వీరికి మోదం.. వారికి ఖేదం

Eenadu icon
By National News Desk Published : 19 Aug 2026 06:10 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

 

రాంచీ: ఝార్ఖండ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉద్యోగ నియామకాల పరీక్ష రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. సంబరాలు చేసుకుని దీక్షలు విరమించగా.. పరీక్ష రద్దుతో ఉద్యోగాలు కోల్పోయినవారు రోడ్డెక్కారు. 

  • ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై నిరాహార దీక్షలు చేస్తున్న ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు దీక్షలను విరమించారు. ఝార్ఖండ్‌ స్టేట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగ నియామక పరీక్షను రద్దు చేయడంతోపాటు ప్రైవేటు సంస్థ 2014 నుంచి నిర్వహించిన అన్ని నియామకాలను నిలిపేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోమవారం రాత్రి ప్రకటించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. జేకేఎల్‌ఎం నేత దేవేంద్ర మహతో సోమవారం రాత్రే దీక్ష విరమించగా.. మంగళవారం ప్రేమ్‌ నాయక్, ఉమ్మీ హబీబా విరమించారు. రాహుల్‌ క్రాంతి, సబితా కుమారి, రూపేశ్‌ పాల్‌ ఇంకా దీక్షలను విరమించలేదు. విద్యార్థుల డిమాండ్లలో ఇంకా సీబీఐ దర్యాప్తు ఒక్కటే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆందోళనల విరమణలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యార్థి నేతలు తెలిపారు. 
  • ఝార్ఖండ్‌లో మొత్తంగా 44 నియామక పరీక్షలు రద్దయ్యాయి. 2014 నుంచి నిర్వహించిన పరీక్షలు ఇందులో ఉన్నాయి.

2,000 మంది భవితవ్యం ప్రశ్నార్థకం..

స్టేట్‌ కమిషన్‌ నియామక రద్దుతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన 2,000 మంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వారంతా మంగళవారం ఝార్ఖండ్‌ సచివాలయంవద్ద బైఠాయించారు. తమను తాము సమర్థించుకోవడానికి పారదర్శక అవకాశాన్ని ఇవ్వాలని డిమాండు చేస్తూ సచివాలయం నుంచి బిర్సా చౌక్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఎవరో కొందరు చేసిన తప్పునకు అందరినీ శిక్షించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కోర్టుల తీర్పులతోనే తాము నియామకాలు పొందామని, ఇప్పుడు రద్దు చేస్తే ఎలాగని నిలదీస్తున్నారు. 2,000 మంది అక్రమంగా ఎలా నియమితులవుతారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. 

ఆందోళన శిబిరంవద్ద పలువురు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగి తన భార్యను విడాకులు తీసుకోవాలని కోరారు. ఉద్యోగం ఉందని తనను పెళ్లి చేసుకుందని, ఇప్పుడు ఉద్యోగం పోతున్నందున తన నుంచి విడాకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల కిందట వివాహం చేసుకున్న సందీప్‌ను మంగళవారం భద్రతా సిబ్బంది కార్యాలయంలోకి రానివ్వలేదు. దీంతో ఆయన ఆవేదనతో విడాకులు తీసుకోవాలని భార్యకు సూచించారు. 

అభయ్‌ తివారీ భార్య, సోదరుడి అరెస్టు

ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన కేసులో కీలక నిందితుడు అభయ్‌ తివారీ భార్య సుష్మా కుమారి, అతడి సోదరుడు అక్షయ్‌ తివారీని మంగళవారం ఝార్ఖండ్‌ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు వారిని పలు గంటలపాటు విచారించారు. బ్లాక్‌ సరఫరా అధికారిగా పోరియహట్‌లో నియమితుడైన అభయ్‌ నియామకాల్లో అక్రమాలకు సూత్రధారిగా ఉన్నారు. అతడిని జులై 22వ తేదీన సీఐడీ అరెస్టు చేసింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆ హైకోర్టు దుస్థితి ఎలా ఉందో చూడండి: సుప్రీంకోర్టు ‘న్యాయవిద్య కళాశాలల్లో తొలి ఏడాదే విద్యార్థులకు నేర్పే న్యాయసూత్రాలివి. ఇలాంటి తీర్పులు మా వద్దకు రావడం ఇదే తొలిసారి కాదు.
  • ‘నీలి డ్రమ్ము’ హత్యకేసులో ఆమెకు, ప్రియుడికి మరణశిక్ష దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీలి డ్రమ్ము’ హత్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
  • పండగ వ్యాపారాన్ని కాపాడండి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ సాగుతున్న నిరసనోద్యమం సందర్భంగా ప్రజా నియంత్రణలపై దేశంలోని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తంజేశాయి.
  • తిహాడ్‌ జైలుకు సీజేపీ నేతలు కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్‌ రాంకాలకు ఐదురోజుల జైలుశిక్ష విధించారు.
  • రైల్వే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌ రాబోయే దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రైల్వేలోని 11,40,770 మంది ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • విద్యార్థులకు అడ్డు రావొద్దు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విద్యార్థులకు అడ్డు రావొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ హితవు పలికారు.
  • ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు? మీరు దేనినైతే పదే పదే పునరావృతం చేస్తారో, మీ మెదడు ఆ విషయంలో మరింత నైపుణ్యం సాధిస్తుంది.
  • సంక్షిప్త వార్తలు (7) ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, దీనిని ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంటు వంటి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దాడి చేయడం సరికాదని హార్వర్డ్‌ విద్యావేత్తల బృందం పేరుతో విడుదలైన ఒక ప్రకటన పేర్కొంది.
  • డేటా సెంటర్ల అనుమతులకు పంచ సూత్రాలు రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చే సమయంలో ఐదు సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని నీతి ఆయోగ్‌ సూచించింది.
  • పరిహారం కోరే హక్కు ఆ కుటుంబాలన్నిటికీ ఉంది రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొని మృతి చెందిన భారతీయుల కుటుంబాలు పరిహారం, సహాయం కోరేందుకు ముందుకు వచ్చేలా బహిరంగ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.
  • ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు(2023) వీడియో రికార్డుల ఫుటేజీ లభించడంలేదన్న ఎన్నికల సంఘం (ఈసీ) సమాధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • నిందితుడికి రాజ్యాంగ పదవా? హత్య కేసులో నిందితుడిగా ఉన్న వీఐపీకి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ పదవి ఇచ్చి రక్షణ కల్పించిందని, ఆ కేసులో బాధితులకు నాలుగేళ్లయినా ఇంతవరకూ న్యాయం చేయలేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.
  • తండ్రికి కాలేయదానం కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రం బాందాలో తీవ్రమైన కాలేయవ్యాధితో బాధపడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు పడిన తపన ఫలించింది.
  • మోదీ గుడి నిర్మించేదాకా.. రాముడు 400 ఏళ్లు గుడారంలోనే ఉన్నాడు: బిహార్‌ సీఎం ప్రధాని మోదీ అయోధ్యలో ఆలయం కట్టించేవరకూ శ్రీరాముడు 400 ఏళ్ల పాటు టెంట్‌లోనే ఉన్నాడని బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధరీ వ్యాఖ్యానించారు.
  • కనుపాప సమస్య ఉన్న వారికి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ఎలా? రాయితీతో కూడిన వంట గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
  • అకోయిజంను అరెస్ట్‌ చేయాలి: ఏబీవీపీ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నుంచి తొలగింపునకు గురైన మణిపుర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అంగోమ్చా బిమోల్‌ అకోయిజంను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ బుధవారం జేఎన్‌యూ వద్ద నిరసనలు ప్రారంభించింది.
  • ఫోన్‌ రిపేర్‌కు రూ.300 లంచం తీసుకున్న అధికారికి ఏడాది జైలు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ రిపేర్‌ కోసం రూ.300 లంచం తీసుకున్నందుకు హైదరాబాద్‌కు చెందిన టెలికాంశాఖ అధికారిపై సీబీఐ నమోదుచేసిన కేసులో కింది కోర్టులు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది.
  • ఆరాంకో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీలోని అతి పెద్ద చమురు సంస్థ ఆరాంకో ప్రధాన కార్యాలయంపై మంగళవారం రాత్రి హూతీలు దాడులు చేశారు.
  • పోటీ భోజనంబు.. అహహ్హ నేనే ముందు! ఈ చిత్రంలోని మహిళలంతా ఏదో వేడుకలో విందారగిస్తున్నారనుకుంటే పొరపాటే! వీరంతా రాగి ముద్దలు తినే పోటీలో పాల్గొంటున్నారు.
  • సన్యాసదీక్షలో ఉన్న క్యాథలిక్‌ ఫాదర్ల సంపాదన కుటుంబానికి చెందదు మతపరంగా సన్యాసదీక్ష స్వీకరించిన తర్వాత క్యాథలిక్‌ చర్చి ఫాదర్ల సంపాదన వారి వారసులకు చెందదని, సదరు మత సంస్థకే వెళ్తుందని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.