ఎవరికి ఎన్ని కార్పొరేషన్లు?

- A
- A+
- A++

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని చోట్ల, ఎక్కడ పోటీ చేయాలన్న అంశంపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జనసేన నాలుగు మేయర్ స్థానాలు కోరుతున్నట్టు తెలిసింది. ఆ పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ స్థానాలు కేటాయించే అంశంపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. భాజపాకు తిరుపతి స్థానం కేటాయించే అంశంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. మున్సిపాలిటీలపైనా సంప్రదింపులు జరుగుతున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణాలు, ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాల ఆధారంగా స్థానాల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమావేశం కానున్నట్టు సమాచారం. వారి భేటీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు జిల్లా పరిషత్ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల సర్దుబాటుపైనా చర్చలు మరింత ముందుకి వెళ్లేందుకు అవకాశం ఉంది.
గెలుపే ప్రాతిపదిక!
2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంతకు మించిన ఫలితాలతో తమకు ప్రజాదరణ ఏ మాత్రం చెక్కచెదరలేదన్న సంకేతం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. పొత్తు ధర్మానికి, ఐక్యతకు ఎక్కడా విఘాతం కలగకుండా, గెలుపే ప్రాతిపదికగా స్థానాల సర్దుబాటు జరగాలన్న లక్ష్యంతో కూటమి పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. మూడు పార్టీల ముఖ్య నాయకులతో ఏర్పడిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ పార్టీకి ఎక్కడ అనుకూలమన్న దానిపై ప్రాథమిక జాబితాలు రూపొందించాయి. ఇటీవల సీఎం చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారని, సోమవారం భేటీలో మరికొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చీలిక పెదవి.. చింతను తగ్గించొచ్చు! ఆరోగ్యాన్నే కాకుండా, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసే సమస్య గ్రహణ మొర్రి. దీనిపై అనేక మూఢనమ్మకాలూ ఉన్నాయి.
- ద్విచక్ర వాహనమూ స్మార్ట్ అవుతోంది ఒకప్పుడు కార్లకే పరిమితమైన ఆధునిక ఫీచర్లు, సాంకేతికతలు ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లోకీ వచ్చేశాయి. కార్లతో పోటీగా ధీటైన సౌకర్యాలతో మార్కెట్లోకి వస్తున్నాయి.
- అక్కడ బంగారం దొరుకుతుంది.. సైలెంట్‌గా తెచ్చేద్దాం! యూట్యూబ్‌లో రీల్స్ చూసి యాభై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బంగారం వేట కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
- నౌకా నిర్మాణ హబ్‌గా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
- కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించలేం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనేక ఏళ్లుగా అమలులో ఉన్న విధానమే ఇప్పుడూ అమలు చేస్తున్నామని.. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- యువశక్తే దేశానికి దిక్సూచి భారత యువత ఉత్సాహం, పరుగులు పెడుతున్న సాంకేతికతతో 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
- మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎంతో తెలుసా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో, ఎంత మందికి సంక్షేమ...
- దుర్గమ్మను దర్శించుకున్న విజయ్ తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దర్శించుకున్నారు.
- మీది ద్రోహం.. మాది భరోసా! స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించి వైకాపా తీవ్ర అన్యాయం చేస్తే, కూటమి ప్రభుత్వం 40 శాతానికిపైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ భరోసా ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
- జడ్పీ ఛైర్పర్సన్ పదవుల్లో బీసీలకు 6.. ఎస్సీలకు 5 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులకు ప్రభుత్వం మంగళవారం రిజర్వేషన్లు ప్రకటించింది.
- ఎన్సీసీ ఛైర్మన్ ఏవీఎస్ రాజు కన్నుమూత ఎన్సీసీ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సంస్థ గౌరవ ఛైర్మన్ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) (89) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.
- మేయర్ అభ్యర్థుల నామినేషన్ డిపాజిట్ రూ. 3,000 నగరపాలక సంస్థల్లో మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నామినేషన్ డిపాజిట్ (ధరావతు)ను ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
- పల్లెపండగ 3.0లో మరిన్ని రహదారులు పల్లెపండగ 3.0లో రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 161 డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు.
- కొరియన్ కనకరాజుల ముందు షూపు! బూట్లు, చెప్పులు ఏంటి.. ఇలా వరుసగా ఉన్నాయనుకుంటున్నారా? ఓ కొరియన్ రెస్టారెంట్లో ఈ పద్ధతి పాటిస్తున్నారు.
- అంతర్జాతీయ సాంకేతిక హబ్‌గా అమరావతి అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
- ఏపీఈఆర్సీ సభ్యుడిగా పాండురంగారావు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సభ్యుడిగా (న్యాయవిభాగం) అంచా పాండురంగారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఐటీ చట్టంలోని సెక్షన్ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధం ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. దానిని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
- గవర్నర్ ఉదారత గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరుపేద రోగుల పట్ల ఉదారత చాటారు. జీజీహెచ్‌లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆయన సొంత నిధులు రూ.12.65 లక్షలతో...
- ఆహార వ్యర్థాలతో ఆహా.. అనేలా! ఈ చిత్రంలో కనిపిస్తోంది బయోగ్యాస్ ప్రొడక్షన్ ఫ్రం ఫుడ్ వేస్ట్ ప్లాంట్. బాపట్ల వ్యవసాయ కళాశాలలో దీని సాయంతో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు.
- రాష్ట్రంలో కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (పీఎంఎన్డీపీ) కింద కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.