‘కశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు’: లష్కరే చీఫ్‌ పంపించాడంటూ వ్యాఖ్యలు వైరల్‌

Eenadu icon
By National News Team Updated : 19 Aug 2026 09:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Pakistan| ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి 10వేల మంది ఉగ్రవాదులు చొరబడ్డారట. వారిని లష్కరే తయ్యిబా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed) పంపాడని పాక్‌లోని ఒక మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆగస్టు 14న బోధకుడు నాసిర్ మద్నీ మాట్లాడిన మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బహావల్ నగర్‌లో లష్కరే అనుబంధ కార్యక్రమంలో అతడు మాట్లాడుతూ.. సయీద్‌ను మాతృభూమి సేవకుడిగా అభివర్ణించాడు. దీంతో కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల వెనక హఫీజ్‌ ప్రమేయం ఉందని మరింత తేటతెల్లమవుతోంది.

  • టిక్‌టాక్‌ స్టార్ కమ్ ఉగ్రవాది: అమిత్‌ షా చెప్పిన ‘షహజాద్ భట్టీ’ ఎవరు..?

అల్‌ఖైదా, తాలిబన్లతో సంబంధాల కారణంగా 2005లో లష్కరే ఉగ్రసంస్థను ఐరాస నిషేధించింది. దాని చీఫ్ హఫీజ్‌ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 26/11 ముంబయి దాడులతో సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రఘటనలకు సంబంధించిన దర్యాప్తులో అతడి పేరు చాలా సార్లు వెలుగులోకి వచ్చింది. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులో జమ్ము న్యాయస్థానం అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర్నుంచి.. కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్‌ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఐఏ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 08:14 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విమానాల్లో ఆ పవర్‌ బ్యాంకులపై నిషేధం DGCA: పవర్‌ బ్యాంక్‌ల విషయంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది.
  • బ్లూడ్రమ్‌ కేసు..ముస్కాన్‌కు, ఆమె ప్రియుడికి మరణశిక్ష బ్లూడ్రమ్ము హత్య కేసులో నిందితురాలికి, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష విధించింది. 
  • దసరా నవరాత్రులు.. దేవతామూర్తులకు 120 కిలోల స్వర్ణాభరణాలతో అలంకరణ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం (Durga Pandal) భక్తులను ఆశ్చర్యపరుస్తోంది.
  • రైలు కిటికీ నుంచి చోరీకి యత్నం.. షాకిచ్చిన ప్రయాణికులు! రైలు బయల్దేరుతుండగా ఓ వ్యక్తి.. ప్రయాణికుడి ఫోన్‌ (Phone Thief) లాక్కునేందుకు ప్రయత్నించాడు. ప్లాట్‌ఫాం వద్ద నిల్చొని కిటీకీ నుంచి చోరీకి యత్నిస్తుండగా.. ప్రయాణికులు (Passengers Catch Suspected) అతడిని లోపలి నుంచి గట్టిగా పట్టుకున్నారు.
  • సీజేపీకి రాహుల్‌ గాంధీ మద్దతు.. ధన్యవాదాలు తెలిపిన దీప్కే జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేసిన సీజేపీ (CJP) నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలకు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మద్దతు తెలిపారు.
  • ఆలయ సన్నిధిలో చిన్నారితో అసభ్య ప్రవర్తన ఆలయంలో దేవుడికి దణ్ణం పెట్టుకోవడానికి వచ్చిన బాలికతో ఓ కార్మికుడు అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన పుణెలో చోటుచేసుకుంది.
  • 8 నెలల కష్టం వారంలో నాశనం.. బిట్టూ తబాహి ఆవేదన దాదాపు 8 నెలలు శ్రమించి శుభ్రపర్చిన అజ్నార్‌ నది మళ్లీ చెత్తమయం అవ్వడంతో బిట్టూ తబాహి కన్నీటిపర్యంతమయ్యాడు.
  • ‘కాక్రోచ్‌’పై కాదు.. సమస్యలపై దృష్టిపెట్టండి: కేంద్రంపై అభిజీత్‌ దీప్కే విమర్శలు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 
  • ఎయిరిండియా విమానానికి ‘హైజాక్‌’ అలర్ట్‌..! ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి దిల్లీ (Delhi) వస్తోన్న ఎయిరిండియా (Air India) విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని అత్యవరసంగా ల్యాండ్‌ చేశారు.
  • ఎకరా రూ.15 లక్షలకు కొని.. నెలల్లోనే రూ.3 కోట్లకు విక్రయం..! Land Deals: కొన్ని నెలల కిందట ఎకరం రూ.15 లక్షల పలికిన భూమిని హఠాత్తుగా రూ.3 కోట్లకు క్రికెట్‌ అసోసియేషన్‌ కొనుగోలు చేసింది..! ఈ అనుమానాస్పద ల్యాండ్ డీల్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌, బఠిండా ప్రాంతాల్లో జరిగింది.
  • ‘సర్‌’ లేనప్పుడూ ఓడారు...2029లోనూ ఓడిపోతారు ఓట్ల సవరణకు ఉద్దేశించిన ‘సర్‌’ లేనప్పుడు కూడా కాంగ్రెస్‌ ఓడిపోయిందని... 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఆ పార్టీకి ఓటమేనని ఎద్దేవా చేశారు.
  • న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం న్యాయ వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందని, ప్రస్తుత ఓట్ల చోరీ వ్యవహారంలో ఆ వ్యవస్థకో పాత్ర ఉందని, దానిని సమర్థంగా పోషిస్తుందని నమ్ముతున్నామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
  • క్యాబినెట్‌ను మోదీ విస్తరిస్తారా? తమిళనాడుకు చెందిన కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ మంగళవారం మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
  • భద్రతావలయాన్ని ఛేదించుకుని జంతర్‌మంతర్‌లో ఆందోళన యత్నం ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం యత్నించింది.
  • ఎన్నికల్లో గెలవలేకే.. రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్‌ విమర్శలు ఎన్నికల్లో గెలవలేకే కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో ఓడిపోతున్న కాంగ్రెస్‌కు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
  • బాల్య వివాహాలు అరికట్టడంలో భారత్‌ కృషి అద్భుతం: ఐరాస బాల్య వివాహాలు అరికట్టడం, బాలికల హక్కులను బలోపేతం చేయడంలో భారత్‌ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
  • మీరు కాదన్నా లద్దాఖ్‌ మాదే: భారత్‌ లద్దాఖ్‌లో 28 వ్యూహాత్మక ప్రదేశాలకు, భౌగోళిక ఆకృతులకు భారత్‌ నామకరణం చేయడంతోపాటు తన అధికారిక పటంలో వాటిని గుర్తించడాన్ని చైనా మంగళవారం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్‌ తిరస్కరించింది.
  • సమాచార హక్కు చట్టానికి 21 ఏళ్లు దేశంలోని 28 సమాచార కమిషన్ల పరిధిలో జూన్‌ 30 నాటికి 3.85 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) వెల్లడించింది.
  • మతం మారాలని కోరడం... మరొకరి విశ్వాసాలను అవమానించినట్లు కాదు మతం మారాలంటూ కోరడాన్ని మరొక వర్గం వారి విశ్వాసాలను అవమానించినట్లుగా పరిగణించరాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనం పేర్కొంది.
  • బిహార్‌లో పడవ ప్రమాదం 14 మంది మృతి బిహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 మందితో వెళ్తోన్న పడవ గంగా నదిలో బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. 14 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు చిన్నారులు.