హర్మూజ్‌ ఇక మా భూభాగమే

Eenadu icon
By International News Desk Published : 19 Aug 2026 06:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

వాషింగ్టన్‌: ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రణాళికేమీ తమ వద్ద లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. హర్మూజ్‌లో నౌకపై దాడి జరిగినప్పటికీ పరిమితస్థాయిలో రాకపోకలున్నాయని, జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో తమ దిగ్బంధనాన్ని పూర్తిస్థాయిలో, ప్రభావవంతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. సముద్ర జలాల్లోని మందుపాతరలు అన్నింటినీ తొలగించినట్లు వెల్లడించారు. మరోవైపు, హర్మూజ్‌ అమెరికా భూభాగమేనంటూ ట్రంప్‌ మంగళవారం సామాజిక మాధ్యమంలో ఒక మ్యాప్‌ పోస్ట్‌ చేశారు. ఇదంతా ట్రంప్‌ భ్రమేనంటూ ఇరాన్‌ విదేశాంగశాఖ ఉపమంత్రి కజెమ్‌  తోసిపుచ్చారు. ఇరాన్‌ డిమాండ్లను అంగీకరించే వరకూ హర్మూజ్‌ మూసివేత కొనసాగుతుందన్నారు.

ఒమన్‌కు బెదిరింపు

హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై సంయుక్త నియంత్రణకు ఇరాన్‌తో ఒప్పందానికి చేరువైన ఒమన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఒమన్‌ తీరుతో తాను సంతోషంగా లేనని, ఆ దేశంపై బాంబులు వేస్తామని ట్రంప్‌ బెదిరించినట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇరాన్‌తో సంప్రదింపుల్లో ఒమన్‌ దృఢంగా వ్యవహరించలేకపోతోందని అమెరికా భావిస్తోంది. సౌదీఅరేబియాలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధికర్మాగారంపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీనిపై సౌదీఅరేబియా నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మహా శక్తిగా కాదు.. విశ్వ గురువుగా సేవ చేశాం ప్రపంచానికి భారత్‌ ‘విశ్వ గురువు’గా సేవ చేసిందే తప్ప, ‘మహా శక్తి’గా కాదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భాగవత్‌ అన్నారు.
  • యుద్ధవిరమణ వైపు కదలండి రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న అంతులేని పోరుకు తెరపడాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శాంతియుత పరిష్కారమే యావత్తు మానవాళి ప్రాధాన్యమని చెప్పారు.
  • జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా? అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై దృష్టిపెట్టిన ట్రంప్‌ సర్కారు.. హెచ్‌-4 వీసాలకు సంబంధించి ఓ గట్టి షాక్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • పాక్‌లో వందేళ్ల పురాతన ఆలయం కూల్చివేత పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో దాదాపు 100 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కూల్చివేశారు.
  • మంచు, రాళ్ల విస్ఫోటమే! మంచు, రాళ్ల విస్ఫోటమే నేపాల్‌లో వరద పోటెత్తడానికి కారణమని, భూకంపంగానీ, హిమనీనదం కరిగి వరద రావడంగానీ కారణం కాదని తాజా అధ్యయనం తేల్చింది.
  • గుర్తించలేక.. ఖననం మృతదేహాలు బయటపడుతున్నాయ్‌.. కట్టెలు కాలుతున్నాయ్‌.. సామూహికంగా సమాధి అవుతున్నాయ్‌.. అవి ఎవరివో.. ఎందుకు నేపాల్‌ వచ్చారో.. లేదంటే స్థానికంగా ఉంటున్న వారివైనా.. గుర్తించడానికి బంధువులెవరూ మిగిలి లేరో.. కానీ నేపాల్‌లో అత్యంత హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.