IND vs WI 4th T20I HYD: HCA Reveals Tickets Details; Check Prices

PC: BCCI X

టీమిండియా- వెస్టిండీస్‌మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం (అక్టోబరు 14) ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) కార్యదర్శి జీవన్‌ రెడ్డి టికెట్ల వివరాలను వెల్లడించారు.

కనీస టికెట్ ధర రూ. 750
‘‘భారత్‌- విండీస్‌ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. కనీస టికెట్ ధర  750 రూపాయలు పెట్టాం. అత్యధిక  టికెట్  ధర 20 వేలు. HCA మొదటి సారి పాఠశాల విద్యార్థులకు 2500 టికెట్స్, భారత ఆర్మీకి  250 ఉచిత టికెట్లు ఇస్తున్నాం. పార్కింగ్, ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో మెట్రో రైలులో వచ్చి మ్యాచ్ చూడండి.

శుక్రవారం సాయంత్రం మరిన్ని.. రిలీజ్‌
మ్యాచ్ ఆరంభానికి రెండు గంటల ముందు స్టేడియానికి చేరుకోవాలి. మొత్తం 34 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాము. యాప్‌లో ఒకేసారి నాలుగు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటి వరకు 12 వేల టికెట్లు  అమ్ముడు పోయాయి. 

మళ్ళీ శుక్రవారం సాయంత్రం 12 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో పెడతాం. చివరి 48 గంటల్లో 10 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తాము. టికెట్లకు బాగా డిమాండ్‌ ఉంది. అందుకే బ్లాక్‌లో అమ్మకాలు కాకుండా ఆన్‌లైన్‌లోనే పెట్టాము’’ అని జీవన్‌ రెడ్డి తెలిపారు.

చదవండి: నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. ఉచిత సలహాలు ఇవ్వకు