ఇమ్రాన్‌ఖాన్‌ను ఆసుపత్రికి తరలించండి

- A
- A+
- A++

ఇస్లామాబాద్: జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను రెండు రోజుల్లోగా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని మంగళవారం ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. 73 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంది. తదుపరి విచారణ జరిగే సెప్టెంబరు 16వ తేదీ వరకు ఇమ్రాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచి వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్సలు అందించాలని స్పష్టం చేసింది. వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో కలుసుకునే వెసులుబాటును మాజీ ప్రధానికి కల్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జైలులో ఉన్న ఇమ్రాన్‌ను కలిసేందుకు మంగళవారం అతని సోదరి నొరీన్ నియాజీని దాదాపు ఏడాది తర్వాత అధికారులు అనుమతించారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ముగిసిన ఒప్పంద గడువు ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడంతోపాటు ఆ దేశ అణు కార్యక్రమ వివాదానికి తెరదించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జూన్‌లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది.
- యుద్ధం.. బాలికా విద్యకు గొడ్డలిపెట్టు ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిపోయిన చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా పేద పిల్లలను, ముఖ్యంగా బాలికలను విద్యకు దూరం చేస్తున్నాయి.
- హర్మూజ్‌పై ఒమన్‌తో ఒప్పందం: ఇరాన్ హర్మూజ్ జల సంధిలో నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై ఒమన్‌తో ఒప్పందం కుదిరిందని ఇరాన్ సోమవారం వెల్లడించింది. హర్మూజ్ జల సంధి ఇరాన్, ఒమన్ తీరాల మధ్యగా సాగుతున్న సంగతి తెలిసిందే.
- మక్కా ఒడంబడికకు ట్రంప్ ప్రశంస మక్కా ఒడంబడిక పేరుతో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్‌లు ఇటీవల కుదుర్చుకున్న త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
- ఉక్రెయిన్‌లోని మిత్తల్ స్టీల్ ప్లాంటుపై దాడి ఉక్రెయిన్‌లోని ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంటుపై రష్యా జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోనే అతి పెద్ద స్టీల్ ప్లాంటు అయిన ఆర్సెలర్ మిత్తల్.. భారతీయ కోటీశ్వరుడైన లక్ష్మీ మిత్తల్‌కు చెందినది.
English Translation
Take Imran Khan to hospital

- A
- A+
- A++

Islamabad: Jailed former Prime Minister Imran Khan in two days On Tuesday, the Supreme Court of Pakistan ordered the government of Pakistan to take him to a private hospital and conduct medical tests. The court intervened in the wake of concerns over the health condition of 73-year-old Imran Khan by his family members and supporters who alleged that the prison was not providing proper medical facilities. It has been clarified that Imran will be kept in the hospital till September 16, when the next inquiry will take place, and treatment will be provided under the supervision of a team of doctors. It allowed the former prime minister to meet family members in the hospital once a week. After nearly a year, authorities on Tuesday allowed Imran's sister Noreen Niazi to meet him in jail following a Supreme Court order.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. No correspondence in this matter.
More
- Expired contract period The Memorandum of Understanding signed by US President Donald Trump last June with the intention of ending the war with Iran and opening up the dispute over the country's nuclear program expired on Monday. The rise in oil prices caused by Iran's war is keeping poor children, especially girls, out of education around the world.
- Agreement with Oman on Hormuz: Iran Iran announced on Monday that it has reached an agreement with Oman on a plan to manage shipping traffic in the Strait of Hormuz. It is known that the Strait of Hormuz is running between the coasts of Iran and Oman.
- Trump praises the Mecca Treaty. US President Donald Trump praised the tripartite defense agreement recently signed by Saudi Arabia, Turkey and Pakistan under the name of Makkah Pact.
- Attack on Mittal Steel Plant in Ukraine Two people were killed in the Russian attack on the ArcelorMittal steel plant in Ukraine. 13 people were injured. ArcelorMittal, the largest steel plant in Ukraine, is owned by Indian billionaire Lakshmi Mittal.