థాల విక్రయాలను ఫేస్బుక్ లైవ్‌లో ప్రశ్నించడం ఓ ఉద్యమకారుడి ప్రాణాలు తీసింది.