చెలామణిలో 17,600 కోట్ల నోట్లు

Eenadu icon
By Business News Desk Published : 19 Aug 2026 02:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉండే కరెన్సీల్లో అమెరికా డాలర్, ఐరోపా దేశాల యూరో ముందు స్థానాల్లో ఉంటాయి. అయితే నోట్ల సంఖ్యా పరంగా చూస్తే, వీటి కంటే దేశీయ కరెన్సీ అయిన  రూపాయి (వివిధ విలువలు కలిగినవి రూ. 1, 5, 10, 20, 50, 100, 200, 500) నోట్లే ఎక్కువని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ శిరీష్‌ చంద్ర ముర్ము తెలిపారు. జకార్తాలో జరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండొనేషియా క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సదస్సులో ఆయన ఈ గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్న డాలర్‌ నోట్లు 5,600 కోట్ల కంటే ఇవి 3 రెట్లు ఎక్కువ. యూరో నోట్ల సంఖ్య 3000 కోట్లు కాగా, వీటితో పోలిస్తే 6 రెట్లు అధికం. 

ఏటా 3,000 కోట్ల కొత్త నోట్లు:మన దేశంలో లావాదేవీలకు ఎక్కువగా తక్కువ విలువ కలిగిన నోట్లను వినియోగిస్తారు. కొంచెం ఎక్కువ ధర లావాదేవీలు నిర్వహించడానికి ఎక్కువ సంఖ్యలో నోట్లు అవసరమవుతాయి. దేశంలో ఏటా 3,000 కోట్ల వరకు కొత్త నోట్లను ఆర్‌బీఐ ముద్రిస్తోంది. అదే సమయంలో పాడైపోయిన లేదా వాడకానికి పనికిరాని దాదాపు 2,100 కోట్ల నోట్లను ఏటా ధ్వంసం చేస్తోంది. 

డిజిటల్‌ పెరిగినా తగ్గని నగదు:యూపీఐ, డిజిటల్‌ లావాదేవీలు దూసుకెళ్తున్నా, దేశంలో నగదు చెలామణి రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. నోట్ల ముద్రణ, పాత నోట్ల మార్పిడి ఖర్చులను తగ్గించడానికి పాలిమర్‌ నోట్లను తీసుకురావడానికి ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది.  

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • భారత్‌లో జావెలిన్‌ క్షిపణుల తయారీ భారత రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ టాటా గ్రూపు సంస్థ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
  • ప్రతి మూడేళ్లకు రూ.లక్ష కోట్ల వ్యాపారం పెంచుతాం బ్యాంక్‌ వ్యాపారాన్ని ప్రతి మూడేళ్లకు రూ.లక్ష కోట్ల మేర పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) బి.రమేశ్‌బాబు చెప్పారు.
  • భారత్‌ వృద్ధి భళా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌- జూన్‌)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసిన 7 శాతం కంటే ఇది ఎక్కువ.
  • రూ.1,27,500 కోట్లతో సెమీకాన్‌ 2.0 రూ.1,27,500 కోట్లతో సెమీకాన్‌ 2.0 పథకాన్ని నోటిఫై చేస్తూ  ప్రభుత్వం సోమవారం అమల్లోకి తెచ్చింది.
  • భయపెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో దేశీయ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
  • ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ సేవలు ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల కోసం ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోన్‌పే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • ‘రక్షణ’లో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ! విదేశీ పెట్టుబడిదార్లను మరింతగా ఆకర్షించే ఉద్దేశంతో రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఒక అధికారి తెలిపారు.
  • మూలధన వ్యయాలు పెంచిన మారుతీ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా వచ్చే అయిదేళ్లకు రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలను కేటాయించింది.
  • బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల అదనపు నిధులు బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు ద్రవ్యలభ్యత ఆగస్టు చివరి నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి.
  • జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం కోసం ఆష్విల్‌ నగరానికి సీతారామన్‌ అమెరికాలో ఆరు రోజుల పర్యటనలో భాగంగా జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం కోసం నార్త్‌ కరోలినాలో ఉన్న ఆష్విల్‌ నగరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేరుకున్నారు.
  • సంక్షిప్త వార్తలు(7) ఆహార డెలివరీ సంస్థ జొమాటో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న తన వినియోగదారుల సేవా కేంద్రాన్ని శాశ్వతంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది.
  • సుభాష్‌ చంద్ర దివాలా పరిష్కార ప్రణాళికపై అయిదుగురు సభ్యులతో ధర్మాసనం మీడియా దిగ్గజం సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో రుణదాతలు పేర్కొన్న రూ.22,000 కోట్లకు పైగా క్లెయిమ్‌లకు సంబంధించి రుణ చెల్లింపు ప్రణాళికపై నిర్ణయం తీసుకోవడానికి అయిదుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఎన్‌సీఎల్‌టీ ఏర్పాటు చేసింది.