సీతే లంకాదహనం చేస్తే.. ‘ఆల్ఫా’ ట్రైలర్‌లో అదరగొట్టిన ఆలియా

- A
- A+
- A++
ఇంటర్నెట్ డెస్క్: హనుమంతుడు చేసిన లంకాదహనం గురించి మనం విన్నాం. ఫర్ ఏ ఛేంజ్.. సీతాదేవి లంకాదహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఆ బీభత్సం ఎలా ఉండబోతోందో ‘ఆల్ఫా’ (Alpha) ట్రైలర్‌లో శాంపిల్ చూపించారు ప్రముఖ కథానాయిక ఆలియా భట్ (Alia Bhatt). ఆమెతో పాటు శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ప్రధాన చిత్రం యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగం. ఇది ఈ సిరీస్‌లో వస్తున్న తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఆలియా, శార్వరి కలసి ఒళ్లు గగుర్పొడిచేలా చేసిన స్టంట్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ముఖ్యంగా ‘సీత లంకాదహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా’ అని ఆలియా చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌కు వ్యతిరేకంగా ‘ఆల్ఫా’ పేరుతో మిషన్ నడిపే ప్రతినాయకుడిగా బాబీ దేవోల్ క్రూరమైన పాత్రలో భయపెట్టబోతున్నాడు. గూఢచారిగా ఆలియా ఆ మిషన్‌ను ఎలా అడ్డుకుంటుదన్నది సినిమా కథాంశం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రచార చిత్రం చివర్లో హృతిక్ కళ్లను మాత్రం చూపిస్తూ ఆ పాత్రను పరిచయం చేయడం కొసమెరుపు. మరో కీలక పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. శివ్ రవాలీ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శర్వానంద్ - శ్రీను వైట్ల సినిమా షురూ.. హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రానుంది.
- ఒక్కరోజే ఆరు చిత్రాలు విడుదల.. వేటికవే ప్రత్యేకం..! ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఏ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు వాటి వివరాలు
- మీర్జాపూర్ మూవీ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కి ఓటీటీలో పాపులారిటీ సొంతం చేసుకున్న ‘మీర్జాపూర్’ (Mirzapur)
- ‘వారణాసి’ అప్‌డేట్.. రుద్రగా మహేశ్.. ఫస్ట్‌లుక్ రిలీజ్.. మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘వారణాసి’.
- రామాయణ.. రిలీజ్‌లో కొత్త ట్విస్ట్ రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’.
- ఇట్స్ అఫీషియల్.. ‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది..! నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’.
- ఒకే ఏడాది రెండు పార్ట్‌లు.. కొత్త సినిమా ప్రకటించిన సందీప్ కిషన్ యంగ్ హీరో సందీప్ కిషన్ కొత్త ప్రయోగం చేయనున్నారు.
- ఈ వారం థియేటర్‌లో థ్రిల్/యాక్షన్ చిత్రాలు.. ఓటీటీలో ఇవి స్పెషల్.. ప్రేక్షకులకు అలరించడానికి ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌లో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి
- ‘ఎల్లమ్మ’లో పర్షిగా దేవిశ్రీ ప్రసాద్.. ఫస్ట్‌లుక్ చూశారా? సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు ఆయన వెండితెరపై అలరించబోతున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ తీసిన వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’ (Yellamma).
- అబ్బురపరిచేలా.. ‘రామాయణ’ ట్రైలర్ భారతీయ సినీచరిత్రలో భారీస్థాయిలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదలైంది.
- ‘సౌండ్ ఇంజినీర్’గా నారా రోహిత్.. మళ్లీ ట్రాక్ ఎక్కిన హీరో కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohith) జోరుమీదున్నారు. ఒకప్పుడు వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుని అలరించేవారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఏదో కొత్తదనం ఉందనే భావన ప్రేక్షకులకు కలిగేది.
- ‘జన నాయగన్’ విజయ్ చివరి మూవీ కాదు.. సీఎంగా ఫస్ట్ మూవీ.. ఆసక్తికర విశేషాలివే! స్తుతం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జన నాయగన్’. తమిళనాడు ముఖ్యమంత్రి, కథానాయకుడు విజయ్ (Vijay) నటించిన ఆఖరి చిత్రం కావడంతో అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి.
- ‘రామాయణ’ ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారంటే.. ఎన్ని సార్లు చదివినా, తెరపై ఎప్పుడు చూసినా నిత్య నూతనంగా అనిపించే ఇతిహాసగాథ ‘రామాయణం’. ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
- ఈ వారం థియేటర్ వినోదాలివే..! ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. అవేంటి? ఎప్పుడు రాబోతున్నాయి?
- ‘వారణాసి’ సర్‌ప్రైజ్.. ప్రియాంక లుక్ రిలీజ్ మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘వారణాసి’.
- రూ.2వేల కోట్ల బడ్జెట్.. 5 దేశాలు.. 91 రోజుల షూటింగ్.. సినీ చరిత్రలోనే మొదటిసారి.. జులై 17న వస్తున్న ‘ది ఒడిస్సీ’ కథేంటి? తెరవెనుక ఏం జరిగింది? ‘ఒడిస్సీ’ ప్రత్యేకతలు ఏవి?
- ప్రభాస్ ‘ఫౌజీ’ అప్‌డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే! ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi).
- ‘జన నాయగన్’ 23న వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన తమిళనాడు ముఖ్యమంత్రి, కథానాయకుడు విజయ్ (Vijay) అభిమానులకు శుభవార్త. ఆయన కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల తేదీ ఖరారైంది.
- ‘లెనిన్’.. ఈ ఒక్క సినిమా వీరందరి ‘లెక్క’ మార్చింది! జులై 10వ తేదీ చాలా మంది లెక్కల్ని మార్చింది. హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారికి ఊరటనిచ్చింది.
- ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 9 చిత్రాలు.. ఓటీటీలో వీటిదే హవా జులైలో వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. మూడో వారంలో పలు చిన్న చిత్రాలు వెండితెరకు క్యూ కట్టాయి. మరి ఆ చిత్రాలేంటి? వాటి విశేషాలు..