ఈసారి ఆపేశారు...

Eenadu icon
By Sports News Desk Published : 12 Oct 2026 04:14 IST Ee Font size
  • A
  • A+
  • A++
6 min read

రెండో టీ20లో 250 లక్ష్యాన్నీ చెమట పట్టకుండా ఛేదించేశారు కరీబియన్‌ బ్యాటర్లు. అలాంటిది మూడో టీ20లో భారత్‌ 223 పరుగులు చేసింది. హోల్కర్‌ స్టేడియంలో ఈ స్కోరు అనుకున్నదాని కన్నా తక్కువే. విధ్వంసకారులతో కూడిన విండీస్‌కు లక్ష్యం అంత కష్టమేమీ కాదనిపించింది. కానీ భీకర ఫామ్‌లో ఉన్న హోప్‌ను ఔట్‌ చేసి, ఆపై కీలక సమయాల్లో వికెట్లు తీసిన భారత్‌.. మూడో టీ20లో విజయాన్ని అందుకుంది. బ్యాట్‌తో అభిషేక్‌.. బంతితో అర్ష్‌దీప్‌ భారత హీరోలు.

ఇందౌర్‌

వెస్టిండీస్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో భారత్‌ బలంగా పుంజుకుంది. ఆదివారం మూడో మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలిచిన శ్రేయస్‌ సేన, సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (69; 30 బంతుల్లో 6×4, 5×6) టాప్‌ స్కోరర్‌. ఇషాన్‌ కిషన్‌ (37; 18 బంతుల్లో 6×4, 1×6) కూడా రాణించాడు. చేజ్, షమార్‌ జోసెఫ్, షమార్‌ స్ప్రింగర్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులే చేసింది. హెట్‌మయర్‌ (43; 26 బంతుల్లో 6×4, 2×6), కామిల్‌ పూరన్‌ (42; 27 బంతుల్లో 3×4, 3×6), స్ప్రింగర్‌ (35 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4, 4×6), రూథర్‌ఫర్డ్‌ (32; 20 బంతుల్లో 2×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/44), నమన్‌ ధీర్‌ (2/39) భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. నాలుగో టీ20 బుధవారం హైదరాబాద్‌లో జరుగుతుంది. 

విండీస్‌ పోరాడినా..:హోప్‌ (5) త్వరగా ఔటైనా.. ఛేదనలో వెస్టిండీస్‌ ధాటిగానే ఆడింది. హెట్‌మయర్, కామిల్‌ పూరన్‌ మెరుపులు మెరిపించారు. అర్ష్‌దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో హెట్‌మయర్, పూరన్‌ కలిసి  6, 4, 4, 4 కొట్టడంతో స్కోరు దూసుకెళ్లింది. 6 ఓవర్లకు 54/1తో కరీబియన్‌ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఏడో ఓవర్లో హెట్‌మయర్‌ను బౌల్డ్‌ చేసిన నమన్‌ ధీర్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. అక్కడ నుంచి విండీస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. పదో ఓవర్లో రోమన్‌ పావెల్‌ (5) కూడా ఔటైపోయాడు. నమన్‌ ధీర్‌ వేసిన తర్వాతి ఓవర్లో 3 సిక్స్‌లు బాది ఊపు మీద కనిపించిన పూరన్‌.. అదే ఓవర్లో వెనుదిరగడంతో మ్యాచ్‌పై భారత్‌ మరింత పట్టుబిగించింది. అప్పటికి సమీకరణం (54 బంతుల్లో 119) క్లిష్టంగా మారడంతో విండీస్‌ మరింత ఒత్తిడిలో పడింది. గత మ్యాచ్‌లో అదరగొట్టి విండీస్‌ విజయంలో కీలకమైన రూథర్‌ఫర్డ్‌.. నితీశ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో జోరందుకున్నాడు. అతడికి శాంప్సన్‌ (21) జత కలవడంతో స్కోరులో మళ్లీ ఊపు వచ్చింది. అయినా (5 ఓవర్లలో 75 పరుగులు) విండీస్‌కు చాలా క్లిష్టంగానే ఉంది. శాంప్సన్‌ను నితీశ్‌ ఔట్‌ చేయడం, ఆపై ఒకే ఓవర్లో కీమో పాల్‌ (10), రూథర్‌ఫర్డ్‌లను అర్ష్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఆ జట్టులో ఏదో మూల ఉన్న ఆశలు కూడా అడుగంటాయి. ఆఖర్లో స్ప్రింగర్‌ పోరాటం భారత్‌ గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

అభిషేక్‌ మెరుపులు:భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ ఆటే హైలైట్‌. రెండో ఓవర్లోనే సంజు శాంసన్‌ (3) ఔటైనా.. అభిషేక్‌ తగ్గలేదు. చేజ్‌ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాది స్కోరు పెంచాడు. తర్వాతి ఓవర్లో కీమో పాల్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ కూడా 3 ఫోర్లు అందుకోవడంతో స్కోరు పరుగులెత్తింది. ఈ క్రమంలోనే అభిషేక్‌ 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ ప్లే ఆఖరికి భారత్‌ 87/1తో భారీ స్కోరుకు పునాది వేసుకుంది. 8 ఓవర్లకే టీమ్‌ఇండియా స్కోరు వంద దాటింది. అయితే స్వల్ప వ్యవధిలో భారత్‌కు షాక్‌ మీద షాక్‌లు తగిలాయి. చేజ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో భారీ సిక్స్‌తో జోరు మీద కనిపించిన ఇషాన్‌ కిషన్‌.. మరో షాట్‌కు వెళ్లి స్టంపౌట్‌ అయ్యాడు. అదే ఓవర్లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో అభిషేక్, ఆపై నమన్‌ ధీర్‌ (10) డగౌట్‌ చేరిపోయారు. 11 ఓవర్లకు 136/5తో భారత్‌ ఇబ్బందుల్లో పడింది. 13వ ఓవర్లో నితీశ్‌ (21), తిలక్‌ (28) చెరో రెండు బౌండరీలు కొట్టడంతో స్కోరు బోర్డుకు మళ్లీ ఊపొచ్చింది. నితీశ్‌ వెనుదిరిగినా.. అక్షర్‌ పటేల్‌ (20)తో కలిసి తిలక్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరే ఇన్నింగ్స్‌ను ముగిస్తారని అనుకుంటే.. తిలక్, అక్షర్‌ రనౌట్‌ కావడం భారత్‌ను దెబ్బ తీసింది. చివరి ఓవర్లో ప్రిన్స్‌ యాదవ్‌ (13 నాటౌట్‌) మూడు ఫోర్లు కొట్టడంతో స్కోరు 220 దాటింది. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి మయాంక్‌ (0)ను ఔట్‌ చేయడం ద్వారా జోసెఫ్‌.. భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 

తిలక్‌ అనుకోకుండా..

16వ ఓవర్‌ నాలుగో బంతికి తిలక్‌ వర్మ అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. మోటీ వేసిన బంతిని అక్షర్‌ పటేల్‌ లెగ్‌సైడ్‌ ఫ్లిక్‌ చేశాడు. డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో కామిల్‌ పూరన్‌ డైవ్‌ చేసి బంతిని గొప్పగా ఆపాడు. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసిన తిలక్‌-అక్షర్‌.. అది బౌండరీ అనుకుని సగం వరకే పరుగెత్తి ఆగిపోయారు. బౌండరీ కాకపోవడంతో అక్షర్‌  స్ట్రైకింగ్‌ ఎండ్‌కు వెళ్లిపోయాడు. తిలక్‌ నెమ్మదిగా నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ వైపు వెళ్లాడు. ఈలోగా పూరన్‌ బంతిని వికెట్‌కీపర్‌ హోప్‌కు అందించడం అతడు.. బౌలర్‌ మోటీకి విసరడం, ఆపై మోటీ బెయిల్స్‌ ఎగరేయడం జరిగిపోయాయి. దీంతో తిలక్‌ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు.  

భారత్‌ ఇన్నింగ్స్‌:శాంసన్‌ (సి) కమిల్‌ పూరన్‌ (బి) జోసెఫ్‌ 3; అభిషేక్‌ శర్మ (సి) అండ్‌ (బి) స్ప్రింగర్‌ 69; ఇషాన్‌ కిషన్‌ (స్టంప్డ్‌) హోప్‌ (బి) చేజ్‌ 37; శ్రేయస్‌ ఎల్బీ (బి) చేజ్‌ 1; తిలక్‌ రనౌట్‌ 28; నమన్‌ ధీర్‌ (సి) స్ప్రింగర్‌ (బి) మోటీ 10; నితీశ్‌ (సి) హోప్‌ (బి) కీమో పాల్‌ 21; అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ 20; అర్ష్‌దీప్‌ ఎల్బీ (బి) స్ప్రింగర్‌ 11; ప్రిన్స్‌ యాదవ్‌ నాటౌట్‌ 13; మయాంక్‌ యాదవ్‌ (బి) జోసెఫ్‌ 0; ఎక్స్‌ట్రాలు 10
మొత్తం:(20 ఓవర్లలో ఆలౌట్‌) 223;
వికెట్ల పతనం:1-7, 2-115, 3-117, 4-124, 5-135, 6-169, 7-194, 8-202, 9-210; బౌలింగ్‌: రోస్టన్‌ చేజ్‌ 4-0-38-2; షమార్‌ జోసెఫ్‌ 4-0-54-2; కీమో పాల్‌ 4-0-38-1; షమార్‌ స్ప్రింగర్‌ 4-0-50-2; గుడాకేశ్‌ మోటీ 4-0-37-1

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌:షై హోప్‌ (బి) అర్ష్‌దీప్‌ 5; కమిల్‌ పూరన్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) నమన్‌ ధీర్‌ 42; హెట్‌మయర్‌ (బి) నమన్‌ ధీర్‌ 43; రోమన్‌ పావెల్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 5; రూథర్‌ఫర్డ్‌ (బి) అర్ష్‌దీప్‌ 32; శాంప్సన్‌ (సి) తిలక్‌ (బి) నితీశ్‌ 21; కీమో పాల్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్‌దీప్‌ 10; స్ప్రింగర్‌ నాటౌట్‌ 35; చేజ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 11
మొత్తం:(20 ఓవర్లలో 7 వికెట్లకు) 209;
వికెట్ల పతనం:1-7, 2-67, 3-82, 4-105, 5-151, 6-169, 7-174;
బౌలింగ్‌:మయాంక్‌ యాదవ్‌ 4-0-34-0; అర్ష్‌దీప్‌ 4-0-44-3; ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-37-0; నమన్‌ ధీర్‌ 3-0-39-2; అక్షర్‌ 3-0-33-1; నితీశ్‌ 2-0-19-1

  • టీ20ల్లో బంతుల పరంగా వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అభిషేక్‌ శర్మ (1024 బంతులు) ఘనత సాధించాడు. అతడు సూర్యకుమార్‌ యాదవ్‌ (1164 బంతులు)ను దాటేశాడు. 

68

ఈ సీజన్లో టీ20ల్లో అభిషేక్‌ కొట్టిన సిక్స్‌లు. ఒక క్యాలెండర్‌ ఏడాదిలో ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా సూర్యకుమార్‌ (68)ను అతడు సమం చేశాడు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తిరిగి హైదరాబాద్‌కు నటరాజన్‌ ఎడమచేతి వాటం పేసర్‌ నటరాజన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. ఐపీఎల్‌ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ అతణ్ని దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి తీసుకుంది.
  • టీ20ల్లో మేం చాలా శ్రమించాలి వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరముందని కొత్త కెప్టెన్‌ స్మృతి మంధాన చెప్పింది. మహిళల తొలి ఛాంపియన్స్‌ ట్రోఫీ వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది.
  • ఆ స్థానం ఓజాదే..! అజిత్‌ అగార్కర్‌ స్థానంలో వెస్ట్‌జోన్‌ నుంచి పార్థివ్‌ పటేల్‌ సెలక్టర్‌ అవుతాడని అంతా భావించారు. కానీ అతడు పదవి కోసం దరఖాస్తే చేసుకోలేదు. దీంతో సెలక్షన్‌ కమిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్‌గా కొనసాగేందుకు ప్రజ్ఞాన్‌ ఓజాకు మార్గం సుగమమైంది.
  • కరుణ్‌ శతకం ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్‌ డ్రా ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో కర్ణాటక డ్రాతో బయటపడింది. కరుణ్‌ నాయర్‌ (155; 242 బంతుల్లో 16×4, 2×6) వీరోచిత శతకంతో జట్టును గట్టెక్కించాడు.
  • 17 ఏళ్ల తర్వాత పంజాబ్‌కు.. ఈ నెలాఖర్లో జరగనున్న హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌కు ప్రత్యేకంగా నిలవనుంది. అతడి సొంతగడ్డ పంజాబ్‌లో 17 ఏళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ జరగబోతోంది.
  • నాలుగో స్థానంలో శ్రేయస్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో అతను 18 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని రేటింగ్‌ మెరుగుపడింది.
  • యోధాస్‌ గెలుపు ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో పృథ్వీరాజ్‌ యోధాస్‌ పుంజుకుంది. బుధవారం ఆ జట్టు 5-1తో చేరో ఆర్చర్స్‌పై ఘనవిజయాన్నందుకుంది. గణేశ్‌ మణిరత్నం 60కి 59 పాయింట్లతో జట్టు గెలుపులో కీలకమయ్యాడు.
  • సాత్విక్‌ జోడీ ఔట్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి జోడీ కథ ముగిసింది. బుధవారం తొలి రౌండ్లో ఈ జంట 21-12, 15-21, 19-21తో చైనా ద్వయం హె జి టింగ్, రెన్‌ జియాంగ్‌ యుల చేతిలో ఓడిపోయింది.
  • సంక్షిప్త వార్తలు (4) ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారు. గురువారం దిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో ఆయన ప్లేయర్లతో సమావేశం కానున్నారు.
  • ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్‌ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్‌ఇండియా తహతహలాడుతుంటే..
  • ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్‌ గిల్‌.. భారత మహిళల జట్టు ఓపెనర్‌ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్‌’ అవార్డు (సెప్టెంబర్‌ నెల) సాధించారు.
  • ఆరేసిన తనయ్‌ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనంగా బోణీ కొట్టింది. తనయ్‌ త్యాగరాజన్‌ (6/52) విజృంభించడంతో గ్రూప్‌-బి ఎలీట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో త్రిపురను చిత్తు చేసింది.
  • దిల్లీ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌లో కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. మంగళవారం అతడు దిల్లీ క్యాపిటల్స్‌ సహాయ కోచ్, బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు.
  • సింధు, లక్ష్య ఔట్‌ భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. ఆమె తొలి రౌండే దాటలేకపోయింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 21-13, 23-25, 19-21తో యోనెలి (జర్మనీ) చేతిలో ఓడిపోయింది.
  • రాజ్‌పుతానా ఘనవిజయం ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌ అదిరే విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆ జట్టు 6-0తో చేరో ఆర్చర్స్‌ను చిత్తు చేసింది.
  • పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈనెల 18న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది అథ్లెట్లలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.
  • క్రిషన్‌ బహదూర్‌ పునరాగమనం గోల్‌కీపర్‌ క్రిషన్‌ బహదూర్‌  పాఠక్‌ భారత హాకీ జట్టులో పునరాగమనం చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించాడు.
  • సంక్షిప్త వార్తలు (3) సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు భంగపాటు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పేసర్‌ హేజిల్‌వుడ్‌ (6/49) ధాటికి కుదేలైన సఫారీ జట్టు 214 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.