ఆ సమస్యకు కారణమెవరో గుర్తించారా?

దాంపత్య బంధంలో కలతలు సహజం. భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోతే ఇలాంటివి ఎన్నొచ్చినా క్షణాల్లో పరిష్కారమవుతాయి. కానీ కొంతమంది మాత్రం ప్రతి విషయంలోనూ భాగస్వామితో కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మాటలు, చేతలతో వారి మనసును గాయపరుస్తుంటారు.

Eenadu icon
By Vasundhara Team Published : 17 Jun 2026 21:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

దాంపత్య బంధంలో కలతలు సహజం. భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోతే ఇలాంటివి ఎన్నొచ్చినా క్షణాల్లో పరిష్కారమవుతాయి. కానీ కొంతమంది మాత్రం ప్రతి విషయంలోనూ భాగస్వామితో కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మాటలు, చేతలతో వారి మనసును గాయపరుస్తుంటారు. తమది తప్పని తెలిసినా దాన్ని అంగీకరించరు.. సరికదా అన్నింట్లోనూ తామే కరక్ట్‌ అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితంగా ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పాటు అనుబంధంలోని మాధుర్యమూ ఆవిరైపోతుంది. అయితే ఇది ఇద్దరినీ విడదీయకముందే జాగ్రత్తపడమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇందుకోసం తమ దాంపత్య బంధంలో ప్రతికూల పరిస్థితులు రావడానికి ఇద్దరిలో కారణమెవరో గుర్తించమంటున్నారు. తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోమంటున్నారు.

ఇలా ప్రవర్తిస్తున్నారా?

⚛  గొడవలైనప్పుడు క్షణికావేశంలో భార్యాభర్తలిద్దరూ మాటా మాటా అనుకున్నా.. ఆ తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి కలిసిపోవడం చూస్తుంటాం. కానీ కొంతమంది భాగస్వామి వేసిన ప్రతి అడుగులోనూ తప్పులు వెతుకుతుంటారు. ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలో అవతలి వారు బాధతో ఓ మాట అన్నా.. విడాకులిస్తానంటూ బెదిరిస్తుంటారు. ఇలా ప్రతి చిన్న విషయానికీ విడాకులిస్తాననడం వారి అభద్రతా భావానికి సంకేతమంటున్నారు నిపుణులు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి, అనుబంధంలో కలతలు రేగడానికి అసలు కారణం వారేనంటున్నారు.

⚛  మంచి జరిగితే తమకు ఆపాదించుకోవడం, చెడు జరిగితే ఇతరుల పైకి నెట్టేయడం.. ఇలా కొంతమంది చేస్తుంటారు. కొందరు దంపతుల్లోనూ ఇలాంటి ప్రవర్తనను గమనించచ్చు. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమే అయినా.. తప్పుల్ని భాగస్వామి పైకి నెట్టేసే వారే తమ అనుబంధంలో కలతలకు అసలు కారణమని గ్రహించమంటున్నారు నిపుణులు.

⚛  దంపతులే అయినా.. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఈ విషయాన్ని విస్మరించి కొంతమంది తమ భాగస్వామి ఇలాగే ఉండాలి.. ఈ తరహా దుస్తులే వేసుకోవాలి.. నాకు నచ్చినట్లుగానే నడచుకోవాలి.. అంటూ ఆంక్షలు పెడుతుంటారు. ఇది అవతలి వారికి నచ్చక చీటికీ మాటికీ గొడవలవుతుంటాయి. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఆంక్షలు పెట్టిన వారే కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి హద్దులు దాటనంత వరకు ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించకపోవడం మంచిదంటున్నారు.

⚛  అతి ఆలోచనల వల్ల కూడా దాంపత్య బంధంలో అరమరికలొస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భాగస్వామికి సంబంధించిన ప్రతి విషయాన్నీ లోతుగా పరిశీలించి చూడడం, విశ్లేషించడం వల్ల.. అందులో పొరపాట్లు లేకపోయినా.. ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు కారణమవుతుంది. కాబట్టి దంపతులిద్దరిలో ఎవరు ఇలాంటి ఆలోచన విధానంతో ఉంటే.. వారే దాంపత్య బంధంలో కలతలు రేగడానికి అసలు కారణం అంటున్నారు నిపుణులు.

⚛  అటు ఉద్యోగ బాధ్యతల్ని, ఇటు ఇంటి బాధ్యతల్ని సమానంగా పంచుకుంటున్నారు ఈతరం భార్యాభర్తలు. అయితే కొంతమంది ఇంటి పనుల విషయానికొస్తే.. అది నా పని కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అన్ని పనులు భాగస్వామి చేసుకున్నప్పటికీ.. కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. ఈ నిర్లక్ష్యమే ఇద్దరి మధ్య దూరం పెంచుతుంది.

గ్రహిస్తే సరిపోదు.. పరిష్కరించుకోవాలి!

దాంపత్య బంధంలో కలతలు రేగడానికి కారణమెవరో గుర్తిస్తే సరిపోదు.. ఆయా సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పొరపాటు ఇద్దరిలో ఎవరిదైనా.. ఒప్పుకొని భాగస్వామిని క్షమాపణ కోరడం.. ఇకనుంచైనా ఒకరి మనసు మరొకరు తెలుసుకొని మసలుకోవడం.. వంటివి సమస్య అక్కడితో సద్దుమణిగేలా చేస్తాయి. అలాకాకుండా.. కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడానికి తామే కారణం అని తెలిసినా.. తమను తాము మార్చుకోవడానికి, అవతలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పైగా ఎవరి మాట వినను అన్నంత మొండిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి కౌన్సెలింగ్‌ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Did you find out who is the cause of the problem?

Disruption in marriage is natural. If both the husband and wife are adjusted, such things can be resolved in a moment. But some people aim to go toe-to-toe with their partner in everything. They hurt their hearts with words and hands.

Eenadu icon
By Vasundhara Team Published : 17 Jun 2026 21:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Disturbances in marriage are natural. If both the husband and wife are adjusted, such things can be resolved in a moment. But some people aim to go toe-to-toe with their partner in everything. They hurt their hearts with words and hands. Even if they know they are wrong, they don't accept it.. They act as if they are right in everything. As a result, the distance between the two grows and the sweetness of the relationship evaporates. But relationship experts say to be careful before this separates the two. For this, they want to find out who is the cause of negative situations in their marital relationship. They know their mistake and want to correct it.

Are they behaving like this?

⚛ When there is a fight, both the husband and wife think that they are talking about each other. But some find fault with every step taken by the partner. Every decision is opposed. In this sequence, the other person says a word in pain.. They threaten to divorce. Experts say that divorce for every little thing is a sign of their insecurity. They say that they are the real reason for the distance between the two and for the disturbance in the relationship. Similar behavior can be observed in some couples. Even if it is a decision taken by both of them together.. Experts realize that the real cause of trouble in their relationship is those who push the mistakes on the partner. Ignoring this, some people put restrictions saying that their partner should be like this.. They should wear this type of clothes. The others don't like it, so they quarrel with each other. Experts say that the reason for increasing the distance between the two is those who imposed restrictions. So it is better not to deprive each other of their freedom until the limits are crossed.

⚛ Experts say that overthinking can also cause problems in marriage. In this order, due to the deep examination and analysis of everything related to the partner.. even if there are no mistakes in it. This causes differences between the two. So experts say that if one of the two couples has this kind of thinking, they are the real reason for the trouble in the marital relationship. But some people act as if housework is not my job. Even if the partner does all the work.. at least they don't come forward to help. This carelessness increases the distance between the two.

It is not enough to understand.. it must be solved!

It is not enough to identify the cause of trouble in the marital relationship.. Experts also want to think about how to solve those problems. In this process, any one of the two mistakes.. admitting and asking for forgiveness from the partner.. from now on knowing each other's mind and making peace with each other.. etc. will solve the problem there. Apart from that.. some people behave stubbornly. Even if they know that they are the cause of the misunderstandings between the two, they don't try to change themselves and understand the other person. Moreover, they behave so stubbornly that they do not listen to anyone. Experts say counseling is good for such people.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :