Sensex, Nifty Trade Flat: Today Latest Market News and Key Highlights

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు పెరిగి 22,556 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 39 పాయింట్లు పుంజుకొని 72,517 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 102.15
  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 102.9 డాలర్లు
  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.24 శాతానికి చేరాయి.
  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.59 శాతం పెరిగింది.
  • నాస్‌డాక్‌ 0.64 శాతం పుంజుకుంది.

మార్కెట్‌ సరళిపై విశ్లేషకుల అంచనాలు

  • గ్లోబల్ ప్రతికూలతలు, బాహ్య సవాళ్ల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించే ముప్పు ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ ఆధారిత కంపెనీలు ప్రస్తుతం భారీ వ్యాల్యుయేషన్లలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటి లాభాలు మందగించే అవకాశం ఉంది.
  • భారత ఈక్విటీ మార్కెట్లలో ఉన్న ప్రీమియం వ్యాల్యుయేషన్లు తగ్గుతూ దిద్దుబాటు వైపు అడుగులు వేయవచ్చు.
  • రాజకీయ, ఆర్థిక పరమైన సవాళ్ల వల్ల దాదాపు మూడేళ్ల పాటు సంస్కరణలు నెమ్మదించే అవకాశం ఉంది.
  • ఏఐను వివిధ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పూర్తిగా వినియోగంలోకి తేవడానికి కనీసం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

పెట్టుబడులను కేవలం ఈక్విటీలకే పరిమితం చేయకుండా కనీసం వేర్వేరు అసెట్ క్లాసెస్ (ఉదాహరణకు: ఈక్విటీలు, పసిడి/డెట్, రియల్ ఎస్టేట్) లో వైవిధ్యపరచాలి. మార్కెట్లను ఒకే కోణంలో చూడటం మదుపరుల ఆర్థిక ఆరోగ్యానికి చేటు. సరైన అసెట్ అలోకేషన్ పాటించడం ద్వారా మాత్రమే రాబోయే ఆర్థిక ఒడిదొడులకులను తట్టుకొని స్థిరమైన సంపదను సృష్టించుకోగలరు.

Today Nifty position 12-10-2026(time: 09:27 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)