
source: X
పాకిస్తాన్లో జరగనున్న వన్డే ట్రై సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ పథుమ్ నిస్సంక గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో 32 ఏళ్ల బ్యాటర్ లహిరు ఉదారకు జట్టులో చోటు కల్పించారు.
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన నిస్సంక ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఎడమ తొడ కండరానికి (హ్యామ్‌స్ట్రింగ్) గాయం కావడంతో అతడికి శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి అనుమతి లభించలేదు. అంతకుముందు పక్కటెముకల గాయం కారణంగా పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యాడు.
నిస్సంక స్థానంలో జట్టులోకి వచ్చిన లహిరు ఉదారకు ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడిన అనుభవం కూడా లేదు. అయితే టీ20 క్రికెట్లో అతడు మంచి ప్రదర్శన చేస్తున్నాడు.
ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులు చేసిన ఉదార.. తొలి మ్యాచ్‌లోనే 91 పరుగులతో ఆకట్టుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 434 పరుగులు సాధించాడు.
పాకిస్తాన్ ట్రై సిరీస్‌కు శ్రీలంక జట్టు
కుశాల్ మెండిస్ (కెప్టెన్), సహన్ ఆరాచిగే, దుష్మంత చమీర, సచిందు కొలంబాగే, అవిష్క ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, జనిత్ లియానగే, దిల్షాన్ మదుశంక, ఈషాన్ మలింగ, కమిందు మెండిస్, కమీల్ మిశారా, లహిరు ఉదార, పవన్ రత్నాయకే, దసున్ శనక, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే
కాగా, కుశాల్ మెండిస్ నాయకత్వంలో శ్రీలంక ఈ ట్రై సిరీస్‌లో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాక్, ఇంగ్లండ్ జట్లు కూడా పాల్గొంటాయి. ఈ సిరీస్ అక్టోబర్ 18న జరిగే పాక్-శ్రీలంక మ్యాచ్‌తో మొదలవుతుంది.
ఇదీ చదవండి:చీఫ్ సెలెక్టర్‌గా రమేశ్ పవార్..? ఓజా తాత్కాలికమే..!