బెజవాడలో వెలుగుచూసిన కార్పొరేట్ మోసం

- A
- A+
- A++

అంతా కుమ్మక్కయి... తప్పుడు ఆర్థిక సమాచారంతో స్టాక్‌ను పెంచి చూపించారు. కీలక అంశాలను దాచిపెట్టి యూబీఐ నుంచి మోసపూరితంగా రుణం పొందారు. అనంతరం డొల్ల సంస్థల ద్వారా రుణాన్ని మళ్లించి బ్యాంకుకు భారీ నష్టాన్ని కలగజేశారు. విజయవాడలో వెలుగుచూసిన ఈ కార్పొరేట్ మోసంపై సీబీఐ కేసు నమోదు చేసింది. యూబీఐ ఏజీఎం శ్రీకాంత పాత్రో ఫిర్యాదుతో ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ1), డైరెక్టర్లు కోట భానుప్రసాద్ (ఏ2), కోట శ్రావణి (ఏ3), కోట పృథ్వీ వెంకటతేజ (ఏ4), కోట రాహుల్ సాయిబాలాజీ (ఏ5)తోపాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను సీబీఐ నిందితులుగా చేర్చింది.
ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2017లో ఏర్పాటైంది. గాల్వనైజ్డ్ పైపులు, ఇతర ఉక్కు ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2024లో కంపెనీ డైరెక్టర్లు కోట భానుప్రసాద్, కోట శ్రావణి, కోట పృథ్వీ వెంకటతేజ, కోట రాహుల్ సాయిబాలాజీ తప్పుడు ఆర్థిక నివేదికలు, ఇతర పత్రాలతో సూర్యారావుపేటలో యూబీఐ శాఖను సంప్రదించారు. గతంలో కరూర్ వైశ్యా బ్యాంకులో తీసుకున్న రుణాన్ని యూబీఐకి బదిలీ చేసుకున్నారు. వీరిచ్చిన దరఖాస్తులు, పత్రాల ఆధారంగా యూబీఐ.. 2024 ఫిబ్రవరిలో రూ.24 కోట్ల రుణం ఇచ్చింది. దీనికిహామీగా సరకు, ప్లాంట్, యంత్రాలను పెట్టారు. 2025 మే 17న రుణం రెన్యువల్ చేశారు. యూనిట్‌ను తనిఖీ చేయగా.. గణనీయ తేడా కనిపించింది. రూ.23.85 కోట్ల సరకుకు.. రూ.25 లక్షల విలువైన నిల్వలే ఉన్నాయి. స్టాక్ ఆడిట్‌లోనూ తేడాలను గుర్తించారు.
టాటా క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ నుంచి తీసుకున్న రూ.2.10 కోట్ల రుణాన్ని కూడా వెల్లడించకుండా దాచిపెట్టారు. రుణం మంజూరైన తేదీ నుంచి ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. యాజమాన్య మార్పుపై ముందస్తు అనుమతి పొందలేదు. ఆ ఇద్దరు డైరెక్టర్లు మెస్సర్స్ నెర్రో స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త కంపెనీ ప్రారంభించారు. దీనికి కెనరా బ్యాంకులో రూ.6 కోట్లు చెల్లించాల్సిన రుణం ఉంది. అనుమతి లేకుండానే ఆడిటర్లనూ మార్చారు. బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా యూనిట్ నుంచి స్టాక్‌ను తరలించారు.
ప్రధాన చెల్లింపులు మారుతీ ట్రేడర్స్ పేరు మీద జరిగాయి. రూ.67.54 కోట్ల రుణాలలో రూ.32.19 కోట్ల మేర ఎక్కువ జమలు దుర్గాభవానీ స్టీల్స్ పేరున జరిగాయి. వీటిని వ్యాపారంలో చూపించలేదు. ఈ రెండు సంస్థలు 2024లో ఏర్పాటవగా కార్యకలాపాలు ప్రారంభించలేదు. కంపెనీ రుణ అర్హతను పెంచుకునేందుకు, నిధులను పక్కదారి పట్టించేందుకు, టర్నోవర్‌ను కృత్రిమంగా పెంచేందుకే వీటిని ఉపయోగించారు. వడ్డీ చెల్లించక పోవడంతో బకాయిలు రూ.26.05 కోట్లకు చేరి బ్యాంకుకు నష్టం వాటిల్లింది.
► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 07:20 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సైరన్ మోగింది.. సందడి మొదలైంది [ 15-10-2026] స్థానిక సమరానికి సైరన్ మోగింది. మొదటి దశలో జిల్లాలో మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు పెడన, ఉయ్యూరు పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
- స్థానిక పోరుకు రిజర్వేషన్లు ఖరారు [ 15-10-2026] జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. జిల్లా పరిధిలోని మొత్తం 26 మండలాలకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు బుధవారం ఖరారు చేశారు.
- త్రిశక్తి రూపిణి.. త్రిభువన పాలిని.. [ 15-10-2026] విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జగన్మాత దుర్గమ్మ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
- బెజవాడ బైపాస్ నెత్తురోడుతోంది [ 15-10-2026] బెజవాడ బైపాస్‌పై తరచూ జరుగుతున్న ప్రమాదాలు బేజారెత్తిస్తున్నాయి. వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యం, ఆగివున్న వాహనాలను ఢీకొనడం ఇలా అనేక కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
- గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల్లో ఘోర దుర్ఘటన [ 15-10-2026] గుంటూరు పట్టాభిపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌గ్రేస్ బహుళ అంతస్తుల్లో ఘోర సంఘటన చోటు చేసుకుంది.
- ఉత్సవ్ ఉత్సాహం.. కళాసౌరభం [ 15-10-2026] విజయవాడ పున్నమిఘాట్, అజిత్‌సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య స్టేడియంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్‌లో అటు కళాకారులు... ఇటు ప్రేక్షకుల ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
- వంగవీటి రాధా చేరికతో.. జనసేనలో నూతనోత్సాహం [ 15-10-2026] విజయవాడ మేయర్ బరిలో జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయబోతున్నారంటూ కొద్దికాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ..
- బెదిరింపు.. బరితెగింపు.. [ 15-10-2026] ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికారం అండగా 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడ్డారు.
- త్రిశక్తి రూపిణి.. త్రిభువన పాలిని.. [ 15-10-2026] విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జగన్మాత దుర్గమ్మ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
- సతీమణుల సమరం [ 15-10-2026] గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల జిల్లా పరిషత్‌లు మహిళలకు కేటాయించడంతో ఇప్పటి వరకు పదవులు ఆశించిన వారికి అవకాశం లేకుండాపోయింది.
- ఆయన తపన.. ఆమె కోసమే..! [ 15-10-2026] పురపాలక సమరానికి ముహూర్తం ఖరారైందో లేదో.. అభ్యర్థుల ఆశలపై రిజర్వేషన్ల రూపంలో నీళ్లు జల్లింది.
- జడ్పీ పీఠం.. ఏ మండలానిదో..! [ 15-10-2026] జడ్పీ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. కట్టుబడి ఉన్నాం: మంత్రి మండిపల్లి [ 14-10-2026] బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
- సర్ గడువు పొడిగింపు [ 14-10-2026] భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ‘సర్’ గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- మోపిదేవీ ఆలయ హుండీల లెక్కింపు [ 14-10-2026] ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
- పార్క్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే [ 14-10-2026] తాడికొండ మండలం మోతడక గ్రామంలో రూ.13.50 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శంకుస్థాపన చేశారు .
- పురపోరు.. కొత్తతరం జోరు [ 14-10-2026] ప్రభుత్వం పుర, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మేయర్, ఛైర్మన్లతో పాటు వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు కూడా ప్రకటించింది.
- మహాచండీదేవి రూపంలో దుర్గమ్మ [ 14-10-2026] ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీమహా చండీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
- నిత్యాన్నదాయిని.. నిఖిల సంతోషిణి [ 14-10-2026] విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజు దుర్గమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది.
- ఎస్సీలకే జడ్పీ పీఠం [ 14-10-2026] ఎన్టీఆర్ జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంగళవారం రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో గ్రామీణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది
- మూడు పీఠాలు మహిళలకే.. [ 14-10-2026] గుంటూరు జిల్లా పరిషత్‌తో పాటు కొత్తగా ఏర్పడిన పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు మూడు మహిళలకే రిజర్వు అయ్యాయి. మూడు జిల్లాల్లోనూ మహిళలే జిల్లా పరిషత్ పీఠాలపై కూర్చోనున్నారు
- ఆమె ఓటే.. గెలుపు శాసనం [ 14-10-2026] జిల్లాలో కీలక పురపాలక సంఘాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గుంటూరు నగరపాలక సంస్థతో పాటు తెనాలి, మున్సిపాలిటీల్లో దాదాపు అన్ని వార్డుల్లోనూ వారిదే పైచేయిగా ఉంది
- మేయరు అభ్యర్థి ఎంపికపై గుంభనం [ 14-10-2026] గుంటూరు మేయరు అభ్యర్థి ఎంపికలో ఇటు కూటమి, అటు వైకాపాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. తెదేపా తరఫున ఎక్కువమంది ఆశావహులు ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.
- ఒక్కొక్కరు తెరపైకి.. చోటెవరికి..? [ 14-10-2026] మేయర్, ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే తాము పోటీలో ఉన్నామని ప్రకటించినవారితో పాటు కొత్తవారు కూడా ఆసక్తి చూపుతున్నారు.
- సరస్ మేళా ప్రారంభం [ 14-10-2026] ఇంద్రకీలాద్రి సమీపాన భవానీపురంలో పున్నమి, భవానీ స్నానఘాట్ల వెంబడి సరస్ మేళా మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు దీన్ని నిర్వహిస్తారు.
- విజయోత్సవ్ జోష్ [ 14-10-2026] ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాక.. విజయవాడ ఉత్సవ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
- అతివేగమే ప్రమాదానికి కారణం [ 14-10-2026] విజయవాడ బైపాస్‌పై సోమవారం సాయంత్రం నున్న వెళ్తున్న కారు ప్రమాదానికి గురై.. అక్కడికక్కడే అందులో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే
- గుంటూరులో చోరీ.. ఇతర రాష్ట్రాల్లో విక్రయాలు [ 14-10-2026] ద్విచక్రవాహనాలు చోరీ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు ఆ వాహనాలు కొనుగోలు చేసిన ఇద్దరిని అరెస్టు చేశారు
- తాడేపల్లిలో బకింగ్‌హామ్ కెనాల్‌పై వంతెనకు రూ.27 కోట్లు మంజూరు [ 14-10-2026] తాడేపల్లి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేశ్ పశు వైద్యశాల వద్ద బకింగ్‌హామ్ కెనాల్‌పై రోడ్డు వంతెనకు నిధులు మంజూరు చేయించారు.
- ఆశలు చెదిరి.. గుండెలు పగిలి.. [ 14-10-2026] జాతీయ రహదారి 216పై వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ఒక ఘటనలో నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను కోల్పోయి తల్లిదండ్రులు విలవిల్లాడుతుంటే.. మరో ఘటనలో కొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి ఘనంగా చేయాల్సిన తండ్రి దూరమై ఓ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది.
English Translation
Translation pending...