● 174 కిలోలు స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ● వ్యాపారి అరెస్టు

తాండూరు టౌన్‌:జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడిలో భారీగా కల్తీ కోవా పట్టుబడింది. ఓ వ్యా పారి కల్తీ కోవాతో పాటు కలాకంద్‌ను ఆటోలో తాండూరుకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌ అలీ తోపాటు సిబ్బంది దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై నుమాన్‌ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్‌లోని పాష్తాపూర్‌ కాలనీకి చెందిన వ్యాపారి రూపారామ్‌ 160 కిలోల కల్తీ కోవా, 14 కిలోల కల్తీ కలాకంద్‌ను ఆటోలో తాండూరుకు తరలిస్తున్నాడనే పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం పట్టణ పోలీసులకు కల్తీ సరుకును అప్పగించారు. రూపారామ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీని విలువ సుమారు రూ. 34,800గా ఉంటుందని ఆయన తెలిపారు.