మీ అండదండలతో ఈసారి 117 సీట్లు గెలుస్తాం

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్; ఖైరతాబాద్, న్యూస్‌టుడే: ‘బహుజనులు.. కల్లుగీత కార్మికులు.. ప్రజలు.. గౌడన్నల అండదండలతో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డి.శ్రీనివాస్, సీఎల్పీ లీడర్‌గా పనిచేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అదే తరహాలో మహేశ్‌కుమార్‌గౌడ్, నేను కూడా పార్టీని రెండోసారి అధికారంలోకి తెస్తాం. సామాజిక న్యాయం... బహుజనులకు అధికారం.. ప్రజాప్రభుత్వ ఆశయం. భారాస నాయకులు మతి భ్రమించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చివరకు అఘోరా పూజలు, చేతబడులు చేయిస్తున్నారు. బహుజనుల కోసం పోరాడి గోల్కొండ ఖిల్లాను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సాయంత్రం జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. బహుజనులపై రాజులు, భూస్వాములు, జమీందార్లు దాడులు చేస్తుంటే సహించలేక పాపన్న ఒక్కడే సైన్యంగా మారి దండయాత్రలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన చరిత్ర బ్రిటిష్ లైబ్రరీలో ఒక గ్రంథంగా ఉందని అన్నారు. ఆ చరిత్ర అందరికీ తెలియాలని.. ఆయన పోరాట స్ఫూర్తితో లక్షల మంది తమ జీవితాలను మార్చుకోవాలన్న లక్ష్యంతోనే ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేశామని వివరించారు. ఈ శుభ సందర్భంలోనే ముదిరాజుల ఆరాధ్యుడు పండుగ సాయన్న జయంతి అక్టోబరు 22ను ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

కాలువల గట్లపై ఈత, తాటి చెట్లు..
‘‘గీత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గీత, చేనేత కార్మికులకు అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశించాం. కుల వృత్తినే జీవనాధారంగా చేసుకున్న గౌడ సోదరులారా.. రాష్ట్రంలోని కాలువ గట్లపై ఈత, తాటి చెట్లను పెంచుకోండి. సారవంతమైన కల్లును తయారు చేయండి. ఆ చెట్లు పెంచుకునేందుకు సహకరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరుదాం. అవి ఎదగడానికి నాలుగైదేళ్లు పడుతుంది. తర్వాత క్రమం తప్పకుండా కల్లు విక్రయాలతో ఆదాయం వస్తుంది. భారాస ప్రభుత్వంలో.. బర్రెలు, గొర్రెలు కాసుకోండి, చెప్పులు కుట్టుకోండి అన్నారు. మేము మాత్రం.. మీ కులవృత్తులు కొనసాగిస్తూనే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరుతున్నాం. ఎందుకంటే... మీ తల రాతను ఇప్పుడు మీరు మార్చుకోలేరు. మీ పిల్లల్ని చదివిస్తే.. వారు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లుగా మారి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. చదువుకోవడం వల్లే మధుయాస్కీ గౌడ్ విదేశాలకు వెళ్లారు. అక్కడ ఎంతోమందికి సాయం చేశారు.

నాడు కేసీఆర్.. కుటుంబానికే న్యాయం చేశారు
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. పదేళ్లపాటు అధికారంలో ఉన్నారు.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు.. ఆయన తన కుటుంబానికే న్యాయం చేశారు. కేటీఆర్, హరీశ్‌లు మంత్రులయ్యారు. కవిత ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీ అయ్యారు. వినోద్‌కుమార్ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడయ్యారు. సంతోష్ రాజ్యసభ సభ్యుడయ్యారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మహేశ్‌కుమార్‌గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లు మంత్రులయ్యారు. వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు మహిళా కమిషన్ సభ్యురాలయ్యారు. ప్రజాప్రభుత్వం ప్రకటించిన పనుల్లో కొంత ఆలస్యం కావొచ్చు కానీ అన్ని హామీలు నెరవేర్చుతాం. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బావా బామ్మర్దులు చెట్లకు, పుట్టలకు మొక్కుతున్నారు.. చేతబడులు చేయిస్తున్నారు. ఇలాంటి వాళ్లు సమాజానికి మంచిది కాదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు మల్లురవి, వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.ప్రకాశ్ గౌడ్, బీర్ల ఐలయ్య, నవీన్ యాదవ్, వీర్లపల్లి శంకర్, మందుల సామేల్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్‌యాదవ్, మధుయాస్కీగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కల్లుగీత అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, వైస్ఛైర్మన్లు చంద్రశేఖర్‌గౌడ్, నాగరాజుగౌడ్, కాంగ్రెస్ నాయకులు ఇందిరా శోభన్, రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మట్టి.. బానిసత్వాన్ని సహించదు: భట్టి
సామాన్యులు కలలుగంటే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని సర్వాయి పాపన్న గౌడ్ నిరూపించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ‘‘రాజులు, జమీందార్లపై దండయాత్ర చేసి కోటలను స్వాధీనం చేసుకున్నారు. సంక్షేమ పాలన అందించారు. ఎందుకంటే తెలంగాణ మట్టి బానిసత్వం సహించదు. అణచివేతను అంగీకరించదు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్న భావనతో విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ప్రజాప్రభుత్వం మూల సిద్ధాంతాలను ఎప్పుడూ మర్చిపోలేదు’’ అని అన్నారు.
వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి: పొన్నం
గౌడ కులస్థులు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘మీ సంక్షేమం కోసం చాలా నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో ఆదరణ పథకం కింద మోపెడ్లు ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా గీత కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని అన్నారు.
మరో ఐదుసార్లు రేవంత్ ప్రభుత్వమే: మహేశ్‌కుమార్‌గౌడ్
బహుజనులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్‌రెడ్డి మరో ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ‘‘ఎందుకంటే మాకన్నా ఎక్కువగా ఆయన బహుజన నాయకుల గొప్పదనాన్ని కోట్లమందికి తెలిపేలా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్‌కు నీరా రుచి తెలియకపోయినా.. భట్టి విక్రమార్కకు తెలుసు. అన్నీ ఆధునికంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో బార్లలోనూ కల్లు అవుట్లెట్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలి’’ అని కోరారు.

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రేవంత్‌గౌడ్ జిందాబాద్.. అంటూ నినాదాలు హోరెత్తాయి. విగ్రహావిష్కరణ అనంతరం సచివాలయం ముందున్న లుంబినీ పార్కు రోడ్డుపై సభ ఏర్పాటుచేశారు. సభలో మహేశ్‌కుమార్‌గౌడ్ తన ప్రసంగంలో సీఎంని రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్‌గౌడ్ అనడంతో.. ఒక్కసారిగా సభలోని జనం రేవంత్‌గౌడ్ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కార్యక్రమానికి వచ్చిన వారిని ఉత్సాహపరుస్తూ మాట్లాడగా సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గాయకుడు నర్సన్న రేవంత్‌రెడ్డిపై, సర్వాయి పాపన్నపై పాడిన పాటలతో సభ మార్మోగింది. గౌడన్నలు నృత్యాలు చేస్తూ పాటను అనుసరించారు. పలువురు గౌడన్నలు కల్లుగీత పరికరాలతో సభలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గౌడ సంఘాల నాయకులు, గౌడన్నలు, నగరానికి చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- దయచేసి వినండి... మీ ప్రయాణం సురక్షితం కావాలంటే.. రైలు ప్రయాణం వేగవంతమైంది... సౌకర్యాలు పెరిగాయి... అదే సమయంలో ఆపదలూ పెరిగాయి... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలూ ముంచుకొస్తాయి... ఒక్క క్షణం నిర్లక్ష్యం...
- పులి భయం... కూలీలకు రైతుల కాపలా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి, సికినాపూర్ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడంతో రెండు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
- ‘అధిక’ధరకు కరెంటు కొంటారా! సాధారణంగా ఎవరైనా ఏదైనా వీలయినంత తక్కువ ధరకే కొనాలని చూస్తారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ జెన్కో చేపడుతున్న విద్యుత్ కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
- కంటికి రెప్పలా కాపాడుకునేలా! ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటల సాగు లక్ష్యం తగ్గగా.. ప్రస్తుతమున్న పంటలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
- సభ జరగకుండా ఆ రెండు పార్టీలు నాటకం: ఏలేటి శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న భాజపా గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలు అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
- సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని శాసన మండలి భారాస ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసమే మండలిని నడిపినట్లు ఉందని ఆరోపించారు.
- ఆ రెండు పార్టీలు.. ఆశలను వమ్ము చేశాయి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా గద్దెనెక్కిన భారాస, ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ప్రజల ఆశలను వమ్ము చేశాయని జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు విమర్శించారు.
- ఆపరేషన్ పోలోతోనే భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం ఆపరేషన్ పోలోలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న యుద్ధ ట్యాంక్ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
- ఉమ్మడి కుటుంబం ఒక బలమైన సామాజిక వ్యవస్థ ఉమ్మడి కుటుంబం అనేది బలమైన సామాజిక వ్యవస్థ అని.. ఆ విలువలను కొత్త తరానికి అందించే బాధ్యత మనమంతా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.
- ఉదయం కడగళ్లు.. మధ్యాహ్నం పరవళ్లు సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలంలో శనివారం రాత్రి జోరు వాన కురిసింది. దీంతో పాలేరు వాగు పొంగిపొర్లి.. వెంకేపల్లి, తాళ్లసింగారం, యడవెల్లిలోని చెక్‌డ్యాంలు వరదనీటితో కళకళలాడాయి.
- న్యాయం అందించడంలో వేగం పెరగాలి న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే కాకుండా సత్వర, పారదర్శక న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ పిలుపునిచ్చారు.
- బంబార వేరుసెనగ సాగుకు తెలంగాణ అనుకూలం ఆఫ్రికా దేశానికి చెందిన బంబార రకం వేరుసెనగ సాగుకు రాష్ట్రం అనుకూలంగా ఉందని కిర్క్హౌస్ ట్రస్టు, ఇంగ్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.క్లాడియా కానలెన్ హోల్జైస్, దిల్లీ (ఎన్‌బీపీజీఆర్) ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు డా.కుల్దిప్ త్రిపాఠి పేర్కొన్నారు.
- 17న తిమ్మాపూర్‌లో ‘సేవా అభియాన్’: కిషన్‌రెడ్డి ప్రధాని మోదీ 25 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘సేవా అభియాన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- పశుసంపదకు బ్రాండింగ్ ముర్రా, గిర్, సాహివాల్, రెడ్ సింధీ, ఒంగోలు, పుంగనూరు దేశంలో పేరొందిన ఆవుజాతులు. ముర్రా, జాఫరాబాదీ పేరొందిన గేదె జాతులు. ఇప్పుడీ జాబితాలో తెలంగాణ పశుసంపద కూడా చేరనుంది.
- మహాపూజకు వేళాయే.. ఖైరతాబాద్ మహా గణపతి పూర్తి రూపంతో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. సోమవారం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి.
- ఏకదంతాయ.. సూక్ష్మరూపాయా కేవలం 100 మైక్రాన్ల వెడల్పు ఉన్న తల వెంట్రుకపై 150 మైక్రాన్ల ఎత్తులో అతి సూక్ష్మ గణపతి శిల్పాన్ని రూపొందించారు వరంగల్‌కి చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్‌కుమార్.
- తటాలున వేట.. తటాకాలే నివాసాలంట! నీలిరంగు తోకతో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పక్షి పేరు బ్లూ-టెయిల్డ్ బీ-ఈటర్. కళ్లకు అడ్డంగా నల్లని పట్టీలు, గొంతు, ఉదర భాగాలు పసుపు, గోధుమ రంగులో ఉండటం వీటి ప్రత్యేకత.
- కార్ పూలింగ్‌కు చట్టబద్ధతపై కసరత్తు రోడ్లపై ట్రాఫిక్, కాలుష్య సమస్యలను పరిష్కరించడంలో భాగంగా కార్ల వినియోగాన్ని తగ్గించాలని రవాణాశాఖ భావిస్తోంది. జులై 31 నాటికి రాష్ట్రంలో కార్ల సంఖ్య 27.82 లక్షలకు చేరింది.
- అలా రద్దు.. ఇలా పోస్టింగులు ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయ పరిపాలనలో టీచర్ల డిప్యుటేషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. బోధన సిబ్బంది బోధనేతర పనుల్లో నియమించకూడదని అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేసిన నాలుగు నెలల వ్యవధిలో తిరిగి నియామకాలు చేపడుతోంది.