అలా చేయకపోతే మనల్ని మనం కోల్పోతాం!: రష్మిక

- A
- A+
- A++

‘‘సోషల్ మీడియా ట్రెండ్లను పాటిస్తూ.. ఇతరుల అంచనాలను అందుకోవాలని చేసే ప్రయత్నాలు మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయ’’ని అంటున్నారు కథానాయిక రష్మిక. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా వ్యక్తిగత ప్రయాణంలో ఉన్నది ఉన్నట్లు పంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడతాను. సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకులు నన్ను చూసేది నిజజీవితంలో నేను ఎలా ఉంటానో దానికి దగ్గరగా ఉంటుంది. ట్రెండ్ల ప్రభావానికి లోనవకుండా ఒక నిర్దిష్టమైన ఇమేజ్‌లో ఇమడటానికి ఎక్కువగా ప్రయత్నించనప్పుడు ఇలాంటి సహజమైన వ్యక్తిత్వం వస్తుంది. బహుశా అదే నేనిలా ఉండడానికి సహాయపడుతుందని భావిస్తున్నా. మనం ఎలా ఉండాలో నిరంతరం చెబుతూ ఉండే ప్రపంచంలో బతుకుతున్నాం.
ఇతరుల అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సోషల్ మీడియా, ట్రెండ్లు, అభిప్రాయాలు మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయి. అందుకే నా దృష్టిలో సక్సెస్ అంటే ఫర్ఫెక్ట్ ఇమేజ్ కాదు.. ఎంత ఎదుగుతున్నా సరే మనం మనలా ఉంటూ ప్రేక్షకులతో నిజాయతీగా ఉండడమే. అలాంటి నిజాయతీని ఎప్పటికైనా ప్రేక్షకులు గుర్తిస్తారు. నటిగా ఉండడం వల్ల అంచనాలు, విమర్శలనేవి సహజం. అందరి అభిప్రాయాలను నియంత్రించలేమని, కానీ వాటికి ఎలా స్పందిస్తామన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని కాలక్రమేణా తెలుసుకున్నా. నా పనిపై దృష్టి పెట్టడం. వ్యక్తిత్వానికి కట్టుబడి ఉండడం, నా ప్రయాణమే నా గురించి చెప్పేలా చేసుకోవడం నాకు ఇష్టమ’’ని అన్నారు. ఇటీవలే ‘మైసా’ చిత్రీకరణలో గాయపడిన రష్మిక విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాలున్నాయి
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పవన్ ప్రతి అడుగూ మేలు కోసమే: చిరంజీవి ప్రతి క్షణం ప్రజలకు మేలు చేయాలనే తపన, బాధ్యతతో కూడిన సంకల్పం.. ఇవన్నీ చిన్నప్పటి నుంచే కల్యాణ్ బాబులో చూశానని అన్నారు అగ్రహీరో చిరంజీవి.
- ఏడాదికి ఆరు సినిమాలు చేయడానికైనా సిద్ధమే కానీ... ‘‘ప్రేక్షకులు ఈమధ్య థియేటర్లకు బాగా వస్తున్నారు. ఇన్నాళ్లూ తెలియకుండానే రక్తపాతం, చీకటి నేపథ్యంతో కూడిన కథలు చూసిన వాళ్లంతా ఇప్పుడు సున్నితమైన సరదా సినిమాల్ని కోరుకుంటున్నారు.
- సైకలాజికల్ థ్రిల్లర్‌లో త్రిష భాషలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక త్రిష.
- ఇలాంటి విజయం దశాబ్దానికి ఒకసారే! ఇది మన ఇంట్లో ఆడపిల్ల కథ... మన అమ్మానాన్నల కథ అనే అనుభూతిని కలిగించడంతోనే ‘ఇరుముడి’ సినిమాకి ఇంత ఆదరణ లభించిందన్నారు శివ నిర్వాణ.
- కొన్నేళ్ల తర్వాతైనా సరైన నిర్ణయం అనిపించాలి సినిమాల వసూళ్ల కంటే పోషించిన పాత్రలతో గుర్తుండిపోవడమే తనకు ముఖ్యమని అంటోంది నాయిక తాప్సి.
- సుదీప్.. ‘దేవరాయ’ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా... టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘దేవరాయ’.
- చిత్రసీమలో ప్రతిభే ముఖ్యం! మలుపులతో కూడిన అత్యంత ఆసక్తికరమైన కథతో ‘మా రాముడు అందరివాడు’ తెరకెక్కిందన్నారు సీనియర్ నటుడు సుమన్.
- సంక్షిప్త వార్తలు (3) ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవు. ఈ క్రమంలోనే యువత ఇ.ఎం.ఐ కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమే ‘ఇ.ఎం.ఐ’.
- ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహిస్తా! ఆరు నుంచి... అరవయ్యేళ్ల వయసున్న ప్రేక్షకుల వరకూ అందరికీ నచ్చేలా మా ‘రోమాంచకం’ ఉంటుందన్నారు సుమంత్ ప్రభాస్.
- ‘ప్రేమలు’ సినిమాతోనే బంధం బలపడింది! ‘‘తెలుగు ప్రేక్షకులతోనూ, హైదరాబాద్‌తోనూ నా బంధం బలపడింది ‘ప్రేమలు’ సినిమా కారణంగానే! అలాంటి మరో అందమైన చిత్రమే ‘బెత్లెహొమ్ కుటుంబ యూనిట్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు ఫహాద్ ఫాజిల్.
- పాత్రలు తెలిసినవైనా.. సంఘర్షణ కొత్తగా ఉంటుంది ఓటీటీ వేదికగా విడుదలై ఎంతో ప్రజాదరణ తెచ్చుకున్న వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడిది ‘మీర్జాపూర్ ది మూవీ’ పేరుతో వెండితెరపైకి రానుంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, సోనాల్ చౌహన్, రసికా దుగల్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాని గుర్మీత్ సింగ్ తెరకెక్కించారు.
- నటనలోనూ ఉపయోగపడింది నా డాక్టర్ చదువు: శ్రీలీల తన వైద్యవిద్య అనుభవాలు ఒక నటిగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అంటోంది యువ కథానాయిక శ్రీలీల. ఈమె నటిగానే కాకుండా.. వైద్యురాలిగా కూడా అందరికీ సుపరిచితమే.
- ఊహించని తుపానులా విరుచుకుపడే ‘మైసా’ ‘‘ఆ కోపం.. ఆ ఆవేదన! ఆ గుండె కోత.. ఆ దుఃఖం! ఆ పట్టుదల.. ఆ ధైర్యం! ఊహించని తుపానులా విరుచుకుపడే ఆ శక్తే ‘మైసా’’ అంటోంది నటి రష్మిక. ఇది ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న నాయికా ప్రాధాన్య సినిమా.
- ‘సర్దార్ 2’ హంగామా కార్తి కథానాయకుడిగా... పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ 2’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గూఢచర్యం నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా తీర్చిదిద్దిన ‘సర్దార్’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది
- ఇల్లంటే జ్ఞాపకమా? అమ్ముకునే వస్తువా? ఎన్నో జ్ఞాపకాల్ని, బంధాల్ని పరిచయం చేసిన మన ఇంటిని కూల్చేసి ఒక లగ్జరీ టవర్ నిర్మిస్తామంటే ఊరుకుంటామా? లేదు కదా! ఇలాగే ఓ రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి తన అపార్ట్‌మెంట్‌ను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.
- చిత్ర నిర్మాణంవైపు నిత్య అడుగులు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యమేనన్ నిర్మాతగానూ సినీప్రియుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది.
- రవితేజ భావోద్వేగానికి గురయ్యారు: మాధవ్ ‘‘ఓ కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే ప్రతి సినిమా ఓ బ్లాక్‌బస్టరే. ‘మారెమ్మ’లో ఆ అంశాలన్నీ బాగా కుదిరాయి’’ అన్నారు దర్శకుడు శివ నిర్వాణ. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రమే ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ తెరకెక్కించారు.
- సంక్షిప్త వార్తలు (4) ‘‘కోరుకున్న లైఫ్ ఇదే.. ఎవరికీ ఎవరు కానీ చోటు ఇదే. వేల మైళ్ల దూరమే.. మనవారికి ఊరికీ..’’ అంటూ పాటలు పాడుతున్నాడు ఆనంద్ దేవరకొండ.