‘ఏపీపీఎస్సీని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 19 Aug 2026 06:12 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ‘గత వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. గత తెదేపా ప్రభుత్వంలో నియమితులైన ఛైర్మన్‌ను అనేక రకాలుగా వేధించారు. ఇదంతా మాజీ సీఎం జగన్‌ కనుసన్నల్లోనే జరిగింది’ అని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సెంటర్‌ ఫర్‌ లిబర్టీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వ హయాంలో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ఛైర్మన్‌ సంతకం లేకుండా అర్హత లేనివారి ద్వారా మూల్యాంకనం చేసి అడ్డదారుల్లో పోస్టులు కట్టబెట్టారు. డిజిటల్‌ వాల్యుయేషన్‌ ఏపీపీఎస్సీ విధానానికి విరుద్ధం.

అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా డిజిటల్‌ వాల్యుయేషన్‌ చెల్లదని తీర్పు వచ్చింది. పేపర్లు దిద్దిన వారంతా ఆంజనేయుల బంధువులు. 2022 ఫిబ్రవరి 19న ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్‌ సవాంగ్‌ అధ్యాపకులతో కాకుండా పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించారు. గ్రూప్‌-1లో చోటుచేసుకున్న అక్రమాలపై డీఎస్పీ స్థాయి అధికారితో సిట్‌ వేయటం దారుణం. ఏడాది నుంచి ఛైర్మన్‌ పోస్టును భర్తీ చేయలేదు. వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశ్నించారు. సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సభ్యులు నల్లమోతు చక్రవర్తి, ఎ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చీలిక పెదవి.. చింతను తగ్గించొచ్చు! ఆరోగ్యాన్నే కాకుండా, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసే సమస్య గ్రహణ మొర్రి. దీనిపై అనేక మూఢనమ్మకాలూ ఉన్నాయి.
  • ద్విచక్ర వాహనమూ స్మార్ట్‌ అవుతోంది ఒకప్పుడు కార్లకే పరిమితమైన ఆధునిక ఫీచర్లు, సాంకేతికతలు ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లోకీ వచ్చేశాయి. కార్లతో పోటీగా ధీటైన సౌకర్యాలతో మార్కెట్లోకి వస్తున్నాయి.
  • అక్కడ బంగారం దొరుకుతుంది.. సైలెంట్‌గా తెచ్చేద్దాం! యూట్యూబ్‌లో రీల్స్‌ చూసి యాభై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బంగారం వేట కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
  • నౌకా నిర్మాణ హబ్‌గా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
  • కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరించలేం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనేక ఏళ్లుగా అమలులో ఉన్న విధానమే ఇప్పుడూ అమలు చేస్తున్నామని.. ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చే సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
  • యువశక్తే దేశానికి దిక్సూచి భారత యువత ఉత్సాహం, పరుగులు పెడుతున్న సాంకేతికతతో 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
  • మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎంతో తెలుసా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో, ఎంత మందికి సంక్షేమ...
  • దుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌ తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ దర్శించుకున్నారు.
  • మీది ద్రోహం.. మాది భరోసా! స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించి వైకాపా తీవ్ర అన్యాయం చేస్తే, కూటమి ప్రభుత్వం 40 శాతానికిపైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ భరోసా ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
  • జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో బీసీలకు 6.. ఎస్సీలకు 5 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులకు ప్రభుత్వం మంగళవారం రిజర్వేషన్లు ప్రకటించింది.
  • ఎన్‌సీసీ ఛైర్మన్‌ ఏవీఎస్‌ రాజు కన్నుమూత ఎన్‌సీసీ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు, సంస్థ గౌరవ ఛైర్మన్‌ డాక్టర్‌ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్‌ రాజు) (89) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.
  • మేయర్‌ అభ్యర్థుల నామినేషన్‌ డిపాజిట్‌ రూ. 3,000 నగరపాలక సంస్థల్లో మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌ స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నామినేషన్‌ డిపాజిట్‌ (ధరావతు)ను ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.
  • పల్లెపండగ 3.0లో మరిన్ని రహదారులు పల్లెపండగ 3.0లో రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 161 డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు.
  • కొరియన్‌ కనకరాజుల ముందు షూపు! బూట్లు, చెప్పులు ఏంటి.. ఇలా వరుసగా ఉన్నాయనుకుంటున్నారా? ఓ కొరియన్‌ రెస్టారెంట్లో ఈ పద్ధతి పాటిస్తున్నారు.
  • అంతర్జాతీయ సాంకేతిక హబ్‌గా అమరావతి అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
  • ఏపీఈఆర్‌సీ సభ్యుడిగా పాండురంగారావు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సభ్యుడిగా (న్యాయవిభాగం) అంచా పాండురంగారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
  • ఐటీ చట్టంలోని సెక్షన్‌ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధం ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. దానిని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
  • గవర్నర్‌ ఉదారత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నిరుపేద రోగుల పట్ల ఉదారత చాటారు. జీజీహెచ్‌లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆయన సొంత నిధులు రూ.12.65 లక్షలతో...
  • ఆహార వ్యర్థాలతో ఆహా.. అనేలా! ఈ చిత్రంలో కనిపిస్తోంది బయోగ్యాస్‌ ప్రొడక్షన్‌ ఫ్రం ఫుడ్‌ వేస్ట్‌ ప్లాంట్‌. బాపట్ల వ్యవసాయ కళాశాలలో దీని సాయంతో బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నారు.
  • రాష్ట్రంలో కొత్తగా 22 డయాలసిస్‌ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం (పీఎంఎన్‌డీపీ) కింద కొత్తగా 22 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.