ప్రియుడి కోసం.. ఇంటి దీపాలు ఆర్పేసింది

Eenadu icon
By Karnataka News Desk Updated : 19 Aug 2026 07:37 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ‘బంధువుల ఇంట్లో ఆదివారం రాత్రి భోజనం చేసి వచ్చాం. ఉదయానికి నా భర్త, కుమారుడు ఊపిరి ఆడక చనిపోయారు’ అంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించిన హరిణి, ఆమె ప్రియుడు వినయ్‌ (30)ను చిక్కబాణవార ఠాణా పోలీసులు మంగళవారం కటకటాల వెనక్కి నెట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ప్రియునితో కలిసి భర్త అభినందన్‌ (35), కుమారుడు యదువీర్‌ (4)ను హత్య చేసిందని తెలుసుకోవడానికి వారికి ఎక్కువ సమయం పట్టలేదు. కనకపుర తాలూకా హారోహళ్లికి చెందిన వినయ్‌ ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. ఇన్‌స్టాగ్రామ్‌లో హరిణితో మొదలైన పరిచయం, వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని అభినందన్‌ గుర్తించి, ఆమెతో పలుసార్లు గొడవ పడ్డాడు. తీరు మార్చుకోకపోతే విడాకులు తీసుకుని వెళ్లాలని హెచ్చరించాడు. భర్తను అడ్డు తప్పించేందుకు ఆమె పథకాన్ని రూపొందించింది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన అనంతరం వినయ్‌ను ఇంటికి పిలిపించుకుంది. హరిణి తన భర్త కాళ్లను పట్టుకోగా, అభినందన్‌ తలపై వంట పాత్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. పెనుగులాటలో కేకలు వేసిన తండ్రి గొంతు విని యదువీర్‌ అక్కడకు వచ్చాడు. కుమారుడు ఈ విషయాన్ని బయటపెడతాడన్న భయంతో అతని గొంతును నులిమి హత్య చేశారు. రక్తం మరకలు ఉన్న దుస్తులను ఆమె మార్చింది. భర్త ఛాతీపై కుమారుడ్ని నిద్రపుచ్చింది. హత్యకు ముందు నుంచి- ‘పని’ పూర్తయ్యే వరకు ఇంట్లోని సీసీ కెమెరాను ఆఫ్‌ చేసింది. వినయ్‌ వెళ్లిన అనంతరం దాన్ని ఆన్‌ చేసింది. పోలీసులకు సోమవారం ఉదయం ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. మూడు నెలల కిందటే ప్రియునితో ఓసారి ఎటో వెళ్లిపోయిన ఆమె కొద్ది రోజుల అనంతరం తిరిగి వచ్చిందని అభినందన్‌ కుటుంబ సభ్యులు చెప్పడంతో మొదట హరిణిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ క్రమంలోనే అనుమానం బలపడి, తమదైన శైలిలో విచారణ చేయడంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన వివరాలతో వినయ్‌ను పట్టుకొచ్చి కటకటాల వెనక్కి నెట్టారు. 

► Read latest Karnataka Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 07:33 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చెరకు రైతుల ‘చలో హుబ్లీ’పాదయాత్ర [ 15-10-2026] రాష్ట్రంలో చెరకు మద్ధతు ధర పెంచాలని, ఇథనాల్‌ను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు ‘చలో హుబ్లీ’పాదయాత్ర చేపట్టారు.
  • ‘సిద్ధు’కు ఆ‘పరేషాన్’ [ 15-10-2026] ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల గడుస్తున్నా పూర్వ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతగా వార్తలో కనిపించలేదు.
  • పండగకు వస్తున్నా.. [ 15-10-2026] ఈ దసరాతో నగరంలో రద్దీ ప్రయాణానికి ఒక ముగింపు కార్డు పడనుంది. అలసట, అలుపు, ఎక్కువ ఖర్చు లేకుండా ఆఫీసు నుంచి నేరుగా మెట్రోకు అటు నుంచి ఇంటికి.
  • వెనక్కు తగ్గని చెరకు రైతు [ 15-10-2026] చెరకుకు గిట్టుబాటు ధరను ప్రకటించాలని కోరుతూ సాగుదారులు చేస్తున్న ఆందోళన బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. బెళగావి, కలబురగి, ధార్వాడ, బాగలకోటె, విజయపుర జిల్లాల్లో పలు చోట్ల ఆందోళన తీవ్రమైంది.
  • రాచనగరి.. సంబరాల భేరి! [ 15-10-2026] దసరా సమీపించే కొద్దీ రాచనగరి మైసూరు సంబరాల్లో మునిగి తేలుతోంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేకానేక పోటీలకు వేదికలు సిద్ధంకాగా.. కొన్ని పోటీలు తుది దశకు చేరుకుంటున్నాయి
  • ‘చెక్’ పెట్టుబడులకు ఎర్రతివాచీ [ 15-10-2026] రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు చెక్‌ రిపబ్లిక్‌ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు
  • అంబారీ బాధ్యత ‘ప్రశాంత’కే [ 15-10-2026] మైసూరు దసరా ఉత్సవాల్లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అందులో చివరి ఘట్టం జంబూ సవారీ. ఇది చాలా ప్రత్యేకమైంది. గŸత పాతికేళ్లుగా జంబూసవారీలో పాల్గొంటూ, వరుసగా ఆరేళ్ల పాటు 750 కిలోల బంగారు అంబారీని, అందులో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని మోస్తున్న అభిమన్యు (60) నుంచి ఆ బాధ్యతలను ఈ ఏడాది తప్పించారు
  • ఒకరి మరణం..ఇంకొకరికి జీవం [ 15-10-2026] లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా జీవించవచ్చు. ఇది అవయవ దానంతో సాధ్యపడుతుంది. ఇంకొకరు సంపూర్ణ జీవితం గడపడానికి కారణం కావచ్చు.
  • రద్దీ నియంత్రణకు ముందడుగు [ 15-10-2026] పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందులో అతిముఖ్యమైంది సంచార సౌకర్యం. దీనికోసం ఇప్పటికే మెట్రో మార్గాలను, ఉపరితల వంతెనలను నిర్మిస్తున్నారు. ఈక్రమంలోనే ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉపరితల వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది
  • రాజధాని గొంతు తడారె [ 15-10-2026] రాజధాని అంతకంతకూ విస్తరిస్తోంది. తగినంత స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన మరీచికగా మారుతోంది. రహదారులు, మురుగునీటి కాలువల వ్యవస్థ ఎలా ఉన్నా.. తాగునీటి ఎద్దడి నిత్యం వెంటాడుతోంది.
  • కాలిపోయిన రైలు బోగీలు [ 15-10-2026] రాజానుకుంటె రైల్వే యార్డు వద్ద నిలిపి ఉంచిన రైల్లో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం మంటలు చెలరేగినట్లు గుర్తించి, సిబ్బంది తక్షణమే అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు.
  • బెయిలుపై విడుదలైన రెండు నెలల్లోనే హత్య [ 15-10-2026] నేరానికి పాల్పడి కారాగారానికి చేరి, బెయిలుపై రెండు నెలల కిందటే బయటకు వచ్చిన అమిత్‌ (27) అనే యువకుడు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
  • రైతుల కన్నెర్ర.. స్తంభించిపోయిన జాతీయ రహదారులు [ 14-10-2026] కనీవిని ఎరుగని రీతిలో కర్ణాటక రైతులు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్లకెక్కారు.
  • నేటి రాత్రి నుంచి 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె [ 14-10-2026] 108 అంబులెన్స్ వాహనాల ఉద్యోగులు ఈ రాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించారు.
  • చెక్‌ రిపబ్లిక్‌ ఉప ప్రధాని బృందంతో సీఎం భేటీ [ 14-10-2026] చెక్ రిపబ్లిక్ ఉప ప్రధాని కారెల్‌ హావ్లీచెక్‌ తన ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బెంగళూరులో కలిశారు.
  • బాలల దసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మధు బంగారప్ప [ 14-10-2026] మైసూరు దసరా ఉత్సవాల నేపథ్యంలో కర్ణాటక కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలల దసరా కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప బుధవారం ప్రారంభించారు.
  • రాజానుకుంట రైల్వే స్టేషన్ వద్ద మూడు బోగీలకు మంటలు [ 14-10-2026] బెంగళూరు శివార్లలోని రాజానుకుంట రైల్వే స్టేషన్‌ వద్ద ఖాళీగా ఉన్న మూడు రైల్వే బోగీల్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
  • మద్దతు ధర పెంచాలని చెరకు రైతుల ఆందోళన [ 14-10-2026] చెరకు కొనుగోలుకు సమ్మతమైన ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం సైతం జాతీయ రహదారులను దిగ్బంధించారు.
  • రిజర్వేషన్‌కు కుదుపు [ 14-10-2026] రాష్ట్ర రాజకీయ, సామాజిక వర్గాల్లో నాలుగేళ్ల కిందట తీవ్ర చర్చకు తెరలేపిన ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్‌ పెంపు అంశం మరోసారి వార్తల్లో నిలిచింది.
  • డిజిటల్‌ చెల్లింపుల్లో దూకుడు [ 14-10-2026] డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ ప్రగతి స్థిరంగా పెరుగుతోందని ఓ సమీక్షలో తేలింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని వంద నగరాల్లో చేపట్టిన సమీక్ష ప్రకారం దేశంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో యాప్‌ల ద్వారా డిజిటల్‌ రుణాలు, చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి.
  • నకిలీ వీడియో.. అరాచక చర్య [ 14-10-2026] కొద్ది రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న స్టింగ్‌ ఆపరేషన్‌ (హనీట్రాప్‌)కు సంబంధించిన వీడియోకు తన పేరును కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తాను గుర్తించానని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • అక్రమాలకు డీకే ఆద్యుడు [ 14-10-2026] రాష్ట్రంలో జరుగుతున్న స్టింగ్‌ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి డిమాండ్‌ చేశారు.
  • బెదిరించి.. ఖాతా ఖాళీ [ 14-10-2026] పహల్గామ్‌ హత్యాకాండను ప్రస్తావిస్తూ పుత్తూరుకు చెందిన ఒక వ్యక్తిని డిజిటల్‌ అరెస్టు చేశామని సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. అతని నుంచి రూ.1.31 కోట్ల నగదును తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
  • మూటలకొద్దీ గంజాయి [ 14-10-2026] స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్‌సింగ్‌ ఫొటోను కారుపై అంటించుకుని.. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కుంబళగోడు ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
  • వీడియోకాల్‌ చేసి.. కార్మికుడి బలవన్మరణం [ 14-10-2026] తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన ఉపేంద్ర సహానీ (32) చెట్టుకు ఉరి వేసుకున్న ఘటన దొడ్డబళ్లాపుర తాలూకా నగరకెరెలో చోటు చేసుకుంది
  • ఆస్తి కోసం కత్తిగట్టి..అన్న కుమారుడి హత్య [ 14-10-2026] ఆస్తి కోసం అన్న కుమారుడు కృష్ణ (15)ను అతని పినతండ్రి మోహన్‌ దారుణంగా హత్య చేశాడు. బెంగళూరు ఉత్తర తాలూకా ఐవరకండపురకు చెందిన మునిరాజు, శర్మిల దంపతుల చెందిన రెండో కుమారుడు కృష్ణ. చిక్కజాల సమీపంలోని చప్రదకల్లు వద్ద మోహన్‌ తన కుటుంబంతో ఉండేవాడు
  • ఆకట్టుకుంటున్న మైసూరు దసరా పుష్ప ప్రదర్శన [ 14-10-2026] మైసూరు దసరా ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని కుప్పన్న ఉద్యానవనంలో జరుగుతున్న దసరా పుష్ప ప్రదర్శనకు ప్రజలు, పర్యాటకుల నుండి చక్కని స్పందన వస్తోంది.

English Translation

Translation pending...