24 kg Kachidi Fish Sells Rs 80K

కోనసీమ జిల్లా:పల్లిపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు ఆదివారం మగ కచిడి చేప వచ్చింది. సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. 24 కిలోల బరువున్న ఈ చేపను నరసాపురానికి చెందిన ఒక వ్యాపారస్తుడు రూ.80 వేలకు కొనుగోలు చేసుకున్నాడు. అరుదుగా దొరికే మగ కచిడి చేప ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కచిడి చేపను గోల్డెన్‌ ఫిష్‌గా కూడా పిలుస్తారు. దీని కొనుగోలు ధరలో ఒక వంతు చేపకు వర్తిస్తే, రెండొంతులు పొట్ట భాగానికి వర్తిస్తుంది. దీని పొట్ట భాగంతో ఆపరేషన్‌ సమయంలో కుట్లు వేసే ధారం తయారీ చేస్తారు. దీనివల్ల మగ చేపకు డిమాండ్‌ ఉంటుంది.