
గూగుల్ తయారీ మన దేశానికే!

- A
- A+
- A++
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్, తన పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, ఇతర వేరబుల్ పరికరాల తయారీని చైనా నుంచి బయటకు తరలించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందువల్ల మనదేశంతో పాటు వియత్నాంకు ప్రయోజనం చేకూరొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో తన తయారీ కార్యకలాపాల విస్తరణను గూగుల్ చేపడుతున్న సంగతి తెలిసిందే. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి పిక్సెల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ ఇయర్‌బడ్స్ తయారీని చైనా నుంచి తరలించాలని యోచిస్తున్నట్లు గూగుల్ తన సరఫరాదార్లకు తెలియజేసింది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. గూగుల్ తన సరఫరా వ్యవస్థను విస్తరించుకోవాలని భావిస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే, ఇటీవలి సంవత్సరాల్లో వియత్నాం, భారత్‌లలో తయారీ సామర్థ్యాలను పెంచుతోంది. ఇప్పటికీ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల తయారీ అత్యధికంగా చైనాలోనే జరుగుతోంది. అయితే చైనాలో పిక్సెల్ స్మార్ట్ఫోన్లను గూగుల్ విక్రయించదు. అందువల్ల అక్కడ నుంచి వీటి తయారీని తరలించడం కంపెనీకి పెద్ద కష్టం కాదు. గత సంవత్సరం పిక్సెల్ ఫోన్ల ఎగుమతులు సుమారు 1.20 కోట్లు కాగా.. ఈ సంవత్సరం 8-10% మేర ఎగుమతులు పెరుగుతాయన్నది గూగుల్ అంచనా.
స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ ఇయర్‌బడ్స్ వంటి ఉత్పత్తుల తయారీతో పోలిస్తే, ప్రీమియం స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి సంక్లిష్ట ప్రక్రియ. ఈ సంవత్సరం తన హై-ఎండ్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల అభివృద్ధి, తయారీని గూగుల్ వియత్నాంలో ప్రారంభించగా, విజయవంతమైంది. మనదేశంలో ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి సంస్థల సహకారంతో పిక్సెల్ 10 శ్రేణి స్మార్ట్ఫోన్లనూ తయారు చేస్తోంది. ఇటీవల పిక్సెల్ 11 శ్రేణి స్మార్ట్ఫోన్లను సంస్థ విడుదల చేసింది. పిక్సెల్ 12 సిరీస్ స్మార్ట్ఫోన్లను మాత్రం పూర్తిగా చైనా వెలుపలే గూగుల్ తయారు చేయిస్తుందన్న అంచనాలున్నాయి.
ఇప్పటికే శామ్సంగ్ కూడా తన స్మార్ట్‌ఫోన్ తయారీని చైనా నుంచి తరలించింది. యాపిల్ తన తయారీ భాగస్వాముల ద్వారా భారత్‌లో ఐఫోన్ల తయారీని పెంచింది. అయితే చైనాలో ఐఫోన్ల తయారీ కొంతమేర కొనసాగుతోంది.
మనదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో బలమైన వృద్ధిని గూగుల్ ఆశిస్తోంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. మనదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విపణిలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా గూగుల్ నిలిచింది. ఇక్కడి విపణిపై పట్టు సాధించేందుకు భారత్‌లో తయారీపై గూగుల్ మరింత దృష్టి పెట్టనుంది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్కోడా నుంచి డీజిల్ కార్లు చెక్ రిపబ్లిక్ వాహన దిగ్గజం స్కోడా ఆటో, భారత మార్కెట్లో అయిదేళ్ల విరామం తర్వాత మళ్లీ డీజిల్ వాహనాలను ప్రవేశ పెట్టింది. సరికొత్త ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ సూపర్బ్ డీజిల్‌ను సంస్థ విడుదల చేసింది.
- ఎన్ఎస్ఈ విలువ రూ.5.26 లక్షల కోట్లు! ట్రేడింగ్ పరిమాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), ప్రతిపాదిత తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం తన విలువను రూ.5.26 లక్షల కోట్లు (55 బిలియన్ డాలర్లు)గా పరిగణించాలని ఆశిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు.
- అనుమానాస్పద విదేశీ నిధుల బదిలీలపై ఐటీ శాఖ నిఘా సరైన వ్యాపార కార్యకలాపాలు లేకుండానే విదేశాలకు భారీగా నగదు బదిలీ చేస్తున్న అనుమానస్పద సంస్థలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, ఈ సంస్థలకు పన్ను ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లపై ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నిఘా పెట్టింది.
- లాలాజల పరీక్ష నిర్వహించండి పైలట్లకు ప్రస్తుతం నిర్వహిస్తున్న డ్రగ్స్ పరీక్షల్లో భాగంగా మూత్ర పరీక్షలతో పాటు అదనంగా లాలాజల పరీక్ష (ఓరల్ ఫ్లూయిడ్)లనూ నిర్వహించాలని భారతీయ పైలట్ల సమాఖ్య (ఎఫ్ఐపీ) కోరుతోంది.
- సంక్షిప్త వార్తలు(5) ఆంప్లిఫోన్ ఇండియా వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, వినికిడి సంరక్షణ రంగంలో సేవలు అందిస్తున్న హైదరాబాద్ సంస్థ హియర్జాప్ వెల్లడించింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ ఈ లావాదేవీలో కీలక ఆర్థిక భాగస్వామి.
- ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసుల ప్రభావం.. తప్పులు సరిదిద్దుకున్న డాబర్ సహా 5 సంస్థలు ఆహార ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే లేబుళ్లు, నిబంధనలకు విరుద్ధమైన క్లెయిమ్‌లు, ప్రకటనలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన నోటీసులపై డాబర్ ఇండియా, ఫెర్న్స్ ఎన్ పెటల్స్, మరో 4 నాలుగు సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి.
- 10 లక్షల కంపెనీలు.. 50 లక్షల ఉద్యోగాలు ‘దేశంలోని ప్రస్తుత అంకురాలు, కంపెనీలకు మద్దతునిస్తున్న పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 10 లక్షల కంపెనీలు, 50 లక్షల వరకు ఉద్యోగాలను సృష్టించొచ్చు’ అని మేధో సంపత్తి సంస్థ భారత్ ప్రాజెక్ట్ తెలిపింది.
- రోజూ రూ.2.2 లక్షల కోట్ల లావాదేవీలు మన దేశంలోనూ బంగారాన్ని ఆభరణాల కోసమే కాక, పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవడమూ పెరుగుతోంది. పసిడి డెరివేటివ్స్‌కు లభిస్తున్న విశేష ఆదరణే ఇందుకు నిదర్శనం.
- మ్యూచువల్ ఫండ్ల నమోదు.. ఇక సులభం మ్యూచువల్ ఫండ్ల నమోదు ప్రక్రియను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న సంక్లిష్ట విధానాన్ని మారుస్తూ, ఒకే దరఖాస్తు ద్వారా ప్రాథమిక, తుది అనుమతులు పొందేలా నిబంధనలను సరళీకరించింది.
- సరిహద్దుల్లో శత్రు డ్రోన్ల కట్టడి ఇంద్రజాల్కు రూ.155 కోట్ల ఆర్డర్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తున్న ఇంద్రజాల్ అటానమస్ డిఫెన్స్ సిస్టమ్స్, కేంద్ర హోం శాఖ నుంచి రూ.155 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
- క్లోజింగ్ ఆక్షన్ సెషన్ కొనసాగుతుంది దేశీయ స్టాక్ మార్కెట్లో ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానం కొనసాగుతుందని, దీన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు.
- విద్యుత్ సీప్లేన్లకు నార్వే పరిజ్ఞానం దేశంలో ప్రాంతీయ విమానయాన రవాణా సేవలను విస్తరించే లక్ష్యంతో సీప్లేన్ ఆపరేటర్ స్కైహాప్ ఏవియేషన్, నార్వే సంస్థ నోమి ఏరోస్పేస్ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
- ‘బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్’పై త్వరలో అత్యున్నత సంఘం వికసిత్ (అభివృద్ధి చెందిన) భారత్‌కు కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేలా బ్యాంకులకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్రం భావిస్తోంది.
- వరుసగా అయిదో రోజూ అమ్మకాలే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు అధిక ధరల నేపథ్యానికి తోడు ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ సూచీలు వరుసగా అయిదో రోజైన సోమవారమూ నష్టపోయాయి.
- టాటా సన్స్ ఏజీఎం నేడే టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) మంగళవారం జరగాల్సి ఉంది. అయితే మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన నిషేధం వల్ల, కీలక వాటాదారు అయిన సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ) తన ప్రతినిధిని నామినేట్ చేయడానికి అవకాశం లేదు.
- టెనెట్‌లో రూ.286 కోట్ల పెట్టుబడులు రోగ నిర్ధరణ సేవలు అందించే హైదరాబాద్‌కు చెందిన టెనెట్ మెడ్కార్ప్ (టెనెట్ డయాగ్నొస్టిక్స్)లో టాటా క్యాపిటల్ హెల్త్‌కేర్ ఫండ్-3, స్విట్జర్లాండ్‌కు చెందిన బ్లూ ఎర్త్ క్యాపిటల్ ఏజీ సంయుక్తంగా రూ.286 కోట్ల (30 మి.డాలర్లు) పెట్టుబడులు పెట్టాయి.
- విమాన ఛార్జీల నియంత్రణ నిబంధనలు దేశంలో విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించడం, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
- యోధా నుంచి ఈపాడ్- భారత్ విద్యుత్ వాహన సంస్థ యోధా, సరికొత్త ప్రయాణికుల త్రిచక్రవాహనం ‘ఈపాడ్- భారత్’ను సోమవారం విడుదల చేసింది. ఈ పరిమిత కాల ఎడిషన్ ప్రారంభ ధరను రూ.3.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
- ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఛైర్‌పర్సన్‌గా షబ్నం సిన్హా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సునీల్ మిత్తల్ తన పదవీ కాలాన్ని ముగించుకుని, 2026 సెప్టెంబరు 30 నుంచి బోర్డు నుంచి వైదొలగనున్నట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది.
- ఏడాదిపాటు స్థిర ఛార్జీలు: జియో భారతీ ఎయిర్టెల్ ఇటీవల కొన్ని ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచగా, ఇతర టెలికాం సంస్థలూ తమ టారిఫ్‌లను సవరిస్తాయన్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తన చందాదార్లకు కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.